జలపాతాన్ని తలపించిన బిల్డింగ్‌! | Cuffe Parade Skyscraper Turns Waterfall | Sakshi
Sakshi News home page

జలపాతాన్ని తలపించిన బిల్డింగ్‌!

Published Wed, Sep 4 2019 3:39 PM | Last Updated on Wed, Sep 4 2019 4:01 PM

Cuffe Parade Skyscraper Turns Waterfall - Sakshi

ముంబై : నగరంలోని కఫే పరేడ్‌ ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌ జలపాతాన్ని తలపించింది. బిల్డింగ్‌ పై నుంచి నీరు కారుతున్న వీడియో చూపరులను ఆకట్టుకుంది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఓ నెటిజన్‌ ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశాడు. ‘వాటర్‌ ఫాల్స్‌ ఇన్‌ న్యూ కఫే పరేడ్‌’అంటూ పేర్కొన్నాడు.  ఈ వీడియో  వైరల్‌గా మారడంతో.. భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని చాలా మంది  భావించారు.

అయితే భారీ వర్షాల కారణంగా బిల్డింగ్‌పై వర్షపు నీరు కిందకు వచ్చిందనే వార్తలను సదురు బిల్డింగ్‌ నిర్వాహకులు ఖండించారు. బిల్డింగ్‌పై ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త వాటర్‌ ట్యాంక్‌ను పరీక్షిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వారు తెలిపారు. వాటర్‌ ట్యాంక్‌కు లీక్‌ ఏర్పడటంతో నీరు కిందకు ప్రవహించిందని పేర్కొన్నారు. 

మరోవైపు భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు చెరవులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement