
పారిస్: తన అద్వితీయ ఆటతీరుతో ఈ ఏడాది క్రొయేషియాను ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన లుకా మోడ్రిచ్... 2018 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ బాల్’ (వరల్డ్ బెస్ట్ ప్లేయర్) అవార్డును అందుకున్నాడు. మోడ్రిచ్‌కు మొత్తం 753 ఓట్లు లభించగా... 476 ఓట్లతో రొనాల్డో రెండో స్థానంలో... 414 ఓట్లతో ఫ్రాన్స్ స్ట్రయికర్ గ్రీజ్‌మన్ మూడో స్థానంలో నిలిచారు.
రొనాల్డో (పోర్చుగల్), మెస్సీ (అర్జెంటీనా) కాకుండా గత పదేళ్లలో ఈ అవార్డు నెగ్గిన తొలి ప్లేయర్ మోడ్రిచ్ కావడం విశేషం. ఈ ఏడాది కొత్తగా మహిళా ఫుట్‌బాల్ స్టార్‌కు గోల్డెన్ బాల్ పురస్కారాన్ని అందజేశారు. నార్వే స్ట్రయికర్ అడా హెగెర్‌బెర్గ్ ఈ అవార్డును అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment