సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ట్యాంక్ బండ్‌పై కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.
వివరాల ప్రకారం.. ట్యాంక్ బండ్‌పై ఉన్న ఎన్టీఆర్ మార్గ్‌లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదకి దూసుకెళ్లి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కొద్దిలో కారు హుస్సేన్ సాగర్‌లో పడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
కాగా, ప్రమాదం తర్వాత వారిద్దరూ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కారులో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.
మరోవైపు.. రాజేంద్రనగర్‌లోని అరాంఘర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతిచెందగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో అతడికి ప్రమాదం తప్పింది.
ఇది కూడా చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి..
Comments
Please login to add a commentAdd a comment