సాక్షి, విజయవాడ : రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను దగ్గరుండి క్లియర్ చేశారు. శనివారం ప్రకాశం బ్యారేజ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి రోడ్డుపై పెద్దసంఖ్యలో పేరుకుపోయిన వాహనాలను దగ్గరుండి క్లియర్ చేశారు. అంతకు క్రితం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పేర్నినాని వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment