jet crash
-
బయలుదేరిన కొద్దిసేపటికే..
మాడ్రిడ్: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో మిలటరీ యుద్ధవిమానం కూలిన ఘటనలో పైలట్ చనిపోయాడు. టోర్రెజోన్ డి ఆర్డోజ్ ఎయిర్‌బేస్ నుంచి మంగళవారం ఉదయం ఎఫ్-18 ఫైటర్ జెట్ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీంతో పైలట్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్ జాతీయదినం సందర్భంగా ప్రదర్శించే జెట్ విమానల్లో ఇదీ ఒకటని అధికారులు తెలిపారు. మృతి చెందిన పైలట్ ముర్సియాకు చెందిన లెఫ్టినెంట్ ఫెర్నాండో పెరెజ్ సెరానో(26) అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో అతడొక్కడే ఉన్నాడని వెల్లడించింది. కాగా, స్పెయిన్‌లో వారం వ్యవధిలో జరిగిన రెండో విమాన ప్రమాద ఘటన ఇది. గత గురువారం ఆల్బాసెట్ మిలటరీ బేస్ నుంచి బయలుదేరిన యూరోఫైటర్ జెట్ విమానం కూలిపోగా పైలట్ మృత్యువాతపడ్డాడు. -
ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి
-
ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి
బిష్కెక్: కిర్జిస్థాన్లోని మనాస్ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం టర్కీష్ ఎయిర్‌లైన్స్ కార్గోకు చెందిన విమానం జనావాసాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 32 మంది మరణించారని కిర్జీ ప్రభుత్వం ప్రకటించింది. సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఓ పైలట్, మరో 29 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇళ్లపై విమానం కూలిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మృతుల్లో స్థానికులే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా విమానంలో ఎంత ఉన్నారు, ఎక్కడకు వెళ్తోంది వంటి విషయాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
రష్యాలో విమాన ప్రమాదం, 50 మంది మృతి
స్థానిక ఎయిర్ లైన్ కు చెందిన బోయింగ్ 737 విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైన ఘటనలో 50 మంది మృతి చెందారు. ఈ విమానంలో 44 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ దుర్ఘటన వెస్టర్న్ తతర్స్ఠాన్ సమీపంలో చోటుచేసుకుంది. మాస్కో డమోదేద్వ్ ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న విమానం కజన్ లోని ఓల్గాలో 7.25 ప్రమాదానికి గురైంది. రన్ వేను ఢికొట్టడంతో మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురి కావడానికి ముందు మూడు సార్లు ల్యాండింగ్ అవటానికి ప్రయత్నం జరిగింది అని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.