మాడ్రిడ్: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో మిలటరీ యుద్ధవిమానం కూలిన ఘటనలో పైలట్ చనిపోయాడు. టోర్రెజోన్ డి ఆర్డోజ్ ఎయిర్‌బేస్ నుంచి మంగళవారం ఉదయం ఎఫ్-18 ఫైటర్ జెట్ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీంతో పైలట్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్ జాతీయదినం సందర్భంగా ప్రదర్శించే జెట్ విమానల్లో ఇదీ ఒకటని అధికారులు తెలిపారు. మృతి చెందిన పైలట్ ముర్సియాకు చెందిన లెఫ్టినెంట్ ఫెర్నాండో పెరెజ్ సెరానో(26) అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో అతడొక్కడే ఉన్నాడని వెల్లడించింది.
కాగా, స్పెయిన్‌లో వారం వ్యవధిలో జరిగిన రెండో విమాన ప్రమాద ఘటన ఇది. గత గురువారం ఆల్బాసెట్ మిలటరీ బేస్ నుంచి బయలుదేరిన యూరోఫైటర్ జెట్ విమానం కూలిపోగా పైలట్ మృత్యువాతపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment