Seemandhra statues
-
ఆ విగ్రహాలు ఆంధ్రులవి కావు....తెలుగువారివి
హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలు తెలుగువారివే కానీ...ఆంధ్రులవి కావని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కొందరు విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలుగువారి గౌరవానికి నిదర్శనంగా ఎన్టీఆర్ ....మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్రవారి విగ్రహాలను తొలగిస్తామన్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలను శంకర్రావు ఖండించారు. కాగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న అనవసర ఆంధ్రావాళ్ల విగ్రహాలను తొలగించి, వాటి స్థానంలో నూతన విగ్రహాలకు ప్రతిష్టిస్తామని నాయిని నిన్న సికింద్రాబాద్‌లోని వీర శైవ లింగాయత్ లింగబలిజ సమావేశంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్రుల విగ్రహాలు తొలగిస్తాం:కేటీఆర్
ముస్తాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీమాంధ్రుల విగ్రహాలను తొలగించి, అక్కడ తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర పాలకులు కుట్రపూరితంగా తెలంగాణ మహనీయుల చరిత్రను వక్రీకరించారని తెలిపారు. తెలంగాణ పోరాటయోధుల చరిత్రను పాఠ్యాపుస్తకాల్లో చేర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగి, శ్రీకాంతాచారి, సర్వాయిపాపన్న విగ్రహాలను నెలకొల్పుతామని ఆయన తెలిపారు.