సొంతిల్లు చాలా మంది మధ్యతరగతి కుటుంబీకుల కల. భవన నిర్మాణం చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న వ్యవహారం. అందుకోసమే చాలా మంది సివిల్ ఇంజనీర్లు తక్కువ ధరకు ఎక్కువ మన్నిక గల ఇంటి డిజైన్లు రూపొందించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ కోవలోనిదే హాంకాంగ్‌కు చెందిన జేమ్స్ లా సైబర్‌టెక్చర్ కంపెనీ. ఈ కంపెనీ ఇంటి నిర్మాణానికి సరికొత్త భాష్యం చెప్పింది. వినూత్నంగా చిన్నపాటి ఇంటిని కట్టిచూపించారు. వాడేసిన సిమెంట్ పైపులనే అందమైన ఇంటిగా మార్చేశారు.
ఈ ఇంటిలో ఇద్దరు సౌకర్యవంతంగా నివసించొచ్చని, దాదాపు వెయ్యి చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. సోఫా, బెడ్, కిచెన్, చిన్నపాటి ఫ్రిజ్, బాత్రూం, షవర్ ఇలా సకల సదుపాయాలు ఇందులో ఉంటాయని చెబుతోంది. కొన్నిసార్లు ఇళ్ల మధ్య మిగిలిన ఖాళీ స్థలంలో కూడా వీటిని కట్టుకునేందుకు, ముఖ్యంగా నగరాల్లో ఖాళీ స్థలాల్లో ఎక్కువ ప్రదేశం వేస్ట్ కాకుండా వీటిని నిర్మించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment