పుష్కర రూట్లలో భారీ ట్రాఫిక్ జాం | Huge Traffic zam at Puskaras routes | Sakshi
Sakshi News home page

పుష్కర రూట్లలో భారీ ట్రాఫిక్ జాం

Published Sun, Aug 21 2016 8:36 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

Huge Traffic zam at Puskaras routes

నల్లగొండ/శంషాబాద్: కృష్ణా పుష్కరాలు ముగుస్తున్న సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. ఆదివారం కావడంతో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున కృష్ణా తీరానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. నల్లగొండ జిల్లాలోని మట్టంపల్లి, వాడపల్లి ఘాట్‌లలో స్నానం ఆచరించడానికి వెళ్తున్న భక్తుల రద్దీ వల్ల నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జాం అయింది.

మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద మండలంలోని పాల్మాకుల శివారులోని బెంగళూరు జాతీయ రహదారిపై పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనాలతో భారీ ట్రాఫిక్ జాం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement