
వినాయక నవ రాత్రుల ముగింపు ఘట్టం దగ్గరకు వచ్చింది.
వినాయక నవ రాత్రుల ముగింపు ఘట్టం దగ్గరకు వచ్చింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్‌లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంది. నగరం నలమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం వీక్షించడానికి సిద్ధపడుతున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు జరగబోయే శోభాయాత్రను తిలకించడానికి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఈసారి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, బారికేడ్లను దాటడంలో ఇబ్బందులు పడకుండా ఉత్తమమైన మెట్రో మార్గాన్ని ఎంచుకోండి.