Ganesh Immersions
-
2వ రోజు కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ పై భారీ క్యూ
-
సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలు చేయొద్దంటూ సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే నిమజ్జనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్పారిస్ (పీవోపీ) విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే కృత్రిమ నీటికుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. న్యాయవాది వేణుమాధవ్ వేసిన ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ పీవోపీ విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్లు నిలుపుతున్నారని న్యాయవాది వేణుమాధవ్ అభ్యంతరం తెలిపారు. భారీ క్రేన్ల వల్ల ట్యాంక్‌బండ్‌కు ముప్పు ఉందన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదిస్తూ ‘కోర్టు ధిక్కరణ చట్ట ప్రకారం ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయడానికి గడువు ఒక సంవత్సరం. కానీ పిటిషనర్ 2021 నాటి సు ప్రీం మార్గదర్శకాలను ప్రస్తావిస్తున్నారు క నుక పిటిషన్ అక్కడే వేయాలి. ఇక్కడ వేసిన పిటిషన్‌ను అనుమతించొద్దు’అని కోరారు. ఇన్నాళ్లూ ఏం చేశారు? న్యాయవాది వేణుమాధవ్ వాదనలపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘2021లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇస్తే రెండేళ్లుగా ధిక్కరణ పిటిషన్ ఎందుకు వేయలేదు? అధికారులు ఒకవేళ రెండేళ్లు మార్గదర్శకాలు పాటించి ఉంటే ఇప్పుడు పాటించరని ముందే ఎలా చెబుతారు? అయినా ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడో ముందే తెలిసినా ఇన్ని నెలలు పిటిషన్ వేయకుండా నిమజ్జనాల వేళ పిటిషన్ వేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేస్తే ఫొటోలతో నివేదిక అందజేయాలని 2023లో హైకోర్టు ఆదేశించినా ఆ పని చేయలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చే నాటికి హైడ్రా మనుగడలో లేదు. అలాంటప్పుడు హైడ్రాను ప్రతివాదిగా ఎలా చేరుస్తారు? ప్రస్తుతానికి కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదు. పిటిషన్‌ను అనుమతించడంపైనే విచారణ చేస్తున్నాం. ఆలస్యంపట్ల మీరు విచారం వ్యక్తం చేసినా అనుమతించలేం. చివరి నిమిషంలో ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా 2021లో తప్పుబట్టింది కదా. అదే ఉత్తర్వు లు అందరికీ వర్తిసాయి. పీవోపీ విగ్రహాల నిమజ్జనం, కాలుష్య ఆరోపణలను రుజువు చేసేందుకు ఆధారాలు, గణాంకాలను వెల్లడించలేదు. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విధిగా పాటించాల్సిందే’అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ధిక్కరణ పిటిషన్లో విచారణ ముగించింది. కాగా, పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్లో పీసీబీ తీరుపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే అవి చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలిగానీ రహదారినే తీసేస్తామన్నట్లు అధికారుల చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. -
హుస్సేన్ సాగర్ లో కొనసాగుతున్న నిమజ్జనాలు
-
Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం పూర్తి
-
నిమజ్జనం పై డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ప్రకటన
-
కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపే.. నిమజ్జన రూట్‌మ్యాప్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఇంకొద్ది క్షణాల్లో ఉద్విగ్న ఘట్టానికి తెర లేవనుంది. మహా యజ్ఞానికి ముహూర్తం పడనుంది. గణేష్ సామూహిక ఊరేగింపులు, నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపు కదలనున్నాయి. దాదాపు 24,132 మంది పోలీసులు, 122 ప్లటూన్ల సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజాము లోపు నిమజ్జనాలు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు. నిమజ్జన ఊరేగింపులు ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శుక్రవారం నుంచి 24 గంటల పాటు నగరంలో మద్యం విక్రయాలు నిషేధించారు. ►శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ, సీఏఆర్, సీఎస్‌డబ్ల్యూ, హోంగార్డ్స్, ఇతర జిల్లాల అధికారులు, ఏపీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ, ఏఆర్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీసు ఫోర్స్ బందోబస్తులో ఉంటాయి. 120 బృందాలను షీ–టీమ్స్ రంగంలోకి దింపింది. ►బాలాపూర్– హుస్సేన్‌సాగర్ మధ్య 18.9 కి.మీ మేర ప్రధాన శోభాయాత్ర మార్గం ఉంది. ఇది 11 పోలీసుస్టేషన్ల పరిధిల మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం 261 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. నగర వ్యాప్తంగా 739 అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ►పాతబస్తీలోని సర్దార్ మహల్లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమిషనరేట్, ఎన్టీఆర్ మార్గ్, గాంధీనగర్ ఔట్‌పోస్ట్ వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేశారు. నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఖైరతాబాద్ బడా గణేషుడి వద్ద, ఆ చుట్టుపక్కల కలిపి 53 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 2.5 కి.మీ మేర జరిగే ఈ ఊరేగింపుపై నిఘా ఉంచడానికి అదనంగా మరో 24 కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ►ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌లోనే మూడు కమిషనరేట్లలో అనేక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో దాని చుట్టూ అందుబాటులో ఉన్న 66 సీసీ కెమెరాలకు తోడు అదనంగా అవసరమైన ప్రాంతాల్లో 27 ఏర్పాటు చేస్తున్నారు. 500 మీటర్ల పరిధిలో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్‌తో పని చేసే 10 మెగా పిక్సల్ కెమెరాలు ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ.. ఎంఎంటీఎస్.. మెట్రో సేవలు హుస్సేన్‌సాగర్ వద్ద నిర్వహించనున్న నిమజ్జన వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 565 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. శనివారం తెల్లవారు జాము వరకు బస్సులు నడుస్తాయి. శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. ఇబ్బందులు రానీయొద్దు: మేయర్ నిమజ్జనం సందర్భంగా కొలనుల వద్ద తాగునీటి వసతితో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండాలని, వ్యర్థాలు పోగవకుండా పారిశుద్ధ్యం సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు నగర మేయర్ విజయలక్ష్మి సూచించారు. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెకిలి చేష్టలు వద్దు శోభా యాత్రలో అమ్మాయిలు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలకు అరదండాలు తప్పవు. వాటర్ ప్యాకెట్లు చింపి మహిళల మీద చల్లడం, పేపరు ముక్కలను వేయటం, పూలు చల్లడం వంటివి చేస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దు. అనుమతి లేకుండా మహిళల ఫొటోలు, వీడియోలు తీయటం చేయకూడదు. పోకిరీల వెకిలి చేష్టలను సీసీ కెమెరాలలో రికార్డ్ చేసి, ఆధారాలతో సహా న్యాయస్థానంలో హాజరుపరుస్తాం. – రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఎస్కే సలీమా 196 తాగునీటి శిబిరాలు భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి 196 నీటి క్యాంపులను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరగనున్న ప్రధాన మార్గాలు, ట్యాంక్ బండ్ పరిసరాలు, నిమజ్జన కొలనుల వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మొత్తంగా 30.72 లక్షల నీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటి శిబిరాల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించారు. వినాయకుడికో కోడ్! నిమజ్జన ఊరేగింపుల పర్యవేక్షణకు నగర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 9 వేల విగ్రహాలను చేశారు. పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్న గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ గణేష్ నిమజ్జనం సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. గురువారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆయన ప్రారంభించారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక లైన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 20, 315 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 7, 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 43 సహా 13 కిలోమీటర్ల ఎల్టీ కేబుల్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100/1912/ 7901530966/ 790153086లను సంప్రదించాలి. డ్రోన్లతో డేగకన్ను గణేష్ నిమజ్జనానికి సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే 35 చెరువుల వద్ద తొలిసారిగా డ్రోన్లు, బాడీవార్న్ కెమెరాలతో అనుక్షణం పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే డయల్ 100 లేదా 94906 17444ను సంప్రదించాలి. -
Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
► ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడి చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ►తుది దశకు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ గణపతి ►ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్దకు ఖైరతాబాద్ గణేషుడు.. ► ఖైరతాబాద్ భారీ గణనాథుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనం సందర్భంగా గణేషుడు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకున్నాడు. అశేష భక్తజన సమూహంలో గణనాథుడు నాలుగో నెంబర్ క్రైన్ వరకు తరలివెళ్తున్నాడు. ►ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చివరిసారిగా భక్తజనం భారీగా తరలివచ్చారు. గణపతిబప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేయనున్నారు. ►హుస్సేన్ సాగర్ వద్ద ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున వడివడిగా యాత్ర సాగించనున్నారు. మరి కొద్ది సేపటిలో టాంక్ బండ్ వద్దకు బడా గణేష్ విగ్రహం రానుంది. ► గత ఏడాది కన్నా ఈ ఏడాది నిమజ్జన ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తను దగ్గరుండి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత వ్యర్ధాలను తీసివేసే పని మొదలు పెడతామన్నారు. ► ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. ►ఖైరతాబాద్ గణేష్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో కెల్లా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకి ప్రత్యేకత ఉందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భారీ జనసమూహం మధ్య ఖైరతాబాద్ వినాయకుడి శోభ యాత్ర #KhairatabadGanesh pic.twitter.com/h31teOJMeW — Latha (@LathaReddy704) September 9, 2022 ►సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. 10వేలమంది పోలీసులు, 10వేలమంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ రాత్రి నుంచి రేపటి ఉదయం వరకూ నిమజ్జనాలు జరుగుతాయనిచ రాత్రి ఎక్కువగా వర్షం కురవడంతో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఆలస్యం అయిందన్నారు. ► ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకున్న మంత్రి తలసాని. ►బడా గణేషుడిని టస్కర్ మీదికి ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో గణేషుడిని విగ్రహాన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రక్రియ మొదలైంది. వంద టన్నులు బరువు మోయగల బరువున్న లారీ, క్రేన్ సహాయంతో నిమర్జన శోభాయాత్ర ఏర్పాట్లు చేశారు. సాక్షి, హైదరాబాద్: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు. ► గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి బరువు రెట్టింపైంది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60– 70 టన్నులకు చేరింది. ►మహాగణపతిని సాగర తీరానికి ట్రయిలర్ వాహనంపై తరలిస్తారు. లేటెస్ట్ మోడల్ మెకానికల్ ట్రయిలర్ ఓల్వో ఇంజిన్ సామర్థ్యం. డీఎస్–6 పర్యావరణ కాలుష్య ప్రీ వాహనం. ఈ ట్రయిలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది. ►ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి 2010 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్నారు. ►మహాగణపతికి గురువారం రాత్రి 11.10 గంటలకు చివరి పూజ నిర్వహించి కలశాలను కదిలించారు. క్రేన్ నంబర్ 4 వద్దకు.. ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నంబర్–4 వద్దకు మహాగణపతి మధ్యాహ్నం 1 గంటలకల్లా చేరుకోగానే వెల్డింగ్ తొలగింపు, చివరి పూజలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. రూట్ మ్యాప్ ఇలా.. ఖైరతాబాద్ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్ థియేటర్ ముందు నుంచి రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నం– 4 వద్దకు చేరుకుంటుంది. -
నిమజ్జనానికి హాజరు కానున్న అసోం సీఎం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో శుక్రవారం(నేడు) నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన ఉత్సవాలకు అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వశర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి(బీజీయూఎస్) ఆహ్వానం మేరకు గురువారంరాత్రి ఆయన నగరానికి చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకోవాల్సి ఉండగా, వేరే కార్యక్రమంలో గవర్నర్ ఉన్న కారణంగా ఈ భేటీ జరగలేదు. ఆయన ట్రిడెంట్ హోటల్లో బసచేస్తున్నారు. శుక్రవారం ఉదయం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ), బీజీయూఎస్ నేతలు, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసి వచ్చిన తెలుగు ఉన్నతాధికారులతో కలిసి ఆయన అల్పాహా రం స్వీకరిస్తారు. ఉదయం 11 గంటలకు రాడిసన్ హోటల్లో మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తారు. మొజంజాహి మార్కెట్ వద్ద ప్రధాన వినాయక విగ్రహాల ఊరేగింపును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తారు. -
Ganesh Chaturthi 2022: ఆకట్టుకుంటున్న పోర్టబుల్ పాండ్స్
సాక్షి, హైదరాబాద్: ఇదివరకు సహజసిద్ధమైన చెరువులు, కొలనుల్లో గణేశ్ నిమజ్జనాలు జరిగేవి. చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా విగ్రహాల నిమజ్జనం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బేబిపాండ్స్ (నిమజ్జన కొలనులు) వినియోగిస్తున్నారు. ఈసారి కొత్తగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ప్లాస్టిక్ (ఎఫ్ఆర్సీ) పాండ్స్, నేలను తవ్వి తాత్కాలిక పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తాత్కాలిక పాండ్స్, ఎఫ్ఆర్సీ పాండ్స్ పనులు వడివడిగా జరుగుతున్నాయి. మూడో రోజు నుంచే.. బుధవారం వినాయకచవితి.. మూడోరోజు నుంచే చిన్నసైజు విగ్రహాల నిమజ్జనం జరగనుంది. వాటికోసమే ఉద్దేశించిన ఈ పాండ్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో ఎఫ్ఆర్సీ పాండ్స్ పోర్టబుల్వి. వీటిని ఎక్కడంటే అక్కడ.. ఎప్పుడంటే అప్పుడు ఏర్పాటు చేసే సౌలభ్యం ఉంది. ఇవి చూడ్డానికి ఆకర్షణీయంగానూ ఉండటంతో కాలనీల్లోని స్థానిక ప్రజలు వీటిని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది. నగరంలోని అన్ని జోన్లలో ఈ పాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో రెండు పోర్టబుల్ పాండ్లు, ఒక తాత్కాలిక పాండ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మిగతా జోన్లలోనూ పనులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు,నాలుగున్నర అడుగుల లోతుతో ఈ పాండ్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ పాండ్స్‌లోకి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతారు. నిమజ్జనం కాగానే విగ్రహాలు, పూజా సామగ్రి వెంటనే తొలగించి వేరే చోటుకు తరలిస్తారు. నీరు పరిశుభ్రంగా ఉండేందుకు నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు తాజా నీరు నింపుతారని అధికారులు పేర్కొన్నారు. లోతు నాలుగున్నర అడుగులే అయినప్పటికీ, విగ్రహాలను అడ్డంగా పాండ్స్‌లోకి వేసి నిమజ్జనం చేయడం ద్వారా అంతకంటే పెద్ద విగ్రహాలు కూడా నిమజ్జనం చేయవచ్చని అధికారులు తెలిపారు. నిమజ్జనాలు ముగిసేంత వరకు వినియోగించే పోర్టబుల్ పాండ్స్‌ను అవసరాల కనుగుణంగా ఎక్కడంటే అక్కడ మాత్రమే కాకుండా వేసవిలో జీహెచ్ఎంసీ స్టేడియంలలో స్విమ్మింగ్ పూల్స్ గానూ వినియోగించుకునే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
-
గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ ముస్తాబు
-
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, ఢిల్లీ: హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అడ్డంకులు తొలిగాయి. ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే చివరి అవకాశం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. (చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య) ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ వచ్చిందని సోలిసిటర్ జనరల్ అన్నారు. విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ ఆర్డర్‌ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు. హైదరాబాద్ వినాయక నిమజ్జనం ఇబ్బందులు తనకు తెలుసు అని సీఐజే అన్నారు. హుస్సేన్ సాగర్ పరిశుభ్రపరిచేందుకు, సుందరీకరణకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృథా అవ్వడం లేదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. 22 చిన్న పాండ్స్ ఏర్పాటు చేశామని, కానీ అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. చదవండి: టికెట్ తీసి సాధారణ ప్రయాణికుడిలా.. -
నిమజ్జనానికి 15వేల మందితో భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. నిమజ్జనానికి 15వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు సాగుతున్నాయిని పేర్కొన్నారు. (నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు) సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే బాలాపూర్ గణేషుడు నిమజ్జనం అయ్యాడు, మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం నిమజ్జనం అయిపోతుందని చెప్పారు.కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.ఈ రోజు అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తులు, ఉత్సవ సమితి నాయకులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. -
‘భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం కోసం పోలీసు శాఖ పకడ్భంది ఏర్పాట్లు చేసిందన్నారు. గత వారం నుంచి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటి వరకు 30 వేల విగ్రహాలను నిమజ్జనం అయ్యాయని తెలిపారు. మంగళవారం రాత్రి వరకు ఐదు ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తున్న 165 విగ్రహాలు, మూడు నుంచి ఐదు ఫీట్ల వరకు ఉన్న 1239, మూడు ఫీట్ల కంటే తక్కువ ఉన్న 1842 విగ్రహాలు నిమజ్జనం కాబోతున్నాయని, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. మొత్తం 21 క్రేన్లను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేశామని చెప్పారు. 1500పైగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఇతర వాహనాలకు అనుమతి లేదని, పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశామని చెప్పారు. -
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా శుక్రవారం జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతోనే గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. మిగిలిన పండుగల కన్నా గణేష్ ఉత్సవాలు..నిమజ్జనాలు ప్రత్యేకంగా సాగుతాయన్నారు. అన్ని మతాలకు చెందిన వారు పరస్పర సహకరించుకుంటూ ఆనందంగా జరుపుకుంటారని చెప్పారు. పోలీసు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విద్యుత్, ఇరిగేషన్, టూరిజం తదితర విభాగాలు సమన్వయంతో పనిచేసి గణపతి ఉత్సవాలను విజయవంతంగా సాగేలా చేశాయన్నారు. మెట్రో, ఎంఎంటిఎస్,ఆర్టీసీ మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాయని అభినందించారు. పరస్పర సహకారంతోనే.. గణేష్ నిమజ్జనాలు విజయవంతం అయ్యేందుకు జీహెచ్ఎంసీ అన్ని సందర్భాల్లోనూ మంచి సహకారం అందించిందని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. నగర మౌలిక సదుపాయాల విషయంలో పరస్పర సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి నిమిషం సమన్వయంతోనే నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. ప్రజలు కూడా సహకరించారని తెలిపారు. గతంలో కొన్ని ఇబ్బందులు కలిగాయని..ఈ సారి చిన్నపాటి అసౌకర్యం కూడా లేకుండా ప్రశాంతంగా ఉత్సవాలు ముగిశాయన్నారు. అన్ని విభాగాలు పూర్తి సహకారం.. గత నెలరోజులుగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడంతో జీహెచ్ఎంసీ నిమగ్నమైందని..అన్ని విభాగాలు పూర్తి సహకారం అందించాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ అన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. -
నిఘా నీడన నిమజ్జనం
-
గంగమ్మ ఒడిలోకి గణపతులు
-
గణేష్ నిమజ్జనాన్ని సులభంగా ఇలా వీక్షించండి
వినాయక నవ రాత్రుల ముగింపు ఘట్టం దగ్గరకు వచ్చింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్‌లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంది. నగరం నలమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం వీక్షించడానికి సిద్ధపడుతున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు జరగబోయే శోభాయాత్రను తిలకించడానికి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఈసారి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, బారికేడ్లను దాటడంలో ఇబ్బందులు పడకుండా ఉత్తమమైన మెట్రో మార్గాన్ని ఎంచుకోండి. -
రేపే మహా గణపయ్య నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్ : సోమవారం ఉదయం 10 గంటలకల్లా నగరంలోని అన్ని వినాయక నిమజ్జనాలు పూర్తి చేయిస్తామని సిటీ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. నిమజ్జనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 19వేల మంది పోలీసులు, 2 లక్షలకుపైగా సీసీ కెమెరాల సేవలు వినియోగించుకోనున్నామని తెలిపారు. సెంట్రల్ సెక్కురిటీ ఫోర్స్, షీ టీమ్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 8 వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయనీ, మరో 14 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని తెలిపారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల భద్రతా పర్యవేక్షణ వ్యవస్థలను అనుసంధానం చేసినట్టు వెల్లడించారు. నగర వ్యాప్తంగా 125 ప్రధాన స్థావరాల నుంచి నిమజ్జనానికై వినాయకులు తరలిరానున్నట్టు తెలిపారు. ఖైరతాబాద్ మహా గణపయ్య నిమజ్జనం ఖైరతాబాద్‌లో కొలువైన మహా గణపతి నిమజ్జనం రేపు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తవుతుందని కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. మహాగణపయ్య శోభాయాత్ర సాగే రూట్ మాప్లో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని 6వ నెంబర్ క్రేన్ పాయింట్ వద్ద ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరుగుతుందని వివరించారు. బాలాపూర్ గణేషుని శోభాయాత్ర ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్లు కొనసాగనుందని అన్నారు. -
'త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు'
హైదరాబాద్ : గణేశ్ నిమజ్జోత్సవానికి కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో సాక్షితో మాట్లాడుతూ.... పాతబస్తీలో ఐసిస్ కదలికల నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 12 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జోన్ల వారీగా సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన ఊరేగింపును పరిశీలిస్తామన్నారు. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. సోధ్యమైనంత త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు. -
వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతులు
హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్బంగా తెలంగాణలోని పలు చోట్ల అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నగురం గ్రామంలో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ముగ్గురు వాగులో పడి మరణించారు. అయితే వాగులో నీరు ఉధృతంగా ప్రవహించడంలో ఆ ముగ్గురి మృతదేహలు వాగులో కొట్టుకుపోయాయి. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం పంతినిలో వినాయకుడ్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో విగ్రహం కిందపడి పొన్నం కొమరయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే కోమరయ్య తుది శ్వాస విడిచాడు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం అవంచలో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన పర్వతాలు అనే వ్యక్తి మృతి చెందాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.