దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఏకదాటి వర్షానికి నగరమంతా జలమయమైంది. రోడ్లపై నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిలిపోయింది. అయితే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘తూర్పు, ఆగ్నేయం, ఈశాన్య, ఉత్తర ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, దాద్రి, మీరట్, మోడీనగర్‌లోని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ట్వీట్ చేసింది.
ఇదిలా ఉండగా ఢిల్లీ వర్షాలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైర వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ మీద వరద ప్రవాహం ఎక్కువవడంతో వర్షపు నీరు కింద ఉన్న రోడ్డు మీదకు పారుతోంది. అయితే ఇది చూడటానికి అచ్చం జలపాతం మాదిరి కనిపిస్తోంది. దీనిని సంజయ్ రైనా అనే ట్విటర్ యూజర్ తన అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘ఢిల్లీకి నయాగరా జలపాతం వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని కెంప్టీ వాటర్ ఫాల్‌ను తలపిస్తోంది. ఇది ఢిల్లీ ప్రభుత్వ కొత్త 'కార్' వాష్ చేసుకునే ఫెసిలిటీ.’ అంటూ రిప్లై ఇస్తున్నారు.
చదవండి: న్యూజిలాండ్‌లో నవారు మంచం ధరెంతో తెలుసా?
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే!
Welcome to the #WaterfallCity of #Delhi #DelhiRains pic.twitter.com/ZQtYbwvFB6
— Sanjay Raina (@sanjayraina) August 31, 2021
It's the new 'car' wash facility of the Delhi Govt
— deesso (@deesso) August 31, 2021
Delhi mai banega Niagra Fall ... uski ye pehli jhalak hai
— Sumit Srivastava (@meet2sumeet) August 31, 2021
Comments
Please login to add a commentAdd a comment