ఇటీవలి కాలంలో జనాలు.. మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్న సంగతి తెలిసిందే. కొందరైతే ఫోన్‌ల ధ్యాసలో పడి వారి పరిసరాల్లో ఏం జరుగుతుందో గమనించకుండా .. ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల అలాంటి ఘటనే స్పెయిన్‌లోని ఉత్తర మడ్రిడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. రైలు ఫ్లాట్‌పామ్‌పైకి వస్తున్న సమయంలో ఓ మహిళ లేచి ముందుకు నడవసాగింది. అయితే మొబైల్ చూడటంలో బిజీగా ఉన్న ఆమె.. ఫ్లాట్‌పామ్ ఎక్కడివరకు ఉందో కూడా చూసుకోకుండా వెళ్లారు. దీంతో ఆమె ట్రైన్‌కు ముందు కొద్ది దూరంలో పట్టాలపై పడిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయింది. ఈ వీడియోను మడ్రిడ్ మెట్రో అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.అయితే ఈ ప్రమాదం నుంచి ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా సమాచారం.
⚠ Por tu seguridad, levanta la vista del móvil cuando vayas caminando por el andén.#ViajaSeguro #ViajaEnMetro pic.twitter.com/0XeQHPLbHa
— Metro de Madrid (@metro_madrid) October 24, 2019
Comments
Please login to add a commentAdd a comment