మెడిసిన్ చదువుకు వెళ్లిన నలుగురు ఆంధ్రులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారు
ఏపీఎన్‌ఆర్టీఎస్ చైర్మన్ వెంకట్ మేడపాటి
సాక్షి, అమరావతి: కిర్గిజ్‌స్థాన్ (బిష్కెక్)లో తెలుగువారు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీఎన్‌ఆర్టీఎస్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కిర్గిజ్‌స్థాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడుల జరుగుతున్న నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా కిర్గిజ్‌స్థాన్‌లోని తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్టు ఏపీఎన్‌ఆర్టీఎస్ చైర్మన్ వెంకట్ మేడపాటి తెలిపారు. ఏపీకి చెందిన ప్రజలు, విద్యార్థులు ఏపీఎన్‌ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 863 2340678, +91 8500027678 (డబ్ల్యూ)తో పాటు కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ 0555710041ను సంప్రదించాలని సూచించారు. ఏపీఎన్‌ఆర్టీఎస్ ఈ–మెయిల్స్: info@apnrts.com; helpline@apnrts. com ద్వారా కూడా సంప్రదించొచ్చని పేర్కొన్నారు.
భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం ఏపీఎన్‌ఆర్టీఎస్ ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మెడిసిన్ చదివేందుకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలిసిందని, వీరంతా క్షేమంగా సురక్షిత ప్రదేశాల్లో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment