
సాక్షి, హైదారాబాద్: వినాయక నిమజ్జనం కారణంగా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. శుక్రవారం నాటికి కూడా నిమజ్జనం పూర్తి కాకపోవడంతో ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, రానిగంజ్, సికింద్రాబాద్, సంగీత సర్కిల్, బేగంపేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోవంటి ప్రధాన మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదలుతున్నాయి. నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్‌ను ఎత్తివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఐదు వందలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య నేటి సాయంత్ర వరకూ కొనసాగనుంది. దీని కారణంగా నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పటి వరకు రెండు వేలకు పైగా విగ్రహాలు గంగఒడికి చేరినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment