
పట్టాలపై పడబోతున్న యువతి(వృత్తంలో)
మ్యాడ్రిడ్: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని మరిచిపోతాం అనేందుకు తాజా ఉదాహరణ ఇది. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం కూర్చున్న ఓ యువతి స్మార్ట్‌ఫోన్‌లో మునిగితేలుతోంది. ఇంతలో రైలు స్టేషన్‌లోకి రావడంతో ఆ యువతి ముందుకు అడుగులు వేసింది. రైలు ఇంకా రాకమునుపే.. రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో రైలు పట్టాలపై పడిపోయింది. ప్రస్తుతం ఈ ఘటన వీడియో వైరల్ అయింది. వీడియో ఆమె పట్టాలపై పడినంత వరకే ఉండటంతో తనకు ఏమైందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీనిపై అధికారులు ట్విటర్‌లో స్పందిస్తూ.. స్వల్ప గాయాలతో సదరు యువతి బయటపడినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment