చైనాకు శత్రువులు ఎక్కడో లేరు. ఆ దేశ యువత రూపంలో ఆ భూభాగంలోనే ఉన్నారు. ఇంతకీ ఏం చేస్తున్నారని అంత మాట అన్నారంటారా?.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా తమ దేశం పరువును ఎప్పటికప్పుడు తీసిపారేస్తున్నారు మరి.
యుంటాయ్ జలపాతం.. చైనాలోనే అతిపెద్ద జలపాతంగా ఓ రికార్డు ఉంది. దీనిని ఆసియాలోనే అతిపెద్ద వాటర్‌ఫాల్‌గా చైనా ప్రమోట్ చేసుకుంటోంది కూడా. హెనాన్ ప్రావిన్స్‌లో యుంటాయ్ పర్వతాల నడుమ పచ్చని శ్రేణుల్లో సుమారు 314 మీటర్ల(1,030 ఫీట్ల) ఎత్తు నుంచి నీటి ధార కిందకు పడే దృశ్యాలు.. చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. లక్షల మంది సందర్శకులతో పర్యాటకంగానూ ఈ జలపాతం విశేషంగా నిలుస్తుంటుంది కూడా. అలాంటి జలపాతం విషయంలో షాకింగ్ విషయం వెలుగు చూసిందిప్పుడు.
అంత ఎత్తు నుంచి పైపులతో నీటిని కిందకు గుమ్మరిస్తుందనే నిజం బయటపడింది. కొందరు యువకులు.. యుంటాయ్ పర్వత్వాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడ వాళ్లు ఆ పైపుల్ని గమనించి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంకేం.. చైనా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో యుంటాయ్ జియో పార్క్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
Chinese officials have been forced to apologise, after a hiker's video revealed that China's highest waterfall may be supplied by a water pipe.
The video, on Douyin app, showed the flow of water from the Yuntai Mountain Waterfall coming from a pipe built into the rock face.
🧵1 pic.twitter.com/O8DodMnn1L— BFM News (@NewsBFM) June 7, 2024
వర్షాధార జలపాతం అయిన యుంటాయ్‌కి వేసవి కాలంలో వచ్చిన పర్యాటకుల్ని నిరాశకు గురి చేయడం ఇష్టం లేకనే అక్కడి నిర్వాహకులు ఈ పని చేస్తున్నారంట. అయితే అప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసిపోయింది.
గతంలో కరోనా టైంలో వైరస్ కట్టడి పేరిట అక్కడి ప్రభుత్వం సాగించిన దమనకాండ గుర్తుండే ఉంటుంది. ఆ టైంలోనూ సోషల్ మీడియా ద్వారా అక్కడి సంగతులు బయటి ప్రపంచానికి తెలిశాయి. అలాగే.. గ్జియాపు కౌంటీ గ్రామం విషయంలోనూ చైనా సృష్టించిన ఫేక్ ప్రపంచం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment