
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఢిల్లీలో భీకరస్థితిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇండియా గేట్ పరిసరాలతో పాటు తిలక్ మార్గ్, మండి హౌజ్ సర్కిల్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడటంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఉంది. వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురుగ్రామ్, గుర్గావ్ లాంటి ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. బారీ వర్షాలతో జనజీవనం స్తంభించి బోట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్-5లోని ఒక అపార్ట్‌మెంట్‌లో వరదనీరు ఇళ్లలోకి రావడం వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇదేందయ్య ఇది.. మేమేన్నడు సూడలే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోమరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment