Tank band
-
ట్యాంక్ బండ్‌పై మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర మహనీయుల విగ్రహాలను ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహనీయుల చరిత్రను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ విషయంపై మంత్రిమండలిలో చర్చించి, ప్రకటన చేస్తామని వెల్లడించారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మంథని నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వంటి ఎంతో మంది అగ్ర నాయకులతో కలసి శ్రీపాదరావు పనిచేశారని గుర్తుచేశారు. స్పీకర్‌గా శ్రీపాదరావు ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని కొనియాడారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీపాదరావు, ఆయన కుమారుడు శ్రీధర్‌బాబుతో కలసి పనిచేసిన వ్యక్తిగా ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లా డుతూ తన తండ్రి శ్రీపాదరావు ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు రంగాలలో సేవలందిస్తున్నవారికి అవార్డులను అందజేశారు. శ్రీపాదరావుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రాజ్‌ఠాకూర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌లతో పాటు శ్రీపాదరావు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ట్యాంక్ బండ్‌పై కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. ట్యాంక్ బండ్‌పై ఉన్న ఎన్టీఆర్ మార్గ్‌లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదకి దూసుకెళ్లి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కొద్దిలో కారు హుస్సేన్ సాగర్‌లో పడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ప్రమాదం తర్వాత వారిద్దరూ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కారులో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్‌లోని అరాంఘర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతిచెందగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో అతడికి ప్రమాదం తప్పింది. ఇది కూడా చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి.. -
భాగ్యనగరం నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత విగ్రహం
-
కాసేపట్లో బాలాపూర్ గణేశుడి ఊరేగింపు
-
ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది!
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఇక నుంచి ఎక్కడంటే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసేందుకు కుదరదు. నిర్దేశించిన స్థలాల్లో మాత్రమే వాహనాలను నిలపాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన బైక్ ఆపుకొని అలా హుస్సేన్‌సాగర్‌ను చూస్తామంటే రూల్స్ ఒప్పుకోవు. నో పార్కింగ్ జోన్లో వాహనం పార్కింగ్ చేశారో క్షణాల్లో మొబైల్ ఫోన్‌కు రూ.1000 జరిమానా విధిస్తూ సందేశం వస్తుంది. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల స్పీడ్ గన్లను కూడా ఫిక్స్ చేశారు. నిమిషం పాటు అలా వెళ్లి వస్తామని నిర్లక్ష్యంగా పార్కింగ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నో పార్కింగ్ బోర్డులు అడుగడుగునా ఏర్పాటు చేసి ఒక వేళ పార్కింగ్ చేస్తూ రూ.1000 జరిమానా అంటూ రాయడంతో ఇక వాహనదారులు అప్రమత్తం కావాల్సిందే. చదవండి: మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’ -
ట్యాంక్‌బండ్‌పై అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఓ చిన్నారిని బలి తీసుకోగా.. ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడటానికి కారణమైంది. ఈ ప్రాంతం ప్రమాదాలు ఎక్కువగా జరిగే మార్గాల జాబితాలో, పాదచారులకు రెడ్జోన్గానూ ఉంది. ట్యాంక్‌బండ్‌పై 2012 అక్టోబర్ 27 రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కేసు లోకాయుక్త సుమోటోగా స్వీకరించే వరకు వెళ్లింది. అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ ఈ రహదారి భద్రతపై ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పటికైనా శాశ్వత చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు ట్యాంక్‌బండ్‌కు బలయ్యే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. అత్యంత కీలక రహదారి... అంబేడ్కర్ విగ్రహం జంక్షన్ నుంచి వైస్రాయ్ చౌరస్తా వరకు దాదాపు 2.6 కిలోమీటర్ల పొడవున్న ట్యాంక్‌బండ్ పాఠశాల, వ్యాపార జోన్లలో ఏ ఒక్కదాని కిందికీ రాదు. అయితే జంట నగరాలకు అనుసంధానంగా ఉన్న దీని చుట్టూ కీలకమైన ప్రాంతాలు, కార్యాలయాలు ఉన్నాయి. సచివాలయం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, మింట్ కాంపౌండ్ తదితరాతో పాటు పర్యాటక స్థలాలైన ఐమాక్స్, పీవీ మార్గ్, ఎన్టీఆర్ మార్గ్, లుంబినీపార్క్, ఎన్టీఆర్ గార్డెన్ తదితరాలు విస్తరించి ఉన్నాయి. ఆద్యంతం పూర్తిస్థాయిలో సరాసరిన, ఎలాంటి టర్నింగ్స్ లేకుండా ఉండే రహదారి ట్యాంక్‌బండ్. రహదారి వెడల్పు తక్కువగా ఉండటం, ప్రతి ఏటా జరిగే నిమజ్జనాలు, ఇటీవల ప్రారంభమైన సన్డే–ఫన్డే తదితరాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై డివైడర్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. చదవండి: జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? ఈ–చలానాలతోనే సరా..? ► ఈ ప్రాంతంలో గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల మించిన వేగంతో వెళ్లకూడదనే నిబంధన ఉంది. ► దీన్ని ఉల్లంఘిచిన వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ లేజర్ గన్స్‌తో కాచుకుని ఉంటారు. ఈ ఉల్లంఘనులకు చలాన్లు విధిస్తారు. ► అయితే వీటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోందే తప్ప ట్యాంక్‌బండ్‌పై ప్రమాదాలు తగ్గే దాఖలాలు కనిపించట్లేదు. ► మరోపక్క ఎలాంటి సాంకేతిక నిపుణుల పోస్టులు లేని ట్రాఫిక్ పోలీసులు ఈ గరిష్ట వేగాన్ని ఎలా నిర్ధారించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ► ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ వింగ్ పేరుతో ఇంజనీర్లతో నిండిన జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి ప్రాంతాలను సాంకేతికంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలి. వాటిలో ట్రాఫిక్ పోలీసుల్ని భాగస్వాముల్ని చేసి పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఈ విషయంలో ‘గ్రేటర్’ మాత్రం అవసరమైన స్థాయిలో స్పందించిన దాఖలాలు లేవు. ఇలా ఎందుకు చేయరు? ► ఇరుకుగా ఉండటంతో పాటు డివైడర్ లేని ట్యాంక్‌బండ్‌పై రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఈ మార్గాన్ని వన్‌వేగా ప్రకటించాలి. ► నిర్దేశిత సమయంలో అప్పర్ ట్యాంక్‌బండ్‌ను ఒక దిశలో వెళ్లే వాహనాలకు, లోయర్ ట్యాంక్‌బండ్‌ను మరో దిశ వెళ్లే వాహనాలు కేటాయించాలి. ‘సన్డే–ఫన్డే’ సమయంలో ట్యాంక్‌బండ్ మొత్తాన్ని మూసేస్తున్న విషయం గమనార్హం. ►ట్యాంక్‌బండ్‌పైకి ఎక్కిన పాదచారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకుండా ఆద్యంతం రెయిలింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడికి వచ్చే వారు చూడాల్సిన విగ్రహాలు, జలాలు కూడా రెండు వైపులానే ఉన్నాయి కాబట్టి వీటివల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. -
అధికారంలోకి వచ్చాక ఎస్టీ రిజర్వేషన్లపైనే తొలి సంతకం
కవాడిగూడ: రాష్ట్రంలోబీజేపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఎస్టీ రిజర్వేషన్ల ఫైల్ మీద ఉంటుందని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్ రావు చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై కొమురంభీం విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్టీ రిజర్వేషన్లపై గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితబంధు మాదిరిగానే గిరిజనబంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి చొరవతో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తింపునిస్తామని చెప్పారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, గిరిజన ఐక్యవేదిక నేతలు వివేక్ నాయక్, డాక్టర్ హెచ్‌కె నాగు, సిదం అర్జున్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుతాడి కుమార్, లోనిక రాజు పాల్గొన్నారు. -
పూర్తికాని నిమజ్జనం.. భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, హైదారాబాద్: వినాయక నిమజ్జనం కారణంగా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. శుక్రవారం నాటికి కూడా నిమజ్జనం పూర్తి కాకపోవడంతో ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, రానిగంజ్, సికింద్రాబాద్, సంగీత సర్కిల్, బేగంపేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోవంటి ప్రధాన మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదలుతున్నాయి. నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్‌ను ఎత్తివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఐదు వందలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య నేటి సాయంత్ర వరకూ కొనసాగనుంది. దీని కారణంగా నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పటి వరకు రెండు వేలకు పైగా విగ్రహాలు గంగఒడికి చేరినట్లు అధికారులు తెలిపారు. -
భర్త తలాక్ చెప్పాడని..
-
భర్త తలాక్ చెప్పాడని.. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి..
సాక్షి, హైదరాబాద్: తలాక్ ఇస్తానంటూ భర్త వేధించడంతో ఓ గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన పిల్లలతో సహా ట్యాంక్‌బండ్‌లో దూకేందుకు యత్నించింది. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నీటిలోకి దూకేందుకు వెళ్తున్న ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. వారి సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న లేక్ పోలీసులు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కాగా గత కొద్దిరోజులుగా తలాక్ ఇస్తానంటూ తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసుల వద్ద వాపోయింది. ఆత్మహత్యయత్నానికి యత్నించిన మహిళను నగరంలోని టోలీచౌక్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. -
జంటనగరాల్లో 20 మినీ ట్యాంక్బండ్లు
సాక్షి, హైదరాబాద్ : జంట నగరాల పరిధిలోని 20 చెరువులను రూ.287 కోట్లతో మినీ ట్యాంక్బండ్లుగా మారుస్తామని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మరో 64 చెరువులను రూ.94 కోట్లతో పునరుద్ధరిస్తామన్నారు. శనివారం శాసనమండలిలో సభ్యులు పూల రవీందర్, కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రజల సౌకర్యాన్ని, భూగర్భజలాల పెంపు లక్ష్యంగా పట్టణ ప్రాంత చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. 220 మంది పిల్లలు చనిపోయారు: పాతూరి సిద్దిపేట జిల్లా కోహెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏడాదిలో 220 మంది పిల్లలు చనిపోయారని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మండలి దృష్టికి తెచ్చారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అని మంత్రి లక్ష్మారెడ్డిని ప్రశ్నించారు. ఈ పీహెచ్సీ పరిధిలో ఏడాదిగా వైద్యు డు లేరని, వైద్యున్ని నియమించాలని పట్టుబడితే తన గ్రామంలోని ఏఎన్ఎంను తొలగించా రన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. జీతాలు పెంచుతాం: తలసాని త్వరలోనే గోపాలమిత్రల జీతాలు పెంచుతామని పశు సంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సంక్షేమంపై కేంద్రం పెత్తనమెందుకు: ఈటల రాష్ట్రాల జనాభా, వెనుకబాటుతనం, విస్తీర్ణం దృష్ట్యా కాకుండా విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గొప్ప సంక్షేమ పథకాలు చేపడుతున్న తెలంగాణకు నిధులివ్వాలని కోరుతున్నా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి శాఖలపై కేంద్రం పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు కలిపి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం ఇంతవరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. -
ట్యాంక్‌బాండ్
చిన్న వ్యాపారమైనా సరే పుంజుకోవడానికి సంవత్సరమైనా పడుతుంది. అలాంటిది స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన ‘ఎన్యం వియం’ అనే ఇంటర్నేషనల్ బ్యాంకు కేవలం ఆరునెలల్లో ప్రపంచ బ్యాంకులలోనే నంబర్‌వన్ బ్యాంక్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.‘ఎన్యం వియం’ దెబ్బకు స్విట్జర్లాండ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ బ్యాంకు ‘యుబీఎస్’, అమెరికాలోని ‘సిటీ’ బ్యాంక్, చైనాలోని ‘చైనా మర్చంట్స్ బ్యాంక్’....ఒక్కటనేమిటి....ఎన్నో బ్యాంకులు కుదేలైపోయాయి.ఆరోజు స్విట్జర్లాండ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ‘ఎన్యం వియం’ బ్యాంక్ చైర్మన్‌తో ముఖాముఖి కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రెస్‌మీట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి ప్రసిద్ధ బిజినెస్ జర్నలిస్ట్‌లు వచ్చారు.అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్యం వియం’ చైర్మన్ సిమోనెట్టా పంజాగుట్ట రానే వచ్చాడు.పేరులో పంజాగుట్ట ఏమిటని పరేషానవుతున్నారా?అవును. అది మన పంజాగుట్టే. సిమోనెట్టా ముత్తాతకు ముత్తాత ముత్తులింగం మన తెలుగు వాడే. హైదరాబాద్‌లో పంజాగుట్టలో ఉండేవాడు. వ్యాపార నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన ముత్తులింగం అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడిపోయాడు. తమ భారతీయ మూలాలను గుర్తు తెచ్చుకోవడానికి ముత్తులింగం వంశస్తులు పేరు చివరన ‘పంజాగుట్ట’ అని తగిలించుకోవడం పరిపాటయింది. ఇప్పుడు మళ్లీ మనం ప్రెస్‌మీట్ దగ్గరికి వద్దాం.‘‘ఈరోజుల్లో బ్యాంకింగ్ వ్యాపారం ఎంత రిస్కో అందరికీ తెలిసిందే...నిన్నటి వరకు కలర్ఫుల్గా ఒక్క వెలుగు వెలిగిన బ్యాంకులు కూడా ఒక్క దెబ్బతో నెత్తి మీద వైట్క్లాత్ వేసుకొని బిక్కచచ్చి బిత్తరచూపులు చూస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో బ్యాంక్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే ప్రపంచంలోనే నంబర్‌వన్ బ్యాంక్‌గా నిలవడం చాలా గొప్ప విషయం. మీ విజయరహస్యం ఏమిటి?’’ అడిగాడు ఒక జర్నలిస్ట్.‘‘పెద్దల సలహాలు తీసుకున్నాను. తీసుకుంటాను. తీసుకుంటూనే ఉంటాను...’’ అని బదులిచ్చాడు సిమోనెట్టా పంజాగుట్ట. కొద్దిసేపటి తరువాత....‘‘ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎవరైనా సమాధానం చెప్పండి!’’ అని సవాలు విసిరాడు సిమోనెట్టా.‘‘అడగండి సర్’’ అన్నారు జర్నలిస్టులంతా మూకుమ్మడిగా. అప్పుడు సిమోనెట్టా గొంతు సవరించి ఇలా అడిగాడు...‘‘ఒక బ్యాంకును దోచుకోవడానికి ఇద్దరు దొంగలు వెళ్లారు. ఆ దొంగలు సరాసరి బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి... ‘మేము ఈ బ్యాంకును దోచుకోవడానికి వచ్చాం. బ్యాంకులో ఒక్కరూపాయి కూడా లేకుండా మొత్తం ఊడ్చేసి ఈ బ్యాగుల్లో సర్ది పెట్టండి. లేకుంటే ఏం జరుగుతుందో తెలుసా?’’ అంటూ ఇద్దరు ప్యాంట్ జేబులో చేయిపెట్టారు. వాళ్ల గుండె ఆగినంత పనైంది.ఎందుకంటే వాళ్లు పిస్టల్ తెచ్చుకోవడం మరిచిపోయారు. అయినా సరే.... ఆ బ్యాంకును విజయవంతంగా దోచుకెళ్లారు. చిన్న ఆయుధం కూడా లేకుండా ఉత్త చేతులతో వాళ్లు ఎలా బ్యాంకును దోచుకువెళ్లారో మీలో ఎవరైనా చెప్పగలరా?’’ జర్నలిస్టులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయిదు నిమిషాలు. పదినిమిషాలు. టైమ్ గడుస్తూనే ఉందికాని ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు సిమోనెట్టా ఇలా సమాధానం ఇచ్చాడు...‘‘అరే పిస్టల్ తేవడం మరిచామే... అని గట్టిగా గొణుక్కున్నారు ఇద్దరు దొంగలు.అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడో తెలుసా?‘‘ఏం ఫరవాలేదు. ఐ ట్రస్ట్ యూ, యు కెన్ షో మీ ది గన్ టుమారో’’... చెప్పొచ్చేదేమింటే ఇలాంటి పిట్టకథలెన్నో నన్ను సక్సెస్ఫుల్ బ్యాంకర్‌గా మలిచాయి’’ ఇప్పుడు ఇండియాలో... నీరవ్ మోదీ కేసును ట్యాంక్‌బాండ్007కు అప్పగించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈయన కాస్త పేరున్న ప్రైవేట్ డిటెక్టివ్. జేమ్స్‌బాండ్ అనబోయి ట్యాంక్‌బాండ్ అనలేదు. ఆయన పేరు నిజంగానే ట్యాంకుబాండ్! ఈ ట్యాంకుబాండ్ వాళ్ల నాన్న కొంతకాలం హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాడు. ఆఫీసు అయిపోగానే ఆయన రోజూ సాయంత్రం ట్యాంక్‌బండ్ మీద కూర్చొని జేమ్స్‌బాండ్ నవలలు చదువుకునేవాడు. తనకు ఇష్టమైన ట్యాంక్‌బండ్, జేమ్స్‌బాండ్‌ను ఎప్పుడూ గుర్తు వచ్చేలా తన కొడుకుకు ‘ట్యాంక్‌బాండ్’ అని పేరు పెట్టుకుని మురిసిపోయాడు. సరే, ఈ పేరు సంగతి వదిలేసి మ్యాటర్‌లోకి వద్దాం.‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’ అధికారులను చూసీ చూడగానే...టీవీ ముందు కూర్చున్న ట్యాంక్‌బాండ్ లేచి‘జస్ట్ ఇప్పుడే క్లూ కనిపెట్టాను’’ అన్నాడు. అధికారులు ఆనందం తట్టుకోలేక ‘యురేక తకమికా’ అని అరిచారు.రెండు రోజుల తరువాత తాటికాయంత అక్షరాలతో న్యూస్పేపర్లలో వచ్చిన సంచలన హెడ్లైన్లు ఇవి...‘ఎన్యం వియం బ్యాంకు చైర్మన్ సిమోనెట్టా పంజాగుట్ట అరెస్ట్’. ‘ఎన్యం వియం బ్యాంక్ ఎవరిదో కాదు... నీరవ్ మోదీ, విజయ్మాల్యాలదే! వీళ్లకు సిమోనెట్టా పంజాగుట్ట బినామీ’. ‘బ్యాంకు నుంచి దోచుకెళ్లిన డబ్బుతో కొత్త బ్యాంకు స్థాపించడం ప్రపంచ చరిత్రలో ఇదే ప్రథమం’. ‘ఎన్ఎం వియంలో ఎన్ఎం అంటే నీరవ్ మోదీ, వియం అంటే విజయ్ మాల్యా’ ... ఇలా అంతులేని వార్తాకథనాలు నాన్‌స్టాప్‌గా వస్తూనే ఉన్నాయి! ‘‘క్లూ ఎలా దొరికింది?’’ ట్యాంక్‌బాండ్ 007ను ఆసక్తిగా అడిగింది మీడియా.‘‘లియన్ గ్లాస్ అనే రచయిత్రి రాసిన ‘ది బాడీ లాంగ్వేజ్ ఆఫ్ లయర్స్’ అనే పుస్తకాన్ని అప్పుడే చదవడం పూర్తి చేసి టీవీ ఆన్ చేశాను. సిమోనెట్టా ప్రెస్‌మీట్ కార్యక్రమం వస్తుంది. అయిపోయేంత వరకు చూశాను. ఆ పుస్తకంలో తెలుసుకున్న విషయాల ఆధారంగా సిమోనెట్టా అబద్ధాలకోరు అని అతని బాడీలాంగ్వేజి ద్వారా కనిపెట్టాను. చాలా షార్ట్‌టైమ్‌లో ఒక బ్యాంకు నంబర్‌వన్‌గా నిలిచిందంటే... ఆ విజయం వెనుక బ్యాంకుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మేధావులైనా ఉండాలి, బ్యాంక్‌ల గురించి బాగా తెలిసిన బ్యాంకుదొంగలైనా ఉండి ఉండాలి. మేధావులుండేంత సీన్ సిమోనెట్టాకు లేదు. కాబట్టి దీని వెనుక నీరవ్ మోదీ, విజయ్‌మాల్యాలు కచ్చితంగా ఉంటారని ఊహించాను. నా ఊహ నిజమైంది’’ అసలు విషయం చెప్పాడు ట్యాంక్‌బాండ్ 007. – యాకుబ్ పాషా -
జెండా చిరిగి స్తంభం మిగిలింది
దేశంలోనే అతిపెద్ద జెండా దుస్థితి ఇది పక్షం రోజుల్లో చిరిగిన మూడు జెండాలు గాలి ప్రభావం తగ్గేవరకు జెండా ఎగరేయొద్దని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద జెండాకు గాలి రూపంలో పెద్ద సమస్య ఎదురవుతోంది. స్తంభంపైకి పతాకాన్ని ఎక్కిస్తే చాలు పర్రున చిరిగిపోతోంది. బలంగా వీచే గాలి ప్రభావాన్ని తట్టుకునేలా ప్రత్యేక పాలిస్టర్ వస్త్రంతో రూపొందించినప్పటికీ అది తట్టుకోలేకపోతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన అతిపెద్ద జెండా పరిస్థితి ఇది. పక్షం రోజుల్లోనే మూడు జెండాలు చిరిగి పోవటంతో ప్రస్తుతం అధికారులు స్తంభం నుంచి జెండాను తాత్కాలికంగా దించివేశారు. వర్షాకాలం వచ్చినా ఇప్పటి వరకు చినుకు జాడ లేకపోవటంతో గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. 291 మీటర్ల ఎత్తులో జెండాను ఎగరేయాల్సి ఉన్నందున అక్కడ గాలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. దీంతో జెండా చాలా వేగంగా రెపరెపలాడుతూ ఆ ఒత్తిడితో చిరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గాలి వేగం తగ్గేవరకు జెండాను ఎగరవేయొద్దని అధికారులు నిర్ణయించారు. బుధవారం జెండా చిరగటంతో దాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయలేదు. దీనిపై ఢిల్లీలోని ‘ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు కేవీ గిల్‌తో అధికారులు చర్చించారు. గాలి ప్రభావం తీవ్రంగా ఉంటే ఏర్పాటు చేసేకొద్దీ జెండాలు చిరిగిపోతూనే ఉంటాయని, ఇది ‘మాన్యుమెంట్ ఫ్లాగ్’ కేటగిరీలోకి వస్తున్నందున కొద్దిరోజులు జెండా తొలగించినా నిబంధనలకు ఇబ్బంది ఉండదని సూచించినట్టు సమాచారం. వాతావరణ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ గాలివాటం ఎలా ఉండనుందో ముందస్తు సమాచారం ఇచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. దీంతో అధికారులు ప్రస్తుతం జెండాను తొలగించారు. జూన్ రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దీన్ని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేశారు. దేశంలో అతి ఎత్తయిన జెండాగా రాంచీలోని పతాకం రికార్డుల్లో నిలవగా, అతి పెద్ద జెండాగా సంజీవయ్య పార్కులోని జెండా రికార్డుకెక్కింది. సరిగ్గా వారం క్రితం తొలి జెండా ఓ మూలన చిరిగిపోయింది. చిన్నగా మొదలైన చిరుగు రోజురోజుకు పెరగటంతో గుర్తించిన అధికారులు దాన్ని తొలగించి మరోటి ఏర్పా టు చేశారు. తొలి జెండాతోపాటు ముందుజాగ్రత్త చర్యగా రెండోది తెప్పించి పెట్టుకోవటంతో ఉపయోగపడింది. అది కూడా చిరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళనతో ముంబైలోని సారాబాయి ఫ్లాగ్ కంపెనీకి మూడు జెండాలను, తొలి జెండాను రూపొందించిన ఖమ్మం వాసికి మరో మూడు జెండాలకోసం ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం నాలుగు జెండాలు వచ్చాయి. రెండో జెండాను ఏర్పాటు చేసిన మూడు రోజులకే అది కూడా చిరిగిపోయింది. దీంతో బుధ వారం మరో జెండాను ఎక్కిస్తుండగా గాలి తాకిడికి అది స్తంభంలోని ఓ అతుకు వద్ద చిక్కుకుని చిరిగిపోయింది. ఒక్కో జెండా ఖరీదు రూ.1.15 లక్షలకు పైమాటే కావటంతో అధికారులు మరో జెండా ఎగరేసే సాహసం చేయలేదు. జెండా నిర్వహణకు కమిటీ... ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ జెండాను హెచ్ఎండీఏకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని నిర్వహణకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
నేడు ఎఫ్1 ‘షో రన్’
హైదరాబాద్‌లో తొలిసారి ఎఫ్1 రేస్ కారు పరుగులు తీయనుంది. ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ఉదయం 9 గంటలకు రెడ్‌బుల్ రేస్ కారు ‘షో రన్’ జరుగుతుంది. గతంలో 13 గ్రాండ్‌ప్రి రేస్‌లను గెలిచిన డ్రైవర్ డేవిడ్ కూల్ట్‌హర్డ్ ఈ కారును నడుపుతారు. -
ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్రుల విగ్రహాలు తొలగిస్తాం:కేటీఆర్
ముస్తాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీమాంధ్రుల విగ్రహాలను తొలగించి, అక్కడ తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర పాలకులు కుట్రపూరితంగా తెలంగాణ మహనీయుల చరిత్రను వక్రీకరించారని తెలిపారు. తెలంగాణ పోరాటయోధుల చరిత్రను పాఠ్యాపుస్తకాల్లో చేర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగి, శ్రీకాంతాచారి, సర్వాయిపాపన్న విగ్రహాలను నెలకొల్పుతామని ఆయన తెలిపారు. -
పాపం... పవన్
హైదరాబాద్: అతని పేరు పవన్‌కుమార్. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఎందరివో మృతదేహాలను బయుటకు తీశాడు.. ఆత్మహత్య చేసుకొనేందుకు ‘సాగర్’ జలాల్లో దూకిన ఎందరినో రక్షించాడు... చివరకు తానే ప్రమాదవశాత్తు అదే నీటిలో మునిగి చనిపోయూడు. ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాచలానికి చెందిన పవన్‌కుమార్ ట్యాంక్‌బండ్ కింద ఉండే కట్టమైసమ్మ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై ఉంటూ జీవిస్తున్నాడు. ఏ పని చిక్కితే ఆ పని చేసేవాడు. హుస్సేన్‌సాగర్‌లో ఏదైనా మృతదేహం తేలియాడుతుంటే పోలీసుల ఆదేశాల మేరకు బయటకు తీసేవాడు. ఐదేళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. అలాగే, వినాయక నిమజ్జనం తర్వాత సాగర్ జలాల్లో ఉండే ఇనుప చువ్వలు తీసుకొని విక్రయించేవాడు. ఇదిలా ఉండగా, ఆదివారం సాయంత్రం హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా నీటిలో ఉండిపోయిన ఇనుపచువ్వలు తీసుకుంటూ.. ప్రమాదవశాత్తు ఆ చువ్వల్లో చిక్కుకొని మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లో ఓ మృతదేహం తేలియాడుతుండగా పోలీసులు బయుటకు తీయించారు. మృతుడు పవన్‌కుమార్‌గా గుర్తించి, పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో మృతదేహం వెలికితీత... హుస్సేన్‌సాగర్‌లో తేలియాడుతున్న మరో మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు సోమవారం వెలికి తీయించారు. సంజీవయ్యపార్కు వెనుకవైపు గల సాగర్ జలాల్లో ఓ మృతదేహం తేలియడుతుండగా బయటకు తీశారు. మృతుడికి 25- 30 ఏళ్లుంటాయని, ఒంటిపై ఆకుపచ్చ టీషర్ట్, నలుపు జీన్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. సంబంధీకులు 9490157553 సెల్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. -
సభలో విగ్రహావేశాలు
మట్టిబొమ్మలు పగిలితే ట్యాంక్‌బండ్‌కు వెళ్లి రోదించారన్న కేటీఆర్ వెయ్యి మంది విద్యార్థులు మరణిస్తే కన్నీటి బొట్టు రాల్చరంటూ ధ్వజం మట్టిబొమ్మలు కావవి.. జాతి నేతల చిహ్నాలు: ధూళిపాళ్ల, వంగా గీత కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే: శైలజానాథ్, టీ టీడీపీ సభ్యులు సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఉన్న ప్రముఖుల విగ్రహాల కూల్చివేతపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు మంగళవారం శాసనసభలో దుమారం రేపాయి. టీఆర్ఎస్, టీడీపీ సభ్యుల మధ్య ఆవేశకావేశాలకు దారి తీశాయి. సభ్యులు చరిత్ర తవ్వుకుంటూ మాటల యుద్ధానికి దిగారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ సీమాంధ్ర టీడీపీ సభ్యులతో పాటు, అధికార పక్షానికి చెందిన కొందరు సభ్యులు సభను అడ్డుకున్నారు. వెన్నుపోట్లకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆద్యుడని కేటీఆర్ ఎద్దేవా చేస్తే, ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి అందరితో సంతకాలు చేయించింది టీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణ బిల్లుపై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ‘ట్యాంక్‌బండ్‌పై ఉన్న నాలుగు మట్టి బొమ్మలు పగిలిపోతే రాద్ధాంతం చేస్తూ రోదించారు. అక్కడకు వెళ్లి కన్నీరు పెట్టుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వెయ్యి మంది మరణిస్తే కన్నీరు కూడా పెట్టలేదు. అలాంటి వారు అన్నదమ్ముల్లా కలిసుందామని ఎలా అంటారు?’ అని వ్యాఖ్యానించారు. దాంతో సభలో దుమారం రేగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. టీడీపీ సభ్యులు కూడా పోడియంలోకి వెళ్లి, కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. కానీ కేటీఆర్ మాత్రం, ‘క్షమాపణలు చెప్పను. వంద శాతం ఇలాగే అంటాను. నాలుగు మట్టిబొమ్మలు కూలితే ఇంత రోదిస్తారా?’ అని మరోసారి అనడంతో గొడవ రెట్టింపయింది. దాంతో సభను డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క ఐదు నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక కూడా సభలో అదే ఆందోళన కొనసాగింది. ఏ మహనీయులకు తాము వ్యతిరేకం కాదని టీఆర్ఎస్ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. ‘‘పెట్రోల్ మంటల్లో కాలిపోతూ కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ నినాదాలు చేస్తూ మరీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి ఆత్మహత్యలు వద్దంటూ తీర్మానం, విజ్ఞప్తి చేద్దామని, తద్వారా యువకులకు భరోసా కల్పిద్దామని కోరినా ఎవరూ కలసి రాలేదు. కడుపు మంటతో చేసే పనులు సాధారణంగా జరుగుతుంటాయి. మీ ఉద్యమంలో కూడా జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేశారు. ట్యాంక్‌బండ్‌పై కొమరం భీమ్, బందగి, చాకలి ఐలమ్మ విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? పదవులు మాకు గడ్డిపోచ కింద లెక్క’’ అన్నారు. మట్టిబొమ్మలు కావవి: ధూళిపాళ్ల టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కల్పించుకుని, అవి మట్టిబొమ్మలు కావని, జాతి నాయకులకు, సంస్కృతీ, సంప్రదాయాలకు చిహ్నాలని అన్నారు. ‘‘ఆ విగ్రహాలు పెట్టడానికి వేసిన కమిటీలో ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డితో పాటు కేసీఆర్ కూడా సభ్యుడు. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు మీ నైజానికి గుర్తు. క్షమాపణ చెప్పే సంస్కారం కూడా లేదా?’ అంటూ మండిపడ్డారు. కేటీఆర్ బదులిస్తూ, ‘బతికున్న వారికి సమాధి కట్టే సంస్కృతి మీది. శాంతియుత ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేస్తేనే అలాంటి ప్రతిక్రియ జరిగింది. ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన దుర్మార్గులు మీరు. క్షమాపణ చెప్పాలని మీ నాయకునికి సూచించండి. మీ దగ్గర సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణకు అనుకూలమని మీ టీడీపీ మేనిఫెస్టోలో అన్నారు. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. సిగ్గుంటే రాజీనామా చేసి మాట్లాడండి. మందబలంతో నోరు నొక్కేస్తే ఎవరూ ఊరుకోరు’’ అన్నారు. గాంధీని చంపిన గాడ్సే కంటే కూడా చంద్రబాబు నీచుడని ఎన్టీఆరే అన్నారని గుర్తు చేశారు. దాంతో మరోసారి టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ‘అహంకార వైఖరి నశించాలి’, ‘అహంకార వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’, ‘క్షమాపణ చెప్పాలి’ అంటూ నినాదాలు చేశారు. విడిపోవడానికే ఏకాభిప్రాయమా: కేటీఆర్ రాష్ర్టం విడిపోవడానికి కావాల్సిన ఏకాభిప్రాయం, కలిసుండటానికి మాత్రం అవసరం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. విభజన బిల్లుపై మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఏకాభిప్రాయంతోనే విభజన జరగాలనడం సరికాదన్నారు. ‘‘కుట్రలు, కుతంత్రాలతోనే నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రెడీమేడ్‌గా ఉన్న హైదరాబాద్ రాజధాని కోసమే సీమాంధ్ర వారు అప్పుడు కలసిపోయారు. తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు స్వభావముంది. నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి రక్షణగా టీఆర్ఎస్ నిలబడింది. ఈ బిల్లు ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ రాలేదు. మెడలు వంచి తెలంగాణను సాధించుకుంటున్నాం’’ అన్నారు. రాష్ట్రం కోసం పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు చనిపోతే ఆయన అంత్యక్రియలను కనీసం అధికార లాంఛనాలతో నిర్వహించలేదంటూ ఆక్షేపించారు. పీవీ నరసింహారావును రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది కూడా పని చేయకుండా చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో పూర్తి శత్రుభావం రాకముందే విడిపోవడం మంచిదన్నారు. -
గంగ ఒడికి మహా గణపతి
బుధవారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన ఘట్టం గురువారం సాయంత్రానికి పూర్తయింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణనాథుని శోభాయాత్ర గురువారం మధ్యాహ్నానికి ట్యాంక్‌బండ్‌కి చేరుకుంది. 1.53 నిమిషాల ప్రాంతంలో గోనాగ చతుర్ముఖ గణపతి సాగర గర్భంలోకి చేరాడు.