ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి | Turkish Airlines cargo jet crash in Kyrgyzstan | Sakshi
Sakshi News home page

ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి

Published Mon, Jan 16 2017 9:31 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి

ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి

బిష్‌కెక్‌: కిర్జిస్థాన్లోని మనాస్‌ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం టర్కీష్‌ ఎయిర్‌లైన్స్ కార్గోకు చెందిన విమానం జనావాసాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 32 మంది మరణించారని కిర్జీ ప్రభుత్వం ప్రకటించింది.

సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఓ పైలట్‌, మరో 29 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇళ్లపై విమానం కూలిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మృతుల్లో స్థానికులే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా విమానంలో ఎంత ఉన్నారు, ఎక్కడకు వెళ్తోంది వంటి విషయాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement