Traffic zam
-
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
-
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
టెక్సాస్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 100 వాహనాలు.. ఒకదానినొకటి ఢీకొని మైలున్నర మేర చిందరవందరగా పడిపోయాయి. దీంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన మంచు తుపానుతో రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి కనీవినీ ఎరగని రీతిలో ఈ ప్రమాదానికి దారితీసింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్త్‌విత్ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. ఫెడ్ఎక్స్కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
వామ్మో.. ఇదేందిది ఇంత ట్రాఫిక్ జామ్!
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఢిల్లీలో భీకరస్థితిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇండియా గేట్ పరిసరాలతో పాటు తిలక్ మార్గ్, మండి హౌజ్ సర్కిల్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడటంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఉంది. వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురుగ్రామ్, గుర్గావ్ లాంటి ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. బారీ వర్షాలతో జనజీవనం స్తంభించి బోట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా గుర్గావ్లోని డీఎల్ఎఫ్ ఫేజ్-5లోని ఒక అపార్ట్మెంట్లో వరదనీరు ఇళ్లలోకి రావడం వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇదేందయ్య ఇది.. మేమేన్నడు సూడలే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోమరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
పూర్తికాని నిమజ్జనం.. భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, హైదారాబాద్: వినాయక నిమజ్జనం కారణంగా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. శుక్రవారం నాటికి కూడా నిమజ్జనం పూర్తి కాకపోవడంతో ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, రానిగంజ్, సికింద్రాబాద్, సంగీత సర్కిల్, బేగంపేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోవంటి ప్రధాన మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదలుతున్నాయి. నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్‌ను ఎత్తివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఐదు వందలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య నేటి సాయంత్ర వరకూ కొనసాగనుంది. దీని కారణంగా నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పటి వరకు రెండు వేలకు పైగా విగ్రహాలు గంగఒడికి చేరినట్లు అధికారులు తెలిపారు. -
రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసిన మంత్రి
-
ట్రాఫిక్ క్లియర్ చేసిన మంత్రి పేర్నినాని
సాక్షి, విజయవాడ : రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను దగ్గరుండి క్లియర్ చేశారు. శనివారం ప్రకాశం బ్యారేజ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి రోడ్డుపై పెద్దసంఖ్యలో పేరుకుపోయిన వాహనాలను దగ్గరుండి క్లియర్ చేశారు. అంతకు క్రితం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పేర్నినాని వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. -
పుష్కర రూట్లలో భారీ ట్రాఫిక్ జాం
నల్లగొండ/శంషాబాద్: కృష్ణా పుష్కరాలు ముగుస్తున్న సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. ఆదివారం కావడంతో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున కృష్ణా తీరానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. నల్లగొండ జిల్లాలోని మట్టంపల్లి, వాడపల్లి ఘాట్లలో స్నానం ఆచరించడానికి వెళ్తున్న భక్తుల రద్దీ వల్ల నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జాం అయింది. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద మండలంలోని పాల్మాకుల శివారులోని బెంగళూరు జాతీయ రహదారిపై పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనాలతో భారీ ట్రాఫిక్ జాం అయింది.