Ganesh nimarjanam
-
క్రతువు ముగిసింది.. కాలుష్యం మిగిలింది!
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్ సహా సుమారు వంద జలాశయాల్లో వేలాదిగా గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు. నిమజ్జన క్రతువు ముగిసిన వెంటనే వ్యర్థాలను గణనీయంగా తొలగించినట్లు బల్దియా యంత్రాంగం ప్రకటించినప్పటికీ.. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కారణంగా టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, అధిక గాఢత రసాయనాలు, హానికారక మూలకాలు, ఇనుము, కలప, పీఓపీ ఆయా జలాశయాల్లో కలిసినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. త్వరలో నిమజ్జన కాలుష్యంపై తుది నివేదిక విడుదల చేయనున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో అంచనా ఇలా.. జలాశయంలోకి సుమారు 5 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 2 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలిసినట్లు పీసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఇనుము, కలపను బల్దియా ఆధ్వర్యంలో తొలగించినా.. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్లు పరిమితులకు మించి నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. రసాయనాలు, మూలకాలిలా.. రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టరీ్పన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్ని‹Ù. హానికారక మూలకాలు: కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జిక్ సలై్ఫడ్, మెర్క్యురీ, మైకా. తలెత్తే అనర్థాలు.. ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి. (చదవండి: రూబీ లాడ్జీ: ఎనమిదికి చేరిన మృతుల సంఖ్య..ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు) -
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం
-
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ
-
నిరాడంబరంగా నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: గణపతులు కొలువుదీరిన వాహనాలతో కిక్కిరిసిపోయిన రోడ్లు, గంటల కొద్దీ శోభాయాత్రలు, భక్తుల నృత్యాలు, జయజయ ధ్వనులు, ప్రసాదాల వితరణ, చిన్నారుల చిందు లు, యువతీయువకుల కోలాహలం.. ఏటా వినాయకుల నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కనిపించే దృశ్యాలు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం, ప్రభుత్వ నిబంధనలతో ఈ ఏడాది ఇలాంటి దృశ్యాలు చాలా వరకు కనిపించలేదు. అతి తక్కువ మందితో వచ్చి వినాయకుల నిమజ్జనం పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. ‘ఓ ధన్వంతరీ వినాయకా.. మానవ జాతి మేలు కోసం మహా వినాయకుడిగా మళ్లీ రావాలే.. కోవిడ్‌ను ఓడించి విజయ వినాయకుడివై పూజలందుకోవాలి’అని భక్తుల ప్రార్థనలు, నినాదాల మధ్య హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన శోభాయాత్ర మంగళవారం నిరాడంబరంగా ముగిసింది. కోవిడ్ నిబంధనల నేపథ్యం లో వినాయక విగ్రహాలతో పాటు శోభా యాత్రలో పాల్గొన్న భక్తుల సంఖ్య కూడా ఈసారి భారీగా తగ్గిపోయింది. అర్ధరాత్రి వరకు హుస్సేన్‌సాగర్‌లో దాదాపు మూడున్నర వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇక కూకట్పల్లి ఐడీఎల్, హస్మత్‌పేట, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, దుర్గం చెరువు, మల్కం చెరువు తదితర ప్రాంతాల్లో మొత్తం పది వేల వరకు విగ్రహాలను గంగమ్మ చెంతకు చేర్చారు. 4 గంటల్లో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తి ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం నాలుగు గంటల్లో పూర్తి చేశారు. 11 రోజుల పాటు విశేష పూజలందుకున్న ‘శ్రీధన్వంతరి నారాయణ’గా కొలువుదీరిన ఖైరతాబాద్ మహా గణపతి మంగళవారం భక్తుల కోలాహలం, జయజయ ధ్వనుల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. మధ్యాహ్నం 12.44 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా 4.35 గంటలకు ట్యాంక్‌బండ్‌లోని క్రేన్ నంబర్ 3 వద్దకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 5.26 గంటలకు మహా గణపతి నిమజ్జనం పూర్తి చేశారు. అయి తే గతంతో పోలిస్తే ఈసారి నెక్లెస్‌రోడ్‌లో భక్తజన సందోహం భారీగా తగ్గింది. కేసీఆర్‌కు బాలాపూర్ లడ్డూ ఈసారి లడ్డూ వేలం లేకుండానే బాలాపూర్ గణేశుడు గంగమ్మ ఒడిలో చేరిపోయాడు. ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. చంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, చార్మినార్, మొజంజాహీ మార్కెట్ మీదుగా ఉదయం 11.30 గంటలకు హుస్సేన్‌సాగర్ చేరుకున్నాడు. అనంతరం పూజలు నిర్వహించి నిమజ్జనం పూర్తి చేశారు. ఈ ఏడాది లడ్డూ వేలం వేయలేదని, సీఎం కేసీఆర్‌కు లడ్డూని బహూకరిస్తామని బాలాపూర్ గణపతి నిర్వాహక కమిటీ ప్రకటించింది. ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం వినాయక శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరగటంతో పోలీసు, అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేశ్ భగవత్, వీసీ సజ్జనార్‌లు ప్రత్యక్షంగా బందోబస్తులో పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది రహదారులతో పాటు చెరువుల్లోని వ్యర్థాలను వెనువెంటనే శుద్ధి చేశారు. మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి -
గణేష్ నిమజ్జనం: 28మంది దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: గణేశ్ నిమజ్జం సందర్భంగా పలు రాష్ట్రాల్లో విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రతో పాటు భోపాల్‌లో సుమారు 28 మంది దుర్మరణం చెందగా, పలువురు గల్లంతు అయ్యారు. ఒక్క మహారాష్ట్రలోనే 17మంది నిమజ్జనం సందర్భంగా నీట మునిగారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. అమరావతిలో నలుగురు, రత్నగిరిలో ముగ్గురు, నాసిక్, సింధుదుర్గ్, సతరాలో ఇద్దరు చొప్పున, థానే, ధులే, బుల్దానా,భందారాలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక భోపాల్‌లో ఖట్లపురా ఘాట్ వద్ద పడవ బోల్తా పడటంతో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 16మంది ఉన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ఢిల్లీతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు యమునా నదిలో గణపతి నిమజ్జనం సందర్భంగా మృత్యువాత పడ్డారు. ఇక రెండు రోజుల క్రితం కర్ణాటకలోని కేజీఎఫ్ పట్టణంలో నిమజ్జనంలో పాల్గొన్న ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. -
పూర్తికాని నిమజ్జనం.. భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, హైదారాబాద్: వినాయక నిమజ్జనం కారణంగా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. శుక్రవారం నాటికి కూడా నిమజ్జనం పూర్తి కాకపోవడంతో ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, రానిగంజ్, సికింద్రాబాద్, సంగీత సర్కిల్, బేగంపేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోవంటి ప్రధాన మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదలుతున్నాయి. నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్‌ను ఎత్తివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఐదు వందలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య నేటి సాయంత్ర వరకూ కొనసాగనుంది. దీని కారణంగా నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పటి వరకు రెండు వేలకు పైగా విగ్రహాలు గంగఒడికి చేరినట్లు అధికారులు తెలిపారు. -
గణేశ్ నిమజ్జనంలో తీవ్ర విషాదం : 11 మంది మృతి
భోపాల్ : గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా భోపాల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భోపాల్‌లోని ఖట్లపురా ఘాట్ వద్ద పడవ బోల్తా పడటంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. భోపాల్ ఐజీ యోగేష్ దేశ్‌ముఖ్ అందించిన సమాచారం ప్రకారం పడవలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 11మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని వారి కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మరో అయిదుగురి ఆచూకీ గల్లతైంది. వీరి ఆచూకీ కోసం గత ఈతగాళ్లు శ్రమిస్తున్నారు. ఎస్‌డిఇఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ విషాదంపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. Madhya Pradesh: 11 bodies recovered at Khatlapura Ghat in Bhopal after the boat they were in, capsized this morning. Search operation is underway. More details awaited. pic.twitter.com/mEMSJdzhE9 — ANI (@ANI) September 13, 2019 -
గణేష్ నిమజ్జనాన్ని సులభంగా ఇలా వీక్షించండి
-
గణేష్ నిమజ్జనాన్ని సులభంగా ఇలా వీక్షించండి
వినాయక నవ రాత్రుల ముగింపు ఘట్టం దగ్గరకు వచ్చింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్‌లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంది. నగరం నలమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం వీక్షించడానికి సిద్ధపడుతున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు జరగబోయే శోభాయాత్రను తిలకించడానికి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఈసారి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, బారికేడ్లను దాటడంలో ఇబ్బందులు పడకుండా ఉత్తమమైన మెట్రో మార్గాన్ని ఎంచుకోండి. -
అయ్యో.. గణేశా!
ఇటిక్యాల (అలంపూర్) : జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానదిలో బుధవారం నిర్వహించిన గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. రెండు మూడు రోజులుగా హైదరాబాద్, కర్నూలు, ఇతర ప్రాంతాలనుంచి కృష్ణానదిలో వినాయకులను నిమజ్జనం చేయడానికి భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మస్తాన్‌నగర్‌కు చెందిన 22 మంది యువకులు విగ్రహాన్ని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు ఉదయం 8.15 గంటలకు బీచుపల్లికి చేరుకున్నారు. వారి వెంట వచ్చిన సాయిరాం (18), రాజ్‌కుమార్ (18)లు సైతం పుష్కరఘాట్లపై నుంచి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు నదిలోకి దిగారు. 10 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని అందరు కలిసి ఎత్తుకోని పుష్కరఘాట్ల మేట్లపై నుంచి నదిలోకి వదిలేందుకు వెళ్లారు. ఘాట్లపై నీరు 4 ఫీట్ల ఎత్తులోనే ఉండగా పెద్ద విగ్రహం కావడంతో నదిలోకి ఎక్కువ దూరం వెళ్లారు. లోతు అధికంగా ఉన్న విషయం తెలియక ఈత రాని ఇద్దరు గల్లంతయ్యారు. ఎవరూ గమనించకపోవడంతో ఆ విషయం తోటి స్నేహితులు పసిగట్టలేకపోయారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చిన గజ ఈతగాళ్లు నదిఒడ్డున వచ్చిన యువకకులు కాసేపటి తర్వాత ఆందోళనకు గురయ్యారు. నదిలో దిగిన వారిలో ఇద్దరు ఇంకా రాలేదని.. నీటిలోనే మునిగిపోయి ఉంటారని కేకలు పెట్టారు. అక్కడున్న వారు గజ ఈతగాళ్లను పిలిచి విషయాన్ని చెప్పారు. వెంటనే వారు నదిలో దిగి ఇద్దరి మృత దేహలను ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న అలంపూర్ సీఐ రజితారెడ్డి, ఇటిక్యాల ఎస్ఐ జగదీశ్వర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తోటి స్నేహితులు జరిగిన సంఘటన గురించి కుటుంబసభ్యులకు తెలిపారు. మృతదేహాలను చూసి స్నేహితులు బోరున విలపించారు. అవగాహన లేకే ప్రమాదం సోమ, మంగళ, బుధవారాల్లో ఎలాంటి ప్రమాదా లు జరుగకపోయినా నదిలో ఉన్న లోతు తెలియక చాలామంది ఇబ్బంది పడ్డారు. బుధవారం ఉద యం జరిగిన ప్రమాదానికి నది లోతు తెలియకపోవడం, దానికి తోడు వారికి ఈత రాకపోవడం, నీటి లో పడిపోయినప్పుడు ఎవరూ గమనించకపోవడం ప్రమాదానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇదే మొదటి ప్రమాదం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద ప్రతియేటా వేలసంఖ్యలో గణేష్ విగ్రహాలను కృ ష్ణానదిలో నిమజ్జనం చేస్తారు. పుణ్యక్షే త్రం వద్ద ఇప్పటివరకు ఎలాంటి అప శ్రుతి చోటుచేసుకోలేదు. యువకుల తప్పిదం వల్ల మొదటిసారి ప్ర మాదం చోటుచేసుకోవడంతో బీచుపల్లి వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది మొత్తం 1004 వినాయక విగ్రహాలను అధికారుల సమక్షంలో నిమజ్జనం చేశారు. రెండురోజుల క్రితమే నిమజ్జన కార్యక్రమం ముగియడంతో సంఘటన జరిగినప్పుడు అధికారులు ఎవరూ అక్కడ లేరు. మృతదేహాల అప్పగింత గద్వాల క్రైం: వినాయకుని నిమజ్జనం చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందగా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటిక్యాల పోలీసుల సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి స్నేహితులకు అప్పగించారు. ఇదిలాఉండగా మృతి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై తెలుగు తమ్ముళ్ల దాడి
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు కత్తితో దాడి చేశారు. గ్రామంలో ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జనం సందర్భంగా చోటు చేసుకున్న చిన్న ఘర్షణ దాడికి కారణమైందని తెలుస్తోంది. టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున గ్రామంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త బి.బాలాజీపై అతని ఇంటి వద్దే కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన బాలాజీని శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు.