Madrid
-
యూరో ఛాంపియన్స్‌కు గ్రాండ్ వెల్కమ్.. జనసంద్రంలా మారిన మాడ్రిడ్ (ఫొటోలు)
-
నాటో భద్రతకు రష్యాతో ముప్పు
మాడ్రిడ్ (స్పెయిన్): నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గజేషన్ (నాటో) సభ్య దేశాల శాంతిభద్రతలకు రష్యా నేరుగా ముప్పుగా పరిణమించిందని అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వెలిబుచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద భద్రతా ముప్పుని ఎదుర్కొంటున్నామన్నాయి. యూరప్‌లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత కుదుర్చుకున్న భద్రతాపరమైన ఒప్పందాలను రష్యా తుంగలోకి తొక్కి ఉక్రెయిన్‌పై దండెత్తిందని ధ్వజమెత్తాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో బుధవారం నాటో సభ్య దేశాల వార్షిక సదస్సు జరిగింది. అనంతరం 30 దేశాల నాటో కూటమి ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు రాజకీయంగా, ఆచరణీయంగా మద్దతిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరప్‌లో శాంతిని విచ్ఛిన్నం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోటెన్‌బెర్గ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో సభ్య దేశాలకు భద్రతాపరంగా పెను సవాళ్లు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలండ్‌లో శాశ్వత సైనిక కేంద్రం యూరప్‌కు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రాంతీయ భద్రత కోసం పోలండ్‌లో తొలి శాశ్వత మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమెరికాకు చెందిన లక్ష బలగాలు నిరంతరం యూరప్‌లో ఉండేలా చూస్తామన్నారు. -
20 ఏళ్లుగా పరారీలో డాన్.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు
టెక్నాలజీ.. ఆక్సిజన్ తర్వాత మనిషికి అవసరంగా మారింది. అయితే మనిషి తన కంఫర్ట్ లెవల్స్ పెరిగే కొద్దీ.. టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ పోతున్నాడు. ఆపత్కాలంలో మనుషుల ప్రాణాల్ని కాపాడడమే కాదు.. అవసరమైతే సంఘవిద్రోహ శక్తుల వేటలోనూ సాయం చేస్తోంది సాంకేతిక పరిజ్ఞానం. ఇందుకు ఉదాహరణే.. ఇటలీలో జరిగిన ఓ ఘటన. పోలీసుల్ని సైతం ముప్పుతిప్పలు పెట్టిన కరడు గట్టిన నేరస్తుణ్ని 20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ పట్టించింది. ఇటలీ రాజధాని రోమ్‌లో 'స్టిడా' అనే సిసిలియన్ మాఫియా ఉంది. 2002 -03 మధ్య కాలంలో ఈ మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కటకటాల వెనక్కి నెట్టారు. అయితే జైలు శిక్షను అనుభవిస్తున్న మాఫియా డాన్ గియోఅచినో గామినో (61) రోమ్ రెబిబ్బియా జైలు నుండి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి నుంచి తప్పించుకుని మారు పేర్లు.. రకరకాల వేషాలతో కాలం గడిపాడు. గామినో పరారై 20ఏళ్లు గడిచినా.. ఇటలీ పోలీసులకు కంటిమీద కునుకు లేదు. ఈ నేపథ్యంలో చివరి అస్త్రంగా టెక్నాలజీని వాడాలనే బుద్ధి పోలీసులకు కలిగింది. ఇందుకోసం ఫోటోగ్రామ్ సాయం తీసుకుని..గామినో కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఫోటోగ్రామ్ ఫోటో సాయంతో గూగుల్ మ్యాప్‌ను అనుసంధానించారు. దేశవిదేశాల్ని జల్లెడపట్టారు. చివరికి మాడ్రిడ్(స్పెయిన్) గల్లీలపై నిఘా వేయగా.. గాలాపగర్ అనే ప్రాంతంలో ఓ పండ్ల దుకాణం ముందు ఉన్న గామినోను గూగుల్ మ్యాప్ గుర్తించింది. వెంటనే ఇటలీ పోలీసులను అలర్ట్ చేసింది. అప్రమత్తమైన పోలీసులు గామినోను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇటాలియన్ యాంటీ-మాఫియా పోలీస్ యూనిట్ (డీఐఏ) డిప్యూటీ డైరెక్టర్ నికోలా అల్టీరో హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలపాటు ముప్పుతిప్పలు పెట్టిన ఓ మాఫియా డాన్‌ను గూగుల్ మ్యాప్ పట్టించడంపై సోషల్ మీడియాలోనూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడు ప్రస్తుతం స్పెయిన్ కస్టడీలో ఉన్నాడని, ఫిబ్రవరి చివరి నాటికి అతన్ని ఇటలీకి తరలిస్తారని సమాచారం. చదవండి: మనుషులు పట్టించుకోలేదు.. స్మార్ట్ వాచ్ బతికించింది -
అయ్యో.. కుళ్లిన శవం, పీక్కుతిన్న పెంపుడు పిల్లులు
స్పెయిన్‌లో ఘోరం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న ఓ పెద్దావిడ చనిపోగా, ఆ విషయం మూడు నెలల దాకా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. ఇక ఆమె పెంచుకుంటున్న పిల్లులు ఆకలికి తాళలేక ఆమె మృతదేహాన్నే పీక్కుతిన్నాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాడ్రిడ్: క్లారా ఇనెస్ టోబోన్(79) అనే ఆవిడ నగరంలోని ఓ అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు ఆమె కొన్ని పిల్లుల్ని పెంచుకుంటోంది. పోయిన సొమవారం ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తలుపులు బద్ధలు కొట్టిన పోలీసులు అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. ఆమె రెండు పెంపుడు పిల్లులు.. కుళ్లిన ఆమె శవాన్ని పీక్కుతింటూ కనిపించాయి. కరోనా అనే అనుమానంతో.. ఇక ఈ కేసులో దారుణమైన విషయం ఒకటి బయటపడింది. క్లారా, కొలంబియా నుంచి మాడ్రిడ్‌కు వలస వచ్చింది. 1996 నుంచి శాన్ కుగట్ సెల్ వాల్లెస్లో ఒంటరిగా ఉంటోంది. పోయినేడాది ఆమె జబ్బుపడింది. దీంతో ఆమెకు కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఎవరూ సాయం అందించలేదు. కొన్ని నెలల క్రితం ఆమె దగ్గుతూ కనిపించిందని కొందరు చెప్పారు. వీధిలో పిల్లులకు ఆహారం పెట్టిందని, మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకుందని, ఆమెను చూడడం అదే చివరిసారని చుట్టుపక్కల వాళ్లు చెప్తున్నారు. కాగా, క్లారా మృతదేహాం నడుం పైభాగం వరకు పూర్తిగా కుళ్లిపోయి ఉంది. ఆమె పెంపుడు పిల్లులో అయిదు అక్కడే చచ్చిపడి ఉన్నాయి. చచ్చిన పిల్లుల కడుపులో ఆమె అవశేషాలున్నాయా? అనేది గుర్తించేందుకు వాటి శవాల్ని ల్యాబ్‌కు పంపించారు. ఆమె శవాన్ని పీక్కతుంటూ కనిపించిన రెండు పిల్లులూ.. దీనావస్థకి చేరుకున్నాయి. దీంతో వాటిని యానిమల్ షెల్టర్‌కు తరలించారు. క్లారా కరోనాతో చనిపోయిందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. కాగా, ఆమెకు బంధువులు ఎవరూ లేరని, డైజెనెస్ సిండ్రోమ్ డిజార్డర్(శుభ్రత పాటించకపోవడం, చెత్తను పోగు చేసుకోవడం)తో ఆమె బాధపడుతోందని, అందుకే ఆమెకు దగ్గరగా ఎవరూ వెళ్లేవాళ్లు కారని ఆ హౌజింగ్ అసోషియేషన్ హెడ్ చెబుతున్నాడు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో అరుదైన ప్రయోగం -
వీల్ ఛైర్లో ఉన్నా డ్యాన్స్ అదరగొట్టింది!
మాడ్రిడ్ : మనసు పెట్టి నేర్చుకున్న కొన్ని కళలు మనం మట్టిలో కలిసిపోయేంత వరకు మన ఆలోచనల్లో భాగంగానే ఉండిపోతాయి. ముసలి తనం వచ్చినా.. వ్యాధులు వేధిస్తున్నా.. అసలు ఏ పరిస్థితులో ఉన్నా వాటి సంగతులు గుర్తొచ్చినా.. ఎవరైనా గుర్తు చేసినా మనల్ని మనం మర్చిపోతాము. స్పెయిన్‌కు చెందిన ఓ బామ్మ ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. వాలెంన్సియాకు చెందిన మార్తా సీ గౌంజలెజ్ అనే బామ్మ యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఎంతో ఇష్టపడి ప్రిమా బాల్లెరినా డ్యాన్స్‌ను నేర్చుకుంది. ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అయితే వృద్ధాప్యంలో ఉండగా ఆమె అల్జీమర్స్ బారిన పడింది. కొద్దికొద్దిగా అన్ని జ్ఞాపకాలను మెదడు చెరిపేసుకుంటూ పోతోంది. (ఇన్‌స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’) 2019లో వీల్ ఛైర్‌కు పరిమితమైన ఆమెకు మనవడు ప్రిమా బాల్లెరినా డ్యాన్స్‌కు సంబంధించిన ఓ పాటను వినిపించాడు. వెంటనే ఆమె చేతులు అసంకల్పింతా వంపులు తిరిగాయి. ఆ వెంటనే ఓపిక లేదన్నట్లు తనను తాను నిగ్రహించుకుంది. మనవడి కోరిక మేరకు వీల్‌ఛైర్‌లోనే ఎంతో అందంగా డ్యాన్స్ చేసింది. అయితే ఆ సంవత్సరమే ఆమె మృత్యువాత పడటం బాధాకరం. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( పానీపూరీ.. ఇక నో పరేషాన్!) -
మరికొంత సమయం ఆగాల్సిందే!
మాడ్రిడ్: ప్రస్తుత పరిస్థితుల్లో టెన్నిస్ ఆట తిరిగి ఆరంభమవడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని 19 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ అభిప్రాయపడ్డాడు. ‘టెన్నిస్ విశ్వ క్రీడ... ప్రపంచం నలుమూలలా టెన్నిస్ ఈవెంట్లు జరుగుతాయి. మేము టెన్నిస్ ఆడటానికి ఒక దేశం నుంచి మరో దేశానికి తరచూ ప్రయాణించాల్సి ఉం టుంది. కానీ ప్రస్తుతం అలా జరిగే అవకాశమే లేదు.’ అని నాదల్ వ్యాఖ్యానించాడు. ప్రేక్షకులు లేకుండా టెన్నిస్ ఈవెంట్లను నిర్వహించినా తాను ఆడటానికి సిద్ధమేనని అయితే దానికి కూడా కొంత సమయం వేచి చూడాల్సిందేనని నాదల్ అన్నాడు. -
క్వారంటైన్లో నువ్వు.. బయట నేను!
మాడ్రిడ్: ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎజ్విక్వైల్ గారే (33)కు కరోనా సోకింది. లా లీగా లీగ్‌లో వెలెన్సియా తరఫున ఆడుతున్న అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గారే కరోనా బారిన పడ్డాడు. దాంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈ ఏడాది దుర్ముహూర్తంలో ప్రారంభమైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నాకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నా’ అని గారే తెలిపాడు. స్పెయిన్ జరగాల్సిన ఉన్న లా లీగాకు కూడా కరోనా సెగ తగలడంతో దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గారేకు కరోనా వైరస్ సోకింది. స్పెయిన్‌లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 9,190 కరోనా కేసులు నమోదవగా.. అందులో 300కి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.(కరోనా వైరస్ ఓ సునామీ) భార్య భావోద్వేగ ఫొటో ఎజ్విక్వైల్ గారే కరోనా బారిన పడటంతో అతని భార్య తమరా గోర్రో ఆవేదన వ్యక్తం చేశారు. గారేను ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో క్వారంటైన్ (నిర్భంధం)లో ఉంచిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కరోనా మనిద్దరికీ అడ్డుగోడలా నిలిచి సెపరేట్ చేసిందంటూ భావోద్వేగ ఫోటో పెట్టారు. అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న ఈ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం గారే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదవండి:గ్రాండ్ ప్రిన్సెస్’లో చిక్కుకుపోయిన 100 మంది భారతీయులు కరోనా సోకి యువ కోచ్ మృతి View this post on Instagram ❤️JUNTOS EN LA DISTANCIA❤️ (Eze lleva mascarilla por recomendación médica) #mamamolona #quedateencasa #otroreto #👑 A post shared by Tamara Gorro (@tamara_gorro) on Mar 16, 2020 at 5:07am PDT -
కటోవీస్ దారిలోనే మాడ్రిడ్!
పారిస్ శిఖరాగ్ర సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపుపై చరిత్రాత్మక ఒడంబడిక కుదిరినప్పటినుంచీ దాన్ని ఉల్లంఘించడమే ధ్యేయంగా పనిచేస్తున్న దేశాలకు ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సులు తప్పనిసరి లాంఛనం. ఈనెల 2 నుంచి 15 వరకూ స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో జరిగిన కాప్–25 సదస్సు కూడా ఆ కోవలోనిదే. దాదాపు 200 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో పారిస్ శిఖరాగ్ర సదస్సు ఆమోదించిన ఒడంబడిక 2030నాటికి అన్ని దేశాలూ 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33 నుంచి 35 శాతాన్ని తగ్గించాలని నిర్దేశించింది. ఆ దిశగా ఏ దేశం ఎలాంటి లక్ష్యాలు నిర్ణయించుకుంటున్నదో, ఆచరణలో అవి ఏవిధంగా సాగుతున్నాయో, సాఫల్యవైఫల్యాలేమిటో సమీక్షించడం కాప్ సదస్సుల ధ్యేయం. కానీ ఏడాది పొడవునా నిర్వా్యపక త్వంతో ఉండిపోయి, ఈ సదస్సులకు ప్రతి దేశమూ ముఖాలు వేలాడేసుకు వస్తున్నాయి. సాధించిం దేమీ లేక, చెప్పడానికేమీ మిగలక తదుపరి కాప్ సదస్సుకు చర్చలను వాయిదా వేసుకుని తిరుగు ముఖం పడుతున్నాయి. తమ చేతగానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ సదస్సులను అనుకున్న కంటే మరో రెండురోజులో, నాలుగురోజులో, వారంరోజులో పొడిగించడం, ఏదో జరుగు తోందన్న అభిప్రాయం ప్రపంచ పౌరుల్లో కలిగించడం దేశాలు అనుసరించే ఎత్తుగడ. వాస్తవానికి కాప్–25 సదస్సుకు తాము ఆతిథ్యమిస్తామని రెండేళ్లక్రితం చెప్పిన బ్రెజిల్ అక్కడ ప్రభుత్వం మారాక నిరుడు మాట మార్చింది. దాంతో ఆ వేదికను చిలీ రాజధాని శాంటియాగోకు మార్చవలసి వచ్చింది. అయితే ఉద్యమాలతో అట్టుడుకుతున్న చిలీ ఈ సదస్సును నిర్వహించే స్థితిలో లేకపోవడంతో అది కాస్తా మాడ్రిడ్‌కు మారింది. ఈసారి సదస్సు సమయానికి ఒక్క చిలీ మాత్రమే కాదు... వేరే దేశాలు కూడా వేర్వేరు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఫ్రాన్స్‌లో దేశవ్యాప్త సమ్మె సాగింది. బ్రిటన్ ఎన్నికల హడావుడి, ప్రభుత్వం ఏర్పాటు వగైరాల్లో బిజీగా ఉంది. ప్రపంచంలో అతి పెద్ద కాలుష్య కారక దేశంగా ముద్రపడిన చైనా హాంకాంగ్ ఉద్యమంతో ఊపిరాడకుండా ఉంది. రెండో స్థానంలో ఉన్న అమెరికా ఇప్పటికే పారిస్ ఒడంబడిక నుంచి తప్పుకుంది. అమెజాన్ మహారణ్యాల్లో ఏడు శాతం వరకూ వాటావున్న బొలీవియాలో ప్రభుత్వం సైనిక తిరుగుబాటులో కుప్పకూలింది. ఇక ఆ అర ణ్యాలు 60 శాతం మేర ఉన్న బ్రెజిల్ దాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ధ్వంసం చేసింది. పర్యావరణానికి ప్రమాదం ముంచుకొస్తున్నదన్న వాదనంతా పెట్టుబడిదారీ దేశాలను దెబ్బతీయడానికి ‘మార్క్సి స్టులు’ పన్నిన కుట్రగా జైర్ బోల్సొనారో నాయకత్వంలోని మితవాద ప్రభుత్వం అభివర్ణిస్తోంది. భూగోళం ఉనికికే పెనుముప్పు తీసుకురాగల కాలుష్యాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోవడమే కాప్ సదస్సుల వరస వైఫల్యానికి కారణం. పారిస్ ఒడంబడిక ఎంత చరిత్రాత్మకమైనది అయినా అందులోని అంశాలు అమలు చేయని దేశాలకు భారీ జరిమానా విధిం చడం, అభిశంసించడం వంటి నిబంధనలు లేకపోవడంతో ఆ లక్ష్యాలను సాధించడానికి ఏ దేశమూ చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. పర్యావరణం ప్రమాదంలో పడిందన్న విషయంలో అమెరికా, బ్రెజిల్ తప్ప అందరూ ఏకీభవిస్తున్నారు. నిజానికి పారిస్ ఒడంబడిక ఆ ప్రమాదాన్ని అవసరమైన స్థాయిలో పట్టించుకోలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచ దేశాలు అనేక ఉత్పాతాలను చవిచూశాయి. మొన్న సెప్టెంబర్‌లో బహామస్ను చుట్టుముట్టిన పెనుతుపాను డోరియన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కేటగిరీ 5లో చేర్చిన ఈ తుపాను వల్ల 70మంది ప్రాణాలు కోల్పోగా, 340 కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది. అగ్రరాజ్యాల చర్యల పర్యవసానాలను చిన్న దేశాలు ఎలా భరించవలసి వస్తున్నదో చెప్పడానికి బహామస్ దేశమే ఉదాహరణ. ఇదొక్కటే కాదు... వనౌతు, తువాలు వంటి అతి చిన్న ద్వీపకల్ప దేశాలు కూడా తరచూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లోనే చిక్కు కుంటున్నాయి. ఇలాంటి చిన్న దేశాలను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత, శిలాజ ఇంధనాల్ని యథేచ్ఛగా వాడుతూ లాభాలు గడిస్తున్న అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఉంది. కానీ వీరిలో ఏ ఒక్కరూ ఆ సంగతిని గుర్తించడం లేదు. మాడ్రిడ్ సదస్సులో జరిగిన చర్చల తర్వాత ఈ దేశాలు నామమాత్రమైన సాయాన్ని విదిల్చి తమ బాధ్యత తీరినట్టు ప్రవర్తించాయి. పారిస్ ఒడంబడిక లక్ష్యాలు ఏమిటో, వాటిని సాధించడానికి ఏం చేయాలో ప్రతి దేశానికీ తెలుసు. అన్ని దేశాలూ ఒకే స్థాయిలో కాలుష్యానికి కారణం కావడం లేదు. అలాగే ఈ కాలుష్య పర్య వసానాలను అన్ని దేశాలూ సమాన స్థాయిలో చవి చూడటం లేదు. ఏ ఒక్క దేశమో పూనుకుని ఈ కాలుష్యాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు. కనుక ప్రతి దేశమూ కాలుష్యంలో తన బాధ్యతను నిజాయితీతో గ్రహించి, దాని అదుపునకు గరిష్టంగా ఏం చేయగలనో నిర్ణయించుకోవాలి. అందరి లక్ష్యమూ కాలుష్యాన్ని అంతం చేయడమే అయినా, ఎవరెంత కారకులన్న దాన్నిబట్టి భారాన్ని పంచు కోవాలి. కానీ సంపన్న దేశాల వైఖరి వేరుగా ఉంది. అతిగా కాలుష్యాన్ని విడుస్తున్నా దానికి దీటైన చర్యలుండటం లేదు. కనుకనే అందరి మెడలూ వంచే విధంగా నిబంధనలుండాలి. ఆ నిబంధనల మాట అటుంచి కర్బన ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో విఫలమైన దేశాలు తప్పించుకోవడానికి పారిస్ ఒడంబడిక వీలు కల్పించింది. అందులోని ఆరో అధికరణ అటువంటిదే. కర్బన ఉద్గారాల అదుపులో విఫలమైన సంపన్న దేశం... వాగ్దానానికి మించి అదుపు చేసిన దేశాలనుంచి ఆ ‘అదనాన్ని’ కొనుగోలు చేయొచ్చునని చెప్పే ఈ అధికరణ పరిస్థితి మెరుగుదలకు ఏమైనా దోహదపడుతుందా? మొత్తానికి ఈ సదస్సు ఎప్పటిలాగే సమస్యల్ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది బ్రిటన్‌లోని గ్లాస్గోలో వాటిని పరిష్కరిస్తామని ఆశాభావం వెలిబుచ్చింది. కానీ నమ్మేదెవరు? నిర్ణయాత్మకంగా వ్యవహరిం చలేని ఇలాంటి సదస్సులు చివరకు నిరర్థకమవుతాయి తప్ప సాధించేదేమి ఉండదు. -
ఫలితం లేకుండానే ముగిసిన ‘కాప్’
మాడ్రిడ్: దాదాపు 200 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు సీఓపీ25 ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. ఈనెల 2నుంచి 13 వరకూ జరగాల్సిన సమావేశాల్లో ఫలితం తేలకపోవడంతో ఆదివారం వరకూ పొడిగించారు. అయినప్పటికీ కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015 పారిస్ ఒప్పందం చేసిన సూచనలను అమలు చేసే దిశగా అడుగులు పడలేదు. వచ్చే ఏడాది స్కాట్లాండ్ (గ్లాస్గో)లో జరగనున్న సీఓపీ26 సదస్సులో వాటిని చర్చించాలని నిర్ణయించారు. ఈ సదస్సులో పలు అంశాలు చర్చకు వచ్చినప్పటికీ ఎటువంటి అంగీకారం కుదరలేదు. -
స్వలింగ సంపర్కంతో డెంగ్యూ వ్యాప్తి
మాడ్రిడ్: స్వలింగ సంపర్కం ద్వారా డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందడాన్ని స్పెయిన్ వైద్యులు తొలిసారిగా గుర్తించారు. మాడ్రిడ్ నగరానికి చెందిన 41 ఏండ్ల ఓ స్వలింగ సంపర్కుడు డెంగ్యూ సోకిన తన సహచరుడితో లైంగిక చర్యలో పాల్గొనడంతో అతనికి కూడా డెంగ్యూ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా సదరు వ్యక్తి సహచరుడు క్యూబా పర్యటనలో ఉండగా అతనికి డెంగ్యూ వైరస్ సోకినట్టు మాడ్రిడ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అయితే తొలుత దోమకాటు కారణంగా డెంగ్యూ సోకిందని భావించిన వైద్యులు.. వివిధ రకాల వైద్య పరీక్షల అనంతరం అసలు నిజం వెల్లడైంది. అయితే స్వలింగ సంపర్కం ద్వారా డెంగ్యూ సోకడం ఇదే తొలిసారి అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా గత కొంతకాలంగా భారత్ పాటు ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ భారీనపడి ఇప్పటికే అనేకమంది మృత్యువాత పడ్డారు. -
ఫోన్లో మునిగి.. పట్టాలపై పడి..
-
ఫోన్లో మునిగి.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా?
మ్యాడ్రిడ్: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని మరిచిపోతాం అనేందుకు తాజా ఉదాహరణ ఇది. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లోని ఓ రైల్వే స్టేషన్లో రైలు కోసం కూర్చున్న ఓ యువతి స్మార్ట్‌ఫోన్‌లో మునిగితేలుతోంది. ఇంతలో రైలు స్టేషన్లోకి రావడంతో ఆ యువతి ముందుకు అడుగులు వేసింది. రైలు ఇంకా రాకమునుపే.. రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో రైలు పట్టాలపై పడిపోయింది. ప్రస్తుతం ఈ ఘటన వీడియో వైరల్ అయింది. వీడియో ఆమె పట్టాలపై పడినంత వరకే ఉండటంతో తనకు ఏమైందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీనిపై అధికారులు ట్విటర్లో స్పందిస్తూ.. స్వల్ప గాయాలతో సదరు యువతి బయటపడినట్లు వెల్లడించారు. -
ఫోన్ చూసుకుంటూ వెళ్తే..
ఇటీవలి కాలంలో జనాలు.. మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్న సంగతి తెలిసిందే. కొందరైతే ఫోన్ల ధ్యాసలో పడి వారి పరిసరాల్లో ఏం జరుగుతుందో గమనించకుండా .. ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల అలాంటి ఘటనే స్పెయిన్‌లోని ఉత్తర మడ్రిడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెట్రో స్టేషన్లో ప్రయాణికులు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. రైలు ఫ్లాట్‌పామ్‌పైకి వస్తున్న సమయంలో ఓ మహిళ లేచి ముందుకు నడవసాగింది. అయితే మొబైల్ చూడటంలో బిజీగా ఉన్న ఆమె.. ఫ్లాట్‌పామ్ ఎక్కడివరకు ఉందో కూడా చూసుకోకుండా వెళ్లారు. దీంతో ఆమె ట్రైన్‌కు ముందు కొద్ది దూరంలో పట్టాలపై పడిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయింది. ఈ వీడియోను మడ్రిడ్ మెట్రో అధికారులు ట్విటర్లో పోస్ట్ చేశారు.అయితే ఈ ప్రమాదం నుంచి ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా సమాచారం. ⚠ Por tu seguridad, levanta la vista del móvil cuando vayas caminando por el andén.#ViajaSeguro #ViajaEnMetro pic.twitter.com/0XeQHPLbHa — Metro de Madrid (@metro_madrid) October 24, 2019 -
యువతి సెన్సేషన్ కోసం అర్థనగ్నంగా..
-
మ్యాచ్ జరుగుతుండగా.. అర్ధనగ్నంగా
మాడ్రిడ్: ప్రస్తుత యువత సెన్సేషన్ కోసం దేనికైనా తెగిస్తున్నారు. ఎవరో ఏదో ఒక చోట ఓవర్ నైట్ స్టార్ అయ్యారని, వారిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు. నలుగురు ఏమనుకుంటారు, ఎవరికైనా ఇబ్బందులు కలిగిస్తున్నామా అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు చేసేస్తున్నారు. ఒక్కోసారి వారు చేసే వెకిలిచేష్టలు విజయవంతమయి ఓవర్ నైట్ స్టార్ అవుతున్నారు. మరికొందరి ప్రయత్నాలు విఫలమై కటకటాల పాలవుతున్నారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్ లో చాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా, ఓ యువతి అర్థనగ్నంగా గ్రౌండ్ లోకి వచ్చి సంచలనం సృష్టించింది. కిన్సే వోలాన్స్స్కీగా అనే రస్యా మోడల్ తరచూ ఇలా సంచలనం కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడం అలవాటుగా మార్చుకుందట. అందుకే ఫుట్ బాల్ మ్యాచ్ లో ఇలా బరితెగించి ఒళ్లు మైమరిచి పరుగులు అందుకుంది. సెక్యూరిటికి దొరకకుండా గ్రౌండ్ మొత్తం పరిగెత్తింది. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. చివరికి మ్యాచ్ నిర్వాహకులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో గర్వంగా షేర్ చేసింది వోలాన్స్స్కీగా. ‘ఈ రోజు చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కోసం ఇలా వెళ్లాను. ఎంతో గర్వంగా ఉంది’అంటూ ఫోటోతోపాటు ఈ కామెంట్‌ను జతచేసింది. యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌నైట్ స్టార్ కావడం కోసం స్విమ్మింగ్ డ్రెస్‌లో మ్యాచ్‌కు వెళతావా నీకు ఇంతనైనా సిగ్గుందా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రొనాల్డోకు రూ.152 కోట్ల జరిమానా
మాడ్రిడ్ (స్పెయిన్): దాదాపు రెండేళ్ల జైలు శిక్ష నుంచి ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తప్పించుకున్నాడు. స్పెయిన్ దేశంలో ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన కేసుకు సంబంధించి భారీ జరిమానా చెల్లించేందుకు అతను సిద్ధపడ్డాడు. దీనికి అంగీకరించిన కోర్టు జైలు శిక్ష నుంచి రొనాల్డోను విముక్తుడిని చేసింది. దీని ప్రకారం రొనాల్డో కోటీ 88 లక్షల యూరోలు (సుమారు రూ. 152 కోట్లు) ప్రభుత్వానికి జరిమానాగా చెల్లించనున్నాడు. వివరాల్లోకెళితే... స్పెయిన్ క్లబ్ రియల్ మాడ్రిడ్ తరఫున 2009 నుంచి 2018 వరకు రొనాల్డో ఆడాడు. అయితే 2011–14 మధ్యలో తనకు వచ్చిన ఆదాయాన్ని అతను బాగా తగ్గించి చూపుతూ పన్ను ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు. పైగా నిబంధనల ప్రకారం తక్కువగా పన్ను చెల్లించాల్సి వచ్చే రియల్ ఎస్టేట్‌లో తాను ఈ డబ్బులు సంపాదించానంటూ తప్పుడు నివేదిక కూడా ఇచ్చాడు. అయితే అధికారుల లెక్కల్లో ఇదంతా బయటపడింది. ఈ తప్పిదానికి దాదాపు 23 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉండేది. అయితే కొన్నాళ్ల క్రితమే జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ రొనాల్డో రాజీ ప్రతిపాదన చేశాడు. దానిపైనే మంగళవారం తన గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్వెజ్‌తో కలిసి కోర్టుకు హాజరు కాగా అతనికి ఊరట కలిగించే తీర్పు వచ్చింది. స్పెయిన్ న్యాయచట్టాల ప్రకారం తొలిసారి తప్పు చేసిన వారి శిక్ష రెండేళ్ల లోపు ఉంటే దానిని రద్దు చేసే అధికారం న్యాయమూర్తులకు ఉంటుంది. -
ఈ యేటి మేటి మోడ్రిచ్
పారిస్: తన అద్వితీయ ఆటతీరుతో ఈ ఏడాది క్రొయేషియాను ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన లుకా మోడ్రిచ్... 2018 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ బాల్’ (వరల్డ్ బెస్ట్ ప్లేయర్) అవార్డును అందుకున్నాడు. మోడ్రిచ్‌కు మొత్తం 753 ఓట్లు లభించగా... 476 ఓట్లతో రొనాల్డో రెండో స్థానంలో... 414 ఓట్లతో ఫ్రాన్స్ స్ట్రయికర్ గ్రీజ్మన్ మూడో స్థానంలో నిలిచారు. రొనాల్డో (పోర్చుగల్), మెస్సీ (అర్జెంటీనా) కాకుండా గత పదేళ్లలో ఈ అవార్డు నెగ్గిన తొలి ప్లేయర్ మోడ్రిచ్ కావడం విశేషం. ఈ ఏడాది కొత్తగా మహిళా ఫుట్‌బాల్ స్టార్‌కు గోల్డెన్ బాల్ పురస్కారాన్ని అందజేశారు. నార్వే స్ట్రయికర్ అడా హెగెర్బెర్గ్ ఈ అవార్డును అందుకుంది. -
ఓ పట్టుపట్టి స్వర్ణం సాధించింది
మాడ్రిడ్: గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ స్పెయిన్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సత్తా చాటింది. మాడ్రిడ్ వేదికగా జరుగుతున్న రెజ్లింగ్ క్రీడలో (50 కేజీల విభాగం) కెనెడాకు చెందిన నటాషా ఫాక్స్‌ను.. వినేశ్ 10-0 తేడాతో చిత్తు చేసింది. ఆరంభం నుంచే బౌట్లో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన వినేశ్.. చివరకు విజేతగా నిలిచింది. కాగా, 23 ఏళ్ల వినేశ్.. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌లో తొలి గేమ్ నుంచే సత్తా చాటుతూ వస్తోంది. కాగా, తాజా విజయంతో వచ్చే నెలలో జరగబోయే ఏషియన్ గేమ్స్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతానని ఆమె తెలిపింది. ఈ టోర్నీ కోసం తనకు కోచ్‌గా వ్యవహరించిన వోల్లర్ అకోస్(హంగేరి)ని.. పర్సనల్ ట్రైనర్‌గా ఇండియాకు రావాల్సిందిగా వినేశ్ ఆహ్వానించింది. ఇదిలా ఉంటే ఆగష్టు 18 నుంచి జకార్త, పాలెంబ్యాంగ్లో ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. -
రొనాల్డో ఇక యువెంటస్ క్లబ్‌కు
మాడ్రిడ్: పోర్చుగల్ కెప్టెన్, స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో... ఇకపై ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్‌కు ఆడనున్నాడు. గత తొమ్మిదేళ్లుగా అతడు స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు ఆడుతున్నాడు. కొత్త ఒప్పందం ప్రకారం రొనాల్డో నాలుగేళ్లపాటు యువెంటస్‌కు ఆడతాడు. సీజన్‌కు 3 కోట్ల యూరోలు (రూ. 241 కోట్లు) చొప్పున రొనాల్డోకు వేతనంగా లభిస్తాయని సమాచారం. ఒదిలీ ఒప్పందంలో భాగంగా యువెంటస్ క్లబ్ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్ మాడ్రిడ్‌కు చెలిస్తుందని స్పెయిన్ మీడియా వెల్లడించింది. తాజా మార్పుపై రొనాల్డో స్పందిస్తూ... ‘మాడ్రిడ్‌కు ఆడిన సమయం నా జీవితంలో అత్యంత సంతోషకరమైనది. జట్టు, అభిమానులు, నగరానికి నా ధన్యవాదాలు. కొత్త అధ్యాయం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. అందుకే బదిలీకి అంగీకరించమని కోరా. మద్దతుదారులంతా అర్ధం చేసుకోగలరు’ అని పేర్కొన్నాడు. రొనాల్డో ప్రాతినిధ్యంలో... రియల్ మాడ్రిడ్ ఈ సీజన్లో చాంపియన్స్ లీగ్‌ను గెల్చుకుంది. -
అది అత్యాచారం కాదు.. తీర్పుపై ఆగ్రహం
మాడ్రిడ్: సంచలనం రేపిన ప్యాంప్లోనా గ్యాంగ్ రేప్ కేసులో స్పెయిన్ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దుమారం రేపుతోంది. ఆమె ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొందని పేర్కొంటూ కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే యువతిపై వేధింపులకు పాల్పడ్డారన్న నిర్ధారణకు వచ్చిన న్యాయమూర్తి.. నిందితులకు 9 ఏళ్ల జైలు శిక్షను విధించారు. స్పెయిన్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన ఈ కేసులో లోతుల్లోకి వెళ్తే... రెండేళ్ల క్రితం ప్యాంప్లోనాలో బుల్ ఫైటింగ్ క్రీడల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న 18 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు(అంతా 20 ఏళ్లలోపు వాళ్లే) కారులోకి లాగి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ఘటనంతా వాట్సాప్‌లో వీడియోలుగా తీసి వైరల్ చేశారు. వీడియోల్లో ఆ యువకులు తాము డ్రగ్స్ ఇచ్చి యువతులపై ఇలా అత్యాచారానికి పాల్పడతామంటూ పేర్కొన్నారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మరుసటి రోజే నిందితులను అరెస్ట్ చేశారు. ‘వోల్ఫ్ ప్యాక్(తోడేళ్ల మంద)’ కేసుగా రెండేళ్లపాటు స్పెయిన్‌లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. జడ్జి అనూహ్య వ్యాఖ్యలు... విచారణ పూర్తికావటంతో గత గురువారం జడ్జి ఈ కేసులో తీర్పు వెలువరించారు. ఆ సమయంలో జడ్జి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘ఘటన జరిగిన సమయంలో వీడియోలను సాక్ష్యంగా చేసుకుని తీర్పు ఇస్తున్నాం. ఆ సమయంలో యువతి ఎలాంటి ప్రతిఘటన చెయ్యకుండా కళ్లు మూసుకుని ఉంది. అంటే ఇష్టపూర్వకంగానే ఆమె శృంగారంలో పాల్గొనట్లు తెలుస్తోంది. స్పెయిన్ క్రిమినల్ చట్టాలను అనుసరించి అత్యాచారం జరిగిన సమయంలో మహిళపై క్రూరమైన చేష్టలు జరగాలి. కానీ, ఈ కేసులో మహిళ సురక్షితంగానే ఉంది. అందుకే ఇది అత్యాచారంగా పరిగణించటం లేదు. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం. కానీ, ఆ యువకులు వైరల్ చేసిన వీడియోల ఆధారంగా ఆమెపై వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వారికి 9 ఏళ్ల శిక్ష విధిస్తున్నాం’ అని న్యాయమూర్తి ప్రకటించారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహం... ఈ తీర్పుపై స్పెయిన్ భగ్గుమంది. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. శనివారం సుమారు 35,000 మంది మహిళలు పాంపలోనాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆమెపై జరిగింది వేధింపులు కాదని.. అది ముమ్మాటికీ అత్యాచారమేనని మహిళలంతా ముక్తకంఠంతో నినదించారు. రేప్ జరిగిందని నిరూపించుకోవాలంటే బాధితురాలు చావాలా?. నిందితులకు మరణ శిక్షలు విధించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మాడ్రిడ్‌తోపాటు మరికొన్ని నగరాల్లో కూడా మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధితురాలికి న్యాయం చేయాలని.. జడ్జి రాజీనామాను కోరుతూ వారంతా నిరసనలు కొనసాగించారు. స్పెయిన్ న్యాయశాఖ మంత్రి రఫెల్ కటాలా కూడా కేసు విచారణలో జడ్జి తీరును తప్పుబట్టారు. మరోవైపు న్యాయవాదుల సంఘం జడ్జికి మద్ధతుగా నిలుస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోయిందని.. చట్టంలో సవరణలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ న్యాయశాఖ మంత్రికి చురకలు అంటించింది. తీర్పు నేపథ్యంలో క్యూఎంటాలో(నీ కథ చెప్పు...) పేరిట ఓ యాష్ ట్యాగ్ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. -
బయలుదేరిన కొద్దిసేపటికే..
మాడ్రిడ్: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో మిలటరీ యుద్ధవిమానం కూలిన ఘటనలో పైలట్ చనిపోయాడు. టోర్రెజోన్ డి ఆర్డోజ్ ఎయిర్‌బేస్ నుంచి మంగళవారం ఉదయం ఎఫ్-18 ఫైటర్ జెట్ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీంతో పైలట్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్ జాతీయదినం సందర్భంగా ప్రదర్శించే జెట్ విమానల్లో ఇదీ ఒకటని అధికారులు తెలిపారు. మృతి చెందిన పైలట్ ముర్సియాకు చెందిన లెఫ్టినెంట్ ఫెర్నాండో పెరెజ్ సెరానో(26) అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో అతడొక్కడే ఉన్నాడని వెల్లడించింది. కాగా, స్పెయిన్‌లో వారం వ్యవధిలో జరిగిన రెండో విమాన ప్రమాద ఘటన ఇది. గత గురువారం ఆల్బాసెట్ మిలటరీ బేస్ నుంచి బయలుదేరిన యూరోఫైటర్ జెట్ విమానం కూలిపోగా పైలట్ మృత్యువాతపడ్డాడు. -
ఆ గే రిఫరీ హర్టయ్యాడు
మాడ్రిడ్: తొలిసారి స్పానిష్ ఫుట్ బాల్ రిఫరీగా ఎంపికైన స్వలింగ సంపర్కుడు(గే) జీసస్ టొమిలెరో తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వరుసగా అవమానాలు ఎదురవుతుండటంతో రెండు నెలల్లోనే ఆ ఉద్యోగానికి బైబై చెప్పేశారు. క్రీడాకారుల నుంచి మద్దతుదారుల నుంచి వరుసగా వేధింపులు, అవమానాలు ఎదురవ్వడం వల్లే తాను తప్పుకుంటున్నట్లు ఈ సందర్భంగా జీసస్ చెప్పారు. అండల్సియాన్ లో పోర్చుగీస్ వర్సెస్ శాన్ ఫెర్నార్డో ఇస్లెనో మధ్య జరిగిన అండర్-19 మ్యాచ్ లో ఓ క్రీడాకారుడికి తాను పెనాల్టీ విధించిన తర్వాత కొంతమంది దారుణంగా తిట్టి అవమానించారని.. చుట్టూ ఉన్నవారంతా నవ్వారని, అది తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. 11 ఏళ్ల నుంచి రిఫరీగా పనిచేస్తున్న జీసస్ టొమిలెరో.. కొద్ది నెలల కిందటే తాను గేనని బహిరంగంగా చెప్పాడు. అప్పటి నుంచి తీవ్ర అవమానాలు ప్రారంభం కావడంతో విధులకు గుడ్ బై చెప్పాడు. -
హిట్.. హిట్.. ముర్రే
మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ సొంతం ⇒ ‘క్లే కింగ్’ నాదల్‌పై ఘనవిజయం ⇒ రెండు వారాల్లో రెండో టైటిల్ మాడ్రిడ్: క్లే కోర్టులపై తొలి టైటిల్ సాధించేందుకు పదేళ్లపాటు నిరీక్షించిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఊహించనివిధంగా వారం తిరిగేలోపు రెండో టైటిల్ సాధించి ఆశ్చర్యపరిచాడు. ‘క్లే కోర్టు’లపై తిరుగులేని రాఫెల్ నాదల్‌ను చిత్తుగా ఓడించి నెగ్గడం ఇక్కడ విశేషం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ ఫైనల్లో ముర్రే 6-3, 6-2తో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై నెగ్గి విజేతగా నిలిచాడు. గతవారం మ్యూనిచ్ ఓపెన్‌లోనూ ముర్రే చాంపియన్‌గా నిలిచి తన కెరీర్లో తొలిసారి క్లే కోర్టులపై టైటిల్ సాధించాడు. ఏప్రిల్ 11న తన చిన్ననాటి స్నేహితురాలు కిమ్ సియర్స్‌ను వివాహం చేసుకున్నాక ముర్రే ఆడిన రెండు టోర్నీల్లోనూ టైటిల్స్ నెగ్గ డం విశేషం. విజేతగా నిలిచిన ముర్రేకు 7,99,450 యూరోల (రూ. 5 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పదేళ్ల తర్వాత ‘ఐదు’ బయటకు నాదల్ మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయిన రాఫెల్ నాదల్ ర్యాంకింగ్స్‌లోనూ పడిపోయాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ స్పెయిన్ స్టార్ నాలుగు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోయాడు. 2005 తర్వాత నాదల్ టాప్-5 ర్యాంకుల్లో లేకపోవడం ఇదే తొలిసారి. జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆండీ ముర్రే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ప్రపంచంలో అతి తక్కువ ఖరీదైన నగరం.. ముంబై
లండన్: ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖరీదైన నగరంగా(జీవించడానికి, పనిచేయడానికి) ముంబై నిలిచింది. ఇక అత్యంత ఖరీదైన నగరంగా హాంగ్‌కాంగ్‌ను తోసిరాజని లండన్ మొదటి స్థానంలోకి దూసుకువచ్చిందని ఇంగ్లండ్‌కు చెందిన రియల్టీ సంస్థ శావిల్స్ నివేదిక పేర్కొంది. అద్దెలు, జీవించడానికి, పనిచేయడానికి లండన్ అత్యంత ఖరీదైనదంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..., కంపెనీలు ఒక్కో ఉద్యోగికి చేసే వార్షిక వ్యయం లండన్‌లో 1,20,568 డాలర్లుగా ఉంది. అదే ముంబైలో అయితే ఇది 29,742 డాలర్లు. 12 నగరాలతో రూపొందిన ఈ అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబైది చివరి స్థానం. లండన్ తర్వాత 1,15,717 డాలర్ల వార్షిక ఉద్యోగ వ్యయంతో హాంకాంగ్ రెండో అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూ యార్క్(1,07,782 డాలర్లు), ప్యారిస్(1,05,550 డాలర్లు)లు నిలిచాయి. 63,630 డాలర్లు వార్షిక ఉద్యోగ వ్యయంతో ఆస్ట్రేలి యాకు చెందిన సిడ్నీ అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 43,171 డాలర్లతో షాంఘై 10వ స్థానంలో, 32,179 డాల ర్లతో రియోడీజెనీరో 11వ స్థానంలో నిలిచాయి. 2008లో ఐదో స్థానంలో ఉన్న లండన్ ఈ ఏడాది మొదటి స్థానంలోకి వచ్చింది. అయితే 2011లో హాంకాంగ్ 1,28,000 డాలర్లతో అత్యంత ఖరీదైన నగరంగా అవతరించింది. ఈ ఏడాది మొదటి స్థానంలోకి వచ్చినప్పటికీ లండన్ 2011 నాటి హాంకాంగ్ స్థాయిని అందుకోలేకపోయింది. ఇక రెసిడెన్షియల్ ప్రోపర్టీ విషయానికొస్తే ఇప్పటికీ హాంకాంగ్‌దే పై చేయి. లండన్‌తో పోల్చితే హాంకాంగ్‌లో నివాస ప్రాపర్టీ ధరలు 40% అధికం. -
క్వార్టర్స్‌లో ఓడిన సానియా జోడి
మాడ్రిడ్: డబ్ల్యూటీఏ మాడ్రిడ్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, కారా బ్లాక్ (జింబాబ్వే) పోరాటం క్వార్టర్ఫైనల్లో ముగిసింది. ఇటీవల పోర్చుగల్ ఓపెన్‌ను గెలుచుకున్న ఈ జోడి 7-5, 1-6, 8-10 తేడాతో తైపీస్ చైనీస్ జంట సు వీ సే, షువా పెంగ్ చేతిలో ఓడింది. గంటా 30 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా, బ్లాక్ తొలి సెట్‌ను గెలుచుకున్నా రెండో సెట్లో చేతులెత్తేసింది. ఆఖరి సెట్లో పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగినా సూపర్ టైబ్రేక్‌లో ప్రత్యర్థి ఆధిక్యం సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న, ఐజమ్ ఉల్ ఖురేషి (పాక్) జోడికి తొలి రౌండ్లో బై లభించింది. వీరు ప్రిక్వార్టర్స్‌లో ఆండ్రియాస్ సెప్పీ (ఇటలీ), మిలాస్ రవోనిక్ (కెనడా)తో తలపడతారు.