రాజధాని బిషె్కక్‌లో స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలు
భారత్, పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరిమూకల దాడులు
భారత విద్యార్థులను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ/బిష్కెక్: స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలతో కిర్గిజ్‌స్తాన్ రాజధాని బిష్కెక్ అట్టుడికిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కొందరు స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి మెడికల్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి.
ఈ నేపథ్యలో బిష్కెక్‌లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం శనివారం సూచించింది. గొడవలు సద్దుమణిగేదాకా ఎవరూ బయటకు రావొద్దని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టం చేసింది. భారతీయ విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని కిర్గిజ్‌స్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
బిష్కెక్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, అయినప్పటికీ విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టంచేసింది. ఏదైనా సహాయం కావాలంటే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బిషె్కక్‌లోని భారతీయ విద్యార్థులకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
మన విద్యార్థుల భద్రత గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కిర్గిజ్‌స్తాన్‌లో ప్రస్తుతం దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎంత మంది బిష్కెక్‌లో ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే, బిషె్కక్‌లో ప్రశాంతమైన వాతావరణ ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం, పౌరుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కిర్గిజ్‌స్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
ఎందుకీ ఘర్షణలు?
కిర్గిజ్‌స్తాన్‌లో అలజడికి మూలాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఉన్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన కిర్గిజ్‌స్తాన్ 1991లో స్వతంత్ర దేశంగా మారింది. ఇక్కడి అధికారిక భాష రష్యన్. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా హఠాత్తుగా దాడి చేయడంతో కిర్గిజ్‌స్తాన్‌కు ఒక్కసారిగా కష్టాలు వచి్చపడ్డాయి. రష్యా నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి.
రష్యాలోని కిర్గిజ్‌స్తాన్ కారి్మకులకు వేతనాలు రాక సొంత దేశానికి డబ్బులు పంపడం లేదు. దీనికితోడు కిర్గిజ్‌స్తాన్‌పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. మరోవైపు రష్యా నుంచి లక్షలాది మంది కిర్గిజ్‌స్తాన్‌కు వలస వస్తున్నారు. కుటుంబాలతో సహా ఇక్కడే స్థిరపడుతున్నారు.
అధికారిక లెక్కల ప్రకారమే 2022 సెపె్టంబర్ నుంచి ఇప్పటిదాకా 1,84,000 రష్యన్లు కిర్గిజ్‌స్తాన్‌కు తరలివచ్చారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పరిశ్రమలు, దుకాణాలు మూతపడుతున్నాయి. స్థానికులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. దాంతో వారిలో అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు.
ప్రధానంగా రాజధాని బిషె్కక్‌లోని వైద్య విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు సహా ఇతర దేశాల విద్యార్థులపై వారి కన్నుపడింది. విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లు, ఇళ్లల్లోకి గుంపులు గుంపులుగా చొరబడిమరీ దాడి చేస్తున్నారు. ఇదే అదనుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు సైతం ప్రతిఘటిస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడుల్లో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment