waterfall
-
వనరుల బంగారం.. బయ్యారం
బయ్యారం ఊళ్లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా కనిపిస్తాయి. అయితే ఆ గుడులు ఇప్పుడు వాడుకలో లేవు.బయ్యారం.. ప్రకృతి వనరుల భాండాగారం..సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమాలకు ఆలవాలం! ఆ ఊరి గురించే ఈ కథనం.. తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లాలో.. మూడు వైపుల నీళ్లు, ఒకవైపు గుట్టలను హద్దులుగా చేసుకుని ఉంటుంది బయ్యారం. ఇక్కడి పెద్దచెరువు కట్టపై తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్న శిలాశాసనం కాకతీయుల వంశవృక్షాన్ని, వారి పాలనాదక్షతను తెలియజేస్తుంది. కాకతీయ వంశస్థురాలైన మైలమాంబ.. తన తల్లి బయ్యమాంబ పేరున ప్రజల సంక్షేమార్థం ఈ చెరువును తవ్వించినట్లు ఈ శాసనం తెలుపుతోంది. సాగునీటి రంగంపై కాకతీయుల పరిజ్ఞానానికి నిదర్శనంగా బయ్యారం చెరువు నిలిచింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉన్న మీడియం ప్రాజెక్టుల్లో మొదటగా నీరు నిండి అలుగు పోసేదిగా బయ్యారం పెద్దచెరువు రికార్డులో ఉంది. ఇది 15,000 ఎకరాలకు సాగునీరును అందిస్తోంది. చెరువు మట్టి మహత్యంబయ్యారం చెరువు మట్టి మహిమ అంతా ఇంతా కాదు. గతంలో బెంగుళూరు పెంకులు, ఇప్పుడు అలంకరణ వస్తువులు, టైల్స్ తయారీకి ఈ మట్టే కీలకం. మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోని టైల్స్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే డెకరేటివ్ టైల్స్ మన దేశంలోనే కాకుండా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి దట్టమైన అడవులను దాటుకుంటూ వచ్చే వరద నీరు ఈ చెరువులో చేరుతుంది. నీటి ప్రవాహంతోపాటు వచ్చే ఒండ్రు మట్టి చెరువు అడుగుకు చేరి రేగడి మట్టిగా మారుతుంది. దీంతో తయారయ్యే పెంకులు, డెకరేటివ్ టైల్స్ నాణ్యతకు మరోపేరుగా నిలుస్తున్నాయి. అయితే ఆర్సీసీ కప్పుతో పోటీ పడలేక పెంకు ప్యాక్టరీలు మూత పడే దశకు చేరుకున్నాయి. వాటి స్థానంలో డెకరేటివ్ టైల్స్ తయారీ మొదలుపెట్టారు. ఇక్కడ తయారయ్యే జేడీ డచ్, హెచ్‌బీటీ, ఎస్సెమ్మార్, మోడర్న్ బ్రాండ్, ప్లోయింగ్ బిట్స్, సెంటర్ టైల్స్ ఇలా కస్టమర్లు ఏ విధమైన డిజై¯Œ కావాలన్నా ఇట్టే తయారుచేసి ఇస్తారు. బయ్యారం చెరువు మట్టితో తయారు చేసిన పెంకులు, టైల్స్, కటింగ్ డిజైన్లను బొగ్గు, ఊకతో కాలుస్తారు. అప్పుడు ఎర్రటి అందమైన వర్ణం వస్తుంది. వందలు, వేల ఏళ్లు గడచినా ఇది చెక్కు చెదరదు. వీటికి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు మలేషియా, జపాన్ వంటి దేశాల్లోనూ డిమాండ్ ఉంది.ఇనుపరాతి గుట్టతెలంగాణకే తల మానికంగా బయ్యారం ఇనుపరాతి గుట్ట ఉంది. దాదాపు 42వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ గుట్టలో దొరికే ఇనుపరాతి ముడిసరుకు నాణ్యమైనదిగా చెబుతున్నారు నిపుణులు. ఈ ముడిసరుకును గతంలో పాల్వంచ, విశాఖ ఉక్కు పరిశ్రమలకు సరఫరా చేసేవారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఖనిజాలుబయ్యారం పరిసరాల్లోని నామాలపాడు, ఇతర ప్రాంతాల్లో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా బైరటీస్, డోలమైట్, అభ్రకం, బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వానికి గతంలో నివేదిక కూడా పంపినట్లు సమాచారం. ఉద్యమాలకు నెలవునాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ పోరు దాకా.. సామాజిక స్పృహకు, ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు నెలవుగా ఉంది బయ్యారం. 1948లో నిజాం వ్యతిరేక పోరులో ఈ ప్రాంతానికి చెందిన 30 మంది పోరాట వీరులు నిజాం సైన్యం తూటాలకు అసువులు బాశారు. వారి స్మృత్యర్థం స్థూపం కూడా ఉందిక్కడ. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బయ్యారం ముందుంది. మలి దశ ఉద్యమంలోనూ చైతన్య శీలురు, కవులు, కళాకారులతో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ∙ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్బండారి వీరన్న, సాక్షి, బయ్యారంమురళీ మోహన్, ఫొటోగ్రాఫర్ -
మారేడుమిల్లి జలపాతంలో ముగ్గురు గల్లంతు
మారేడుమిల్లి: విహారయాత్ర కోసం ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల నుంచి 14 మంది మెడికోలు అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని జల తరంగిణి జలపాతం వద్దకు రాగా.. విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో స్నానాలు చేస్తుండగా భారీవర్షం కురిసి ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థినుల్ని 6 కిలోమీటర్ల దూరంలో స్థానికులు రక్షించగా.. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న 14 మంది విద్యార్థులు వ్యాన్‌లో ఆదివారం విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చారు. అక్కడి నుంచి జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా జలపాతం పొంగింది. దీనిని గమనించిన 9 మంది విద్యార్థులు వెంటనే బయటకు వచ్చేశారు. జలపాతం మధ్యలో చిక్కుకుపోయి.. జలపాతం మధ్యలో ఉండిపోయిన సీహెచ్.హరిదీప్, కె.సౌమ్య, బి.అమృత, గాయత్రీ పుష్ప, హరిణిప్రియ కొట్టుకుపోయారు. వీరిలో గాయత్రీపుష్ప, హరిణిప్రియ 6 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ప్రధాన రహదారి కల్వర్టు వద్ద చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా స్థానికులు ఒడ్డుకు చేర్చారు. మిగతా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో మార్కాపురానికి చెందిన సీహెచ్ హరిదీప్, విజయనగరానికి చెందిన కె.సౌమ్య, బి.అమృత ఉన్నట్టు ఎస్ఐ రాము తెలిపారు. -
జలజల జోగ్ పాతం..చూసేందుకు పర్యాటకులు క్యూ (ఫొటోలు)
-
జోగ్ జలపాతం ఉరకలు : రెండు కళ్లూ చాలవు! వైరల్ వీడియో
భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని షిమోగ జిల్లాలోని సాగర తాలూకాలో ఉన్న జోగ్ జలపాతం నిండు కుండలా కళకళలాడుతోంది. దేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటి జోగ్. సహజ సౌందర్యంతో, నీటి ప్రవాహం హోరు, పాల నురుగు లాంటి లయలతో అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు. తాజా వర్షాలతో పూర్తి జలకళను సంతరించుకుని నయాగరాను మించిన సోయగాలతో ఆకట్టుకుంటోంది. Jogfalls as seen today in its full glory!#jogfalls #2024 #karnataka #KarnatakaRains pic.twitter.com/NhAWrScft4— Raj Mohan (@rajography47) August 3, 2024జోగ్ జలపాతం విశేషాలు జోగ్ జలపాతం 253 మీటర్ల (829 అడుగులు) ఎత్తు. ఇది భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటి. జోగ్ జలపాతం ఒక ట్రెయల్లో పడుతుంది. అందుకే ఇది “ట్రెయిల్ జలపాతం” గా పాపులర్ అయింది.The mighty Jog 😍 Raja, Rani, Roarer and Rocket all came together!!#jogfalls #karnataka #IncredibleIndia #KarnatakaRains pic.twitter.com/tXlGffcWKy— Raj Mohan (@rajography47) August 3, 2024 -
Telangana: ప్రకృతి ఒడిలో 'పొచ్చెర' అందాలు..
ఆదిలాబాద్: పొచ్చర జలపాతం అందాలు పర్యాటకులను కట్టిçపడేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో జలపాతం వద్ద పెద్ద బండరాళ్లపై పడుతున్న నీరు, వచ్చే నీటి తుంపరులు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.ఆహ్లాద వాతావరణం..పొచ్చర జలపాతం అందాలు, పచ్చని వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. జలపాతాన్ని చూడటంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వచ్చిన పర్యాటకులు íవీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పొచ్చెర జలపాతం మంచి పిక్నిక్ స్పాట్‌గా ఏర్పడింది. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన గంగాదేవి, వన దేవత విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు విగ్రహాలతో ఫొటోలు తీసుకుంటున్నారు.‘పొచ్చర’కు ఇలా చేరుకోవాలి..బోథ్ మండలంలోని పొచ్చర జలపాతానికి నిర్మల్ నుండి వచ్చే వారు జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండల కేంద్రం మీదుగా రావాలి. నేరడిగొండ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపు బోథ్ ఎక్స్ రోడ్డు ఉంటుంది. ఎడమ వైపు తిరిగి అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు పొచ్చర జలపాతానికి దారి వస్తుంది. కిలో మీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వారు 44వ జాతీయ రహహదారిపై ఆదిలాబాద్ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణించి బోథ్ ఎక్స్ రోడ్డు కుడివైపు రావాలి. అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు జలపాతానికి దారి వస్తుంది. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు.సహజసిద్ధమైన అందాలు..పొచ్చర వద్ద సహజ సిద్ధమైన అందాలు బాగున్నాయి. జలపాతం వద్ద బండరాళ్లపై నీరు జారిపడినప్పుడు వచ్చే శబ్దాలు వినసొంపుగా ఉన్నాయి. పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కూర్చోవడానికి కుటీరాలు ఏర్పాటు చేశారు. కుటుంబంతో వచ్చి చూడాల్సిన ప్రాంతం ఇది. – గోపిడి రమేశ్‌రెడ్డి, జగిత్యాలఆహ్లాదకరంగా ఉంది..నేను వరంగల్ నుంచి వచ్చా. జతపాతం అందాలు చాలా బాగున్నాయి. ఆహ్లదకరంగా ఉంది. వీకెండ్లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రాంతం. ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మా కుటుంబంతో మళ్లీ వచ్చి చూస్తాం. – ప్రియాంక, వరంగల్ఇవి చదవండి: మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు -
రీల్స్ చేస్తూ జలపాతంలో పడి ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ మృతి
మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతిచెందింది. మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ సమీపంలోని కుంభే జలపాతంలో వద్ద ఉన్న కొండగట్టులో ఈ ఘటన జరిగింది.ముంబైకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్దార్ జూలై 16న రీల్ చిత్రీకరించేందుకు ఏడుగురు స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక లోయ దగ్గర వర్షం పడుతున్న సమయంలో రీల్స్ చేస్తోంది. వానల వల్ల ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారి కాలు జారి 300 అడుగుల లోయలో పడింది.ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, కోస్ట్ గార్డ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి యువతిని బయటకు తీసుకుని వచ్చారు. అయితే కిందకు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైన యువతిని మనగావ్ సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.విహారయాత్ర.. విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. మరోవైపు మనగావ్ పోలీసులు, తహలసీల్దార్ పర్యాటకులకు సూచనలు చేశారు. జలపాతాలను, కొండలను సందర్శించే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర ప్రవర్తనలను నివారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. -
మహారాష్ట్రలో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం
పుణె: మహారాష్ట్రలో ప్రముఖ పర్యాటక ప్రాంతం భూషీ ఆనకట్ట దిగువన ఉన్న జలపాతంలో వద్ద ఒక కుటుంబం కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో వరదనీటి ప్రవాహం జలపాతం వద్ద పోటెత్తింది. హదాప్సార్ నుంచి వచి్చన అన్సారీ కుటుంబం ఇదే సమయంలో జలపాతం వద్ద ఉంది. ప్రవాహం ధాటికి అంతా కొట్టుకుపోయారు. ఈ ఘటనలో 36 ఏళ్ల శహిష్ట అన్సారీ, 13 ఏళ్ల అమీమీ, ఎనిమిదేళ్ల ఉమేరాల మృతదేహాలను దిగువన కనుగొన్నారు. ఇద్దరి జాడ గల్లంతైంది. -
కర్ణాటకలోని జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి
బెంగళూరు: కర్ణాటకలోని హెబ్బే జలపాతం వద్ద హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్‌గా గుర్తించాడు. స్నేహితులతో కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్లి గడపాలనుకున్న శ్రవణ్ కథ.. ఎవరూ ఊహించని విధంగా విషాదంతంగా మారింది. ఈ ఘటన రాష్ట్రంలోని లింగడహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ తన స్నేహితుడితో కలిసి చిక్కమగళూరు పర్యటనకు వెళ్లాడు. వీరిద్దరూ బైక్ అద్దెకు తీసుకుని కొన్ని పర్యటక ప్రాంతాలను సందర్శించారు. సోమవారం కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం వద్దకు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తుండటంతో జలపాతం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ఈక్రమంలో జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో.. శ్రవణ్, అతని స్నేహితుడు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వీరిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అయితే, నీటిలో శ్రవణ్ తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
చైనాకు శత్రువులు ఎక్కడో లేరు. ఆ దేశ యువత రూపంలో ఆ భూభాగంలోనే ఉన్నారు. ఇంతకీ ఏం చేస్తున్నారని అంత మాట అన్నారంటారా?.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా తమ దేశం పరువును ఎప్పటికప్పుడు తీసిపారేస్తున్నారు మరి.యుంటాయ్ జలపాతం.. చైనాలోనే అతిపెద్ద జలపాతంగా ఓ రికార్డు ఉంది. దీనిని ఆసియాలోనే అతిపెద్ద వాటర్‌ఫాల్‌గా చైనా ప్రమోట్ చేసుకుంటోంది కూడా. హెనాన్ ప్రావిన్స్‌లో యుంటాయ్ పర్వతాల నడుమ పచ్చని శ్రేణుల్లో సుమారు 314 మీటర్ల(1,030 ఫీట్ల) ఎత్తు నుంచి నీటి ధార కిందకు పడే దృశ్యాలు.. చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. లక్షల మంది సందర్శకులతో పర్యాటకంగానూ ఈ జలపాతం విశేషంగా నిలుస్తుంటుంది కూడా. అలాంటి జలపాతం విషయంలో షాకింగ్ విషయం వెలుగు చూసిందిప్పుడు. అంత ఎత్తు నుంచి పైపులతో నీటిని కిందకు గుమ్మరిస్తుందనే నిజం బయటపడింది. కొందరు యువకులు.. యుంటాయ్ పర్వత్వాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడ వాళ్లు ఆ పైపుల్ని గమనించి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంకేం.. చైనా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో యుంటాయ్ జియో పార్క్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.Chinese officials have been forced to apologise, after a hiker's video revealed that China's highest waterfall may be supplied by a water pipe.The video, on Douyin app, showed the flow of water from the Yuntai Mountain Waterfall coming from a pipe built into the rock face.🧵1 pic.twitter.com/O8DodMnn1L— BFM News (@NewsBFM) June 7, 2024వర్షాధార జలపాతం అయిన యుంటాయ్కి వేసవి కాలంలో వచ్చిన పర్యాటకుల్ని నిరాశకు గురి చేయడం ఇష్టం లేకనే అక్కడి నిర్వాహకులు ఈ పని చేస్తున్నారంట. అయితే అప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసిపోయింది.గతంలో కరోనా టైంలో వైరస్ కట్టడి పేరిట అక్కడి ప్రభుత్వం సాగించిన దమనకాండ గుర్తుండే ఉంటుంది. ఆ టైంలోనూ సోషల్ మీడియా ద్వారా అక్కడి సంగతులు బయటి ప్రపంచానికి తెలిశాయి. అలాగే.. గ్జియాపు కౌంటీ గ్రామం విషయంలోనూ చైనా సృష్టించిన ఫేక్ ప్రపంచం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. -
గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని తెలుగు విద్యార్థి దుర్మరణం
కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల వైద్య విద్యార్థి దాసరి చందు కన్నుమూశారు. ఈ విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన కిర్గిస్థాన్‌లో కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీలో పరీక్షలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఆదివారం జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. అయితే గడ్డకట్టిన నీడిలో చిక్కుకుని మృతి చెందాడు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి చేరేలా సాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించినట్లు చందు తల్లిదండ్రులు తెలిపారు. కేంద్ర మంత్రి కిర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, మృత దేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి తెలిపారు. కాగా చందు తండ్రి అనకాపల్లిలో హల్వా అమ్మే భీమరాజు. భీమరాజు రెండో కుమారుడు చందు. -
అరుదైన జాలువారే జలపాతాల ఇంద్రధనుస్సు.. విస్తుపోవడమే తరువాయి!
అమెరికాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లోని ఓ అందమైన జలపాతానికి సంబంధించిన వీడియో మరోమారు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బలమైన గాలుల మధ్య జారువారే జలపాతాలలో రంగుల హరివిల్లు ఏర్పడటాన్ని ఈ వీడియో చూడవచ్చు. సూర్యోదయం సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమయ్యింది. సూర్యకాంతిలోని మృదువైన కిరణాలు నీటి బిందువులను తాకినప్పుడు, వాటి వంపు 1,450-అడుగుల ఎత్తయిన జలపాతంలో ఒక మెరిసే ఇంద్రధనస్సు ఆవిష్కృతమయ్యింది. ఈ కాలిఫోర్నియాకు సంబంధించిన పర్వత దృశ్యం 13.7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. రెండు లక్షలకు మించిన లైక్స్ దక్కించుకుంది. యోస్మైట్ కాలిఫోర్నియాలోని నాలుగు వేర్వేరు కౌంటీలలో సుమారు 761,747 ఎకరాల మేరకు విస్తరించి ఉంది. ఇది పరిమాణం పరంగా అమెరికాలో 16వ అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. High winds at the perfect time of day created a rare Rainbow Waterfall in Yosemite National Park pic.twitter.com/8J8EA1Q7x5 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 24, 2023 న్యూస్‌వీక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫుటేజీని వాస్తవానికి అవుట్డోర్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో నైపుణ్యం కలిగిన సాల్ట్ లేక్ సిటీకి చెందిన ఫోటోగ్రాఫర్ గ్రెగ్ హార్లో చిత్రీకరించినట్లు నమ్ముతారు. న్యూస్ పోర్టల్ నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్ఎస్పీ) 2017లో రూపొందించిన డాక్యుమెంటరీ ఫుటేజ్ ఇది అని సమాచారం. సుమారు ఉదయం 9 గంటలకు బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఈ దృశ్యం ఏర్పడింది. 2,400-అడుగుల ఎత్తులో రెయిన్బో ఫాల్స్ కనిపించాయి. ఇది కూడా చూడండి: బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్! -
అయ్యో..! మరీ అంత కొనకు పోతావా భయ్యా..! క్షణాల్లోనే..
ఇందోర్: ప్రమాదవశాత్తు ఓ కారు లోయలో పడిపోయింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో సిమ్రోల్ ప్రాంతంలో జరిగింది. కారును లోయ అంచుకు నిలిపి ఉంచడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అయితే.. కారును లోయకు ఆనుకుని నిలిపి ఉంచారు. లోయ కిందనే చిన్న సరస్సు లాంటి నిర్మాణం ఉంది. ఈ క్రమంలో కారు అనుకోకుండా కిందికి ఒరిగిపోవడం ప్రారంభించింది. ఆ సమయంలో కారులో ఓ అమ్మాయితో పాటు ఆమె తండ్రి ఉన్నారు. అయితే.. కారు డోర్ ఓపెన్ ఉన్న కారణంగా బాధితుడు కిందకు దూకేశాడు. పక్కనే సరస్సు ఉన్న కారణంగా అమ్మాయి నీటిలో పడిపోయింది. సరస్సు దగ్గరే ఉన్న మరికొంత మంది యువకులు నీటిలో దూకి బాధితురాలిని రక్షించారు. #मध्यप्रदेश: इंदौर मे रौंगटे खड़े कर देने वाला हादसा लोधिया कुंड में गिरी कार, पिकनिक मनाने गया था परिवार लोगों ने बचाई पिता और बेटी की जान, देखें वीडियो #Indore #MadhyaPradesh #Accident #Car #ViralVideos pic.twitter.com/34mlHZKCKu — Sanjay ᗪєsai 🇮🇳 (@sanjay_desai_26) August 7, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. జలపాతం వద్ద జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచనలు చేశారు. ఇదీ చదవండి: Nuh violence: హర్యానా అల్లర్లు.. బుల్డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్.. -
విషాదం.. సబితం జలపాతం వద్ద జారిపడి విద్యార్థి మృతి
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు జలకళను సంతరించుకోవడంతో వీటిని తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పలువురు ప్రమాదానికి గురై మృతి చెందుతున్నారు. తాజాగా అలాంటి ఘటనలోనే ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. పెద్దపల్లి మండలం సబితం జలపాతం(గౌరీ గుండాల జలపాతం) వద్ద బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి యువకుడు మృతిచెందాడు. కరీంనగర్ టౌన్ కిసాన్ నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేష్(23), స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చారు. జలపాతం వద్ద ప్రమాదవశాత్తు రాళ్లపై జారీ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, రెస్క్యూ బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. చదవండి: ముగ్గురి హత్యలతో విషాదంగా ముగిసిన లాక్డౌన్ ప్రేమ.. చంటి బిడ్డతో పోలీస్ స్టేషన్‌కు -
అస్తమాను ఫోన్ తోనే.. తండ్రి తిట్టారని 90 అడుగుల ఎత్తు నుండి
రాంచీ: భారత నయాగరాగా పిలవబడే చిత్రకూట్ జలపాతంలోకి దూకి ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు సమాయానికి స్పందించబట్టి ఆ యువతి 90 అడుగుల ఎత్తు నుండి దూకినా కాపాడగలిగారు. ఎటొచ్చి ఆమే ఎందుకు చనిపోవాలనుకుందో కారణం తెలిసిన తర్వాత ఎవ్వరికీ నోట మాట రాలేదు. తన కోపమే తనకి శత్రువు అంటారు. అలాంటి కోపమే ఓ యువతి ప్రాణాలను యమలోకం అంచు వరకు తీసుకెళ్ళింది. పిల్లలు తప్పు చేస్తే తల్లదండ్రులు మందలించడం సర్వసాధారణమే. పిల్లలు అందుకు బదులుగా కోపగించడం కూడా సహజమే. రెండు మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటుంది. తర్వాత అంతా మామూలే.. ఎక్కడో కొంతమంది మాత్రమే తల్లదండ్రులు తిట్టారని అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు. అచ్చంగా అలాంటి పిచ్చి పనే చేసింది చిత్రకూట్ కు చెందిన సరస్వతి మౌర్య(21). నిత్యం సెల్ ఫోన్లో ఎదో ఒకటి చూసుకుంటూ కాలక్షేపం చేస్తోందన్న కారణంతో ఆమె తండ్రి శాంటో మౌర్య ఆమెను పరుషమైన మాటాలతో దూషించారట. తప్పు చేస్తున్నానని గ్రహించకపోగా అంత మాత్రానికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్నారు పోలీసులు. కోపంతో సరస్వతి చిత్రకూట్ జలపాతాల వద్దకు వెళ్లి చుట్టుపక్కల వారు వారిస్తున్నా వినకుండా 90 అడుగుల ఎత్తు నుండి అందులోకి దూకేసింది. క్షణాల్లో ఆమె నదీప్రవాహంలో కిందకు వెళ్ళిపోయింది. అక్కడి గ్రామస్థులు అప్రమత్తమై బోటు మీద వెళ్లి సరస్వతిని రక్షించారు. అక్కడున్న సందర్శకుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: కుటుంబాన్ని చంపి తగులబెట్టి.. మృతుల్లో ఆరు నెలల పసికందు.. -
కర్ణాటక వెళ్తే గెర్సొప్పా జలపాతం చూడాల్సిందే
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ జోగ్ (గెర్సొప్పా) జలాశయం ఎట్టకేలకు పరవళ్లు తొక్కుతోంది. నలభై రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో నదులు, వాగులు, వంకలు వట్టిపోయాయి. దీంతో రాష్ట్రంలో ప్రముఖ జలపాతాలు మూగనోము పట్టాయి. అయితే సుమారు వారంరోజులుగా రుతుపవన వర్షాలు ముమ్మరం కావడంతో నదులు, వాగులకు కొత్త జీవం వచ్చింది. దీంతో శరావతి నదికి ప్రవాహం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో జోగ్ వద్ద శరావతి ప్రవాహంతో జలపాతం నురగలు కక్కుతోంది. 253 మీటర్ల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటే నీటి తుంపరలు రేగి సుందరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. దేశంలోనే ఇది రెండవ ఎత్తైన వాటర్ ఫాల్స్‌గా పేరు గడించింది. One of the most beautiful Waterfalls in the World.Jog Falls, located in Shimoga district of Karnataka, India🇮🇳 pic.twitter.com/WtwEZzGNGW— Raghu (@IndiaTales7) September 14, 2022 పర్యాటకుల వరద జోగ్ సౌందర్యాన్ని చూడటానికి వేలాది పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జోగ్ పరిసరాలు కిక్కిరిశాయి. మొన్నటివరకు నీరు లేక బోసి పోయిన జోగ్ జలపాతం కొత్తందాలను చూసి సందర్శకులు మురిసిపోయారు. పైగా ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతూ, పొగమంచు కొమ్ముకోవడంతో ఆ ప్రాంతంగా ఆహ్లాదమయం అయ్యింది. ఎక్కడెక్కడి నుంచో కార్లు, బస్సులు, బైక్‌లపై సందర్శకులు వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. Jogh falls very less water.. pic.twitter.com/aNCYinrBhJ— prathap cta (@PrathapCta) September 2, 2017 Sound of Jog Falls. Meditative. River Sharavathi has been like this for millions of years. Water to #Bengaluru will completely kill this indescribable beauty. If no excess water, no waterfalls. #Shimoga #Karnataka #Monsoon2019 pic.twitter.com/nxNEYLSYVZ— DP SATISH (@dp_satish) July 21, 2019 -
మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్? షాకింగ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్చల్ చూస్తోంది. గత ఏడాది లాంచ్ చేసిన స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో వాటర్ లీక్ అవుతున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో 1 రోజు క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 మిలియన్ల వ్యూస్‌ని సంపాదించింది. యూట్యూబర్ అరుణ్ పన్వార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో నీరు ఎలా లీక్ అయ్యిందో చూపించే వీడియోను షేర్ చేశారు. కొండల్లో ప్రయాణిస్తుండగా ఓ జలపాతం తనకు ఈ అనుభవం ఎదురైందని వీడియోలో చెప్పాడు. తన కారును జలపాతం కింద కడగాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కారును పార్క్ చేసే ముందు డ్రైవర్ సన్‌రూఫ్‌ను మూసివేసినా కూడా సన్‌రూఫ్, స్పీకర్ల ద్వారా కారులోకి నీరు లీక్ అయిందని, కారు లోపల పాడైపోయిందని పేర్కొన్నాడు. వీడియోలో, రూఫ్-మౌంటెడ్ స్పీకర్లు, క్యాబిన్ ల్యాంప్ ద్వారా క్యాబిన్ లోపల నీరు పారుతూ ఉండగా, సన్‌రూఫ్ మూసి ఉందా లేదా అని రెండు సార్లు నిర్ధారించుకున్నట్టు కనిపిస్తోంది ఈవీడియోలో. (ఆర్ఆర్ఆర్ మేనియా: రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్!) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నా జీప్ మెరిడియన్ని చాలాసార్లు ఇలా కడిగాను కానీ ఇలా ఎపుడూ కాలేదని ఒకరు కమెంట్ చేయగా, అలాంటిదేమీ లేదు.. ఉద్దేశపూర్వకంగా అతగాడు సన్‌రూఫ్‌ను కొద్దిగా తెరిచి ఉంచాడని భావిస్తున్నానంటూ మరొకరు కామెంట్ చేయడం గమనార్హం. (బిజినెస్ క్లాస్ ప్యాసింజర్‌కి షాక్, ట్వీట్ వైరల్: ఎయిరిండియా స్పందన) అయితే కంటెంట్ కోసం అతను నిజంగానే అలా చేశాడా? అసలు ఏమైంది? సన్‌రూఫ్ ఎందుకు లీక్ అయ్యింది, సన్‌రూఫ్ లీక్ ప్రూఫ్‌గా ఉండే రబ్బరు సీల్ ఉందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలపై మహీంద్ర అధికారికంగా స్పందించాల్సి ఉంది. (గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం ) View this post on Instagram A post shared by Arun Panwar (@arunpanwarx) -
గడ్డకట్టిన జలపాతం.. ఎక్కడో కాదు మన దగ్గరే..!
సిమ్లా: కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తర భారత్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా కురవడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అత్యల్పంగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో నీరు గడ్డకట్టుకుపోతోంది. హిమాలయాలకు సమీపంలోని హిమాచల్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతుండటంతో నీళ్లు గడ్డకట్టుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. హిమాచల్ కులూలోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డకట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. గడ్డకట్టిన జలపాతం అందాలను చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. On #Udaipur - #Tindi road... Near Bhim bagh 🥶 7th January 2023#Lahaul , #HimachalPradesh@SkymetWeather @jnmet @Mpalawat @JATINSKYMET pic.twitter.com/IqLve8xh1I — Gaurav kochar (@gaurav_kochar) January 7, 2023 హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో అతి శీతల వాతావరణంతో గడ్డకట్టిన జలపాతం ఇదీ చదవండి: Joshimath: కుంగుతున్నా వదలట్లేదు -
మంచుకొండల్లో రక్తజలపాతం.. ఎక్కడంటే?
అక్కడి జలపాతాన్ని చూస్తే, అక్కడేదో రక్తపాతం జరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఎర్రని రక్తధారల్లా నీరు ఉరకలేస్తూ ఉంటుంది. చలికాలంలో పూర్తిగా గడ్డకట్టుకుపోయి, నీటి మధ్య వెడల్పాటి నెత్తుటి చారికలా కనిపిస్తుంది. ఈ రక్తజలపాతం అంటార్కిటికాలో ఉంది. టేలర్ వ్యాలీ వరకు విమానంలో చేరుకుని, ఇక్కడకు పర్వతారోహణ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అంటార్కిటికా మంచుకొండల మీదుగా ఈ జలపాతం ఉరుకుతున్న దృశ్యం సందర్శకులను గగుర్పాటుకు గురిచేస్తుంది. అరుదైన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు ఔత్సాహిక పర్వతారోహకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి నీటిలో ఇనుము సాంద్రత ఎక్కువగా ఉండి, ఆ ఇనుము ఉప్పునీటి కారణంగా తుప్పుపట్టడం వల్ల జలపాతం మధ్యలో నీరు ఎర్రగా మారుతోందని అలాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జలపాతాన్ని చూడటానికి ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు అనుకూలమైన కాలం. ఈ కాలంలోనే సాహస ప్రవృత్తిగల పర్యాటకులు దేశ దేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. చదవండి: VenkampalliL: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ -
విహారయాత్రలో విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
రాయ్‌పుర్: వారాంతంలో సరదగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు కొటడాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామ్‌దాహా వాటర్‌ఫాల్స్ వద్దకు ఆదివారం పిక్నిక్కు వచ్చినట్లు చెప్పారు. జలపాతం కింద స్నానం చేస్తుండగా అక్కడి నీటిలో ఏడుగురు తప్పిపోయినట్లు ఆదివారం సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అందులో ఇద్దరిని రక్షించించి ఆసుపత్రికి తరలించారు. అయితే, అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ తర్వాత మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. సోమవారం ఉదయం మిగిలిన ముగ్గురు టూరిస్టుల మృతదేహాలను వెలికితీశారు. సోమవారం వెలికి తీసిన మృతులు.. శ్వేత సింగ్(22), శ్రద్ధా సింగ్(14), అభయ్ సింగ్(22)లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. నీటిలోకి దిగి స్నానం చేయకూడదనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ.. టూరిస్టులు స్నానం చేసేందుకు వెళ్లటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: గుంతలో పడి అదుపుతప్పిన బైక్.. లారీ తొక్కటంతో యువకుడు మృతి! -
Photo Feature: పాలనురగలా జలపాతం
సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్: ఎత్తైన కొండలు.. చుట్టూ అడవి పచ్చనికొండల మధ్యన ప్రకృతి అందాలు ఇదెక్కడో కాదు.. జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరాన మహబూబ్‌ఘాట్ వద్ద కనిపిస్తోంది. ఇక్కడ జలపాతం వద్ద పర్యాటకుల సందడితో ఉంటుంది. కురుస్తున్న వర్షాలకు ఘాట్ పైనుంచి నల్లని రాతిపై పాలనురుగులా నీరు ప్రవహిస్తోంది. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటిధారలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చదవండి: ‘చీకోటి’ కేసులో సంచలన విషయాలు.. సినీ హీరోయిన్లకు కళ్లు చెదిరే పారితోషికాలు -
పర్యాటకుల స్వర్గధామం.. ‘కాస్ పీఠభూమి’
పింప్రి: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక మంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. మహారాష్ట్రలోనూ వర్షాకాలంలో అందమైన ప్రకృతి రమణీయమైన జలపాతాలు, పచ్చని కొండలు, లోయలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటిలో సాతారా జిల్లాలోని ఓ అందమైన ప్రాంతం.. జిల్లాకు 22 కి.మీ. దూరంలో ఉన్న ‘కాస్ పీఠభూమి’. ఒక అసాధారణమైన బయోస్పియర్, స్థానికులతోపాటు పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో దాదాపు 300 రకాలకుపైగా వివిధ రకాలకు చెందిన రంగురంగుల పూలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కేవలం ఈ రెండు నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు తండోపతండాలుగా దేశ, విదేశాల నుంచి తరలి వస్తారు. అదేవిధంగా మరెక్కడా చూడలేని రకరకాల పక్షులను ఈ ప్రాంతంలో చూసేందుకు ఇదే మంచి అవకాశం. పర్వత శిఖరాలపైన కనిపించే ఈ పీఠ భూములు హెలిప్యాడ్లను పోలి ఉంటాయి. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు మొదలయ్యేసరికి వివిధ రకాల గడ్డి పెరిగి, కొండలన్నీ పచ్చటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. దీంతో ఆ ప్రదేశానికి రంగులు వేసినట్లుగా పచ్చిక బయళ్లు.. వాటిపై రంగురంగుల బొట్లు పెట్టినట్లుగా వివిధ రకాల పూలు చూడముచ్చటగా కనిపిస్తాయి. పసుపు రంగు, ఇత ర రంగుల పుష్పాలతో రంగురంగు తివాచీలు పర చి మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు, పలు రకాల పుష్పాలను, పక్షులను అధ్యయనం చేసేందుకు వృక్ష, జంతు శాస్త్ర నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ప్రియులు, పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ ప్రదేశానికి తరలివస్తుంటారు. పర్వత ప్రాంతం ఈ రెండు నెలల్లో పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ పీఠభూమికి కాలినడకన మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిని ఆస్వా దించిన పర్యాటకులకు ఈ ప్రదేశం తమ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రయాణం.. అత్యంత అద్భుతం.. సతారా నుంచి కాస్‌కు వెళ్లే మార్గం కొంత ఇరుకుగా ఉన్నప్పటికి పర్వతాలపైకి వెళ్తున్నంతసేపు పర్యాటకులను తాకే చల్లటి గాలులు మొత్తం శ్రమను దూరం చేస్తాయి. ముందుకు సాగుతున్నంతసేపూ ఎన్నో అద్భుతాలను, మనోహరమైన ప్రకృతి దృశ్యాలను కెమరాలలో బంధించవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్‌కు సంబంధించిన ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు పూలను, మొక్కలను తెంచకపోవడం మరో విశేషం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వింత లోకాన్ని చూడడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చూడాల్సిన ప్రదేశాలు.. కాస్లేక్.. కాస్ పీఠభూమి సముద్ర మట్టానికి 3,725 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పీఠభూమి సహ్యాద్రి కొండల మధ్య గిన్నె ఆకారంలో కనిపిస్తుంది. కొయనా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా కాస్ లేక్ ఏర్పడింది. సతారా పట్టణానికి తాగునీటిని ఈ లేక్ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ సరస్సు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్వచ్ఛతలో ఈ లేక్ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇక్కడ బోటింగ్ ఓ అద్భుత, చిరస్మరణీయ అనుభూతిని కల్గిస్తుంది. ఈ ప్రాంతం మొక్కలకు, వన్యజీవులకు అనుకూలంగా నిలుస్తుంది. భూలోకంలో స్వర్గాన్ని అనుభవించాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి.. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సిందే. చల్కేవాడి.. వందలాది గాలి మరలు ఇక్కడ పర్వతాలపై మనకు టాటా చెబుతూ వీడ్కోలు పలుకుతుంటాయి. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలు సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గాలి మరల ద్వారా ఇక్కడ విద్యుచ్ఛక్తిని తయారు చేస్తున్నారు. అందుకే సతారా జిల్లాను ‘డిస్ట్రిక్ట్ ఆఫ్ పవర్’గా పిలుస్తున్నారు. చల్కేవాడి పవన నిలయంగా చెప్పవచ్చు. నైసర్గ్ ఆర్గానిక్ ఫార్మ్.. సతారాకు చెందిన శిందే ఈ ఆర్గానిక్ ఫామ్‌ను నడుపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన సర్పగంధ, ఇన్సులిన్, తులసి లాంటి వివిధ మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడ సజ్జన్ఘడ్ కోటను కూడా చూడవచ్చు. (క్లిక్: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు) తోసేఘర్ వాటర్ ఫాల్స్... సతారా నుంచి 20 కి.మీ. దూరాన తోసేఘర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ వెయ్యి అడుగుల పైనుంచి కిందున్న లోయలోకి పడుతుంటాయి. పర్యాటకులకు ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతాలను చూడడానికి దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. వాటర్ ఫాల్స్‌కు ఎదురుగా ఉన్న లోయపైన ఒక ప్లాట్‌ఫాంను నిర్మించడం వల్ల ఈ జలపాతాలను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సాహస కృత్యాలు చేయకూడదు. గతంలో చాలామంది పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందా లు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. (క్లిక్: అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్) -
'రివర్స్ వాటర్ ఫాల్'.. ఎక్కడో కాదు మన దేశంలోనే
ముంబై: ఎత్తైన కొండల నుంచి కిందికి జాలువారే జలపాతాల్ని చాలానే చూసి ఉంటాం. కానీ గాల్లో పైపైకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? అలా ఎలా అనుకుంటున్నారా? అవునండి అది నిజమే.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం ఎక్కడో కాదు మన దేశంలోనే కనువిందు చేస్తోంది. మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఈ ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత్ నంద.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం అద్భుత దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే కాదు.. అసలు ఇలా రివర్స్ వాటర్‌ఫాల్ ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని వివరించారు. గురుత్వాకర్షణ, గాలి ఒకదానినొకటి వ్యతిరేక దిశలో సమానంగా ఉన్నప్పుడు ఇలాంటివి సంభవిస్తాయని తెలిపారు. పశ్చిమ కనుమల్లోని నానేఘాట్ వద్ద ఆదివారం ఇదే జరిగిందంటూ దానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. When the magnitude of wind speed is equal & opposite to the force of gravity. The water fall at its best during that stage in Naneghat of western ghats range. Beauty of Monsoons. pic.twitter.com/lkMfR9uS3R — Susanta Nanda IFS (@susantananda3) July 10, 2022 వర్షాకాల సోయగం.. ఈ ప్రకృతి అద్భుతాన్ని 'వర్షాకాల సోయగం'గా అభివర్ణించారు నంద. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 3 లక్షల వీక్షణలు, 15వేలకుపైగా లైక్‌లు సంపాదించింది. చాలా మంది ఆ అద్భుతంపై కామెంట్లు చేశారు. 'ఆ ప్రాంతాన్ని నేను సందర్శించాను. అది భూలోక స్వర్గం' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. 'దీనికన్నా సుందరమైనదాన్ని ఇప్పటి వరకు చూడలేదు' అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: IndiGo Airlines: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
స్నేహితుడిని కాపాడబోయి మృత్యువాత
మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరు జలపాతంలో గురువారం పలవెల హసన్ ప్రీతమ్(21) మునిగిపోయి మృతి చెందాడు. అప్పటి వరకు స్నేహితులతో ఆనందంగా గడిపిన హసన్‌కు పొల్లూరు జలపాతం యమపాశమైంది. మృతుడు హసన్ ప్రీతమ్ కాకినాడ కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ డిపార్టెమెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి గురువారం ఉదయం 4 గంటలకు రెండు మోటార్‌బైక్‌లపై బయలుదేరి 11 గంటలకు పొల్లూరు జలపాతం వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు హసన్‌ప్రీతమ్, మరో స్నేహితుడు ద్విగిజయ్ అబురుక్‌లు జలపాతంలోకి దిగారు. స్నానం చేస్తుండగా ద్విగిజయ్ నీటిలో మునిగిపోవడంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో హసన్ ప్రీతమ్ నీటిలో మునిగిపోయి చనిపోయాడు. సంఘటన జరిగిన వెంటనే ఎస్ఐ వి.సత్తిబాబు తమ సిబ్బందితో అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. గత ఏడాదే ఉద్యోగం వచ్చింది పలవెల హసన్ ప్రీతమ్ తల్లిదండ్రులు చనిపోయారు. సొంత గ్రామం మండపేట. తల్లి పద్మ మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తూ 2020 సంవత్సరంలో చనిపోయారు. దీంతో కుమారుడు హసన్‌కు 2021 సంవత్సరంలో కాకినాడ కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. మృతుడికి ఒక సోదరి ఉంది. ఆమె ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నంలో డిగ్రీ చదువుతున్నారు. బంధువులు పొల్లూరు బయలు దేరారు. ఒంటరైన సోదరి కాకినాడ : కన్నతల్లి అనారోగ్యంతో మృత్యువాతపడింది. కొద్ది నెలలకే తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. తనే అమ్మా నాన్నలా తోడుగా నిలిచిన అన్నయ్యను కూడా మరణం వెంటాడింది. ఇలా మూడేళ్ళ వ్యవధిలో ఒకరి వెంట ఒకరుగా కుటుంబ సభ్యులంతా చనిపోవడంతో ఇప్పుడామె ఒంటరి అయ్యింది. ఆమె దయనీయ స్థితిని చూసిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చింతూరు మండలం పొల్లూరు జలపాతంలో పడి పలివెల హసన్‌ప్రీతమ్ మరణించాడన్న సమాచారంతో ఇక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే...కాకినాడ నగర పాలకసంస్థ అసిస్టెంట్ ఇంజినీ ర్గా పనిచేస్తున్న పద్మశ్రీ రెండున్నరేళ్ళ క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆమె మరణించిన మరికొద్ది నెలలకే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తండ్రి వెంకటేశ్వరరావును కూడా మృత్యువు వెంటాడి తీసుకుపోయింది. తల్లి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వీరి కుమారుడు హసన్‌ప్రీతమ్‌కు కారుణ్య నియామకం ద్వారా కాకినాడ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ ధైర్యాన్ని కూడగట్టుకుని చెల్లెలు హర్షితను చదివిస్తూ తనే అమ్మా, నాన్నగా, అన్నగా తోడుండి బాసటగా నిలిచాడు. అన్న ప్రోత్సాహంతో కొద్ది రోజుల క్రితమే హర్షిత విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో బీటెక్‌లో చేరింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబాన్ని మరోసారి విధి వెంటాడింది. అవివాహితుడైన అన్న హసన్ ప్రతీమ్ గురువారం రంపచోడవరం ఏజన్సీ పొల్లూరు జలపాతంలో గల్లంతై మృత్యువాత పడ్డాడన్న సమాచారం బయటపడింది. దీంతో హర్షిత పరిస్థితిని తలుచుకుని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..!) -
సరదాకు చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. వీడియో వైరల్
సరదాకు చేసిన ఓ ఫీట్ యువకుడిని ఆసుపత్రిపాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల కర్నాటకలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగాయి. ఈ క్రమంలో చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్ వద్ద ఉన్న గోడపై నుంచి డ్యామ్ నీళ్లు కిందకు వస్తున్నాయి. వేసవిలో దీన్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు(20) పై నుంచి నీళ్లు వస్తున్న సమయంలో సరదాకు ట్రెక్కింగ్ చేయబోయాడు. అతడు దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత పట్టుజారి పోవడంతో కింద పడిపోయాడు. కాగా, ఆనకట్ట దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదకర ఫీట్ చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా యువకుడి ఇలా చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A man fell down the wall of Srinivasa Sagara Dam in #Chikkaballapur and got injured while he was attempting to scale the wall. Reports @dpkBopanna pic.twitter.com/KUpU1NRgyR — Sanjay Jha (@JhaSanjay07) May 23, 2022 ఇది కూడా చదవండి: మోదీని సర్ప్రైజ్ చేసిన బాలుడు.. ఆశ్యర్యపోయిన ప్రధాని -
వైరల్ వీడియో: వరదలో చిక్కుకున్న తల్లీబిడ్డలను రక్షించిన అధికారులు
-
క్షణ క్షణం ఉత్కంఠ.. ప్రమాదం అంచున తల్లీ బిడ్డలు.. వారు సేఫ్, అయితే..
తమిళనాడు అటవీ అధికారులు ఓ మహిళను ఆమె కూతురిని రక్షించిన వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. రెండు నిమిషాల నిడివిగల ఆ వీడియోలో ఓ మహిళ తన ఒడిలో చిన్నారిని పట్టుకొని జలపాతం పక్కన ఉన్న కొండ వద్ద చిక్కుకుపోగా ఆమెను అటవీ అధికారులు రక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా అత్తూరు సమీపంలోని కల్లవరయన్ కొండల్లో అనైవారి మట్టల్ జలపాతం కొండల మీద నుంచి పరవళ్లు తొక్కుతోంది. చదవండి: 150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం.. నెట్టింట ఫోటో వైరల్ ఈ క్రమంలో ప్రమాదకరంగా ఉన్న రాయిపై మహిళ తన కూతురితో చిక్కుకుపోయింది. వరద ప్రవాహంతో ఎక్కువగా ఉండడంతో ఆమె ఎటూ వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ రెస్క్యూ అధికారులు కొంతమంది యువకులు తాడు సాయంతో తల్లీబిడ్డలను రక్షించారు. అయితే అటవీశాఖ అధికారులకు సహాయం అందిస్తున్న సమయంలో చివరలో ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి నీటిలో పడిపోయారు. అప్పటికే వీడియో పూర్తయినప్పటికీ, ఇద్దరు వ్యక్తులు నదికి అవతలి ఒడ్డుకు ఈదుకుంటూ అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్ -
శ్రీశైలం క్షేత్రంలో అదొక దర్శనీయ స్థలం.. అక్కడి జలంతో రోగ నివారణ!
సాక్షి, కర్నూలు: శ్రీశైలం మహాక్షేత్రంలోని పేరొందిన దర్శనీయ స్థలాలలో పాలధార–పంచధారలు ఒకటి. శ్రీశైల ప్రధానాలయానికి మూడు కిలోమీటర్ల దూరములో రహాదారిని అనుకొని ఎడమవైపుగల లోయ ప్రాంతమే పాలధార–పంచధార. రోడ్డుమార్గము నుంచి 146మెట్లను దిగి ఈ పాలధార–పంచధారలను చేరుకోవాల్సి ఉంటుంది. నిరంతరం వెలువడే జలధారలు: పాలధార–పంచధారల వద్ద కొండరాళ్ల మధ్య నుంచి ఒక జలధార, మరోకచోట ఐదు జలధారలు ప్రవహిస్తుంటాయి. ఎండా వానలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తుండడం ఈ జలధారల విశేషం. క్షణకాల సందర్శనతో క్షణాలను మరిపించే ఈ దివ్యస్థల సందర్శనతో భక్తులు ముగ్దులవుతారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పాలధార–పంచధారలను తప్పనిసరిగా సందర్శిస్తుంటారు. ఆదిదేవుడి నుంచి అవిర్బావం: ఆదిదేవుడైన పరమేశ్వరుడి నుంచే ఈ పాలధార–పంచధారలు ఉద్బవించాయని చెప్తుంటారు. పరమశివుని పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘెర, తత్పురుష, ఈశాన్య ముఖాల నుంచి ఉద్భవించినవే పంచధారలని చెబుతారు. ఈ జలధారల ప్రవాహతీరులో ఎంతో విశేషం కూడా ఉంది. నిరంతరం వెలువడే ఈ జలధారలు ముందుకు ప్రవహించకుండా అక్కడికక్కడే అంతరించి పోవడం అశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా ఈ జలధారలు తెల్లగా కనిపించడం వల్ల కొందరు దీన్ని పాలధార–పంచధార అని కూడా పిలుస్తారు. మన ప్రాచీన కావ్యాలు ఈ పాలధార–పంచధారలను పావనతీర్థంగా అభివర్ణించాయి. ఆ జలంతో రోగ నివారణ: ఔషధీ సమ్మిళతమైన పాలధార–పంచధారల నీటికి రోగాన్ని నివారించే శక్తి ఉందనే భావన చాలా ప్రసిద్దంగా ఉంది. ఇప్పటికే కొందరు పాలధార–పంచధార జలాలలను పవిత్ర తీర్థగంగగా భావించి రోగాల నివారణకు వాడుతుంటారు. చదవండి: రాయచోటి రాక్ గార్డెన్స్.. శిలల సొగసు చూడతరమా! -
ఢిల్లీకి నయాగరా వాటర్ ఫాల్స్ వచ్చిందిరోయ్.. వైరల్ వీడియో
దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ-ఎన్సీఆర్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఏకదాటి వర్షానికి నగరమంతా జలమయమైంది. రోడ్లపై నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిలిపోయింది. అయితే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘తూర్పు, ఆగ్నేయం, ఈశాన్య, ఉత్తర ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, దాద్రి, మీరట్, మోడీనగర్‌లోని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా ఢిల్లీ వర్షాలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైర వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ మీద వరద ప్రవాహం ఎక్కువవడంతో వర్షపు నీరు కింద ఉన్న రోడ్డు మీదకు పారుతోంది. అయితే ఇది చూడటానికి అచ్చం జలపాతం మాదిరి కనిపిస్తోంది. దీనిని సంజయ్ రైనా అనే ట్విటర్ యూజర్ తన అకౌంట్లో పోస్టు చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘ఢిల్లీకి నయాగరా జలపాతం వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని కెంప్టీ వాటర్ ఫాల్‌ను తలపిస్తోంది. ఇది ఢిల్లీ ప్రభుత్వ కొత్త 'కార్' వాష్ చేసుకునే ఫెసిలిటీ.’ అంటూ రిప్లై ఇస్తున్నారు. చదవండి: న్యూజిలాండ్‌లో నవారు మంచం ధరెంతో తెలుసా? కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే! Welcome to the #WaterfallCity of #Delhi #DelhiRains pic.twitter.com/ZQtYbwvFB6 — Sanjay Raina (@sanjayraina) August 31, 2021 It's the new 'car' wash facility of the Delhi Govt — deesso (@deesso) August 31, 2021 Delhi mai banega Niagra Fall ... uski ye pehli jhalak hai — Sumit Srivastava (@meet2sumeet) August 31, 2021 -
తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం
భైంసా టౌన్: 200 ఏళ్లకుపైగా పురాతన శివాలయం, ప్రకృతి ఒడిలో, పచ్చని చెట్ల మధ్య వెలిసింది. పక్కనే జలపాతం అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు, ఎతైన గుట్టలు, పక్కనే జాలువారే జలపాతం.. వీటి మధ్యన వెలిసిన పురాతన శివాలయం.. వెరసి కుభీర్ మండలంలోని బ్రహ్మేశ్వరాలయం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో పూజలు చేసేందుకు శని, సోమవారాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం తరలివచ్చి పూజలు చేస్తారు. గ్రామం: బ్రహ్మేశ్వర్, మండలం: కుభీర్ భైంసా నుంచి దూరం: 20 కి.మీ(దాదాపు) ఆలయ చరిత్ర... బ్రహ్మేశ్వర ఆలయానికి దాదాపు 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వనవాసం సమయంలో రామలక్ష్మణులు, సీత ఇక్కడ సంచరించారని, శివలింగం ప్రతిష్ఠించి పూజలు చేశారని నమ్ముతారు. తమ తాతల కాలం నుంచి ఆలయం ఉందని, శివరాత్రితోపాటు ఏటా శ్రావణమాసంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారని చెబుతున్నారు. ఆకట్టుకునే వాతావరణం.. భైంసా నుంచి దాదాపు 20కి.మీ దూరంలో ఉండే బ్రహ్మేశ్వర్ గ్రామంలోని బ్రహ్మేశ్వరాలయం పరిసరాలు, అక్కడి వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయ సమీపంలోని జలపాతంలో స్నానాలు చేస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు దూరప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు. పురాతన ఆలయంగా ప్రసిద్ధి.. కొత్త పంచాయతీలతో బ్రహ్మేశ్వర్ జీపీగా ఏర్పడింది. ఇక్కడి శివాలయానికి దాదాపు 200ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. - దత్తురాం, బ్రహ్మేశ్వర్ గ్రామస్తుడు -
దుసపాటిలొద్ది జలపాతంలో ఇద్దరు యువకుల గల్లంతు
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీపంలో ఉన్న దుసపాటి లొద్ది జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు ఒకరు నీట మునిగి పోతుండటంతో అతడిని రక్షించడానికి వెళ్లి మరొకరు నీటిలో మునిగిపోయాడు. ఎస్సై కొప్పుల తిరుపతిరావు కథనం ప్రకారం.. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం సందర్శనకు వచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తుండగా మునిగెల నరేశ్ (24) ప్రమాదవశాత్తు గుండంలో పడిపోయాడు. అతను ఎంతకూ బయటకు రాక పోవడంతో మిగతా మిత్రులు ఆందోళనకు గురై అక్కడే ఉన్న పర్యాటకులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి తమ సిబ్బందితో పాటు రెస్క్యూ టీంను అక్కడికి పంపించారు. రాత్రి వరకు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. చీకటి కావడంతో గాలింపు నిలిపి వేశారు. గల్లంతైన నరేశ్‌కు తల్లి సమ్మక్క ఉంది. తండ్రి సింగరేణిలో పనిచేస్తూ మృతిచెందడంతో ఆ ఉద్యోగం నరేశ్‌కు వచ్చింది. గత కొంతకాలంగా గోదావరిఖనిలో విధులు నిర్వహిస్తున్న నరేశ్ మూడు నెలల క్రితం భూపాలపల్లికి డిప్యుటేషన్‌పై వచ్చాడు. కాపాడటానికి వెళ్లి..: నరేశ్ నీటిలో మునిగి గల్లంతు కావడంతో జలపాతం చూడటానికి వచ్చిన రవికుమార్‌చారి (30) అనే యువకుడు అతడిని కాపాడటానికి నీటిలో దిగాడు. అయితే అతను కూడా గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన రవికుమార్‌చారి అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులను నిర్వహిస్తున్నాడు. వారించినా వినకుండా..: ఈ జలపాతం రిజర్వ్ ఫారెస్టులో ఉండడంతో అటవీ శాఖ సిబ్బంది పర్యాటకులను అక్కడికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు వారిస్తున్నారు. అయినా వినకుండా చాలా మంది వెళ్తున్నారు. గతంలో ఇక్కడ ఒకరు గల్లంతై చనిపోగా, తాజాగా ఇద్దరు గల్లంతయ్యారు. -
జలజల జలపాతం కావాలా? ఇదుగో ఇలా వెళ్లండి
-
రోటీన్ లైఫ్‌తో విసిగి పోయారా ?.. ఈ వీడియో మీ కోసమే...
Karimnagar Raikal Waterfall: కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా మన లైఫ్స్టైల్లో ఎంతో మార్పు వచ్చింది. బయట కాలు పెట్టాలంటే భయం. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. పార్కుల్లో అరకొర జనమే, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఇళ్లు, ఆఫీసు, మార్కెట్ తప్ప మరో ఎక్సైట్మెంట్ కరువైంది జీవితానికి. ఈ బోర్డమ్ను బ్రేక్ చేసేందుకు రా.. రమ్మంటోంది రాయికల్ జలపాతం. జలజల... ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే అడవిలో రాళ్ల బాటలో ప్రకృతిలో మమేకం అవుతూ కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇదొక చక్కని వేదిక. ఇంట్లో రోటీన్ లైఫ్‌కి భిన్నంగా.. ఆఫీస్ ఒత్తిడికి దూరంగా... ప్రకృతిలో మమేకం అవుతూ జల సవ్వడిలో కష్టాలను కరించేస్తూ.. ఎత్తైన కొండలను ఒక్కో అడుగు వేస్తూ ఎక్కేస్తూ... ఇటు అడ్వెంచర్.. అంటూ నేచర్ బ్యూటీలను ఒకేసారి అనుభవించాలంటే ఇటు వైపు ఓ సారి వెళ్లండి. ఇలా వెళ్లొచ్చు - హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల నుంచి వచ్చే వారు పీవీ స్వగ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోవాలి. - వంగర నుంచి రాయికల్ గ్రామానికి చేరుకోవాలి - రాయిల్కల్ నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎత్తైన పర్వత పాదాల వద్ద రాయికల్ చెరువు కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడి వరకు బైకులు, కార్లు వెళ్లగలవు - చెరువు సమీపంలో వాహనాలు నిలిపి సుమారు 1.5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే జలపాతం చేరుకోవచ్చు. కొండల నడుమ వరంగల్ నగరం నుంచి 43 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఎత్తన కొండల నడుమ ఈ జలపాతం ఉంది . ఏళ్ల తరబడి స్థానికులకే తప్ప బయటి ప్రపంచానికి ఈ జలపాతం గురించి తెలియదు. ఇటీవలే ఈ జలపాతానికి వస్తున్న టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. 170 అడుగుల ఎత్తు నుంచి చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ. 170 అడుగుల ఎత్తు నుండి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతుంటుంది. మొత్తం ఐదు జలపాతాల సమాహారం రాయికల్ జలపాతం. పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: - జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవు, కాబట్టి సందర్శకుల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సెల్ఫీ మోజులో నిర్లక్ష్యంగా ఉన్న అనవసరపు సాహాసాలు చేసినా... ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన మరో రకంగా మారుతుంది. - కొండల పై భాగంలో ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఉంటే మేలు - మద్యం తాగివెళ్లొద్దు. - ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు. - జలపాతాలు ఎక్కే ప్రయత్నం చేయకూడదు. - కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి షూ ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. - ఫుడ్, వాటర్ తదితర వస్తువులేమీ అక్కడ లభించవు. కాబట్టి పర్యటకులు తమతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం బెటర్. టి. కృష్ణ గోవింద్, సాక్షి, వెబ్‌డెస్క్. -
అలరిస్తున్న బోడకొండ జలపాతం అందాలు
-
ప్రమాదవశాత్తు జలపాతంలో పడి..
బ్యాంకాక్: ప్రమాదవశాత్తు జలపాతంలో పడి నాలుగు అడవి గున్న ఏనుగులు మృతి చెందిన ఘటన థాయ్‌లాండ్‌లోని ఖావో యై జాతీయ పార్కులో చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా పార్క్‌లో ఉన్న జలపాతానికి వరద నీరు పెరిగింది. ఈ నీటిలో మొత్తం ఆరు ఏనుగులు చిక్కుకున్నాయి. అందులో నాలుగు ఏనుగులు ప్రవాహంలో కొట్టుకుపోతూ రాళ్లను ఢీకొని మృతి చెందాయి. మృతి చెందిన ఓ గున్న ఏనుగును చేరుకొనేందుకు మిగిలిన రెండు ఏనుగులు ప్రయత్నించసాగాయి. దీన్ని గుర్తించిన పార్క్ అధికారులు లోయలో నుంచి వాటిని రక్షించారు. నీటి ప్రవాహానికి ఎదురు వెళ్లిన గున్న ఏనుగులు తీవ్రంగా అలసిపోయాయని, ప్రస్తుతం అవి విశ్రాంతి తీసుకుంటున్నాయని పార్కు అధికారులు తెలిపారు. మరో వారం పాటు వాటి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తామని తెలిపారు. ఏనుగులను రక్షించే సమయంలో పర్యాటకులను జలపాతం వద్దకు అనుమతించలేదు. -
జలపాతాన్ని తలపించిన బిల్డింగ్!
-
జలపాతాన్ని తలపించిన బిల్డింగ్!
ముంబై : నగరంలోని కఫే పరేడ్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్ జలపాతాన్ని తలపించింది. బిల్డింగ్ పై నుంచి నీరు కారుతున్న వీడియో చూపరులను ఆకట్టుకుంది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఓ నెటిజన్ ట్విటర్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ‘వాటర్ ఫాల్స్ ఇన్ న్యూ కఫే పరేడ్’అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని చాలా మంది భావించారు. అయితే భారీ వర్షాల కారణంగా బిల్డింగ్‌పై వర్షపు నీరు కిందకు వచ్చిందనే వార్తలను సదురు బిల్డింగ్ నిర్వాహకులు ఖండించారు. బిల్డింగ్‌పై ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త వాటర్ ట్యాంక్‌ను పరీక్షిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వారు తెలిపారు. వాటర్ ట్యాంక్‌కు లీక్ ఏర్పడటంతో నీరు కిందకు ప్రవహించిందని పేర్కొన్నారు. మరోవైపు భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు చెరవులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. -
నీరెక్కడైనా నిప్పులు కక్కుతుందా?
-
నీరు నిప్పులు కక్కిన వేళ..
నీరెక్కడైనా నిప్పులు కక్కుతుందా? కక్కదుగా.. ఓసారి కాలిఫోర్నియా వెళ్లి చూడండి.. అక్కడ నీళ్లు ఇదిగో ఇలా నిప్పులు కక్కుతుంది. యెసెమెటీ నేషనల్ పార్క్‌లోని హార్స్ టెయిల్ జలపాతం ఫిబ్రవరి నెలలో మాత్రం అగ్నిపర్వతం నుంచి జాలువారే లావాను తలపిస్తుంది. దీన్ని వీక్షించేందుకు పర్యాటకులు వెల్లువలా తరలివస్తారు. ఇంతకీ అదెలా అంటే.. సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ కాంతి జలపాతంపై పడి.. నారింజ రంగులో నీళ్లు మెరుస్తాయి. దాని వల్ల లావాలాంటి ఎఫెక్ట్ వస్తుంది. ఏటా ఫిబ్రవరిలో కొన్ని రోజులు మాత్రమే ఇలా కనిపిస్తుంది. ఈ చిత్రం ఆ సందర్భంగా తీసినదే. -
లోయలో పడ్డ విద్యార్థి.. వైరల్ వీడియో
భువనేశ్వర్ : పశ్చిమ ఒడిశాలో బరాగర్ జిల్లాలో ఓ విద్యార్థి అదుపుతప్పి జలపాతంలో పడిపోయాడు. 200 మీటర్ల ఎత్తు నుంచి జలపాతంలో యువకుడు పడిపోయిన వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్అవుతోంది. అతన్ని డిప్లొమా ఇంజినీర్ విద్యార్థి రాహుల్ దాస్(18)గా గుర్తించారు. డీయోదరా హిల్‌లోని నలీచుహాన్ జలపాతం వద్ద బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ దాస్ తన ముగ్గురు క్లాస్‌మెట్స్‌తో కలిసి నలీచుహాన్ జలపాతం దగ్గరికి వెళ్లారు. జలపాతం దగ్గర అందరూ సరదాగా గడుపుతుండగా రాహుల్ తన ఫోన్‌తో ఫోటోలు తీశాడు. అనంతరం ఆఫోన్‌ను పక్కన పెట్టి, తిరిగి మిత్రుల దగ్గరకి వెళ్దామనుకున్నాడు. అయితే నీళ్లలో అడుగుపెట్టగానే షూ జారడంతో అదుపుతప్పి లోయలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో రాహుల్ ప్రాణాలతో బయటపడ్డా, వెన్నుముకకు తీవ్ర గాయం కావడంతో గురువారం రాత్రి డాక్టర్లు సర్జరీ చేశారు. సంఘటన జరిగిన సమయంలో బాధితుడి స్నేహితుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. -
అదుపుతప్పి జలపాతంలో పడిపోయాడు.. !
-
అబ్బుర పరిచే సోయగం.. రాయికల్ జలపాతం
చుట్టూ అడవులు.. పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. సహజసిద్ధంగా జాలువారే జలపాతాలు.. హోరెత్తే నీటి హొయలు.. వెరసి ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగిపోయిన అద్భుత ‘చిత్రం’.. రాయికల్ జలపాతం. వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో.. వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ప్రచారానికి దూరంగా, కేవలం స్థానికులే సేదతీరే ప్రాంతంగా మిగిలిపోయిన ఈ జలపాతం.. ఇప్పుడిప్పుడే పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. – సాక్షి, హైదరాబాద్ కమనీయం.. ప్రకృతి రమణీయం చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు.. ఇవి తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదిక్కడ. 170 అడుగుల ఎత్తు నుంచి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతూ ఉంటుంది. 5 అంచెలలో సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం, పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. చక్కటి పర్యాటక కేంద్రం కరీంనగర్, వరంగల్ నగరాలకు అత్యంత సమీపం లో ఉండటం వల్ల ఈ జలపాతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. తెలంగాణ నయాగారాగా పిలిచే బొగత జలపాతానికి ఏ మాత్రం తీసిపోని విధంగా రాయికల్ జలపాతం ఉంటుంది. అయితే ఈ జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, కొండలపై భాగంలో ఎలుగుబంట్లు ఉండటం తదితర కారణాల రీత్యా ఇది అంతగా ఆదరణకు నోచుకోలేదు. సరైన భద్ర తా చర్యలు చేపట్టి, అవసరమైన సౌకర్యాలను సమకూరిస్తే ఇది తెలంగాణలో ఓ మంచి పర్యాటక కేంద్రంగా భాసిల్లే అవకాశం ఉందని పర్యాటకుల అభిప్రాయం. ఆద్యంతం ఆహ్లాదభరితం ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంతదూరం గుట్టల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి. పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇంతకు మించిన చక్కటి ప్రదేశం వరంగల్ సమీపంలో లేనే లేదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న చెరువు దర్శనమిస్తుంది. దీని నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పర్యాటకులకు ఏమి కావాలన్నా వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. చేపట్టాల్సిన భద్రతా చర్యలివీ ♦ నీళ్లలో ప్రమాదవశాత్తు పడితే బయటపడేందుకు జలపాతాల వద్ద ఇరువైపులా తాళ్లు ఏర్పాటు చేయాలి. ♦ జలపాతాల వద్ద తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది నియామకం. ♦ నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు. ♦ నీళ్లలోకి వెళ్లకుండా ఇరువైపులా జాలీ ఏర్పాట్లు ఎలా వెళ్లాలి? హుస్నాబాద్ సిద్దిపేట రోడ్లో ములుకనూరు వద్ద కుడి వైపు వెళ్లాలి. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు స్వగ్రామం అయిన వంగర మీదుగా రాయికల్ గ్రామానికి వెళ్లాలి. గ్రామం నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గ్రామ చెరువు వస్తుంది. అక్కడ వాహనాలను నిలిపి , జలపాతాల వైపు సుమారు 1 1/2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ జలపాతాలను చేరుకోవచ్చు. -
చైనాలో ఆకట్టుకుంటున్న కృత్రిమ జలపాతం
-
బొగత జలపాతంలో ఒకరి గల్లంతు
వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతంలో ఆదివారం బుర్రి ప్రసాద్ (28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతయ్యాడు. సహాయక సిబ్బంది అతడి కోసం గాలించినప్పటికీ సాయంత్రం వరకూ ఆచూకీ లభించలేదు. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం రామవాడకు చెందిన ప్రసాద్ కూకట్‌పల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బొగత జలపాతాన్ని సందర్శించడానికి స్నేహితులు మినుగు అనిల్, వేముల వినయ్, రావుల నిఖిల్ తో కలసి ఇక్కడికి వచ్చారు. ప్రసాద్ జలపాతం కింది భాగం లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంత య్యాడు. సహాయక సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. సోమవారం కూడా గాలింపు చేపడతామని ఎస్సై చెప్పారు. కాగా, జలపాతంలో గల్లంతైన ప్రసాద్ కోసం గాలిస్తున్న సమయంలోనే హన్మ కొండకు చెందిన ఎస్వీ రెడ్డి అనే వ్యక్తి బొగతలో వస్తున్న వరదలో పడిపోయాడు. అతను నీటిలో మునిగిపోతుండగా సహాయక సిబ్బంది అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. -
అమెరికాలో తెలుగు టెకీ మృతి
సాక్షి, కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. విహారయాత్రలో భాగంగా నార్త్ కరోలినా ప్రాంతంలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందారు. ఈ విషయాన్ని నాగార్జున మిత్రులు, అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నాగార్జున మరణంతో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతుడు నాగార్జున తండ్రి 7 సంవత్సరాల క్రితం మరణించారు. సోదరుడు యశ్వంత్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. నాగార్జున చెల్లి పూజితకు వివాహం కాగా విజయవాడలో నివాసం ఉంటున్నారు. ఉన్నత చదువుల కోసం 10 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. తల్లి రాజేశ్వరి విజయవాడలో కూతురు వద్ద ఉంటున్నారు. -
చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయిన సైంటిస్ట్
-
అడవితల్లి ఒడిలో ముత్యం‘ధార’
ములుగు: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భారీ జలపాతం వెలుగులోకి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం (కే) మండలం వీరభద్రవరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి రమణీయత మధ్యన సుమారు 700 అడుగుల ఎత్తు నుంచి ముత్యంధార జలపాతం జాలువారుతోంది. ఎగువనున్న మూడు, నాలుగు కొండలను దాటుకుంటూ పాలనురగలా కిందకు ప్రవహిస్తూ సుమారు 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోంది. దాదాపు నాలుగు నెలల కిందట స్థానికులు గుర్తించిన ఈ జలపాతం ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. గద్దలు ఎగిరేంత ఎత్తులోంచి నీటి ధార పడుతుండటంతో దీన్ని గద్దెల సరి అని కూడా స్థానికులు పిలుస్తున్నారు. ఎత్తు విషయంలో కర్ణాటకలోని జోగ్ జలపాతం, మేఘాలయలోని జలపాతాల సరసన ఇది నిలుస్తుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో మూడో ఎత్తయిన జలపాతంగా దీన్ని కొందరు అభివర్ణిస్తున్నారు. జలపాతం అందాలను వీక్షించేందుకు వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. చేరుకోవడం కాస్త కష్టమే... ముత్యంధార జలపాతాన్ని చేరుకోవాలంటే పర్యాటకులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు మీదుగా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట–వాజేడు మండలం పూసూరు మధ్యనున్న బ్రిడ్జిని దాటుకుంటూ వెంకటాపురం (కె) మండల కేంద్రానికి వెళ్లాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని వీరభద్రవరం గ్రామానికి చేరుకుని సమీప అటవీ ప్రాంతంలో సుమారు 9 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే జలపాతం వద్దకు చేరుకోవచ్చు. అభయారణ్యం నుంచి పర్యాటకులు సులువుగా జలపాతం వద్దకు చేరుకునేందుకు స్థానికులు తాత్కాలిక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు నేరుగా జలపాతం వద్దకు వెళ్లేలా అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, టాటా ఏస్‌లు జలపాతం వద్దకు వెళ్లేందుకు వీలవుతోంది. సౌకర్యాలతో పర్యాటకానికి ఊతం ముత్యంధార జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి తలమానికంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర పర్యాటక, అటవీశాఖలు, జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు మార్గం, బొగతా జలపాతం మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరగనుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఆదిమానవులు నివసించే వారని ప్రచారం... జలపాతం నుంచి 200 మీటర్ల దూరంలో కాల్వ నీటిని ఆధారంగా చేసుకుని ఆదిమానవులు జీవించారనేది ప్రచారంలో ఉంది. జలపాతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంగా చిన్న, చిన్న ఆనకట్టలు ఉన్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే బంకమన్ను తయారీ వస్తువులు, రాతి ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు గతంలో ఇక్కడ మునులు తపస్సు చేసే వారని స్థానికులు చెబుతున్నారు. సౌకర్యాలు కల్పించాలి ముత్యంధార జలపాతానికి ప్రతి వారాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో జలపాతానికి వెళ్లేందుకు పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి రోడ్డు ఏర్పాటు చేయాలి. జలపాతం వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలి. – ప్రసాద్, మంచర్ల నాగేశ్వర్రావు, వీరభద్రవరం గ్రామస్తులు -
జలపాతంలో పడి యువకుడి మృతి
బోథ్(ఆదిలాబాద్): ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం వద్ద చోటుచేసకుంది. చాట్లా నరేష్(28) అనే యువకుడు సరదాగా తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు పొచ్చెర జలపాతంలో మునిగిపోయాడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫీ తీసుకుంటూ అనంత లోకాలకు
చెలిమిచేను జలపాతంలో పడి యువకుడి మృతి రామకుప్పం: చెలిమిచేను జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ యువకుడు లోయలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కంగుంది పంచాయతీ రాములగుట్టుచేను గ్రామానికి చెందిన చిట్టిబాబు(27) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం స్నేహితులతో కలిసి సరదాగా వీర్నమల పంచాయతీలోని చెలిమిచేను జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ చిట్టిబాబు జలపాతం పైభాగం నుంచి కిందకు దిగుతూ ఎక్కువగా నీరు ప్రవహిస్తున్న చోటికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి లోయలో పడిపోయాడు. స్నేహితులు గొర్రెల కాపరుల సహాయంతో లోయలోకి దిగి తీవ్రంగా గాయపడిన చిట్టిబాబును అతికష్టం మీద పైకి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. -
వావ్...కొత్తపల్లి జలపాతం
జి.మాడుగుల: మండలంలో కొత్తపల్లి గ్రామంలోని జలపాతాలకు పలు ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులతో ఆదివారం కిక్కిరిసింది. జలపాతాల ప్రాంతాల్లో ప్రభుత్వం తగిన వసతుల ఏర్పాట్లు చేయటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. జిల్లా నుండి ఇతర జిల్లాల నుండి పర్యాటకులు కుటుంబాలుతో వచ్చి జలకాలాడి రోజుంతా ఆనందంగా గడిపారు. -
జలపాతం దగ్గర జోరుగా..
పచ్చదనం పరచినట్లుండే కేరళ అది. అక్కడి చాలకుడి జలపాతం మరింత సుంద రమైన ప్రదేశం. కలర్ఫుల్గా ఉండే ఆ బ్యాక్‌డ్రాప్‌లో చిన్న ఎన్టీఆర్, సమంత ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ‘జనతా గ్యారేజ్’ చిత్రం కోసమే ఈ ఆటా పాటా అని గ్రహించే ఉంటారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. ఒక పాటను ఎన్టీఆర్, సమంతలపై కేరళలోని చాలకుడి జలపాతం దగ్గర చిత్రీకరిస్తున్నారు. ఆ పాట పూర్తి కాగానే హైదరాబాద్ షెడ్యూల్లో ఎన్టీఆర్, కాజల్‌పై ప్రత్యేక గీతం చిత్రీకరించనున్నారు. ఇందులో నిత్యామీనన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 12న హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. సినిమాను తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించినా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో సెప్టెంబరులో విడుదల చేయాలని నిర్ణయించు కున్నారు. -
ప్రకృతి పులకించె
-
చాపరాయి హాయి..హాయి...
చాపరాయి,జలపాతం,విశాఖపట్నం,chaparai,waterfall,visakhapatnam డుంబ్రిగుడ :వాతావరణంతో సంబంధం లేకుండా చాపరాయి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జలజలపారే జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉండటంతో పర్యాటక ప్రియులు నిత్యం సందర్శిస్తుంటారు. -
జలపాతం గట్టున...
క్లాసిక్ కథ ఈ సంవత్సరాంతంలో ఎదురుచూడని ఒక మంచి ఉత్తరం వచ్చింది మాకు. అది ఎంతో సంతోషం కలిగించింది. జన్మస్థలం మీది అభిమానమూ, పొదిగై కొండ చరియల మీది సౌఖ్యమూ ప్రతి యేడూ మమ్మల్ని కుట్రాలానికి లాక్కుని వెడతాయి. ప్రతి యేడూ మేమక్కడికి వెళ్లేముందు, మా మిత్రులూ మా కుటుంబ వైద్యులూ అయిన డాక్టరు ముత్తుకుమారస్వామి గారిని సకుటుంబంగా వచ్చి మాతో పాటు కాలం గడపవలసిందిగా కోరుతాము. ఆయనా ప్రతిసారి మా ఆహ్వానాన్ని పెడచివిని పెడుతూ ఉంటాడు. ‘‘రెండు నెలలూ మీరు మాతో వుండవద్దు. రెండు వారాలైనా వుండండి’’ అని బలవంతం చేసేవాణ్ని. ‘‘అమ్మో! రెండు వారాలే! రెండు రోజులు కూడా నేనీ చెన్నపట్టణం విడిచిపెట్టి రాలేను’’ అని చెప్పేవాడు డాక్టరుగారు. ముత్తుకుమారస్వామి అలా అనడానికి ప్రబలమైన కారణం లేకపోలేదు. ఈ మహానగరంలో నూర్లకొద్ది డాక్టర్లున్నా ఎడింబరో వెళ్లి ఇంగ్లీషు భాషలోని యిరవై అక్షరాలను తమ పేర్లకు చివర తగిలించుకున్న వైద్యులున్నా, ఈ అరవై ఏళ్ల వృద్ధుడు డాక్టరు ముత్తుకుమారస్వామి వద్దకే రోగులు వెతుక్కుంటూ వెడతారు. అందులోనూ కోయడం, కత్తిరించడం, అతికించడం, కలిపి కుట్టడం వంటి శస్త్ర చికిత్సలంటేనూ, పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలంటేనూ తప్పకుండా కుమారస్వామి చేతి మీదుగా జరగాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రముఖుల శరీరాలు ముత్తుకుమారస్వామి కత్తికోసం ఎదురుచూస్తూ వుంటాయి. ఆయనకి భోజనం చేసేందుకు కూడా తీరిక వుండదు. ఆయనకి భోజనానికి కూర్చునే సావకాశం కూడా లేదని ఆయన భార్య అంటూ ఉంటుంది. నిజానికి ఆమె సాంబారూ అవియలూ అన్నంలో కలిపి ఒక పళ్లెంలో ఉంచుతుంది. డాక్టరు నిలబడే భోజనం ముగించుకుని త్వరత్వరగా ఒక శస్త్ర చికిత్స కోసం బయలుదేరుతారు. ఈ దృశ్యం నేను చాలాసార్లు చూశాను. ‘ఇటువంటి డాక్టర్ని రెండు నెలలపాటు రోగుల నుంచి వేరుచేసి, కుట్రాలంలో బంధిస్తే, అంతమంది రోగుల వుసురు మనకు కొడుతుందండి’ అని నా భార్య చాలాసార్లు నాతో చెప్పింది. ఈ డాక్టరు ముత్తుకుమారస్వామిగారి వద్ద నుంచే ఆ అపూర్వ లేఖ వచ్చింది. మేము కుట్రాలం చేరుకున్న రెండు వారాలకు ఆ జాబు వచ్చింది. సంతోషమూ ఆశ్చర్యమూ మమ్మల్ని ఆవహించాయి. సంతోషం ఎందుకంటే, సకుటుంబంగా వచ్చి డాక్టరుగారు మాతో ఉంటామని వ్రాశారు. ఆశ్చర్యం ఎందుకంటారేమో: రెండు నెలలూ మాతో ఉంటామంటూ ఉత్తరంలో వ్రాశారు. 2 కుట్రాలంలో మేము బస చేసిన యిల్లు మా బంధువులది. కొండ చరియా గుడిని ఆనుకుని వున్న మిట్టా కలిసే చోటు నుంచి జలపాతానికి వెళ్లే అందమైన బాట చివర, చెట్టు చేమలూ పూల మొక్కలూ దట్టంగా పెరిగిన ప్రదేశంలో ఉంది ఆ యిల్లు. చిన్న జలపాతం నుంచి గలగల పారే చిన్న వాగులలో ఒకటి ఈ యింట్లోకి ప్రవేశించి, యింటినంతా ఒక్కసారి ప్రదక్షిణం చేసి, వెనక వాకిలికి దగ్గరగా వున్న సరస్సు గుండా ప్రవహించి, చివ్వరికి ఒక చిన్న నదిలో కలిసింది. ఇంటిని అలా నిర్మించాడు ఆ గృహ యజమాని. ఇల్లు పెద్దది. దాని చుట్టూ మామిడి, పనస, కొబ్బరి - అలా రకరకాల ఫల వృక్షాలు గల ఒక తోట. ఆ తోట నానుకుని దక్షిణం వైపు ఒక గది వుంది. దానిని దానికి పక్కనే వున్న భాగాన్నీ డాక్టరుగారి కుటుంబానికి కేటాయించాము. ఈ ప్రశాంతమైన గదిలో దక్షిణం వైపు కిటికీని కనక తెరిస్తే చాలు కమ్మని తెమ్మెర వీస్తుంది. రోగాలనూ రొప్పులనూ తరిమివేసే యీ దక్షిణానిలం చాలా ఆరోగ్యకరమైంది. పొదిగై కొండమీది మూలికల మీదుగా, పూల మొక్కల సువాసనలను లీనం చేసుకుని వీచే యీ గాలి ఎక్కడ లేని హాయినిస్తుంది. పొద్దుటి వేళల, బాలభానుని కిరణాలలో వజ్రాలు చెదిరినట్లుగా జలపాతం తెల్లగా కనిపిస్తుంది. రాత్రివేళ, ఆ తెల్లని వెన్నెట్లో వెండి కరిగినట్లుగా జలపాతం దర్శనమిస్తుంది. డాక్టరుగారికీ గది బాగా నచ్చుతుందని అనుకున్నాము. ఆయన రాకకోసం మేము ఎదురు చూడసాగాము. డాక్టరుగారు తమ భార్యతోనూ, ఢిల్లీలో ఉద్యోగం చేసే కొడుకుతోనూ, మదరాసులో మేరీ ప్రభుత్వ కళాశాలలో చదువుకునే కూతురితోనూ వచ్చారు. వాళ్ల రాక మాకెంతో సంతోషం కలిగించింది. డాక్టరుగారి కొడుకూ కూతురూ జలపాతం వద్దకు వెళ్లి స్నానం చెయ్యడం, ఆకలితో ఇంటికి తిరిగి వచ్చి, దోసెలు తిని మళ్లీ జలపాతం వద్దకు వెళ్లడం, మళ్లీ యింటికి వచ్చి తిరునెల్వేలి ‘ఆనైకొంబన్’ (శ్రేష్ఠమైన వరి జాతి) అన్నంలో పులుసు పోసుకుని భోజనం చెయ్యడం, మళ్లీ జలపాతం వద్దకు వెళ్లడం - ఇలా కుట్రాలం జీవితాన్ని బాగా అనుభవించసాగారు. డాక్టరుగారి భార్య మొదటి రెండు మూడు రోజులు పొద్దుటిపూట జలపాతంలో స్నానం చెయ్యడం, మిగిలిన వేళల్లో ఆడవాళ్లతో కలిపి తెన్ కాశి, సెంగోట - మొదలైన ఆ చుట్టుపక్కల వూళ్లకు వెడుతూ హాయిగా కాలం గడపసాగింది. ఆ తర్వాత ఒక చిక్కు యేర్పడింది ముత్తుకుమారస్వామి వల్ల. అవును. కుట్రాలానికి వచ్చిన ఆ రోజే డాక్టరులో ఒక మార్పుని చూశాడు. ఎప్పుడూ నలుగురితో గలగలమంటూ నవ్వుతూ మాట్లాడే డాక్టరిప్పుడు మూగనోము పట్టాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. పొద్దునపూట జలపాతంలో స్నానం చేసేవాడు. తర్వాత ఫలహారం చేసి గదిలోకి వెళ్లేవాడు. అంతే. మధ్యాహ్నం భోజనానికి ఆయన్ని పిలవాలి. అంతవరకూ ఆయన ఆ గదిలోనే ఒంటరిగా కూర్చునేవాడు. బయటికి వచ్చేవాడు కాదు. ఆ తర్వాత సాయంకాలం నాలుగింటికి చేతికర్ర తీసుకుని జలపాతం బాట వెంబడి గాని, లేకపోతే చంపకాటవి వైపుగా గాని ఒంటరిగా? నడిచి వెళ్లేవాడు. మాట వరసకైనా తోడు రమ్మని ఎవ్వరినీ పిలిచేవాడు కాదు. చీకటి పడ్డ తర్వాత తిరిగి వచ్చేవాడు. ఇది చూచి నేను చాలా ఆశ్చర్యపోయాను. నాలుగైదు రోజులు గడచిన తర్వాత నా ఆశ్చర్యం మరీ ఎక్కువయింది. ఒకరోజు జలపాతం వద్ద నుంచి వచ్చి, ఫలహారం చేసి, మళ్లీ బయటికి వెళ్లాడు. చేతిలోని అల్యూమినియం పెట్టెలో ఒక దోసె మడిచి పెట్టుకున్నాడు. ‘‘ఇవాళ నేను కొండమీద కొంచెం దూరం వెళ్లి వస్తాను’’ అని వెళ్లిన మనిషి సాయంకాలం బాగా చీకటిపడ్డ తర్వాత గాని ఇంటికి తిరిగి రాలేదు. ఒక వారంపాటు ప్రతిరోజూ డాక్టరు ఒంటరిగా ఎక్కడికో వెళ్లి చీకటి పడ్డ తర్వాత తిరిగి వచ్చేవాడు. ఇది డాక్టరుగారి భార్యకు విచారహేతువయింది. ఒకరోజు ఆమె మాటల సందడిలో తన విచారహేతువుని వివరించింది. రాజస్థాన్ నుంచి తమిళనాడుకి వచ్చిన ఒక కళాకారుల బృందం తలవని తలంపుగా భయంకరమైన రైలు ప్రమాదానికి పాల్పడడం, ప్రభుత్వం ఆసుపత్రిలో వాళ్లకు డాక్టరు ముత్తుకుమారస్వామి కొన్ని ముఖ్యమైన చిక్సితలు చేయడం మొదలైనవాటిని గురించి నేను కుట్రాలానికి వచ్చిన మరునాడు పత్రికా ముఖంగా తెలుసుకున్నాను. ఈ చికిత్సల తదనంతరం డాక్టరుగారి వైఖరిలో ఏదో ఒక మార్పు ఏర్పడిందని ఆయన భార్య ఇప్పుడు చెప్పింది. ‘‘బాబూ! ఆ రోజు మొదలుకొని మీ డాక్టరుగరు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడం మానివేశారు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించేవారు. కుట్రాలానికి వెడదామని ఆయన చెప్పడం కూడా ఈ మార్పు ఫలితమే. మొదట్లో నేను ఆశ్యర్యపోయాను. కాని కుట్రాలానికి వచ్చిన తర్వాత, ఈ మార్పూ మౌనమూ తగ్గిపోతాయని అనుకున్నాను. ఇక్కడికి వచ్చినా ఆయన ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. ఆయన ఏకాంతంగా వుండడం, కొండలకూ కోనలకూ వెళ్లడం చూస్తుంటే నాకేదోలా ఉంది. మీరు కొంచెం ఆయన్ని కనిపెట్టుకుని వుండండి’’ అంది డాక్టరుగారి భార్య. 3 ఒకరోజు డాక్టరుగారిని అనుసరించి వెళ్లాను, ఆయనకు తెలియకుండా. చేతికర్రను టక్ టక్మని నేలమీద మోపుకుంటూ గబగబా నడిచి వెడుతున్నాడు డాక్టరు. వంపులు తిరిగిన దోవ కావడం వల్ల, ఆయన నన్నెక్కడ చూస్తాడో అని పొదల్లోనూ బండరాళ్ల మధ్యగానూ ఒదిగి ఒదిగి నేను ఆయన వెనకాలే వెళ్లాను. మిట్టమధ్యాహ్నం వేళ ఆయన చంపకాటవిని చేరుకున్నాడు. ఒక పొద మాటున చేరి ఆయన్ని నేను పరీక్షగా చూశాను. చంపకాదేవి ఆలయం పక్కన వున్న కొండ చరియలో అందమైన గుహ ఒకటుంది గదా! గలగలమంటూ కిందికి ఉరుకులు వేసే జలపాతం దగ్గర భగవదనుగ్రహం కోసం నిరీక్షించే భక్తుని నిండు మనస్సులా దర్శనమిచ్చే ఆ గుహ చాలామందికి తెలుసు. ఇంకా కొంచెం పైకి నడిస్తే ఆ ప్రాంతంలో అటువంటి చిన్న చిన్న గుహలు మరికొన్ని కనిపిస్తాయి. ఆ కోవకు చెందిన ఒక గుహలో మన డాక్టరుగారు కళ్లు రెండూ మూసుకుని ఆసీనుడయ్యాడు. తంబురా శ్రుతిని స్ఫురణకు తెచ్చే కొండవాగుల మృదు ధ్వని, ఆ ఆధార శ్రుతిలో తమ వివిధ కంఠాలను మేళవింపు జేసి గానం చేస్తున్న పక్షుల కిలకిల రావాలు, ఆ గానానికి మృదంగం వాయిస్తున్నట్లుగా జలపాతం చేసే సవ్వడీ - మధుర గానంలా వినిపిస్తున్నాయి ఆ కొండ మీద. ఆ గానం వింటూ మైమరచి డాక్టర్ ముత్తుకుమారస్వామి కళ్లు మూసుకున్నాడా? లేకపోతే ఆయన అంతరంగం లోలోపలి వాగురలో చిక్కుకుపోయిందా? పొదమాటు నుంచి బయటపడి తొందరగా నడిచాను. ‘‘డాక్టర్... డాక్టర్!’’ సరాసరి డాక్టరు వద్దకు వెళ్లి, ఆయనకెదురుగా కూర్చున్నాను. బెదిరిపోయినవానిలా, ఆయన కళ్లు తెరిచాడు. నా రాక ఆయనకు నచ్చలేదు. ఆయన చూపులు తీక్షణంగా ఉన్నాయి. ‘‘నన్ను క్షమించాలి డాక్టరుగారూ! మీరిలా యిక్కడ ఒంటరిగా కూర్చోవడం, మాటా పలుకూ లేకుండా మౌనముద్ర దాల్చి మీరు సంచరించడం, చూస్తే మాకందరికీ దిగులుగా వుంది. ఇందువల్ల మీ భార్య కూడా దిగులుపడుతోంది.’’ ‘‘మీ దిగులుని అర్థం చేసుకుంటున్నాను. కాని నన్ను విసిగించననీ, నా ప్రయత్నాన్ని వారించననీ మీరు కనక మాట యిస్తే మీతో మాట్లాడతాను. లేకపోతే...’’ ‘‘మిమ్మల్ని విసిగించను. మీరు చెప్పినట్లే మాట యిస్తున్నాను. మీరు చెప్పండి డాక్టరుగారూ...’’ అన్నాను నేను. డాక్టరు చెప్పాడు. ‘‘రాజస్థాన్ నుంచి ఒక కళాకారుల బృందం తమిళదేశం రావడం, తలవని తలంపుగా ఆ బృందం వారికి రైలు ప్రమాదం సంభవించడం, వాళ్లను ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్చడం, వాళ్లకు నేను చికిత్స చేయడం, మొదలైనవి మీరు పత్రికలలో చదివే వుంటారు. ఆ కళాకారుల్లో ముగ్గురికి బలమైన గాయాలు తగిలాయి. వాళ్లకు చికిత్స చేసే బాధ్యత నామీద పడింది. ఇందులో ఒక పెద్ద చిక్కు యేమిటంటే, ముగ్గురిలో ఒకామె స్త్రీ. ఆమెకు కాలు తీసెయ్యాలి. కోసి తీసెయ్యాలి. ఒక యువకుడి కళ్లల్లో గాజు ముక్కలు లోతుగా నాటుకున్నాయి. అందుకు ఒక కంటి డాక్టరు శస్త్ర చికిత్స చేయాలి. అదీ నా పర్యవేక్షణలోనే జరగాలి. మరొకతనికి కుడి చెయ్యి పూర్తిగా తీసివేస్తేనే, అతను బతుకుతాడు. నా సంగతి మీకు తెలిసిందే గదా! శస్త్ర చికిత్స విషయంలో తూర్పు పడమరలు చూస్తూ కాలక్షేపం చేయను. మనుషులు అరటికాయలు, వంకాయలూ అని అనుకునే స్వభావం నాది.’’ ఇలా డాక్టరు చెపుతున్నప్పుడు, నాకు ఆశ్చర్యం కలిగింది. ‘‘ఏవిటండీ డాక్టరుగారూ! మీరలా మాట్టాడుతున్నారు? మీరు శస్త్ర చికిత్స కనక చెయ్యకపోతే, మొదటికే మోసమవుతుంది కదా! అందుకని శస్త్ర చికిత్స చేస్తారు. ఇందులో తప్పేముంది.’’ ‘‘అంతవరకూ, ఆ ముగ్గురికీ శస్త్ర చికిత్స చేసేంతవరకూ, నేనూ అలాగే అనుకున్నాను.’’ ‘‘ఏం! వాళ్లు ముగ్గురూ బతకలేదా?’’ ‘‘వాళ్లు బతికారు. అందుకే నేను విచారిస్తున్నాను. చచ్చిపోయివుంటే, యింతగా విచారించి వుండేవాణ్ని కాను’’ ఇలా అంటున్నప్పుడు డాక్టరుగారి కళ్లు చెమ్మగిల్లాయి. ‘‘డాక్టరుగారూ! మీరు నన్ను తికమక పెడుతున్నారు.’’ ‘‘బాబూ! ఆ ముగ్గురు కళకారులకు స్పృహ తెలిసిన తర్వాత, ఆ మరు క్షణంలోనే వాళ్లు పడ్డ బాధను చూసి, నేనెంత బాధపడ్డానో నీకెలా చెప్పగలను? నేను పడ్డ బాధ, పడుతున్న బాధ, పడబోయే బాధ - వీటికి హద్దులేదు. ఎందుకంటే, నేను కాలు తీసివేసిన స్త్రీ రాజస్థానంలో ప్రసిద్ధికెక్కిన నాట్యగత్తె అట! కళ్లు తీసివేసిన ఆ కళాభిజ్ఞుడు ప్రముఖ చిత్రకారుడు. దయాదాక్షణ్యాలు లేకుండా కుడిచెయ్యి తీసివేసిన వ్యక్తి సుప్రసిద్ధ సారంగి విద్వాంసుడట! రాజస్థాన్ నుంచి వచ్చిన ఆ బృందంలో వీళ్లు ముగ్గురే ముఖ్యులట. నాట్యగత్తెకు కాలే పంచప్రాణాలు; చిత్రకారుడికి కళ్లే ప్రాణం; సారంగి విద్వాంసుడికి జీవితం అతని వాద్యం; వాయించడానికి చెయ్యి-చేతివేళ్లు చాలా అవసరం. వాటినే నేను తీసివేయవలసి వచ్చింది.’’ చెప్పడం పూర్తయిందో లేదో ఆయన కళ్ల వెంబడి ధారగా కన్నీళ్లు జారాయి. ఏం చెప్పాలో నాకేమీ తోచలేదు. ‘‘నాయనా! మనుషుల్ని బతికిస్తున్నాననే వుద్దేశంతో, నేను నా శక్తిలోనూ సేవలోనూ తృప్తి చెందుతున్నాను. మదరాసు నుంచి కుట్రాలానికి వచ్చినా, ఈ సంఘటనను ఆధారం చేసుకుని యముడు నామీద పగ తీర్చుకుంటున్నాడా అనిపిస్తుంది. నేను చేసిన పనికి ఇదొక శిక్ష. ఆ ముగ్గురు కళాకారులకు ప్రాణదానం చేసి, వాళ్లను జీవచ్ఛవాలుగా చేశాను గదా! ఆ దుఃఖం నన్ను మాడ్చివేస్తోంది. నాకు ప్రాణం పోతున్నట్లనిపిస్తోంది. ఆ ముగ్గురు తమ ప్రాణ ప్రాణమైన అంగాలు కోల్పోయినందుకు కన్నీరు మున్నీరుగా దుఃఖించారు. ఆ కన్నీటి వేడిని యీ కుట్రాలం జలపాతం కూడా తగ్గించలేకపోతోంది. ఈ చల్లని తెమ్మెరలు కూడా వేడెక్కిన నా మనస్సుకి చల్లగా తగలడం లేదు. మనస్సులో ఏదో బాధ. దేహ ప్రాణాలలో శక్తి లేదు. ఈ అడవులూ కొండలూ తిరిగి, ఈ ఒంటరితనంలో కళ్లు మూసుకుని నా బాధ నుంచి విముక్తి చెందడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మధురం, మధురం ఏకాంతం’’ అంటారు గద. ఆ ఏకాంతాన్ని వెతుక్కుంటూ యిక్కడికి వచ్చాను. కళ్లు బాగా మూసుకుంటేనైనా, ఆ ఏకాంతం లభిస్తుందేమోనని అనుకుంటున్నాను. కాని అందువల్లా లాభం కలిగించలేదు. కుమిలిపోతున్నాను; కుమిలిపోతున్నాను’’ అన్నాడు డాక్టరు. 4 ఈ సంఘటనకు తర్వాత డాక్టరుగారి వైఖరిలో యింకా గొప్ప మార్పుని చూశాను. అడవిలోకి వెళ్లి, కళ్లు మూసుకుని, ప్రశాంతత కోసం ప్రయత్నించాడు. ఇప్పుడేమో యింట్లోనే కళ్లు మూసుకుని, మౌనముద్ర దాల్చి, ఏకాంతంగా కాలం గడపసాగాడు. ఇది అందరి దిగులునీ యినుమడింపజేసింది. అందువల్ల నేనెక్కడికైనా వెడితే చాలు, బలవంతంగానైనా, డాక్టరుగారిని నాతోపాటు పంపించసాగారు. మదరాసుని గురించి గాని, రోగుల్ని గురించి గాని ఆయన కొంచెమైనా అనుకునేవాడు కాదు. మాకందరికీ ఆయన ఒక మనో వ్యాధిని సంక్రమింపజేయడమే కాక, ఆయన కూడా మహా బాధపడేవాడు. ఇలా ఉండగా, పాళయం కోట నుంచి ఒక వార్త వచ్చింది. రాత్రులలో మదరాసు నగరంలో ఇళ్లల్లో ప్రవేశించి, తుపాకులు చూపి కొల్లగొట్టే గజ దొంగల్లో ముగ్గురు ముఖ్యులు పాళయం కోటలో పట్టుబడ్డారనీ, వాళ్ల వద్ద ఉన్న వస్తువుల్ని సోదా చేయగా మదరాసులో మా యింట్లో ఐదేళ్లకు మునుపు పోయిన కొన్ని వెండి సామాన్లు వాళ్ల వద్ద కనిపించాయనీ, నేను పాళయం కోటకు వెళ్లి ఆ దొంగల్నీ సామాన్లనీ గుర్తుపట్టాలనీ నాకు కబురు అందింది. కారులో బయలుదేరి వెళ్లి, మధ్యాహ్నానికల్లా తిరిగి వచ్చేద్దామనుకున్నాను. బలవంతం చేసి, ఎలాగో డాక్టరుగారిని కూడా బయలుదేరదీశాను. పట్టుబడిన ముగ్గురు దొంగలూ ఘటికులే. తుపాకి గురి చూచి పేల్చడంలో ఒకడు మహా నేర్పరి. అతని కంటిచూపు అటువంటిది. మారు తాళాలతో తాళాలు తీసి, లోపలికి వెళ్లడంలో యింకొకడు సిద్ధ హస్తుడు. మూడోవాడు ఎన్ని బస్తాలనైనా సరే బుజాల మీద మోసుకుని కొన్ని మైళ్లు నిమిషంలో పరిగెత్తగల ఘటికుడు. ఈ ముగ్గురి దర్శన భాగ్యం కలిగింది మాకు పాళయం కోటలో. కాని ఆశ్చర్యమేమిటంటే, నాతోపాటు వచ్చిన డాక్టరుగారిని చూడగానే, వాళ్లు ముగ్గురూ చేతులు జోడించి, ఆయనకు నమస్కరించారు. కాని డాక్టరు నిర్లిప్తంగా ఉండిపోయాడు. అంతసేపూ ఆయన అడవులూ కొండలూ మరిచిపోయి నాతోపాటు వుండడం గొప్ప విషయమనుకున్నాను. ఇక అక్కడ కాలక్షేపం చెయ్యకుండా, మేము కుట్రాలానికి తిరిగి వచ్చేశాము. ‘‘ఈ డాక్టరుగారిని మీరింతకు మునుపే ఎరుగుదురా?’’ అని అడగ్గ, ఈ కింది విషయాలు బయటపడ్డాయి. పెక్కు సందర్భాలలో రకరకాల చిక్కులలో రకరకాల పేర్లతోనూ రకరకాల వంకలతోనూ ఈ ముగ్గురు దొంగలు ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందారు. ముఖ్యంగా చెప్పవలసిన సంఘటన యేమిటంటే; కన్నాలు వేసే దొంగ కణ్ణుస్వామి ఒకసారి పైనుంచి కిందపడి, చెయ్యి విరిగిన స్థితిలో ఆసుపత్రికి వచ్చాడు. అతని చేతిని సరిచేసి, బాగుచేసి, చేతిని మళ్లీ పెకైత్తేటట్లు చేసిన ఘనత డాక్టరు ముత్తుకుమారస్వామికి దక్కింది. ఆ చెయ్యే యిప్పుడు కన్నాలు వెయ్యడానికి ఉపకరిస్తూంది. తుపాకీ వీరుడు దొరసామి ఎటువంటి వాడనుకున్నారు! ఒకసారి జరిగిన ఘోర ప్రమాదంలో వాడి కంట్లో ఒక సూది గుచ్చుకుంది. కన్ను పాడు కాకుండా, చూపు చెడిపోకుండా, ఆ కంటిని బాగుచేయడం జరిగింది. ఎవరనుకున్నారు? ఇంకెవరు? డాక్టరు ముత్తుకుమారస్వామీ, ఆయనకు తోడ్పడ్డ ఒక కంటి డాక్టరూను. బస్తాలు అనాయాసంగా మోసే పహిల్వాన్ ముత్తుపక్కిరి? ఆ మూడో దొంగ ఎలాంటివాడని! ఒకప్పుడు తిండికి గతిలేక, నల్లుల మందు తిని, ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. ముత్తుకుమారస్వామి మనుషుల్ని చావనిస్తాడా మరి! వాడికి ప్రాణ దానం చేసి కాపాడడమే కాకుండా, వైటమిన్ మాత్రలతో వాడి కడుపు నింపి, వాణ్ని లోకంలోకి పంపించాడు. కంటిచూపు పొందిన తుపాకీ వీరుడు దొరసామి యిప్పుడు బాగా గురిచూసి తుపాకీ పేలుస్తున్నాడు. చెయ్యి బాగయిన కణ్ణసామి కన్నాలు వేయడంలో ఘటికుడనిపించుకున్నాడు. పహిల్వాన్ పక్కిరి డాక్టరిచ్చిన ఉత్సాహంతో తన వృత్తిని మహా నేర్పుగా సాగిస్తున్నాడు. ఈ ముగ్గురి వద్దా కనిపించిన వెండి సామాన్లు మావని తేలాయి. 5 పోలీసుల వద్ద నుంచి యీ విషయాదికం తెలుసుకున్న ఆ మరునాడే డాక్టరు ముత్తుకుమారస్వామి మదరాసుకి ప్రయాణమైనాడు. ‘‘ఏవిటి డాక్టరుగారూ! ఉన్నట్టుండి ప్రయాణమయ్యారు?’’ అని అడిగాను ఆశ్చర్యంగా, ఆశగా. ‘‘ఒక్క నెలరోజులుగా నేను నా రోగుల్ని మరిచిపోయి, నేనే జబ్బుపడ్డాను. ఇప్పుడు నా జబ్బు నయమయింది. ఇక నా రోగుల వ్యాధుల్ని పరిశీలించాలి. నా కోసం ఎందరు ఎదురుచూస్తున్నారో మదరాసులో!’’ ‘‘ఏమంటున్నారు మీరు?’’ ‘‘నాట్యగత్తె కాలు తీసివేసినందుకూ, చిత్రకారుని కళ్లు తీసివేసినందుకూ, సారంగి విద్వాంసునికి చెయ్యి తీసివేసినందుకూ నేనింతవరకూ చాలా బాధపడ్డాను, దుఃఖించాను. కానీ యిప్పుడు నేను విన్నదేవిటి! కష్టపడి కళ్లిచ్చాను ఒకడికి. కాళ్లూ చేతులూ బాగు చేశాను మరి యిద్దరికి. వాళ్లిప్పుడు ఏం పనులు చేస్తున్నారో విన్నావుగా? వాటిని తీసివేసినందుకూ నేనే బాధ్యుణ్ని; అలాగే బాగుచేసినందుకూ నేనే బాధ్యుణ్ని. ఏమంటారు?’’ డాక్టర్ ఒక్క క్షణం కళ్లు మూసుకుని మళ్లీ ఇలా అన్నాడు. ‘‘నాయనా, నా వృత్తి శస్త్ర చికిత్స చెయ్యడం. అంతకుమించి నా మెదడు పనిచెయ్యకూడదు. నా బాధ్యత నా వృత్తి నిర్వహణతో పూర్తయినట్లే. దేవుడు చేసే పనిని నేను చేస్తున్నట్టు అనుకోవడం అవివేకం. కళ్లూ కాళ్లూ చేతులూ తీసివెయ్యడం, బాగుచెయ్యడం వైద్య శాస్త్ర రీత్యా చేసే ఒక చికిత్స; పని. ఈ అంగాలను సద్వినియోగమో దుర్వినియోగమో చేసుకోవడం, దేనికి ఎంత కాలం వినియోగించాలో - ఇటువంటివి నా చేతిలో లేవు. అదంతా లలాట లిఖితం’’ అన్నాడు డాక్టరు. ‘‘లలాట లిఖితాన్ని మార్చడమే గదా మీ పని?’’ ‘‘కాదు. కాని అలా అనుకున్నాను కొన్ని రోజులు. అది తప్పు. చావు పుట్టుకలు, రోగాలు రొప్పులూ అవి లేకపోవడం - ఇవన్నీ వైద్య శాస్త్రానికి భిన్నంగా పరిశోధించడం అవివేకం. భగవల్లీలలను పరిశీలించడానికి పూనుకుంటే, డాక్టరుకే జబ్బు చేస్తుంది. ఆ తర్వాత దానికి మందు లేదు. రండి. జలపాతంలో స్నానం చేసి నేను మదరాసుకి బయలుదేరాలి. రోగులెంతమందో నాకోసం ఎదురుచూస్తూ వుంటారు. నా విద్యుక్త ధర్మం నన్ను పిలుస్తోంది.’’ ఇలా అంటూ కాల ప్రవాహమైన జలపాతం గట్టు వెంబడి నడక సాగించాడు డాక్టరు ముత్తుకుమారస్వామి. - సోము -
కొండ దిగలేక వెనక్కి మళ్లిన జలపాతం
లండన్: కొండ దిగే జలపాతాల గురించి విన్నాంకానీ, కొండ ఎక్కే జలపాతాన్ని గురించి ఎప్పుడైనా విన్నామా.. సాధారణంగా వాటర్ పాల్స్ అంటే ఎత్తైన కొండ ప్రాంతం నుంచి నురగలు కక్కుతూ కిందపడుతున్న నీటి దృశ్యం మదిలో మెదులుతుంది. కానీ, అలాకాకుండా కిందపడే నీరు కాస్త కిందికి చేరకుండానే తిరిగి వెనక్కి వెళ్లి కొండపైకి ఎక్కడాన్ని ఊహించుకోగలమా.. సరిగ్గా బ్రిటన్‌లో అదే జరిగింది. ఎంతో వేగంగా కొండ నుంచి జాలువారుతున్న ఒక్కసారిగా తన మార్గాన్ని వెనక్కి మరల్చుకొని అదే వేగంతో కొండమీదకు ఎక్కింది. ఇలా ఎందుకు జరిగిందని అనుకుంటున్నారా.. మరేం లేదు గత కొద్ది రోజులుగా బ్రిటన్ లోని పీక్ అనే జిల్లాలో పెనుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వీటి ప్రభావానికి ఆయా ప్రాంతాలకు చెందిన పౌరులంతా తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. భారీ స్థాయిలో వరదలు కూడా వస్తున్నాయి. ఈ సందర్భంగా అక్కడి పరిసర ప్రాంతాలకు అతి కష్టం మీద వీడియో కెమెరాతో బలంగా వీస్తున్న గాలుల మధ్యనే వెళ్లిన ఓ వ్యక్తికి అద్భుత దృశ్యం కనిపించింది. బలంగా వీస్తున్న గాలులకారణంగా ఓ జలపాతం వద్ద కిందకు పడాల్సిన నీరు కాస్త.. వేగంగా వెనక్కి మళ్లీ తిరిగి కొండపైకి చేరుతూ దర్శనమిచ్చింది. అంతే ఆ వీడియోను రికార్డు చేసి ఆన్ లైన్లో పెట్టగా ఇప్పుడది హల్ చల్ చేస్తోంది. -
జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృత్యువాత
వాజేడు: స్నేహితులతో కలసి విహార యాత్రకు వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృత్యువు కాటేసింది. ఖమ్మం జిల్లా వాజేడులో బుధవారం ఈ ఘటన జరిగింది. వరంగల్‌లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న కస్కర్ల నవీన్ (21) ముగ్గురు స్నేహితులతో కలిసి బొగట జలపాతం వద్దకు విహారానికి వెళ్లాడు. సాయంత్రం 5గంటల సమయంలో స్నేహితులంతా కలసి జలపాతంలో స్నానాలు చేస్తుండగా నవీన్ కాలుజారి ప్రవాహంలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సమాచారం అందుకున్న వాజేడు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం నవీన్ మిత్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చండీగఢ్‌లో విశాఖ జిల్లా వాసి మృతి
చోడవరం : విశాఖ జిల్లా చోడవరం మండలం పీఎస్ పేట గ్రామానికి చెందిన యువకుడు చండీగఢ్ రాష్ట్రంలోని ఓ జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. పీఎస్ పేట గ్రామానికి చెందిన కూనిశెట్టి కుమార్(21) చండీగఢ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఓ జలపాతం చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని వాయుసేన విభాగం అధికారులు ఆదివారం రాత్రి కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించనున్నట్టు సమాచారం. -
టూకీగా ప్రపంచ చరిత్ర - 62
రచన: ఎం.వి.రమణారెడ్డి జాతులు నుడికారాలు ఇక, భాష విషయానికి వస్తే - భూగోళం మీద మానవుని విస్తరణ జాతిమూలాలకు కారణమైనట్టే, అదే విస్తరణ భాషాభేదాలకు గూడా కారణమయింది. పరిమితమైన పదాలు తప్ప, విస్తృతమైన భాషతో ఆదిమమానవునికి అవసరం కలిగుండదు. కొత్తతావులకు చేరుకున్నప్పుడు అక్కడ కనిపించే కొత్తరకం చెట్టూ చేమా, జంతువులూ, వేటాడే విధానంలో మార్పులూ, ఆయుధాల ఆధునీకరణా మొదలైన అంశాలనేకం క్రమక్రమంగా మాటల సంఖ్యలను పెంచుకునేందుకు దోహదం చేశాయి. విడతవిడతకూ ఏ గుంపుకాగుంపు, పుట్టినచోటును వదిలేసి తిరిగిరాలేనంత దూరాలకు చేరుకోవడంతో, ఒక చోట పుట్టిన మాటలు మరొకచోటికి చేరుకునే అవకాశం లేక, నుడికారంలో పోల్చుకోలేనంత పెద్ద ఎత్తున వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు - ‘జలపాతం’ అనే దృశ్యం ఎక్కడబడితే అక్కడ కనిపించేది కాదు. దాని పరిసరాలకు చేరుకున్న గుంపుకు మాత్రమే ఆ దృశ్యాన్ని తమలో తాము వ్యవహరించుకునేందుకు కొత్త మాటను సృష్టించుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది. పదహారవ శతాబ్దంలోనో అంతకుముందో పుట్టిన పాశ్చాత్య రచనల్లో ‘పులి’ అనే జంతువు ప్రస్తావనగానీ, ఆ మాటకు సమానార్థకమైన మరో మాటగానీ మనకు కనిపించదు. ఎందుకంటే, ఆ ప్రాంతాల్లో ఆ జంతువు లేదుగాబట్టి. పులిని భారత ఉపఖండంలో చూసిందాకా అక్కడివాళ్ళకు దాన్ని గురించి తెలీనేతెలీదు. పదహారవ శతాబ్దంలోనో అంతకుముందో పుట్టిన పాశ్చాత్య రచనల్లో ‘పులి’ అనే జంతువు ప్రస్తావనగానీ, ఆ మాటకు సమానార్థకమైన మరో మాటగానీ మనకు కనిపించదు. ఎందుకంటే, ఆ ప్రాంతాల్లో ఆ జంతువు లేదుగాబట్టి. అందుకే వాళ్ళ సాహిత్యంలో శౌర్యానికి ప్రతీకగా ‘సింహం’ కనిపిస్తుంది. పులిని భారత ఉపఖండంలో చూసిందాకా అక్కడివాళ్ళకు దాన్ని గురించి తెలీనేతెలీదు. అంతేగాదు, రుగ్వేదంలోనూ ‘పులి’ కనిపించదు. ఆర్యులు సింధూనది పరిసరాలకు చేరుకున్న తరువాత ఉద్భవించిన వాఙ్మయంలో మాత్రమే ‘వ్యాఘ్రం’ అనే పదం కనిపిస్తుంది. సాహిత్యపరంగా మనకు సింహం తెలిసుండొచ్చుగానీ, ఆ జంతువు ఈ ప్రాంతాల్లో లేదు. అందుకే తెలుగులో ఇప్పటికీ ‘పులిబిడ్డ’ అనే మాటే శౌర్యానికి ప్రతీకగా కొనసాగుతూంది. ‘కొదమసింహం’, ‘సింగపుకూన’ అనేవి అరువు తెచ్చుకున్న ప్రయోగాలు. భాష సాహిత్యంగా ఎదిగి, ఆ సాహిత్యం అన్నిచోట్లకు చేరుకోవడం మొదలైన తరువాత రకరకాల దృశ్యాలూ, పలురకాల సంఘటనలూ, వాటి సంబంధించిన వర్ణనలూ మానవాళి ఆలోచనకు చేరువై, ఊహల్లో ఇమిడిపోయిన తరువాతి తరాలకు ఇంతదాకా చెప్పిందంతా చోద్యంగా కనిపించొచ్చు. ‘జలపాతం’ దృశ్యాన్ని మెదడులో ఇమిడించుకోవడం మినహా, దాన్ని కంటితో చూడని జనాలు ఈనాటికీ కోట్లల్లో మిగిలున్నారని తెలుసుకుంటే ఆ విడ్డూరం తొలగిపోతుంది. రేడియో, సెల్‌ఫోన్, టీవీ వంటి పదాలకు ఆయా వస్తువులు ఉనికిలోకి వచ్చిన తరువాత మాత్రమే భాషలో చోటు ఏర్పడింది తప్ప, అవి లేకుండా ఆ మాటలు పుట్టుకురాలేదు. జాతులు పుట్టుకనూ, భాషల్లోని వ్యత్యాసాలూ పోలికలనూ చెప్పుకుంటూపోతే ఎంత దూరమైన సాగుతుందిగానీ, ఇప్పుడు మనకు అవసరమయింది చరిత్రను తెలుసుకునేందుకు చాలినంత ప్రాథమిక అవగాహనే కాబట్టి, ఈ చర్చను ప్రస్తుతానికి ఆపేద్దాం. మరింత లోతైన పరిశీలనకు ఉత్తరోత్తరా అవసరం ఏర్పడితే, తతిమ్మా వివరాలు అప్పుడు తెలుసుకుందాం.