సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఇక నుంచి ఎక్కడంటే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసేందుకు కుదరదు. నిర్దేశించిన స్థలాల్లో మాత్రమే వాహనాలను నిలపాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన బైక్ ఆపుకొని అలా హుస్సేన్‌సాగర్‌ను చూస్తామంటే రూల్స్ ఒప్పుకోవు. నో పార్కింగ్ జోన్‌లో వాహనం పార్కింగ్ చేశారో క్షణాల్లో మొబైల్ ఫోన్‌కు రూ.1000 జరిమానా విధిస్తూ సందేశం వస్తుంది.
నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల స్పీడ్ గన్‌లను కూడా ఫిక్స్ చేశారు. నిమిషం పాటు అలా వెళ్లి వస్తామని నిర్లక్ష్యంగా పార్కింగ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నో పార్కింగ్ బోర్డులు అడుగడుగునా ఏర్పాటు చేసి ఒక వేళ పార్కింగ్ చేస్తూ రూ.1000 జరిమానా అంటూ రాయడంతో ఇక వాహనదారులు అప్రమత్తం కావాల్సిందే.
చదవండి: మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’
Comments
Please login to add a commentAdd a comment