
సాక్షి, విశాఖపట్నం: విలక్షణ నటుడు సోనూ సూద్ మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చా రు. సౌదీ అరేబియా, కిర్గిజిస్తాన్ దేశాల నుంచి ప్రత్యేక విమానంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ సహకారంతో స్పైస్ జెట్ విమానంలో విమానంలో ప్రయాణికులు చేరుకున్నారు. స్వదేశానికి విద్యార్థులు, వలస కూలీలు, ఉద్యోగులు విశాఖ చేరుకున్నారు.
విశాఖ చేరుకున్న ప్రయాణికులకు విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి సొంత జిల్లాలోని క్వారంటైన్ సెంటర్లకు ప్రత్యేక బస్సుల్లో అధికారులు పంపించారు. సౌదీ నుంచి వచ్చిన విమానంలో 170 మంది, కిర్గిజిస్తాన్ నుంచి వచ్చిన విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా లాక్‌డౌన్ కాలంలో అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు సోనూ సూద్ చూపిన చొరవ, కృషి పలువురి ప్రశంలందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment