
మే6 వరకు ఆర్జిత సేవలు రద్దు
తిరుమల: నేటి నుంచి మూడు రోజులపాటు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు నిర్వహిస్తారు. నారాయణగిరివనంలో ఉత్సవ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇవాళ మలయప్పస్వామి, రేపు అశ్వవాహనం, ఎల్లుండి గరుడ వాహనంపై అమ్మవారిని ఊరేగిస్తారు. నేటి నుంచి 6వ తేదీ వరకు పలు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 75,283 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 3.60 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.