కిర్గిస్తాన్‌లో అనకాపల్లికి చెందిన వైద్య విద్యార్థి దాసరి చందు కన్నుమూత
కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల వైద్య విద్యార్థి దాసరి చందు కన్నుమూశారు. ఈ విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన కిర్గిస్థాన్‌లో కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీలో పరీక్షలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఆదివారం జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. అయితే గడ్డకట్టిన నీడిలో చిక్కుకుని మృతి చెందాడు.
తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి చేరేలా సాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించినట్లు చందు తల్లిదండ్రులు తెలిపారు. కేంద్ర మంత్రి కిర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, మృత దేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి తెలిపారు. కాగా చందు తండ్రి అనకాపల్లిలో హల్వా అమ్మే భీమరాజు. భీమరాజు రెండో కుమారుడు చందు.
Comments
Please login to add a commentAdd a comment