pipe
-
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
చైనాకు శత్రువులు ఎక్కడో లేరు. ఆ దేశ యువత రూపంలో ఆ భూభాగంలోనే ఉన్నారు. ఇంతకీ ఏం చేస్తున్నారని అంత మాట అన్నారంటారా?.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా తమ దేశం పరువును ఎప్పటికప్పుడు తీసిపారేస్తున్నారు మరి.యుంటాయ్ జలపాతం.. చైనాలోనే అతిపెద్ద జలపాతంగా ఓ రికార్డు ఉంది. దీనిని ఆసియాలోనే అతిపెద్ద వాటర్‌ఫాల్‌గా చైనా ప్రమోట్ చేసుకుంటోంది కూడా. హెనాన్ ప్రావిన్స్‌లో యుంటాయ్ పర్వతాల నడుమ పచ్చని శ్రేణుల్లో సుమారు 314 మీటర్ల(1,030 ఫీట్ల) ఎత్తు నుంచి నీటి ధార కిందకు పడే దృశ్యాలు.. చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. లక్షల మంది సందర్శకులతో పర్యాటకంగానూ ఈ జలపాతం విశేషంగా నిలుస్తుంటుంది కూడా. అలాంటి జలపాతం విషయంలో షాకింగ్ విషయం వెలుగు చూసిందిప్పుడు. అంత ఎత్తు నుంచి పైపులతో నీటిని కిందకు గుమ్మరిస్తుందనే నిజం బయటపడింది. కొందరు యువకులు.. యుంటాయ్ పర్వత్వాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడ వాళ్లు ఆ పైపుల్ని గమనించి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంకేం.. చైనా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో యుంటాయ్ జియో పార్క్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.Chinese officials have been forced to apologise, after a hiker's video revealed that China's highest waterfall may be supplied by a water pipe.The video, on Douyin app, showed the flow of water from the Yuntai Mountain Waterfall coming from a pipe built into the rock face.🧵1 pic.twitter.com/O8DodMnn1L— BFM News (@NewsBFM) June 7, 2024వర్షాధార జలపాతం అయిన యుంటాయ్కి వేసవి కాలంలో వచ్చిన పర్యాటకుల్ని నిరాశకు గురి చేయడం ఇష్టం లేకనే అక్కడి నిర్వాహకులు ఈ పని చేస్తున్నారంట. అయితే అప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసిపోయింది.గతంలో కరోనా టైంలో వైరస్ కట్టడి పేరిట అక్కడి ప్రభుత్వం సాగించిన దమనకాండ గుర్తుండే ఉంటుంది. ఆ టైంలోనూ సోషల్ మీడియా ద్వారా అక్కడి సంగతులు బయటి ప్రపంచానికి తెలిశాయి. అలాగే.. గ్జియాపు కౌంటీ గ్రామం విషయంలోనూ చైనా సృష్టించిన ఫేక్ ప్రపంచం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. -
రష్యాలో విషాదం: వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి!
రష్యాలోని మాస్కోలో ఒక షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మంది గాయపడ్డారు. టాస్ అనే వార్తా సంస్థకు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ ఈ విషయాన్ని తెలియజేశారు. షాపింగ్ మాల్లో జరిగిన ప్రమాదం నలుగురి ప్రాణాలను బలిగొందని మేయర్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు, స్నేహితులకు సంతాపం తెలిపారు. తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరిక.. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మాల్లోని పైపు పగిలిపోవడంతో మాల్లోని కొంత భాగంలోకి వేడినీరు ప్రవేశించింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. మరో 20 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక వైద్య అధికారి.. టాస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పైపు పగిలిపోవడంతో పది మంది వేడి నీళ్ల బారిన పడ్డారని, వారిలో తొమ్మిది మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు ఈ ఉదంతంపై రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. నలుగురు నిందితులపై గ్రూప్ క్రిమినల్ కేసు పెట్టామని ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి యులియా ఇవనోవా మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్ నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించింది. ఇది కూడా చదవండి: బైడెన్‌పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు -
ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో దారుణం
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మలసత్రం సమీపంలో ఉన్న ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికుడు జమాల్‌బాషాను ఫ్యాక్టరీ యాజమాన్యం ఐదు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితుడు జమాల్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన అతను కొన్నేళ్లుగా ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. కార్మికులకు యాజమాన్యం అక్కడే భోజనాలు పెడతారు. జమాల్‌బాషా తనకు పరిచయం ఉన్న బియ్యం వ్యాపారితో ఫ్యాక్టరీకి బియ్యం సరఫరా చేయిస్తున్నాడు. బియ్యం వ్యాపారి నుంచి జమాల్‌బాషా కమీషన్ తీసుకుంటున్నట్లు అనుమానించి ఫ్యాక్టరీ మేనేజర్ శేషిరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ మహేశ్వరరెడ్డిలు గత శుక్రవారం దాడి చేశారు. ఫ్యాక్టరీలోని ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. విషయం తెలుసుకున్న భార్య పర్వీన్ ఫ్యాక్టరీ ఎండీ సుజల వద్దకు వెళ్లి తన భర్తను విడిచి పెట్టాలని కోరింది. రూ.15 లక్షలు చెల్లిస్తేనే విడిపిస్తామని చెప్పడంతో పర్వీన్ బంధువుల సహాయంతో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు జమాల్‌ను విడిపించి కారకులపై కేసు నమోదు చేయాలని నంద్యాల జిల్లా పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి జమాల్‌బాషాను విడిపించారు. బాధితుని ఫిర్యాదు మేరకు యాజమాన్యంపై కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం రాత్రి తెలిపారు. చదవండి: (అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్) -
పైపులో ఇల్లు!
సొంతిల్లు చాలా మంది మధ్యతరగతి కుటుంబీకుల కల. భవన నిర్మాణం చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న వ్యవహారం. అందుకోసమే చాలా మంది సివిల్ ఇంజనీర్లు తక్కువ ధరకు ఎక్కువ మన్నిక గల ఇంటి డిజైన్లు రూపొందించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ కోవలోనిదే హాంకాంగ్‌కు చెందిన జేమ్స్ లా సైబర్‌టెక్చర్ కంపెనీ. ఈ కంపెనీ ఇంటి నిర్మాణానికి సరికొత్త భాష్యం చెప్పింది. వినూత్నంగా చిన్నపాటి ఇంటిని కట్టిచూపించారు. వాడేసిన సిమెంట్ పైపులనే అందమైన ఇంటిగా మార్చేశారు. ఈ ఇంటిలో ఇద్దరు సౌకర్యవంతంగా నివసించొచ్చని, దాదాపు వెయ్యి చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. సోఫా, బెడ్, కిచెన్, చిన్నపాటి ఫ్రిజ్, బాత్రూం, షవర్ ఇలా సకల సదుపాయాలు ఇందులో ఉంటాయని చెబుతోంది. కొన్నిసార్లు ఇళ్ల మధ్య మిగిలిన ఖాళీ స్థలంలో కూడా వీటిని కట్టుకునేందుకు, ముఖ్యంగా నగరాల్లో ఖాళీ స్థలాల్లో ఎక్కువ ప్రదేశం వేస్ట్ కాకుండా వీటిని నిర్మించవచ్చు. -
పైపులు వీక్.. గ్యాస్ లీక్
ఒకే చోట ఏడు బావులు ధర్నాకు దిగిన గ్రామస్తులు అంతర్వేదికర (సఖినేటిపల్లి) : గ్రామంలోని రక్షణలేని ఓఎన్జీసీ బావులతోను, తుప్పుపట్టిన పైపులైన్లు, పైపుల జాయింట్‌లతోను ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బావులు వద్ద శాశ్వత రక్షణ చర్యలు చేపట్టకపోవడం, తుప్పు పట్టిన జాయింట్లను తొలగించకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాల్లో సంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, అటుపై వీటి గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా గ్యాస్ లీకేజీ .. గ్రామంలోని దిండమెరక, బెల్లంకొండ గ్రూపులకు సమీపంలో మంగళవారం ఉదయం కేవీ 10 బావి నుంచి లీకయిన గ్యాస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక్కడ ఈ బావితో పాటు మరో ఆరు బావుల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగిస్తోంది. బావి ముఖ ద్వారం పైపు జాయింట్ నట్లు తుప్పు పట్టి ఊడిపోయి, గ్యాస్ బావి వద్ద నుంచి లీకవ్వడం గ్రామస్తులు బెంబేలెత్తి పోయారు. సుమారు 45 నిమిషాల పాటు లీకయిన ఈ గ్యాస్ బావులన్నింటినీ కమ్మేసింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్ సిబ్బంది బావి వద్దకు వచ్చి గ్యాస్ లీకేజీని అరికట్టారు. బావి వద్ద, మోరి జీసీఎస్ వద్ద గొట్టాలను మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ధర్నాకు దిగిన గ్రామస్తులు.. తరుచూ గ్రామంలోని బావులు వద్ద, పొలాల్లోని వెళ్లిన పైపుల నుంచి లీకవుతున్న గ్యాస్ వల్ల తమకు భద్రత లేకుండా పోయిందని గ్రామస్తులు ఏడు బావులున్న ఓఎన్జీసీ సైటులో ధర్నాకు దిగారు. గ్యాస్ లీకేజీలను ముందుగా పసిగట్టే ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, గ్యాస్ లీకేజీల వల్ల దెబ్బతింటున్న పంటలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బెల్లంకొండ నాని, రావి ఆంజనేయులు, చొప్పల బాబూరావు, చెన్నంశెట్టి సుబ్బారావు, బీ వెంకటేశ్వరరావు, బి.రాజు, తోట వెంకటేశ్వర్లు, రావి వాసు, శ్రీను, విష్ణు, బి. పద్మాజీరావు పాల్గొన్నారు.