ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్రుల విగ్రహాలు తొలగిస్తాం:కేటీఆర్ | will remove Seemandhra Statues from Tank Band: KTR | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్రుల విగ్రహాలు తొలగిస్తాం:కేటీఆర్

Published Tue, Mar 11 2014 12:47 AM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM

ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్రుల విగ్రహాలు తొలగిస్తాం:కేటీఆర్ - Sakshi

ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్రుల విగ్రహాలు తొలగిస్తాం:కేటీఆర్

ముస్తాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీమాంధ్రుల విగ్రహాలను తొలగించి, అక్కడ తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్  ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర పాలకులు కుట్రపూరితంగా తెలంగాణ మహనీయుల చరిత్రను వక్రీకరించారని తెలిపారు. తెలంగాణ పోరాటయోధుల చరిత్రను పాఠ్యాపుస్తకాల్లో చేర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగి, శ్రీకాంతాచారి, సర్వాయిపాపన్న విగ్రహాలను నెలకొల్పుతామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement