Kyrgyzstan
-
కిర్గిజిస్తాన్ భద్రమేనా!
ఉపాధి కోసమో, విద్యార్జన కోసమో మనదికాని చోటుకు పిల్లలను పంపినప్పుడు కన్నవాళ్ల హృదయం వారి కోసం నిత్యం ఆరాటపడుతుంది. సక్రమంగా ఉన్నారా, తిన్నారా అన్న ఆలోచనలే అనుక్షణమూ వారిని వేధిస్తుంటాయి. ప్రపంచం మునపట్లా లేదు గనుక ఇటువంటి భయాందోళనలు ఇప్పుడు మరింత పెరిగాయి. దేశంలో ఉన్నత విద్యారంగం, మరీ ముఖ్యంగా వైద్య విద్య బాగా విస్తరిస్తే అందరికీ అందుబాటులోకొస్తే మన విద్యార్థులు దూరతీరాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలా లేకపోబట్టే విద్యార్థులు అనుకోకుండా జరిగే పరిణామాల్లో చిక్కుకుని అవస్థలు పడాల్సివస్తోంది. రెండున్నరేళ్లక్రితం ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి తెగబడినప్పుడు అక్కడి మన వైద్య విద్యార్థులు ప్రాణాపాయంలో చిక్కుకోవటం, ఇబ్బందులు పడటం చూశాం. మన దేశంతోపాటు అన్ని దేశాలూ తమ తమ విద్యార్థులను సురక్షితంగా వెనక్కు తీసుకెళ్లగలిగాయి. సరిగ్గా వారం క్రితం కిర్గిజిస్తాన్లోనూ విద్యార్థులకు సమస్య ఎదురైంది. ఈనెల 13న పాకిస్తాన్, ఈజిప్టు విద్యార్థులతో ఏర్పడిన తగవు ఆసరా చేసుకుని వందలాదిమంది స్థానికులు విద్యార్థుల హాస్టళ్లపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. అనేకమంది విద్యార్థులను గాయపరిచారు. విద్యార్థినులను సైతం వేధించటం, దౌర్జన్యం చేయటంతో ఎప్పుడేమవుతుందో తెలియక విద్యార్థులంతా ఏడెనిమిది గంటలపాటు చీకటి గదుల్లో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులు రంగంలోకి దిగినా దుండగులను అదుపు చేయలేకపోయారు. ఆ తర్వాత అరెస్టులు జరిగాయి. అది వేరే సంగతి. హాస్టళ్లకూ, విదేశీ విద్యార్థులుండే అపార్ట్మెంట్లకూ రక్షణ కల్పిస్తున్నారు. కానీ ఘటన జరిగివారం కావస్తున్నా ఎక్కడా భయాందోళనలు చల్లారలేదు. దాంతో స్వస్థలాలకు పోవటమే ఉత్తమమని శుక్రవారం కూడా వందలాదిమంది పాకిస్తానీ విద్యార్థులు ఇంటి బాట పట్టారు. వారి ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. మన విదేశాంగశాఖ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బిషెక్‌లోని మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడి భాష, సంస్కృతీ సంప్రదాయాలు, పద్ధతులపై అవగాహన పెంచుకుని వాటిని గౌరవించటం అలవాటు చేసుకోవాలి. తమ దేశానికి చెందినవారితోనే సన్నిహితంగా మెలగటం, స్థానికులను చిన్నచూపు చూసే స్వభావం అనవసరమైన అపార్థాలకు దారితీస్తుంది. తమ సంస్కృతే ఘనమైనదని, ఇతరులు అల్పులన్న భావన స్వదేశంలో ఎంతోకొంత చెల్లుబాటవుతుంది. వేరేచోట మాత్రం సమస్యలు తెస్తుంది. దీన్ని గుర్తించబట్టే విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్థానికులతో కలిసిమెలిసివుండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. కిర్గిజిస్తాన్‌లో మూడేళ్లక్రితం కూడా గొడవలు జరిగాయి. అప్పుడూ ఇప్పుడూ కూడా పాకిస్తాన్ విద్యార్థులే గొడవలకు కారకులయ్యారు. రౌడీయిజం, స్థానిక సంప్రదాయాలను కించపరచటం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనటం వంటివి సమస్యలు తెచ్చిపెడుతున్నాయన్నది స్థానికుల ఆరోపణ. సాధారణంగా ఒకరిద్దరి ప్రవర్తన వల్ల గొడవ జరిగితే అది వారికే పరిమిత మవుతుంది. ఎవరో ఒకరి జోక్యంతో అంతా సద్దుమణుగుతుంది. కానీ సామాజిక మాధ్యమాల హవా పెరగటం, ఆ గొడవ తాలూకు వీడియో క్షణాల్లో అందరికీ చేరటం భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. ఉద్రిక్తతలు రేపుతోంది. దీనికితోడు విదేశీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తమకు లేకపోవటం, వారి జీవన ప్రమాణాలు మెరుగ్గా కనబడటం ఆర్థికంగా అంతంతమాత్రంగా బతుకీడ్చే స్థానికులకు సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది. తమను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తూ విదేశీ విద్యార్థులను అందలం ఎక్కించటం అసంతృప్తికి దారితీస్తుంది. పుండు మీద కారం జల్లినట్టు వారిని కించపరచటం లాంటి చేష్టలకు పాల్పడితే ఇక చెప్పేదేముంది? ఇలాంటి సమయాల్లో కారకులెవరన్న విచక్షణ ఉండదు. విదేశీయులందరినీ ఒకే గాటనకడతారు. కనుక ఎవరికి వారు పద్ధతిగా ఉంటే సరిపోదు. తోటి విద్యార్థులపై ఓ కన్నేసివుంచాలి. సమస్య తలెత్తవచ్చన్న సందేహం కలిగితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నిజానికి మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్ వేరే దేశాలతో పోలిస్తే ఎంతో ప్రశాంతమైనది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానికులు ప్రధానంగా సంచార జీవనానికి అలవాటుపడినవారు. విదేశీ అతిథులను ఆదరించటం, గౌరవించటంలో వారు ఎవరికీ తీసిపోరు. కిర్గిజిస్తాన్ విద్యాలయాల్లో మన విద్యార్థులు 15,000 మంది ఉంటారని అంచనా. పాకిస్తాన్ నుంచి వచ్చినవారి సంఖ్య 11,000. వీరుగాక ఇంకా బంగ్లాదేశ్, కొన్ని అరబ్, ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా చదువుకోవటానికి వస్తారు. తమ దేశాల్లో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారడమే ఇందుకు కారణం. పూర్వపు సోవియెట్ యూనియన్‌లో భాగం కావటం వల్ల పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కిర్గిజిస్తాన్ వైద్య విద్య ఎంతో ప్రామాణికమైనది. అంతర్జాతీయంగా అనేక దేశాలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కూడా దానికివుంది. వేరే దేశాల్లో చదవాలని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని తహతహలాడే పిల్లలు దూరాభారాలు లెక్కచేయక విదేశాలకు వెళ్తారు. కానీ ఇక్కడ చదువుకోవాలనుకునేవారికి మన వైద్యవిద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవటం ప్రభుత్వాల బాధ్యత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ పెట్టాయి. వేరే రాష్ట్రాలు కూడా ఆ పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం అందుకు సహాయసహకారాలు అందించాలి. -
కిర్గిస్తాన్‌కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే?
గత కొన్ని రోజులుగా భారతీయ విద్యార్థులు కిర్గిస్తాన్ దేశంలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా ఉంది. అయినా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేస్తున్నాయి కాలేజీలు. హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని తొలుత ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసినా.. తర్వాత పరిస్థితిలో మార్పువచ్చింది. అసలు భారతీయ విద్యార్థులు ఈ దేశానికీ ఎందుకు వెళ్తున్నారు? అక్కడి కరెన్సీ విలువ ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎలా ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కిర్గిస్తాన్‌లో జరిగింది చిన్న గొడవేకిర్గిస్తాన్లోని ఓ యూనివర్సిటీలో ముగ్గురు స్థానిక విద్యార్థులు ఈజిప్ట్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ చిన్న గొడవ జరగగా.. స్థానిక విద్యార్థులను ఈజిప్టు విద్యార్థులు కొట్టినట్టు తెలిసింది. దీంతో స్థానికంగా కొన్ని ఆందోళనలు జరిగాయి. అయితే కిర్గిస్తాన్ ప్రభుత్వ పెద్దలు అందరూ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. తమ దేశం శాంతి, సౌభాగ్యాలకు చిహ్నమని, విదేశీ విద్యార్థుల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం ఉందని ప్రకటనలు చేశారు. కిర్గిస్తాన్‌కు మనవాళ్లు ఎందుకు వెళ్తున్నారు?కిర్గిస్తాన్.. మధ్య ఆసియా ప్రాంతం. భౌగోళికంగా జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి కిర్గిస్తాన్‌కు వెయ్యి కిలోమీటర్ల కంటే తక్కువ దూరం. చాలా కాలం పాటు సోవియట్ పాలనలో ఉండడం వలన కిర్గిస్తాన్‌లో యూరోపియన్ కల్చర్ కనిపిస్తుంది. అందమైన కొండలు, గల గల పారే నదులు, పచ్చిక బయళ్లు, వాటి మధ్య రాజప్రాసాదాలు... ఇలా అందమైన ఈ ప్రాంతం విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది. విద్యార్థులు వారి సొంత దేశాలను వదిలి కిర్గిజిస్తాన్‌కు వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణం.. అక్కడి చదువుకోవడానికి అయ్యే ఖర్చులు తక్కువగా ఉండటమే. మన దేశంలో మెడిసిన్ చేయాలంటే సంవత్సరానికి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కిర్గిజిస్తాన్‌లో అయితే ఏడాదికి సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు (హాస్టల్.. ఫుడ్‌తో సహా) ఖర్చు పెడితే సరిపోతుందని చెబుతున్నారు.కిర్గిస్తాన్ కరెన్సీ విలువఇక కరెన్సీ విషయానికి వస్తే.. కిర్గిస్తాన్ కరెన్సీ విలువ, ఇండియన్ రూపాయికి దాదాపు సమానంగా ఉంటుంది. అయితే ఖర్చుల పరంగా చూస్తే మనదేశం కంటే అక్కడ కొంత తక్కువని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ దేశానికి.. పలు దేశాల నుంచి విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు.కిర్గిస్తాన్‌కు ఆదాయం ఎలా?కిర్గిస్తాన్‌లో పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ఇక్కడ విలువైన గనులు, ప్రకృతి వనరులు ఉన్నాయి. ఈ దేశానికి అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది బంగారం నిల్వల నుంచే. బంగారంతో పాటు వెండి, యురేనియం, బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. అయితే వీటితో పాటు పర్యాటకం, విదేశీయుల విద్య ఇప్పుడు కిర్గిస్తాన్‌కు అత్యంత కీలకంగా మారాయి. ఇండియన్ మెడిసిన్ కేరాఫ్ కిర్గిస్తాన్కిర్గిస్తాన్లో పాతికేళ్ల క్రితమే భారతీయులు మెడిసిన్ విద్యకు బాట వేసుకున్నారు. ఇండియా నుంచే ఫ్యాకల్టీని తెస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో చాలా వరకు ఇండియన్ డాక్టర్ల టీచింగ్ క్లాసులు ఉంటాయి. దీని వల్ల మన వాళ్లు భారీగా కిర్గిస్తాన్‌కు క్యూ కడుతున్నారు.ప్రస్తుతం కిర్గిస్తాన్‌లో 25వేల మంది భారతీయ విద్యార్థులు ఉండొచ్చని చెబుతున్నారు. వీరితో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు లాంటి దేశాల నుంచి కూడా భారీగా విద్యార్థులు వచ్చి కిర్గిస్తాన్‌లో చదువుతున్నారు. ఇక్కడ మెడిసిన్ చదివి, ఇండియాలో FMGE అంటే Foreign Medical Graduate Examination పరీక్ష రాయాలి. దీంట్లో అర్హత సాధిస్తే.. వైద్యుడిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇండియాలో మంచి ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే కోటి ఖర్చు. అదే కిర్గిస్తాన్‌లో అయితే పాతిక లక్షల్లో మెడిసిన్ పూర్తి చేసుకోవచ్చు. పైగా FMGE పరీక్షకు కూడా కిర్గిస్తాన్‌లోనే కోచింగ్ ఇస్తున్నారు. పెరిగిన విద్యార్థుల వల్ల ఇండియన్ హాస్టళ్లు, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్ ఇతర సౌకర్యాలు చాలా వరకు మెరుగుపరిచారు. అందుకే కిర్గిస్తాన్ వైపు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. -
ఎవరు..ఎప్పుడు దాడి చేస్తారో..!
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్‌లో భయం నీడన కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడి ఓ యూనివర్సిటీలో విద్యార్థిని వేధించిన విషయంలో తలెత్తిన వివాదం అక్కడి స్థానికులు, విదేశీయుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ లక్ష్యంగా జరుగుతున్న దాడులతో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హౌస్అరెస్టులో తెలుగు విద్యార్థులకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదు. అక్కడి భారత రాయబార కార్యాలయం పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు స్పందించి, తక్షణం తమను అక్కడ నుంచి రెస్క్యూ చేయాలంటూ కొందరు తెలుగు విద్యార్థులు ‘సాక్షి’తో ఫోన్ ద్వారా వాపోయారు. పేర్లు గోప్యంగా ఉంచాలంటూ అక్కడి ఎంబీబీఎస్ విద్యార్థులు అనేక విషయాలు చెప్పారు. వివరాలు వారి మాటల్లోనే.... అనుమానంగా చూస్తున్నారు... ఓ యువతి విషయంలో కిర్గిస్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య మే 13న గొడవ జరిగింది. 18, 19 తేదీల్లో తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇందులో పాకిస్తాన్, భారత్, బంగ్లా, ఈజిప్ట్ దేశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ విద్యార్థులు చాలామంది వెళ్లిపోయారు. అక్కడి స్థానికులు తెలుగు విద్యార్థులను అనుమానంగా చూస్తున్నారు. దీంతో ఎప్పుడైనా మాపై దాడి జరగొచ్చని భయాందోళనల మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబరు విద్యార్థులకు ఇచ్చింది. కాల్ చేస్తే పూర్తిస్థాయిలో స్పందన ఉండట్లేదు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సహకారం అందిస్తోంది. తెలుగు విద్యార్థులను ఐదు రోజులుగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కళాశాల యాజమాన్యం నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇలా దాదాపు 700 మంది తెలుగు విద్యార్థులు అక్కడ బతుకెళ్లదీస్తున్నారు. భారత ఎంబసీతో మాట్లాడితే పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అంటున్నారు. బయటకు వెళితే మాత్రం ఎవరు...ఎక్కడ దాడి చేస్తారో అన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది. తమ ఉనికి బయటపడకుండా ఉండటానికి విద్యార్థులు తమ హాస్టల్లో లైట్లు ఆఫ్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందినవారు మాత్రం వారి దేశానికి వెళ్లిపోయారు. తెలుగు విద్యార్థులు విమాన టికెట్లు బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తే లభించట్లేదు. కిర్గిస్తాన్‌లో చోటు చేసుకున్న ఘటనలపై భారతీయ విద్యార్థుల భద్రతపై చొరవ తీసుకోవాలని జీవీకే ఎడ్యుటెక్ డైరెక్టర్ విద్యాకుమార్ బుధవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మవద్దని ఈ సందర్భంగా కేంద్రమంత్రి చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే భారత రాయబార కార్యాలయ హెల్ఫ్‌లైన్ నంబర్ 0555710041కు ఫోన్ చేసిసంప్రదించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక విమానం వేయాలి ఇక్కడ బయట తిరగొద్దు అంటున్నారు. లాక్డౌన్ నాటి రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. మా కళాశాలలో భారతీయ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కళాశాల యాజమాన్యం మాకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఇంటికి వెళ్లిపోతామంటున్న వారిని వెళ్లిపోండి అంటున్నారు. విద్యాసంవత్సరం చివరికు వచ్చింది. జూలైలో ఇంటికి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి రావాలన్నా టికెట్లు దొరకడం లేదు. ఉన్నవాట్లో నాలుగు రెట్లు చార్జీలు పెంచారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక విమానం వేయడం లేదా, విమానాల సంఖ్య పెంచి, చార్జీలు తగ్గించాలి. – రాధ, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అడుగు బయట పెట్టాలంటే భయం.. కళాశాలలకు సెలవులు ఇచ్చారు. రూంలోనే ఉంటున్నాం. అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టేవారు. భయంభయంగా ఉండేది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మా కుటుంబసభ్యులు భయపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీతో అంతా తప్పుడు సమాచారం ఇస్తోంది. అంతా బాగుంది అంటున్నారు. బయటకు వెళితే ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని భయమేస్తోంది. మాకు పరీక్షలు దగ్గర పడ్డాయి. మాదగ్గర తెలుగు రా్రష్తాల నుంచి 800 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నెల రోజుల్లో డిగ్రీ పట్టా వస్తుందనుకుంటే ఇప్పుడు మానసిక ఆందోళన మొదలైంది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపులు రావడంతో ఎవ్వరినీ రానీయడం లేదు. – ఉషారాణి, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని -
కిర్గిజ్‌స్థాన్‌లో తెలుగువారు సురక్షితం
సాక్షి, అమరావతి: కిర్గిజ్‌స్థాన్ (బిష్కెక్)లో తెలుగువారు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీఎన్ఆర్టీఎస్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కిర్గిజ్‌స్థాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడుల జరుగుతున్న నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కిర్గిజ్‌స్థాన్‌లోని తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్టు ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ వెంకట్ మేడపాటి తెలిపారు. ఏపీకి చెందిన ప్రజలు, విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 863 2340678, +91 8500027678 (డబ్ల్యూ)తో పాటు కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ 0555710041ను సంప్రదించాలని సూచించారు. ఏపీఎన్ఆర్టీఎస్ ఈ–మెయిల్స్: info@apnrts.com; helpline@apnrts. com ద్వారా కూడా సంప్రదించొచ్చని పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం ఏపీఎన్ఆర్టీఎస్ ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మెడిసిన్ చదివేందుకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలిసిందని, వీరంతా క్షేమంగా సురక్షిత ప్రదేశాల్లో ఉన్నట్లు తెలిపారు. -
Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
న్యూఢిల్లీ/బిష్కెక్: స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలతో కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కెక్ అట్టుడికిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కొందరు స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి మెడికల్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యలో బిష్కెక్లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం శనివారం సూచించింది. గొడవలు సద్దుమణిగేదాకా ఎవరూ బయటకు రావొద్దని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టం చేసింది. భారతీయ విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. బిష్కెక్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, అయినప్పటికీ విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టంచేసింది. ఏదైనా సహాయం కావాలంటే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బిషె్కక్లోని భారతీయ విద్యార్థులకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన విద్యార్థుల భద్రత గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కిర్గిజ్స్తాన్లో ప్రస్తుతం దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎంత మంది బిష్కెక్లో ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే, బిషె్కక్లో ప్రశాంతమైన వాతావరణ ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం, పౌరుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఎందుకీ ఘర్షణలు? కిర్గిజ్స్తాన్లో అలజడికి మూలాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఉన్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన కిర్గిజ్స్తాన్ 1991లో స్వతంత్ర దేశంగా మారింది. ఇక్కడి అధికారిక భాష రష్యన్. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా హఠాత్తుగా దాడి చేయడంతో కిర్గిజ్స్తాన్కు ఒక్కసారిగా కష్టాలు వచి్చపడ్డాయి. రష్యా నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి. రష్యాలోని కిర్గిజ్స్తాన్ కారి్మకులకు వేతనాలు రాక సొంత దేశానికి డబ్బులు పంపడం లేదు. దీనికితోడు కిర్గిజ్‌స్తాన్‌పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. మరోవైపు రష్యా నుంచి లక్షలాది మంది కిర్గిజ్స్తాన్కు వలస వస్తున్నారు. కుటుంబాలతో సహా ఇక్కడే స్థిరపడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 2022 సెపె్టంబర్ నుంచి ఇప్పటిదాకా 1,84,000 రష్యన్లు కిర్గిజ్స్తాన్కు తరలివచ్చారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పరిశ్రమలు, దుకాణాలు మూతపడుతున్నాయి. స్థానికులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. దాంతో వారిలో అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ప్రధానంగా రాజధాని బిషె్కక్లోని వైద్య విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు సహా ఇతర దేశాల విద్యార్థులపై వారి కన్నుపడింది. విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లు, ఇళ్లల్లోకి గుంపులు గుంపులుగా చొరబడిమరీ దాడి చేస్తున్నారు. ఇదే అదనుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు సైతం ప్రతిఘటిస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడుల్లో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. -
కిర్గిజిస్తాన్‌లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
ఢిల్లీ: కిర్గిజిస్తాన్ దేశంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కిర్గిజిస్తాన్ రాజధాని నగరం బిష్కెక్లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీ విద్యార్థులు ఎవ్వరూ బయటకు రావద్దని అక్కడి భారతీయ ఎంబసీ ‘ఎక్స్’వేదికగా అడ్వైజరీ విడుదల చేసింది.‘కిర్గిజిస్తాన్ బిష్కెక్లోని భారతీయ విద్యార్థులతో టచ్‌లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చింది. విద్యార్థులు ఎంబీసీ అధికారులతో టచ్‌లో ఉండాలని సూచిస్తున్నాం. 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎదైనా సమస్య వస్తే.. 0555710041 నంబర్‌ను సంప్రదించండి’ అని పేర్కొంది.Monitoring the welfare of Indian students in Bishkek. Situation is reportedly calm now. Strongly advise students to stay in regular touch with the Embassy. https://t.co/xjwjFotfeR— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 18, 2024విదేశీ విర్థులపై దాడుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేశారు. ‘కిర్గిజిస్తాన్ బిష్కెక్లోని భారతీయ విద్యార్థుల పరిస్థితిని భారతీయ ఎంబీసీ ఎప్పటికప్పుడు కనుకుంటోంది. అక్కడి పరిస్థితి ప్రసుతం సద్దుమణిగింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావోద్దు’ అని ‘ఎక్స్’ వేదికగా సూచించారు.మే 13న కిర్గిజిస్తాన్, ఈజిప్ట్ దేశాల విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. ఇక.. మెడికల్ యూనివర్సిటీ హాస్టల్ వద్ద చెలరేగిన విద్యార్థుల హింసలో పాకిస్తాన్‌ను చెందిన పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. -
గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని తెలుగు విద్యార్థి దుర్మరణం
కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల వైద్య విద్యార్థి దాసరి చందు కన్నుమూశారు. ఈ విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన కిర్గిస్థాన్‌లో కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీలో పరీక్షలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఆదివారం జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. అయితే గడ్డకట్టిన నీడిలో చిక్కుకుని మృతి చెందాడు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి చేరేలా సాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించినట్లు చందు తల్లిదండ్రులు తెలిపారు. కేంద్ర మంత్రి కిర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, మృత దేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి తెలిపారు. కాగా చందు తండ్రి అనకాపల్లిలో హల్వా అమ్మే భీమరాజు. భీమరాజు రెండో కుమారుడు చందు. -
ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నికి వినేశ్
పాటియాలా: వచ్చే నెలలో కిర్గిస్తాన్‌లో జరిగే పారిస్ ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నిలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బరిలోకి దిగనుంది. ఈ టోర్నిలో పాల్గొనే భారత మహిళల జట్టును ఎంపిక చేసేందుకు సోమవారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ 50 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు కాగా... ఇప్పటికే ఈ కేటగిరీలో అంతిమ్ పంఘాల్ ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంది. దాంతో వినేశ్ సెలెక్షన్ ట్రయల్స్ టోర్నిలో 50 కేజీలతోపాటు 53 కేజీల విభాగంలోనూ పోటీపడింది. ఒక రెజ్లర్ ఒకే రోజు ఒకే వెయిట్ కేటగిరీలో పోటీపడాలన్న నిబంధన ఉన్నా అడ్‌హక్ కమిటీ వినేశ్‌ను రెండు కేటగిరీల్లో పోటీ పడేందుకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. అయితే వినేశ్ 53 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓడిపోయింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నిలో పాల్గొనే భారత జట్టులో అన్షు మలిక్ (57 కేజీలు), మాన్సి అహ్లావత్ (62 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రితిక (76 కేజీలు) కూడా ఎంపికయ్యారు. -
మన బలమేంటో మనమే నిరూపించాలి
క్రీడల పట్ల ఆసక్తితోపాటు చదువులోనూ రాణిస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది హైదరాబాద్ వాసి, 28 ఏళ్ల స్ఫూర్తి ఏనుగు. లా చదువుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లోనూ పాల్గొని పతకాలు సాధిస్తోంది. ఇటీవల కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పవర్ లిఫ్టర్ స్ఫూర్తి ఏనుగు పంచుకున్న విషయాలు ఇవి... ‘‘సహజంగా ఇళ్లలో బరువులెత్తే పనులు అమ్మాయిలకు చెప్పరు. అవి, కేవలం అబ్బాయిల పనే అన్నట్టు చూస్తారు. చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం లేదా టెక్నిక్స్ తెలుసుకుంటే బరువులు ఎత్తడం అమ్మాయిలకూ సులువే. ప్రొఫెషనల్ అవ్వాలన్నా, శారీరక బరువు, మానసిక సమతుల్యత సాధించాలన్నా వెయిట్ మానేజ్మెంట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఛాలెంజెస్ అమ్మాయిలకు ఈ రంగంలో ప్రధాన సమస్య నెలసరి సమస్య. అది ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి ఒకే బరువును మోయలేం. శక్తిలోనూ మార్పులు వస్తుంటాయి. ఇందుకు తీసుకునే ఆహారం అబ్బాయిలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. బరువులు ఎత్తే సమయంలో కండరాలు పట్టేస్తుంటాయి. దెబ్బలు తగులుతుంటాయి. జాయింట్స్ దగ్గర సమస్యలు వస్తుంటాయి. బరువులు ఎత్తే సమయంలో ఊపిరిలో తేడాలు వస్తుంటాయి. కానీ, వీటన్నింటినీ సాధనతో అధిగమిస్తుంటాను. మంచి ఆహారం, సరైన నిద్రాసమయం, స్ట్రెస్ లెవల్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను. ఈ విషయంలో మా అమ్మ సాధన, నాన్న రామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బరువును బ్యాలెన్స్ చేసుకోవడానికి... సెకండ్ క్లాస్ నుంచి స్పోర్ట్స్‌లో ప్రవేశం ఉంది. డిస్క్ త్రో, జావలిన్ త్రో వంటి క్రీడల్లో పతకాలు సాధించాను. రెండేళ్ల నుంచి వెయిట్‌లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కరోనా టైమ్‌లో బరువు పెరిగాను. పది కేజీల బరువు తగ్గాలనుకున్నాను. అందుకు డైట్లో మార్పులు చేసుకోవడానికి బదులు నాకు ఎలాగూ స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి, బరువు తగ్గడానికి వెయిట్‌లిఫ్టింగ్ సాధన చేశాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనల్ని మనం ఎలా క్రమశిక్షణగా మలచుకోవాలో నిపుణుల ఆధ్యర్వంలో తెలిసిపోతుంది. అందుకు అనుగుణంగా సరైన దినచర్యను అమలు చేసుకుంటూ, విజయం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఆలోచనలో మార్పు.. అమ్మాయిలు చిన్నప్పటి నుంచే క్రీడలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వారు ఎంచుకున్న రంగంలోనూ చాలా బాగా దూసుకుపోగలరు. ఇంట్లో వాటర్క్యాన్స్, గ్యాస్ సిలిండర్, సోఫా.. వంటి బరువులు ఎత్తడంలో కూడా టెక్నిక్స్ ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు కూడా 50–60 కేజీల బరువు ఎత్తగలరు. కానీ, టెక్నిక్స్ తెలియకుండా ఎత్తి, నొప్పితో బాధపడుతుంటారు. దీంతో అమ్మాయిలు వెయిట్ లిఫ్టింగ్ చేయలేరు అనే అభిప్రాయం మనలో చాలా మందిలో పాతుకుపోయి ఉంది. మన ఆలోచనలో మార్పు రావాలంటే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ దిశగా అమ్మాయిలను ప్రోత్సహించాలి. క్రీడలతోపాటు ... చదువునూ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎంబీయే పూర్తి చేశాను. సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతూనే స్పోర్ట్స్‌లో సాధన చేస్తూ వచ్చాను. ఇప్పుడు లా చదువుతున్నాను. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనే కాదు, కిందటి నెలలో కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన ఏడబ్ల్యూసీ ఓపెన్ వరల్డ్ కప్‌లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాను. మా అమ్మనాన్నల ప్రోత్సాహంతో పాటు కోచ్ ఇచ్చే గైడెన్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయి. మరిన్ని పోటీలు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిచోటా ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఎదుర్కొన్నవారే విజేతలవుతారు. ‘వెయిట్ లిఫ్టింగ్ అంటే అబ్బాయిలదే. అమ్మాయిలకు ఏం సాధ్యమవుతుంది, సూటవదు’ అనే మాట ఇప్పటికీ ఈ రంగంలో మొదటగా వినిపిస్తుంది. కానీ, మనల్ని మనం గెలిచి చూపినప్పుడు అమ్మాయిలుగా మన బలం ఏంటో కూడా ప్రపంచానికి తెలుస్తుంది’’ అని వివరిస్తుంది స్ఫూర్తి. – నిర్మలారెడ్డి -
ఇద్దరికి వైరస్... జట్టు మొత్తం వైదొలిగింది
న్యూఢిల్లీ: అయ్యో వైరస్... ఆడనీయవు, అర్హత కానీయవు. టోక్యో ఒలింపిక్స్ వేటలో పడేందుకు క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సిన భారత జూడో జట్టు చివరి నిమిషంలో వైదొలిగింది. కిర్గిజిస్తాన్ దాకా వెళ్లిన 15 మంది సభ్యులు గల భారత జట్టు పోటీలకు దూరమైంది. ఈ బృందంలోని ఇద్దరు ప్లేయర్లు అజయ్, రీతూలకు కరోనా సోకింది. ఈ నెల 4న భారత జట్టు ఆసియా ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు బిష్కెక్ (కిర్గిజిస్తాన్)కు వెళ్లింది. అయితే మొదట 15 మంది జూడోకాలకు, నలుగురు కోచ్‌లకు నిర్వహించిన తొలి పరీక్షల్లో అంతా నెగెటివ్‌గానే బయటపడ్డారు. కానీ టోర్నీకి కాస్త ముందుగా 5న నిర్వహించిన పరీక్షల్లో అజయ్, రీతూ పాజిటివ్ అని తేలింది. కరోనా నేపథ్యంలోని టోర్నీ నిబంధనల ప్రకారం జట్టులో ఏ ఒక్కరికి కోవిడ్ సోకినా... మొత్తం జట్టంతా పోటీల నుంచి తప్పుకోవాలి. -
సోనూ సూద్ గొప్ప ప్రయత్నం
సాక్షి, విశాఖపట్నం: విలక్షణ నటుడు సోనూ సూద్ మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చా రు. సౌదీ అరేబియా, కిర్గిజిస్తాన్ దేశాల నుంచి ప్రత్యేక విమానంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ సహకారంతో స్పైస్ జెట్ విమానంలో విమానంలో ప్రయాణికులు చేరుకున్నారు. స్వదేశానికి విద్యార్థులు, వలస కూలీలు, ఉద్యోగులు విశాఖ చేరుకున్నారు. విశాఖ చేరుకున్న ప్రయాణికులకు విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి సొంత జిల్లాలోని క్వారంటైన్ సెంటర్లకు ప్రత్యేక బస్సుల్లో అధికారులు పంపించారు. సౌదీ నుంచి వచ్చిన విమానంలో 170 మంది, కిర్గిజిస్తాన్ నుంచి వచ్చిన విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా లాక్డౌన్ కాలంలో అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు సోనూ సూద్ చూపిన చొరవ, కృషి పలువురి ప్రశంలందుకుంది. -
కిర్గిస్తాన్‌లో వైద్య విద్యార్థుల వెతలు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో 4 వేల మంది తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయారు. కళాశాలలు మూతపడి మూడు నెలలైనా స్వ దేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్లోని నాలుగు మెడికల్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు కరోనా ప్రభావంతో భ యం భయంగా అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగు విద్యార్థులు చనిపోవడం కూడా వారిని ఆందోళన కు గురిచేస్తోంది. వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా 500 మంది భారత పౌరులను ఇండియాకు తరలించి న ప్రభుత్వం.. ఈనెల 20న మరో విమానాన్ని కిర్గిస్తాన్‌కు నడుపుతోంది. సుమారు 14 వేల మం ది భారతీయులు స్వదేశానికి రావడానికి ఎదురుచూస్తుండటంతో విమాన టికెట్ల ధరలు కూడా రెట్టింపయ్యాయి. సాధారణ రోజుల్లో రాకపోకల కు రూ.28వేలు ఉండగా.. ప్రస్తుతం కేవలం ఇండియాకు రావడానికే రూ.20 వేలు పలుకుతోంది. పెరుగుతున్న కేసుల సంఖ్య కిర్గిస్తాన్‌లోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. లా క్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పుంజుకుందని అక్కడే మెడిసిన్ చదువుతు న్న వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌కు చెందిన సంకేపల్లి హరికారెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని, సరైన ఆహా రం దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ‘సాక్షి’కి చెప్పారు. భారత్‌కు విమానాలు నడపాలని స్థానిక రాయబార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన లేదని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని చొరవ చూపాలని కోరారు. -
కిర్గిస్తాన్‌లో తెలుగు విద్యార్థుల యాతన
గుత్తి: తమను స్వస్థలాలకు పంపాలంటూ కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కిర్గిస్తాన్‌లోని మెడికల్ కాలేజీల్లో వందల మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్యనభ్యసిస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అక్కడి కాలేజీలతో పాటు హాస్టళ్లనూ మూసేశారు. ఈ నేపథ్యంలోనే తమను స్వస్థలాలకు పంపాలంటూ 20 రోజులుగా వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శనివారం భారత ఎంబసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎంబసీ అధికారులు తామేమీ చేయలేమని, మీ రాష్ట్రాల ప్రభుత్వాలకు చెప్పుకోవాలంటూ తేల్చి చెప్పడంతో విద్యార్థులు వెనుదిరిగారు. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన 45 మంది ఉన్నారు. తిండి, నిద్ర లేక నానాయాతన పడుతున్నామని తమకు న్యాయం చేసేలా, ప్రభుత్వాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలంటూ అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు హర్షవర్దన్‌రెడ్డి, రవితేజారెడ్డి, సాయిచరణ్, సాయివెంకటకృష్ణ, మేఘన, ప్రియాంకలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మరికొందరు విద్యార్థులు వాట్సాప్ ద్వారా ‘సాక్షి’ విలేకరికి విన్నవించారు. -
ఆ దేశాలే బాధ్యులు
బిష్కెక్: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఆర్థిక సహాయం చేస్తున్న దేశాలను తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలని శుక్రవారం ఇక్కడ జరిగిన సదస్సులో మోదీ ఎస్సీవో నేతలకు స్పష్టం చేశారు.ఆహుతుల్లో ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్య చేశారు.ఉగ్రవాదాన్ని అరికట్టే విషయమై అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంతో ఎస్సీవో ప్రదర్శిస్తున్న స్ఫూర్తిని మోదీ కొనియాడారు. ఉగ్రవాద రహిత సమాజం కావాలన్నదే భారత్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు దేశాలన్నీ సంకుచితత్వాన్ని విడనాడి ఐక్యంగా ముందుకు రావాలన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు.‘గత ఆదివారం నేను శ్రీలంక వెళ్లినప్పుడు సెయింట్ ఆంథోనీ చర్చిని చూశాను.ఉగ్రవాదం వికృత ముఖం నాకక్కడ కనిపించింది’అని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను తప్పకుండా జవాబుదారుల్ని చేయాలని మోదీ ఉద్ఘాటించారు. ఎస్సీవో ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక విధానం(ర్యాట్స్)కింద ఉగ్రవాదంపై పోరుకు సహకరించాలని ఆయన ఎస్సీవో నేతలను కోరారు.సాహిత్యం ,సంస్కృతి మన సమాజాలకు సానుకూల దృక్ఫధాన్ని అందించాయని, సమాజంలో యువత చెడుమార్గం పట్టకుండా ఇవి నిరోధించాయని మోదీ అన్నారు. ఎస్సీవో సుస్థిరత, భద్రతలకు శాంతియుతమైన, ప్రగతిశీలమైన, భద్రతాయుతమైన ఆఫ్ఘనిస్తాన్ కీలకమని భారత ప్రధాని అన్నారు. ఆప్ఘన్ శాంతి ప్రక్రియకు మద్దతివ్వడమే మన లక్ష్యమన్నారు. భారత దేశం ఎస్‌సివోలో సభ్యురాలై రెండేళ్లు అయిందని,ఈ రెండేళ్లలో ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో సానుకూల సహకారం అందించామని మోదీ అన్నారు. చైనా నాయకత్వంలో ఎనిమిది దేశాలతో ఎస్సీవో ఏర్పాటయింది.2017లో భారత, పాకిస్తాన్లకు దీనిలో సభ్యత్వం లభించింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ మద్దతిస్తోందని భారత్ ఆరోపిస్తోంది.2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. పాక్ కేంద్రంగా గల ఉగ్రవాదులే ఈ దాడి చేశారని ఆరోపించిన భారత్, పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకుంది. మరోవైపు, బిష్కెక్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మోదీ–ఇమ్రాన్ పలకరింపులు ఎస్సీవో సదస్సు సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేర్వేరు దేశాధినేతలు ఉన్న లాంజ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలసుకున్నారు. భారత సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి ఈ సందర్భంగా ఇమ్రాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు మోదీ ధన్యవాదాలు చెప్పారు. మోదీ–ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య ఎస్సీవో సదస్సు సందర్భంగా భేటీ ఉండదని విదేశాంగశాఖ గతంలోనే స్పష్టం చేసింది. దౌత్య మర్యాదకు ఇమ్రాన్ భంగం షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దౌత్య మర్యాదలను పాటించకుండా దేశాన్ని అపఖ్యాతి పాలు చేశారు.సదస్సు ప్రారంభ సమావేశానికి ఎస్సీవో అధినేతలందరూ వస్తుండగా అప్పటికే హాజరయిన దేశాధినేతలంతా మర్యాద పూర్వకంగా లేచి నిలబడితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం కూర్చునే ఉన్నారు.మోదీ సహా వివిధ దేశాధినేతలు నిలబడి ఉండగా, పాకిస్తాన్ ప్రధాని కూర్చుని ఉన్న వీడియో వైరల్ అయింది.ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధికార ట్విట్టర్లో కూడా ఈ వీడియో వచ్చింది.సమావేశంలో నేతలందరినీ పరిచయం చేస్తున్నసమయంతో తన పేరు ప్రకటించగానే లేచి నిలబడిన ఇమ్రాన్ ఖాన్ వెంటనే కూర్చుండిపోయారు.ఇమ్రాన్ తీరుపై నెటిజన్లు రకరకాల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఇమ్రాన్.. ఏంటిది; ఆరోగ్యం బాగాలేదేమో!
బిష్కెక్ : షాంఘై సహకార సదస్సుకు హాజరైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సౌదీ రాజును అవమానించిన ఇమ్రాన్.. ఈ సదస్సులో మరోసారి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి వివిధ దేశాధినేతలను అగౌరవపరిచారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో గురువారం షాంఘై సహకార సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ దేశాధినేతలకు నిర్వాహకులు స్వాగతం పలుకుతున్న వీడియోను ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ తన అఫీషియల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వ్యవహార శైలిపై సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. అతిథులను ఆహ్వానించే క్రమంలో కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు ప్రపంచ దేశాధినేతలకు పేరుపేరునా స్వాగతం పలికారు. ఈ క్రమంలో.. సభాస్థలికి వచ్చే సమయంలో మిగిలిన నేతలంతా నిల్చునే ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఒక్కరే తన సీట్లో కూర్చుండిపోయారు. తన పేరు పలికినపుడు మాత్రమే నిలబడి అభివాదం చేశారు. ఇమ్రాన్ చర్యపై మండిపడిన నెటిజన్లు.. కనీస మర్యాద కూడా పాటించరా అంటూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. ‘ పాక్ ప్రధానికి ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు. మిగతా వాళ్లంతా నిలబడి ఉండే మీరు మాత్రం కూర్చుంటారా. అందరూ వచ్చేదాకా ఆగలేరా. అంత అహంకారమా’ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇక మరికొందరు...‘ పాపం.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదేమో. కాసేపైనా కూర్చోకుండా ఉండలేరు కాబోలు. అర్థం చేసుకోరూ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఇటీవల సౌదీ ప్రభుత్వం మక్కాలో నిర్వహించిన అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశానికి ఇమ్రాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ రాజు వద్దకు వెళ్లి కరచాలనం చేసిన ఇమ్రాన్.. అనంతరం రాజు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ముందుకు కదిలారు. దీంతో ఇమ్రాన్ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. Prime Minister of #Pakistan @ImranKhanPTI's Arrival with other World Leaders at Invitation of President of Kyrgyzstan for Opening Ceremony 19th Meeting of the Council of the Heads of State of the Shanghai Cooperation Organization in Bishkek Kyrgyzstan (13.06.19)#SCOSummit2019 pic.twitter.com/fYdKYN3Fv7 — PTI (@PTIofficial) June 13, 2019 -
పాక్ మీదుగా వెళ్లను
న్యూఢిల్లీ/బీజింగ్: కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో ఈ నెల 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు (ఎస్సీవో)కు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లరాదని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. తమ గగనతలం మీదుగా మోదీ విమానం వెళ్లేందుకు పాక్ అంగీకరించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఒమన్, ఇతర మధ్య ఆసియా దేశాల మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్కు చేరుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‡ తెలిపారు. ఈ ప్రయాణానికి సంబంధించి రెండు రూట్లను భారత ప్రభుత్వం ఖరారుచేసిందన్నారు. కాగా, భారత ప్రధాని మోదీ విమానంలో ఎస్సీవో సదస్సుకు తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు ప్రత్యేకంగా అనుమతిస్తామని పాక్ విమానయానశాఖ మంత్రి సర్వార్‌ఖాన్ చెప్పారు. మోదీ ప్రయాణించే ఎయిరిండియా బోయింగ్ 747–400 విమానం ఢిల్లీ నుంచి బిష్కెక్కు వెళ్లి తిరిగివచ్చేందుకు వీలుగా 72 గంటలపాటు పాక్ గగనతలంలో రాకపోకల్ని అనుమతిస్తామని పేర్కొన్నారు. ఎస్సీవోలో చైనా, భారత్, పాక్, కిర్గిజిస్తాన్ సహా 8 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మరోవైపు షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బయలుదేరినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వెల్లడించింది. ఎస్సీవో సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో పాటు భారత్‌పై కూడా వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికాను కలసికట్టుగా ఎదుర్కోవడంపై జిన్‌పింగ్, మోదీ చర్చించే అవకాశముందని ప్రభుత్వవర్గాలు చెప్పాయి. ఎస్సీవోతో పటిష్ట సంబంధాలు: మోదీ బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)లో అంతర్జాతీయ భద్రత, ఆర్థిక సహకారమే ప్రధాన అజెండాగా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తన బిష్కెక్ పర్యటన ద్వారా ఎస్సీవో దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ధీమా వ్యక్తం చేశారు. భారత రాయబారిగా వీడాంగ్ భారత్‌తో సత్సంబంధాలను పెంపొందించుకునే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ దౌత్యవేత్త సున్ వీడాంగ్ భారత్‌లో తమ కొత్త రాయబారిగా నియమించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ 2009–13 మధ్యకాలంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన కాలంలో వీడాంగ్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగశాఖ పాలసీ–ప్రణాళికా విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న వీడాంగ్‌ను భారత్‌లో తమ రాయబారిగా నియమించింది. భారత్‌లో చైనా రాయబారిగా ఉన్న లో జుహుయీనిని విదేశాంగశాఖ సహాయమంత్రిగా నియమించింది. -
జనావాసాలపై కూలిన విమానం
• 37 మంది మృతి • కిర్గిస్తాన్‌లో ప్రమాదం • పైలట్ తప్పిదమేనన్న అధికారులు డచాసు(కిర్గిస్తాన్): కిర్గిస్తాన్ రాజధాని బిషెక్ మనాస్ విమానాశ్రయం సమీపంలో జనావాసాలపై సోమవారం టర్కీ కార్గో విమానం కుప్పకూలింది. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్మిన విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుం డగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 37 మంది మరణించారు. వీరిలో నలుగురు పైలట్లు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పైలట్ తప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమికవిచారణలో తేలినట్టు ఉప ప్రధాని ముహమ్మెత్కాలి అబుల్గాజీవ్ వెల్లడించారు. టర్కీకి చెందిన యాక్ట్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 747–400 కార్గో విమానం హాంకాంగ్ నుంచి బిషెక్ మీదుగా ఇస్తాంబుల్ వెళుతోంది. పూర్తిగా పొగమంచుతో కప్పేసిన మనాస్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసే క్రమంలో... పక్కనే ఉన్న డచాసు గ్రామంలోని ఇళ్లపై కుప్పకూలింది. విమాన శకలాలు విరిగి పడి... వాటి నుంచి పొగ, మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. ఈ ఘటనలో 17 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్టు అత్యవసర సేవల శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎల్మిరా షెరిపోవా తెలిపారు. భయంతో పరుగులు... ఇళ్లలో నిద్రిస్తుండగా పెద్ద శబ్దం రావడంతో తొలుత భూకంపం వచ్చిందని భావించామని, భయభ్రాంతులకు గురై పరుగెత్తుకుంటూ బయటకు వచ్చామని స్థానికులు తెలిపారు. తీరా చూస్తే చుట్టుపక్కల మంటలు కనిపించా యన్నారు. మండుతున్నవిమాన శకలం ఓ ఇంటిపై పడటంతో అందులో ఉంటున్న కుటుంబ సభ్యులంతా మృతిచెందారని ఆవేదనతో చెప్పారు. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రధాని సూరోన్‌బాయ్ జీన్బెకోవ్ ప్రత్యేక కమిషన్‌ను నియమించారు. అధ్యక్షుడు అల్మాజ్బెక్అటాంబయేవ్ తన చైనా పర్యటన రద్దు చేసుకుని కిర్గిస్తాన్‌కు తిరిగి వెళ్లారు. యాక్ట్ ఎయిర్‌లైన్స్, తయారీ సంస్థ బోయింగ్ ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశాయి. సోమవారం సాయంత్రం వరకు విమానాశ్రయం మూసి ఉంటుందని అధికారులుతొలుత ప్రకటించినా... ఉదయం ఘటన జరిగిన సమయంలో తెరిచే ఉండటం గమనార్హం. -
ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి
-
ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి
బిష్కెక్: కిర్జిస్థాన్లోని మనాస్ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం టర్కీష్ ఎయిర్‌లైన్స్ కార్గోకు చెందిన విమానం జనావాసాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 32 మంది మరణించారని కిర్జీ ప్రభుత్వం ప్రకటించింది. సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఓ పైలట్, మరో 29 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇళ్లపై విమానం కూలిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మృతుల్లో స్థానికులే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా విమానంలో ఎంత ఉన్నారు, ఎక్కడకు వెళ్తోంది వంటి విషయాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
అగ్ని–5 క్షిపణి పరీక్ష విజయవంతం
జాతీయం భారత్–కిర్గిజిస్థాన్ మధ్య ఆరు ఒప్పందాలు కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు ఆల్మాజ్‌బెక్ అతంబయేవ్ భారత పర్యటనలో భాగంగా డిసెంబర్ 20న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమలుకు విస్తృత ప్రాతిపదికను ఖరారు చేశాయి. తీవ్రవాదం, అతివాదంపై కలసికట్టుగా పోరాడతామనే కృతనిశ్చయాన్ని ప్రకటించాయి. దీంతోపాటు ఇరు దేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో వ్యవసాయం, పర్యాటక రంగం, సాంస్కృతిక, ప్రసార, యువజన వ్యవహారాల్లో సహకారానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. వ్యర్థ పదార్థాలను తగలబెట్టడంపై నిషేధం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పూర్తిగా నిషేధించింది. చెత్త డంపింగ్ ప్రదేశాలతో సహా ఎక్కడ చెత్తను దగ్ధం చేసినా సంబంధిత వ్యక్తి లేదా సంస్థకు రూ.25,000 జరిమానా విధించనున్నట్లు ఎన్జీటీ పేర్కొంది. తక్కువ మొత్తంలో చెత్తను తగలబెడితే రూ.5000 జరిమానాగా విధిస్తామని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ డిసెంబర్ 22న ప్రకటించింది. శివాజీ స్మారకానికి జలపూజ చేసిన మోదీ ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో నిర్మించే ఛత్రపతి శివాజీ భారీ స్మారక (ఎత్తు 192 మీటర్లు) నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 24న జల పూజ చేశారు. ఈ స్మారకాన్ని దక్షిణ ముంబైలోని సముద్ర తీరం నుంచి 1.5 కి.మీ దూరంలో రూ.3,600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రధాని.. కోస్ట్‌గార్డ్ ప్రత్యేక నౌకలో అరేబియా సముద్రంలోని స్మారకం నిర్మించే ప్రాంతానికి వెళ్లి జల పూజ చేశారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చిన మట్టి, వివిధ నదుల నుంచి తెచ్చిన నీటిని ప్రధాని సముద్రంలో చల్లారు. ఈ స్మారకంలో శివాజీ విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం, రంగస్థల వేదిక, ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటాయి. అవార్డులు బెంగాలీ రచయిత శంఖ ఘోష్‌కు జ్ఞాన్‌పీ ప్రముఖ బెంగాలీ కవి శంఖ ఘోష్‌కు 2016 సంవత్సరానికి అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞాన్‌పీuŠ‡ అవార్డు లభించింది. ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్ఞాన్‌పీuŠ‡ ఎంపిక బోర్డ్ డిసెంబర్ 23న ప్రకటించింది. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తోంది. ఘోష్‌కు గతంలో పద్మభూషణ్, సరస్వతీ సమ్మాన్, సాహిత్య అకాడమీ పురస్కారాలు దక్కాయి. 2016 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కేంద్ర సాహిత్య అకాడమీ 2016 వార్షిక అవార్డులను డిసెంబర్ 21న ప్రకటించింది. కవిత్వం నుంచి ఎనిమిది మందికి, ఏడుగురు కథకులకు, ఐదుగురు నవలా రచయితలకు, ఇద్దరు విమర్శకులకు, ఒక వ్యాసకర్తకు, ఒక నాటక రచయితకు కలిపి మొత్తం 24 మందికి ఈ సంవత్సరం అవార్డులు దక్కాయి. 2017, ఫిబ్రవరి 22న జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అవార్డులకు ఎంపికైన వారికి తామ్ర పత్రంతో పాటు లక్ష రూపాయల చెక్కును అందిస్తారు. గుంటూరుకు చెందిన పాపినేని శివశంకర్ రాసిన రజనీగంధ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించగా, విజయవాడకు చెందిన ప్రసాదరావుకు భాషా సమ్మాన్ అవార్డు లభించింది. మేరీకోమ్‌కు ఏఐబీఏ లెజెండ్స్ అవార్డు భారత స్టార్ బాక్సర్లు మెరీకోమ్, వికాస్ కృష్ణన్‌లకు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య అవార్డులు దక్కాయి. మేరీకోమ్‌కు ఏఐబీఏ లెజెండ్స్ పురస్కారం లభించగా, వికాస్‌కు ఏఐబీఏ ప్రో బాక్సింగ్ ఉత్తమ బాక్సర్ అవార్డు దక్కింది. డిసెంబర్ 21న స్విట్జర్లాండ్‌లోని మాంట్రిక్స్‌లో ఏఐబీఏ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఆర్థికం తొలి నగదు రహిత ప్రాంతంగా డామన్ డయ్యు అరేబియా తీరంలోని కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యు.. దేశంలోనే తొలి నగదు రహిత ప్రాంతంగా రికార్డుకెక్కింది. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ 190 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలోని వలంటీర్లు 25,000 కుటుంబాలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. ప్రజలు డిజిటల్ లావాదేవీలను జరిపేందుకు వీలుగా పరిపాలనా యంత్రాంగం ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించింది. వార్తల్లో వ్యక్తులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ డిసెంబర్ 22న తన పదవికి రాజీనామా చేశారు. 1973 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన నజీబ్ జంగ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. 2013, జూలై నుంచి ఆయన ఢిల్లీకి 19వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి, నజీబ్‌జంగ్ మధ్య అనేక వివాదాలు చెలరేగాయి. ఎన్సీసీ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నూతన డైరెక్టర్ జనరల్‌గా వినోద్ వశిష్ట్ట్ డిసెంబర్ 26న బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఎంపీ పదవికి మిథున్ చక్రవర్తి రాజీనామా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి డిసెంబర్ 26న తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనారోగ్యం కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మిథున్ చక్రవర్తి 2015, ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పాప్ గాయకుడు జార్జ్ మైఖేల్ మృతి ప్రముఖ పాప్ గాయకుడు జార్జ్ మైఖేల్ (53) లండన్‌లో డిసెంబర్ 25న మృతి చెందారు. 1980లో జార్జ్ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. 1963లో లండన్‌లో జన్మించిన మైఖేల్ వామ్ పాప్ గ్రూప్‌తో గాయకుడిగా జీవితం ఆరంభించారు. తర్వాత సొంతంగా ఆల్బమ్‌లు రూపొందించారు. ఆయన నాలుగు దశాబ్దాల కెరీర్లో 10 కోట్లకు పైగా ఆల్బమ్స్ అమ్ముడయ్యాయి. క్రీడలు ఐసీసీ మేటి క్రికెటర్‌గా రవిచంద్రన్ అశ్విన్ 2016 సంవత్సరానికి ఉత్తమ క్రికెటర్స్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 22న దుబాయ్‌లో ప్రకటించింది. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఏడాది ఐసీసీ మేటి క్రికెటర్, ఐసీసీ మేటి టెస్ట్ క్రికెటర్ అవార్డులను దక్కించుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (2004) తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు ఐసీసీ అవార్డులు – విజేతలు మేటి క్రికెటర్‌కు ఇచ్చే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ: రవిచంద్రన్ అశ్విన్. గతంలో భారత్ నుంచి రాహుల్ ద్రావిడ్ (2004), సచిన్ (2010) మాత్రమే ఈ ట్రోఫీని అందుకున్నారు. ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: రవిచంద్రన్ అశ్విన్ వన్డే క్రికెటర్: క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) మహిళల వన్డే క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్) మహిళల టీ20 క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్) టీ20 ఉత్తమ ప్రదర్శన: కార్లోస్ బ్రాత్‌వెట్ (10 బంతుల్లో 34 నాటౌట్) వర్ధమాన క్రికెటర్: ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) అంపైర్: మరాయిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా). అండర్ 19 ఆసియా కప్ గెలుచుకున్న భారత్l ఆసియా కప్ అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్లో భారత యువ జట్టు వరసగా మూడోసారి విజేతగా నిలిచింది. కొలంబోలో డిసెంబర్ 23న జరిగిన ఫైనల్లో శ్రీలంకను భారత్ ఓడించింది. భారత కెప్టెన్ అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును, హిమాన్షు రాణా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నారు. పంకజ్ అద్వానీకి 6 రెడ్ స్నూకర్ టైటిల్ భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) స్టార్ పంకజ్ అద్వానీ స్నూకర్‌లో షార్ట్ ఫార్మాట్‌గా భావించే 6 రెడ్ స్నూకర్ జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ముంబైలో డిసెంబర్ 23న జరిగిన ఫైనల్లో ఇష్ప్రీత్ చద్దాపై పంకజ్ గెలుపొందాడు. ఈ విజయంతో జాతీయ, ఆసియా, ప్రపంచ స్థాయిల్లో 6 రెడ్ స్నూకర్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ అగ్ని–5 క్షిపణి పరీక్ష విజయవంతం అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర విధ్వంసక క్షిపణి అగ్ని–5ను ఒడిశాలోని బాలాసోర్‌లో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డిసెంబర్ 26న భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ బాలిస్టిక్ క్షిపణి పరిధి 5 నుంచి 6 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్ని–5 పరిధిలో చైనా, రష్యా దేశాలు పూర్తిగా.. సగానికిపైగా యూరప్, ఆఫ్రికా ఖండాలు ఉన్నాయి. అగ్ని–5ను నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించడం వల్ల వ్యూహాత్మక బలగాల కమాండ్ (ఎన్ఎఫ్సీ)లోకి దీన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని రక్షణ శాఖ పేర్కొంది. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసార్ధమున్న ఈ క్షిపణికి 3 దశల్లో పనిచేసే ఇంజన్లను అమర్చారు. ఇది 1500 కిలోల అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. అవసరమైతే చాలా తక్కువ సమయంలోనే అగ్ని–5ను లాంచింగ్ కోసం సిద్ధం చేయవచ్చు. ఇందులో అత్యంత కచ్చితత్వం కలిగిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ (ఆర్ఐఎన్ఎస్), అధునాతన మైక్రో నేవిగేషన్ వ్యవస్థ (ఎన్ఐఎస్ఎస్) ఉన్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ పరిశీలనకు ఉపగ్రహ ప్రయోగం గ్లోబల్ కార్బన్ డై ఆక్సైడ్ పరిశీలనకు తాన్‌శాట్ అనే ఉపగ్రహాన్ని డిసెంబర్ 21న చైనా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం వాతావరణ మార్పును అధ్యయనం చేసేందుకు తోడ్పడుతుంది. దీని బరువు 620 కిలోలు. తాన్‌శాట్ ఉపగ్రహాన్ని లాంగ్‌మార్చ్–2డీ రాకెట్ ద్వారా చైనాలోని గోబి ఎడారి నుంచి ప్రయోగించారు. తాన్శాట్తో పాటు హై రిజల్యూషన్ మైక్రో నానో శాటిలైట్, రెండు స్పెక్ట్రమ్ మైక్రో–నానో ఉపగ్రహాలను కూడా ప్రయోగించారు. ఇవి వ్యవసాయం, అడవులపై అధ్యయనం చేయనున్నాయి. అమెరికా, జపాన్ తర్వాత చైనా సొంత ఉపగ్రహాలతో గ్రీన్హౌస్ ఉద్గారాలను అధ్యయనం చేస్తుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రత, విస్తరణ, పయనం వంటి అంశాలను తాన్‌శాట్ పరిశీలిస్తుంది. ఐదో తరానికి చెందిన ఎఫ్‌సీ–31 యుద్ధవిమానాన్ని చైనా పరీక్షించినట్లు చైనా మీడియా డిసెంబర్ 26న పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫైటర్లను తయారుచేస్తున్న పశ్చిమ దేశాలకు దీటుగా చైనా ఎఫ్‌సీ–31 యుద్ధవిమానాన్ని రూపొందించింది. జే–31 జెట్లను మరింత అభివృద్ధి చేసిన చైనా వాటికి ఎఫ్‌సీ–31 గైర్ ఫాల్కన్‌గా నామకరణం చేసింది. చైనా డిసెంబర్ 23న ఈ యుద్ధ విమాన పరీక్షను నిర్వహించింది. -
కిర్గిస్థాన్‌లో బాంబు పేలుడు
-
అమ్మాయి పొట్టలో 4 కిలోల జుట్టు!
ఎవరైనా చాక్లెట్లు తింటారు, బిస్కట్లు తింటారు. కానీ, ఆ అమ్మాయి ఏకంగా జుట్టే తినేసింది. అది కాస్తా అలా అలా ఎక్కువైపోయి ఏకంగా ఆమె పొట్టలో నాలుగు కిలోల జుట్టు ఉండలా పేరుకుపోయింది. భరించలేని కడుపునొప్పి రావడంతో కిర్గిజిస్థాన్లోని వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి ఆ ఉండ తొలగించారు. 18 ఏళ్ల వయసున్న ఆ అమ్మాయికి తన జుట్టు కొనలు తినడంతో పాటు ఇంట్లోని తివాచీకి ఉన్న ఊలు తినడం కూడా అలవాటేనట. ఆమె పేరు ఐపెరి అలెక్సీవా. ఆమె కిర్గిజిస్థాన్లోని బాట్కెన్ రాష్ట్రానికి చెందినది. చివరకు మంచినీళ్లు కూడా తాగలేనంత స్థాయికి ఆరోగ్యం దిగజారిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె జీర్ణ వ్యవస్థలో పెద్ద ఉండ పేరుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ఆమె పొట్ట బాగా వాచిపోయిందని, చివరకు లోపల నుంచి మొత్తం జుట్టు, ఊలు బయటకు తీశామని చెప్పారు. ఆమె మానసిక పరిస్థితి చక్కగా ఉందని, మళ్లీ ఇంకెప్పుడూ తాను జుట్టు తినబోనని కూడా తమకు చెప్పిందని వైద్యులు అన్నారు. -
యువ మంత్ర
కిర్గిజిస్థాన్: గుణగణన కేవలం యాభై లక్షల జనాభా ఉన్న చిన్న దేశం కిర్గిజిస్థాన్. ఇక్కడ పార్టీల కంటే అభ్యర్థి గుణగణాలను చూసే ఓట్లేస్తారు. ఈ దేశంలోని యువత ఓటు వేసేందుకు చాలా ఆసక్తి చూపుతుంది. తజకిస్థాన్: పరిగణన ఈ దేశంలో యువత ప్రాతినిధ్యం ఎక్కువ. దేశ ప్రజల్లో అక్షరాస్యులు ఎక్కవే కావడంతో ఓటుపై అవగాహన ఎక్కువే. ఇక్కడి యువత రాజకీయాలను ఓ వృత్తిగా పరిగణిస్తుంది. అఫ్గానిస్థాన్: ఉద్యోగావకాశం ఇక్కడ అధ్యక్ష తరహా పాలన. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగు తాయి. యువత ఎన్నికల్లో భారీగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతుంది. ఓటరు కార్డు ఉంటే ఉద్యోగాలు సులభంగా రావడానికి అవకాశాలెక్కువ. ఇరాన్: గండిపడే అవకాశం ఈ దేశంలో నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఓటరు కార్డు పాస్‌పోర్టు తరహాలో ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో ఓటు వేశాక అందులో ఓ స్టాంప్ వేస్తారు. స్టాంప్‌లు తక్కువుంటే ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. చైనా: ఆసక్తి తక్కువ అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఉపాధి కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఓటేసేందుకు ప్రజల్లో ఆసక్తి తక్కువ. రాజకీయాల్లోకి రావడానికి యువత ముందుకు రాదు. అమెరికా: యువశక్తి ఎక్కువ ఇప్పుడు అమెరికాలో యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటోంది. ఒకప్పుడు ఎన్నికల్లో యువత పాత్ర చాలా తక్కువగా ఉండేది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటివి యువతలో మార్పు తెచ్చాయి. నేపాల్: నవశక్తిదే తెగువ ఏడేళ్ల కితమే ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన నేపాల్‌లో 18 ఏళ్లు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు ఉంటుంది. అక్కడ రాచరికానికి చరమగీతం పాడటంలో యువత పాత్రే కీలకం. ఓటు వేసేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. యెమన్: ఎనలేని హవా ఇక్కడ ఐదు దశల్లో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికే కీలకం. అమెరికా అధ్యక్ష ఎన్నికను పోలి ఉంటుంది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటుంది. ఎన్నికల్లో హామీలివ్వడం, మరచిపోవడం మామూలే.