Croatia
-
రొమ్ము క్యాన్సర్‌కు అరుదైన చికిత్స
కేన్సర్.. ఒకప్పుడు పేరు వినడానికే భయపడిన మహమ్మారి.. ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. అధైర్యపడకుండా చికిత్సతో దాన్ని జయిస్తున్నవారు కొందరైతే.. కారణాలేవైనా ఇంకొందరు ప్రాణాలు పోతున్నాయి. వ్యాధి భయం కంటే.. చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపీ చూపించే నరకం అధికం. అలాంటివేవీ లేకుంటా కేన్సర్‌ను జయించారో శాస్త్రవేత్త. తనకు వచ్చిన రొమ్ము క్యాన్సర్‌కు తానే చికిత్స చేసుకుని చరిత్రలో నిలిచారు. అయితే దీనిపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఇది అన్ని దశల్లోనూ ఉపయోగించలేమంటున్నారు. క్రొయేషియాకు చెందిన 50 ఏళ్ల బీటా హలాస్సీ శాస్త్రవేత్త. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. గతంలోనే కేన్సర్ డిటెక్ట్ అవ్వడంతో మాస్టెక్టమీ చేయించుకున్నారు. 2020లో మళ్లీ పునరావృతమైంది. ఈసారి మూడో స్టేజీ. సాధారణంగా హడలెత్తిపోతాం. కానీ ఆమె అలా కాదు. ధైర్యంగా ఎదుర్కొంది. కాకపోతే.. మొదటి సారి కీమోథెరపీతోనే విసిగిపోయిన ఆమె.. ఈసారి అటువైపు మొగ్గుచూపలేదు. తనకు తానే చికిత్స చేసుకోవాలనుకున్నారు. వైరాలజిస్ట్ కూడా కావడంతో.. యాంటీవైరస్ వేక్సిన్స్తోనే ప్రయోగం చేశారు. మీజిల్స్ వైరస్, ఫ్లూ లాంటి వ్యాధులకు ఇచ్చే వేక్సిన్స్ను కలిపి.. తన ప్రయోగశాలలోనే కొత్త వైరస్‌ను సృష్టించారు. దాన్ని ఇంజెక్ట్ చేసి చికిత్స చేసుకోవడం ప్రారంభించారు. ఇది కణితిపై నేరుగా దాడి చేసిన రోగనిరోధక వ్యవస్థను పెంచే శక్తివంతమైనన వైరస్‌గా పనిచేసింది. హలాస్సీ నాలుగు సంవత్సరాలుగా కేన్సర్ రహితంగా ఉంది. స్టేజ్ 3లో చికిత్స.. ఆంకోలిటిక్ వైరోథెరపీ (ఓవీటీ)గా పిలిచే ఈ ప్రయోగాత్మక వేక్సిన్ ఆమె స్టేజ్ 3 కేన్సర్ చికిత్సకు సహాయపడింది. ఓవీటీ.. క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చెందుతున్న విధానం. ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి, వాటితో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. ఓవీటీ క్లినికల్ ట్రయల్స్ లాస్ట్స్టేజ్లో ఉన్న మెటాస్టాటిక్ క్యాన్సర్ పై ప్రయోగించారు. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ప్రారంభ దశ కేన్సర్లకు కూడా దీన్ని సూచిస్తున్నారు. కణితి కణానికి మీజిల్స్ వైరస్, వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ ఉన్నట్టుగా గుర్తించిన హలాస్సీ.. రెండు వైరస్‌లను సరైన మోతాదులో మిళితం చేసి, తనకు తాను చికిత్స చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇప్పటివరకు ఈ రెండు వ్యాధికారక క్రిములను ఓవీటీ క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించారు. మీజిల్స్ వైరస్ మెటాస్టాటిక్ రొమ్ము కేన్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. భిన్న వాదనలు.. కేన్సర్ చికిత్సకు.. శస్త్రచికిత్స, కెమోథెరపీ, బయోలాజికల్ థెరపీ, రేడియేషన్ వంటి ప్రస్తుత విధానాలకు బదులుగా ఓవిటిని ఉపయోగించాలని హలాస్సీ సూచిస్తున్నారు. దీనిని కొందరు వైద్య పరిశోధకులు విభేదిస్తున్నారు. ఆంకోలిటిక్ వైరస్‌లతో స్వీయ వైద్యం రోగ నిర్ధారణ చేసిన కేన్సర్‌ను ఎదుర్కోవడానికి సరైన విధానం కాదంటున్నారు. కానీ ప్రారంభ దశలో ఓవీటీని నియోఅడ్జువెంట్ థెరపీగా క్లినికల్ ట్రయల్స్ జరపాలని సూచిస్తున్నారు. -
హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్‌కు ఉద్వాసన పలికారు. 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియా మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్టిమాక్ సేవలకు మంగళం పాడింది. క్రొయేషియాకు చెందిన ఈ మాజీ ఫుట్‌బాలర్‌ను 2019లో కోచ్‌గా నియమించారు. ఆయన శిక్షణలో భారత జట్టు నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించింది. ఇందులో రెండు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ టైటిళ్లు కాగా, ఇంటర్కాంటినెంటల్ కప్, ముక్కోణపు సిరీస్ ఉన్నాయి. దీంతో గత అక్టోబర్‌లో ఆయనకు 2026 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే సునీల్ ఛెత్రి (ప్రస్తుతం రిటైరయ్యాడు) నేతృత్వంలోని భారత్ క్వాలిఫయర్స్‌లో ఎప్పటిలాగే రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శన సరిగాలేని కారణంతో గడువుకు ముందే స్టిమాక్‌ను తొలగించారు. ఒప్పందం ప్రకారం ఇలా అర్ధంతరంగా సాగనంపితే స్టిమాక్‌కు 3,60,000 డాలర్లు (రూ. 3 కోట్లు) ఏఐఎఫ్ఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించేందుకు సమాఖ్య సిద్ధమైంది. హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి థోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీతేజ ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మూడో స్థానంలో నిలిచింది.శ్రీతేజ ఓవరాల్‌గా 4136 పాయింట్లు సాధించింది. రినీ ఖాతూన్ (పశి్చమ బెంగాల్; 4357 పాయింట్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. స్నేహిత్‌కు కాంస్యం సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాలోని కజాన్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9–11, 8–11, 6–11తో ఓటమి చవిచూశాడు. -
మిస్టరీ: సముద్రంలో దాగి ఉన్న రహదారి.. ఎప్పటిదో తెలుసా?
కడలి అడుగున పురాతన రహదారి బయటపడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు ఇటీవల అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. ఇటీవల సముద్రంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని నిర్మించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది కొత్తరాతి యుగంలోని మంచుయుగం చివరి రోజులకు చెందినది కావచ్చని, కనీసం ఏడువేల ఏళ్ల కిందట దీనిని నిర్మించి ఉంటారని చెబుతున్నారు. సముద్ర గర్భానికి పదహారు అడుగుల లోతున దీనిని కనుగొన్నారు. జదార్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ మేట్ పారికా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సముద్రంలో దాగి ఉన్న ఈ పురాతన రహదారిని కనుగొంది. ఈ రహదారిపై రాతి గొడ్డళ్లు, పలుగులను కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించి, ఇవి క్రీస్తుపూర్వం 4,900 నాటివని తేల్చారు. వీటిని ఉపయోగించి జంతు బలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఇక్కడ లభించాయి. -
సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి
భారత చెస్ దిగ్గజం.. ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు షాక్ తగిలింది. భారత 17 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ దిగ్గజంతో తలపడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం విశేషం. విషయంలోకి వెళితే.. క్రోయేషియా రాజధాని జగ్రెబ్‌లో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ బ్లిట్జ్ క్రొయేషియా 2023 పోటీల్లో గుకేశ్, ఆనంద్ పోటీ పడ్డారు. ‘ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బాగా ఆడతానని తెలుసు. అయితే. ఆనంద్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. నేను ఎంతగానో ఆరాధించే ఆటగాడిపై విజయం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది’ అని గుకేశ్ అన్నాడు. అయితే.. 10 పాయింట్లు సాధించిన ఈ ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు. చెన్నైకి చెందిన గుకేశ్‌కి విశ్వనాథన్ ఆనంద్ అంటే చాలా ఇష్టం. అతడిని చూస్తూ పెరిగిన గుకేశ్ పెద్దయ్యాక చెస్ ప్లేయర్ కావాలనుకన్నాడు. అండర్ -13 చాంపియన్‌గా నిలిచాడు. అయితే.. ప్రపంచంలో అతి చిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్‌గా రికార్డు చేజార్చుకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది జూన్ నెలలో వరల్డ్ నంబర్-1 మాగ్నస్ కార్లోసన్(Magnus Carlsen)ను ఓడించి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈరోజు ఆనంద్‌పై పైచేయి సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం -
చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం మూడోస్థానం కోసం మొరాకోతో జరిగని ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 2-1 తేడాతో క్రొయేషియా ఘన విజయం సాధించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జట్టు కెప్టెన్ లుకా మోడ్రిక్ తన కెరీర్లో చివరి ఫిఫా వరల్డ్‌కప్ ఆడేసినట్లే. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో క్రొయేషియాను నడిపించిన లుకా మోడ్రిక్ ఒకసారి రన్నరప్, మరోసారి మూడో స్థానంలో నిలిపాడు. టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయాడు లుకా మోడ్రిక్. అయినా కూడా ఈ క్రొయేషియా స్టార్ తన ఆటతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫుట్‌బాల్ స్టార్స్ తర్వాత మరో పేరు బాగా మార్మోగింది. ఆమెనే క్రొయేషియా మోడల్ ఇవానా నోల్. ఖతర్‌లో పొట్టి దుస్తులు వేసుకోవాన్ని ఆ దేశం బహిష్కరించనప్పటికి ఇవానా నోల్ మాత్రం పొట్టి బట్టలు ధరించి క్లీవేజ్ షో చేస్తూ అందాల ఆరబోతను ప్రదర్శించింది. తనకు ఖతర్ అధికారుల నుంచి అనుమతి ఉందని.. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని స్టేడియానికి వచ్చినట్లు ఇవానా పేర్కొంది. ఇక తాజాగా శనివారం క్రొయేషయా, మొరాకోల మధ్య జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో మరోసార దర్శనమిచ్చింది. అయితే ఈసార అందాల ప్రదర్శన కాకుండా తన ఫెవరెట్ అయిన.. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిక్ కోసం మ్యాచ్‌కు వచ్చిందంట. అందుకు తగ్గట్లుగానే లుకా మోడ్రిక్ పేరున్న ప్రత్యేక ఔట్‌ఫిట్‌ను వేసుకొచ్చింది. ఈ సందర్భంగా లుకా మోడ్రిక్కు స్పెషల్ థాంక్స్ చెబుతూ.. థాంక్యూ కెప్టెన్ లుకా మోడ్రిక్.. మన దేశం గర్వించేలా చేశారు. ఇక మూడోప్లేస్లో నిలిచి మెడల్ అందుకోవడమే తరువాయి. ఇంకెందుకు ఆలస్యం పని కానిచ్చేయండి అంటూ రాసుకొచ్చింది. ఇవానా నోల్ కోరికను క్రొయేషియా నిలబెట్టింది. మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-1తేడాతో గెలిచి ఈ వరల్డ్‌కప్‌ను మూడోస్థానంతో ముగించింది క్రొయేషియా జట్టు. ఏది ఏమైనా ఈసారి మాత్రం ఇవానా నోల్ తన అందచందాలతో ప్రత్యేకంగా నిలిచింది. చదవండి: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ను క్రొయేషియా మూడోస్థానంతో ముగించింది. శనివారం మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో క్రొయేషియా.. మొరాకోను 2-1 తేడాతో ఓడించింది. క్రొయేషియా తరపున ఆట 7వ నిమిషంలో జోస్కో గ్వార్డియోల్, ఆట 42వ నిమిషంలో మిస్లావ్ ఓర్సిక్ గోల్స్ చేశారు. ఇక మొరాకో తరపున ఆట 9వ నిమిషంలో అచ్రఫ్ డారీ గోల్ చేశాడు. అయితే ఆట తొలి అర్థభాగంలోనే ఇరుజట్లు గోల్స్ చేశాయి. రెండో అర్థభాగంలో గోల్స్ కోసం ప్రయత్నించినప్పటికి సఫలం కాలేకపోయాయి. ఇక గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో తొలిసారి సెమీస్ చేరి సంచలనం సృష్టించింది. గ్రూప్ దశలో బెల్జియం.. నాకౌట్స్‌లో పోర్చుగల్, స్పెయిన్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకున్న మొరాకో డిఫెడింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఆదివారం(డిసెంబర్ 18న) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగే ఫైనల్‌తో మెగాటోర్నీ ముగియనుంది. -
FIFA World Cup Qatar 2022 Semi-Final: మెస్సీ మాయ...
అంతా తానై జట్టును ముందుడి నడిపిస్తున్న లయెనెల్ మెస్సీ తన ‘ప్రపంచకప్’ కలను నిజం చేసుకోవడానికి మరో విజయం దూరంలో నిలిచాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీలోనే అర్జెంటీనా 0–3తో క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. నాలుగేళ్ల తర్వాత మెస్సీ సారథ్యంలోనే క్రొయేషియాపై అర్జెంటీనా 3–0తో ప్రతీకార విజయం సాధించింది. ఆనాడు అంతగా ప్రభావం చూపని మెస్సీ ఈసారి మాత్రం విశ్వరూపమే ప్రదర్శించాడు. మైదానం మొత్తం పాదరసంలా కదులుతూ క్రొయేషియా డిఫెండర్లకు చుక్కలు చూపించాడు. ఒక గోల్ చేయడంతోపాటు తనను ఆరాధ్యంగా భావించే 22 ఏళ్ల జూలియన్ అల్వారెజ్‌కు రెండు గోల్స్ చేయడానికి సహకరించాడు. ఫలితంగా అర్జెంటీనా ఆరోసారి ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1986లో చివరిసారి విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్లీ జగజ్జేత కావడానికి గెలుపు దూరంలో ఉంది. దోహా: గతంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఐదుసార్లూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అర్జెంటీనా అదే ఆనవాయితీని కొనసాగించింది. ఆరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ ఆడిన మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా అద్భుత ఆటతీరుతో క్రొయేషియా అడ్డంకిని అధిగమించి దర్జాగా ఆరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 88,966 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన లుసైల్ స్టేడియంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా 3–0 గోల్స్ తేడాతో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (34వ ని.లో) ఒక గోల్ చేయగా... జూలియన్ అల్వారెజ్ (39వ, 69వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, మొరాకోజట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఈనెల 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనా తలపడుతుంది. అర్జెంటీనా 1978, 1986లలో ప్రపంచ చాంపియన్‌గా... 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. పక్కా ప్రణాళికతో... నాకౌట్ మ్యాచ్‌ల్లో రక్షణాత్మకంగా ఆడుతూ ప్రత్యర్థికి గోల్స్ ఇవ్వకుండా చివర్లో షూటౌట్లో విజయం సాధించడం క్రొయేషియా అలవాటుగా మార్చుకుంది. ఆరంభంలోనే గోల్స్ చేసి క్రొయేషియాను ఒత్తిడికి నెట్టాలనే వ్యూహంతో అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ వ్యూహం ఫలితాన్నిచ్చింది. ఆట 34వ నిమిషంలో ‘డి’ ఏరియాలో అల్వారెజ్ను క్రొయేషియా గోల్‌కీపర్ లివకోవిచ్ మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. మెస్సీ ఎడమ కాలితో కొట్టిన షాట్ బుల్లెట్ వేగంతో క్రొయేషియా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. అర్జెంటీనా 1–0తో ఆధిక్యం సంపాదించింది. ఐదు నిమిషాల తర్వాత అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ చేరింది. మధ్య భాగంలో ఉన్న మెస్సీ బంతిని అల్వారెజ్‌కు పాస్ ఇవ్వగా అతను వాయువేగంతో క్రొయేషియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ‘డి’ ఏరియాలోకి వచ్చాడు. అదే జోరులో గోల్కీపర్ను తప్పిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి అర్జెంటీనా 2–0తో ముందంజలో నిలిచింది. తక్కువ అంచనా వేయకుండా... నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 2–0తో ఆధిక్యంలో నిలిచినా చివర్లో తడబడి రెండు గోల్స్ సమర్పించుకొని చివరకు షూటౌట్లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. ప్రమాదకరమైన క్రొయేషియా జట్టుకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అర్జెంటీనా రెండో అర్ధభాగంలోనూ జాగ్రత్తగా ఆడింది. బంతి ఎక్కువ శాతం క్రొయేషియా ఆటగాళ్ల ఆధీనంలో ఉన్నప్పటికీ వారిని ‘డి’ ఏరియా వరకు రానివ్వకుండా చేయడంలో అర్జెంటీనా డిఫెండర్లు సఫలమయ్యారు. మ్యాచ్ మొత్తంలో క్రొయేషియా కేవలం రెండుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టడం గమనార్హం. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిచ్, పెరిసిచ్, బ్రోజోవిచ్, కొవాసిచ్లను అర్జెంటీనా డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. వారెవ్వా.. ఏమి గోల్..... ఆట 57వ నిమిషంలో అర్జెంటీనా ఖాతాలో మూడో గోల్ చేరేదే కానీ మెస్సీ కొట్టిన షాట్‌ను గోల్‌పోస్ట్ ముందు గోల్‌కీపర్ లివకోవిచ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత 69వ నిమిషంలో అద్భుతమే జరిగింది. తనదైన రోజున తానెంత ప్రమాదకర ప్లేయర్‌నో మెస్సీ నిరూపించాడు. కుడి వైపున బంతి అందుకున్న మెస్సీ పాదరసంలా కదులుతూ ముందుకు వెళ్లగా... అతని వెంబడే క్రొయేషియా డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ పరుగెత్తాడు. గ్వార్డియోల్ అన్ని రకాలుగా మెస్సీని నిలువరించాలని చూసినా... ఈ అర్జెంటీనా స్టార్ మాత్రం కనువిందులాంటి డ్రిబ్లింగ్‌తో అలరించాడు. చివరకు గోల్‌లైన్ అంచుల్లోంచి గ్వార్డియోల్ కాళ్ల సందులోంచి బంతిని మెస్సీ క్రాస్ పాస్ ఇవ్వగా... అక్కడే ఉన్న అల్వారెజ్ నేర్పుతో బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ గోల్‌ను కళ్లారా చూసిన వారందరూ మెస్సీ మ్యాజిక్కు ఫిదా అయిపోవడమే కాకుండా ఈ గోల్‌ను చిరకాలం గుర్తుంచుకుంటారు. అర్జెంటీనా ఆధిక్యం 3–0కు పెరగడంతో క్రొయేషియా విజయంపై ఆశలు వదులుకుంది. మరోవైపు అర్జెంటీనా చివరి వరకు దూకుడును కొనసాగిస్తూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారిగా... ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తనకు చివరి వరల్డ్‌కప్ అవుతుందని అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ అధికారికంగా ప్రకటించాడు. 2006 నుంచి వరుసగా ఐదు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ, తన ఆఖరి పోరులో గెలిచి చరిత్రకెక్కాలని పట్టుదలగా ఉన్నాడు. ‘నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించబోతున్నాను. నా చివరి మ్యాచ్‌గా ఫైనల్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మరోసారి వరల్డ్‌కప్ అంటే చాలా దూరంలో ఉంది. నేను అప్పటి వరకు ఆడలేనని తెలుసు. వరల్డ్‌కప్‌లో వేర్వేరు రికార్డులు నా దరిచేరడం మంచిదే. కానీ అన్నింటికంటే ముఖ్యం జట్టుగా మా లక్ష్యం ఏమిటనేది. అది సాధిస్తేనే అంతా అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఎంతో కష్టపడి ఈ దశకు వచ్చాం. ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని 35 ఏళ్ల మెస్సీ వ్యాఖ్యానించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు. 1: ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 2: ప్రపంచకప్‌లో తొలి లీగ్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత ఫైనల్ చేరడం అర్జెంటీనాకిది రెండోసారి. 1990లోనూ అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో కామెరూన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 1982లో పశ్చిమ జర్మనీ... 1994లో ఇటలీ... 2010లో స్పెయిన్ కూడా ఈ ఘనత సాధించాయి. జర్మనీ, ఇటలీ రన్నరప్‌గా నిలువగా... స్పెయిన్ మాత్రం టైటిల్ సాధించింది. 2: జర్మనీ తర్వాత ప్రపంచకప్ సెమీఫైనల్లో రెండుసార్లు మూడు అంతకంటే ఎక్కువ గోల్స్ తేడాతో గెలిచిన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. 3: వరుసగా ఐదో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ గత నాలుగు ప్రపంచకప్‌లలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేదు. ఈసారి మాత్రం ఏకంగా మూడు గోల్స్ చేశాడు. 5: ఒకే ప్రపంచకప్‌లో ఐదు గోల్స్ చేసిన పెద్ద వయస్కుడిగా మెస్సీ (35 ఏళ్లు) ఘనత సాధించాడు. 6: ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. జర్మనీ అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరింది. బ్రెజిల్, ఇటలీ (6 సార్లు చొప్పున) సరసన అర్జెంటీనా నిలిచింది. 16: ఈ ఏడాది అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. తన కెరీర్లో జాతీయ జట్టుకు ఒకే సంవత్సరం ఇన్ని గోల్స్ అందించడం ఇదే ప్రథమం. 25: ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో మెస్సీ ఆడిన మ్యాచ్‌లు. లోథర్ మథియాస్ (జర్మనీ–25 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఫైనల్లోనూ మెస్సీ బరిలోకి దిగితే ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. -
FIFA WC: ప్చ్.. క్రొయేషియాతో పాటే అమ్మడు అందాలకు చెక్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫాలో అవుతున్న వారికి క్రొయేషియా మోడల్ ఇవానా నోల్ గురించి పరిచయం అక్కర్లేదు. అసభ్య దుస్తులకు అనుమతి లేని చోట పొట్టి పొట్టి డ్రెస్సులు ధరిస్తూ హాట్ లుక్స్‌తో ఫిఫా అభిమానులను అలరిస్తుంది. తనకు తాను హాటెస్ట్ ఫ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రకటించుకున్న ఇవానా నోల్ తాజాగా తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా అర్జెంటీనా, క్రొయేషియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు హాజరైన ఇవానా నోల్ మరింత రెచ్చిపోయింది. క్రొయేషియా జెండా కలర్ లో కట్ టాప్ డ్రెస్.. బ్లూ జీన్స్‌తో మ్యాచ్‌కు హాజరైంది. కట్టిపడేసే అందంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన కుర్రకారు గుండెల్లో ఆమె రైళ్లు పరిగెత్తించింది. క్లీవేజ్ షో చేస్తూనే హాట్ హాట్ లుక్స్‌తో అందరి కళ్లు తనవైపుకు తిప్పుకుంది. అయితే క్రొయేషియా కథ సెమీస్‌లో ముగియడంతో అమ్మడు అందాలు కూడా ఇక్కడికే పరిమితమవుతాయేమోనని కొంతమంది తెగ ఫీలవుతున్నారు. క్రొయేషియా వెళ్లిపోయింది కాబట్టి తాను వెళ్లిపోతుందని.. ప్చ్ అందాల ప్రదర్శన మిస్ అవుతామోనని మరికొంత మంది కామెంట్స్ చేశారు. అయితే ఇవానా నోల్ ఖతర్‌ను వీడి వెళుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదని.. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ ముగిసాకే ఆమె తన దేశం వెళుతుందంటూ కొంతమంది పేర్కొన్నారు. ఏది ఏమైనా తన అందంతో ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్లతో సమానంగా పేరు పొందిన ఇవానా నోల్కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. అరబ్ లాంటి కఠినమైన దేశాల్లో వారి ఆంక్షలను బేఖాతరు చేసి పొట్టి పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిచ్చి అందాలు ఆరబోసిన ఇవానా నోల్ దైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ కొందరు అభిమానులు ట్విటర్ వేదికగా తెలిపారు. View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) చదవండి: FIFA WC 2022: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
అల్విదా 'లుకా మోడ్రిక్'.. నాయకుడంటే నీలాగే
లుకా మోడ్రిక్.. ఈతరం ఫుట్‌బాల్ స్టార్స్‌లో ఒకడు. మెస్సీ, రొనాల్డో లాగా పాపులారిటీ లేనప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను లుకా మోడ్రిక్ నడిపిన తీరు అద్బుతమని చెప్పొచ్చు. వరుసగా రెండు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అసాధారణ ఆటతీరు కనబరిచి అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ మోడ్రిక్ జట్టును అన్నీ తానై నడిపించాడు. నాయకుడంటే ఇలాగే ఉండాలి అనే పదానికి నిర్వచనంగా నిలిచాడు లుకా మోడ్రిక్. 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించిన లుకా మోడ్రిక్ తొలి రెండు వరల్డ్‌కప్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2010, 2014 వరల్డ్‌కప్స్‌లో క్రొయేషియా గ్రూప్ దశలోనే వెనుదిరిగడం మోడ్రిక్ను వెలుగులోకి తీసుకురాలేకపోయింది. ఇక 2014 ఫిఫా వరల్డ్‌కప్.. గ్రూప్ దశలోనే క్రొయేషియా జట్టు వెనుదిరిగింది. కేవలం 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన క్రొయేషియా వచ్చే నాలుగేళ్లలో అద్భుతం చేయబోతుందని అప్పట్లో ఎవరు ఊహించలేదు. 2014 తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మోడ్రిక్ దశ దిశ లేకుండా అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను గాడిలో పెట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్లలో జట్టులో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. మేజర్ టోర్నీలు గెలవకపోయినప్పటికి జట్టును బలంగా తయారు చేయడంలో మాత్రం సఫలమయ్యాడు. ఇక 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా.. ఈసారి కూడా దాదాపు అదే ఫలితాలను రిపీట్ చేసింది. కీలకమైన నాకౌట్స్‌లో బ్రెజిల్, జపాన్ లాంటి మేటి జట్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అలా వరుసగా రెండు వరల్డ్‌కప్స్‌లో ఒకసారి రన్నరప్.. మరోసారి సెమీఫైనల్ వరకు వచ్చిందంటే లుకా మోడ్రిక్ జట్టులో నింపిన చైతన్యం వల్లే అని చెప్పొచ్చు. ఈసారి లుకా మోడ్రిక్తో పాటు గోల్ కీపర్ డొమినిక్ లివకోవిచ్ , ఇవాన్ పెరిసిక్, డెజన్ లొవ్రెన్, మార్సిలో బ్రొజోవిక్లు నాలుగు స్తంభాలుగా మారి క్రొయేషియాను ముందుకు నడిపించారు. 37 ఏళ్ల లుకా మోడ్రిక్ తన చివరి ఫిఫా వరల్డ్‌కప్ ఆడేసినట్లే. క్రొయేషియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా లుకా రికార్డు నెలకొల్పాడు. క్రొయేషియా తరపున 161 మ్యాచ్‌ల్లో 23 గోల్స్ సాధించాడు. మిడ్‌ఫీల్డర్‌గా బాధ్యతలు నిర్వర్తించే లుకా మోడ్రిక్ ఎక్కువ గోల్స్ చేయకపోయినప్పటికి పాస్‌లు అందించడంలో మాత్రం దిట్ట. 2006 నుంచి 16 ఏళ్ల పాటు క్రొయేషియా జట్టుకు సేవలందించిన లుకా మోడ్రిక్.. ఫిఫి వరల్డ్‌కప్ గెలవలేదన్న కోరిక మినహాయిస్తే జీవితంలో అన్నీ చూశాడు. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్ బాల్ అందుకున్న లుకా.. 2018లోనే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డు, యూఈఎఫ్ఏ మెన్స్ ప్లేయర్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇక 2019లో గోల్డెన్ ఫుట్ అవార్డు గెలుచుకున్న లుకా మోడ్రిక్ ఆటకు నీరాజనం పలుకుతూ అతని మలి కెరీర్ కూడా ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం. చదవండి: దెబ్బకు దెబ్బ తీశారు.. లెక్క సరిచేసిన మెస్సీ Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు' Warrior spirit 💪 Still not over for @lukamodric10 & Co. in #Qatar2022 📊 Watch #Croatia vie for a third-place finish at the #FIFAWorldCup once again, Dec 17 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGCRO #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/HjqX7k2qKe — JioCinema (@JioCinema) December 13, 2022 -
దెబ్బకు దెబ్బ తీశారు.. లెక్క సరిచేసిన మెస్సీ
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ బృందం ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్థరాత్రి క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో 3-0తో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. కీలకమైన నాకౌట్స్‌లో బ్రెజిల్, జపాన్ లాంటి మేటి జట్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే క్రొయేషియా.. అర్జెంటీనాతో జరిగిన సెమీస్‌లో మాత్రం తోకముడిచింది. మెస్సీ బృందం క్లాస్ ఆటతీరుకు ఆ జట్టు వద్ద సమాధానం లేకుండా పోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడిన లుకా మోడ్రిక్ బృందం సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టింది. అయితే అర్జెంటీనా మాత్రం క్రొయేషియాపై తమ ప్రతీకారం తీర్చుకుంది. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా, క్రొయేషియాలు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. లీగ్ దశలో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాకు షాక్ ఇచ్చింది. అప్పటి మ్యాచ్‌లో లుకా మోడ్రిక్ సహా మరో ఇద్దరు ఆటగాళ్లు కలిసి మూడు గోల్స్ కొట్టగా.. మెస్సీ సేన మాత్రం ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. ఆ తర్వాత అర్జెంటీనా ప్రీక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. 2018 ఫిఫా వరల్డ్‌కప్: అర్జెంటీనాపై గెలుపు.. క్రొయేషియా సంబరాలు సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా క్రొయేషియాను కీలక నాకౌట్ దశలో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. యాదృశ్చికంగా అర్జెంటీనా కూడా 3-0 తేడాతోనే క్రొయేషియాను మట్టికరిపించింది. ఈసారి మెస్సీ ఒక గోల్ కొట్టగా.. అల్వరేజ్ రెండో గోల్స్ నమోదు చేశాడు. అలా 2018 ఓటమికి దెబ్బకు దెబ్బ తీసిన మెస్సీ బృందం లెక్కను సరిచేసింది. చదవండి: Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు' 3️⃣ strikes that powered #Messi𓃵 & Co.'s dream of reaching #Qatar2022 final 👏 Watch all the goals from #ARGCRO & stay tuned to the #WorldsGreatestShow on #JioCinema & #Sports18 📺📲#FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/gUWKbJGbJl — JioCinema (@JioCinema) December 13, 2022 -
Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా కథ ముగిసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి అదే ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్ వరకు దూసుకొచ్చింది. కానీ సెమీస్‌లో అర్జెంటీనా లాంటి పటిష్టమైన జట్టు ముందు క్రొయేషియా తలవంచింది. మెస్సీ ఆటను కళ్లార్పకుండా చూసిన ఆ జట్టు అతని ఆటకు ఫిదా అయింది. మొత్తానికి 0-3 తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది. క్రొయేషియాను అన్నీ తానై నడిపించిన కెప్టెన్ లుకా మోడ్రిక్కు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించి ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్న జట్టుకు నిరాశే ఎదురైంది. అయినప్పటికి 2014లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన క్రొయేషియాను గాడిలో పెట్టి.. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో నాకౌట్ దశకు తీసుకురావడంలో లుకా మోడ్రిక్ది కీలకపాత్ర. తన కెరీర్లో వరల్డ్‌కప్ లేదన్న మాటే కానీ అతని ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకొని ఫిఫా వరల్డ్‌కప్‌ను ముగించాడు. మ్యాచ్ అనంతరం లుకా మోడ్రిక్ మాట్లాడుతూ మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈరోజు మ్యాచ్ అర్జెంటీనాదే. ముఖ్యంగా మెస్సీ అన్నీ తానై జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం. మ్యాచ్‌లో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ఇవ్వడం నాకు నచ్చలేదు. అది తప్పిస్తే ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌తో కెరీర్‌ను ముగిద్దామనుకున్నా.. ఇప్పుడు అది లేకుండానే వెళ్లిపోతున్నా. ఈసారి మెస్సీదే వరల్డ్‌కప్.. టైటిల్ కచ్చితంగా కొడతాడన్న నమ్మకం నాకుంది. ఒక దిగ్గజ ప్లేయర్ ఈ ఘనత సాధించి ఆటకు వీడ్కోలు పలికితే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అర్జెంటీనా జట్టులో నాకు మెస్సీ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతావాళ్లు బాగా ఆడుతున్నప్పటికి మెస్సీనే నా ఫెవరెట్. ఆల్ ది బెస్ట్ అర్జెంటీనా అండ్ మెస్సీ.'' అంటూ పేర్కొన్నాడు. 🎙️ Luka Modrić: “I hope Lionel Messi wins this World Cup, he is the best player in history and he deserves it.” 🇭🇷🤝🇦🇷#FIFAWorldCup pic.twitter.com/w3VEGdXnDd — Football Tweet ⚽ (@Football__Tweet) December 13, 2022 చదవండి: ఆదిలోనే సౌదీ చేతిలో ఓటమి! ఎట్టకేలకు ఇలా.. మెస్సీ పోస్ట్ వైరల్ -
WC: ఆదిలోనే సౌదీ చేతిలో ఓటమి! ఎట్టకేలకు ఇలా.. మెస్సీ పోస్ట్ వైరల్
FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi- Final: ‘‘కొన్నిసార్లు పరిస్థితులు మాకు అనుకూలించకపోవచ్చు. అయితే, మా జట్టు ఉత్తమమైనది. ఎప్పుడు ఎలా ఆడాలో.. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఓటములను దాటుకుని ఎలా ముందుకు సాగాలో తెలుసు. ప్రతి మ్యాచ్ మాకు ఎంతో ముఖ్యమైనదే’’ అని అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అన్నాడు. జట్టు వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన తరుణంలో సహచర ఆటగాళ్లను అభినందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఫిఫా ప్రపంచకప్-2022 తొలి సెమీ ఫైనల్లో క్రొయేషియాతో తలపడ్డ అర్జెంటీనా 3-0తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. తద్వారా ఈ ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. 34వ నిమిషంలో మెస్సీ గోల్‌కు తోడు.. జూలియన్ అల్వారెజ్ రెండు గోల్స్ సాధించడంతో అర్జెంటీనా విజయం ఖరారైంది. ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన మోడ్రిచ్ బృందం నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంకొక్క అడుగు ఈ నేపథ్యంలో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక అడుగు దూరంలో ఉన్న మెస్సీ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ రోజు మా ఆట తీరు గొప్పగా ఉంది. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన తర్వాతే మైదానంలో దిగాము. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం. మా జట్టులో ఉన్న వాళ్లంతా ఇంటెలిజింట్లే’’ అంటూ మెస్సీ సహచర ఆటగాళ్లను కొనియాడాడు. అదే విధంగా.. ‘‘చివరి అంకానికి చేరుకున్నాం!!! మమ్మల్ని నమ్మిన వాళ్లందరికీ ధన్యవాదాలు’’ అంటూ ఇన్‌స్టా వేదికగా మ్యాచ్‌కు సంబంధించి ఫొటోలు పంచుకున్నాడు. కోటిన్నరకు పైగా లైకులతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరంభంలోనే సౌదీ చేతిలో ఓటమి! కాగా ఆదివారం నాటి ఫైనల్లో గనుక అర్జెంటీనా గెలిస్తే మెస్సీ ఖాతాలో వరల్డ్‌కప్ టైటిల్ చేరుతుంది. ఇక కోపా అమెరికా 2021 విజేతగా నిలవడంతో పాటు వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు 36 మ్యాచ్‌లలో ఓటమన్నదే తెలియని అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాకిచ్చిన విషయం తెలిసిందే. 51వ ర్యాంకర్ అయిన సౌదీ.. మెస్సీ బృందాన్ని 2-1తో ఓడించి గట్టి షాకిచ్చింది. దీంతో ఫిఫా వరల్డ్‌కప్-2022లో తమ తొలి మ్యాచ్‌లోనే అర్జెంటీనాకు చేదు అనుభవం ఎదురైంది. అయితే, ఆ తర్వాత అవాతంరాలన్నీ అధిగమిస్తూ ఒక్కో మెట్టు ఎక్కిన మెస్సీ బృందం ఫైనల్ వరకు చేరుకుంది. చదవండి: FIFA WC 2022 Final: ఫైనల్ చేరాం చాలు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు! అంబరాన్నింటిన సంబరాలు ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్.. View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
ఫైనల్లో అర్జెంటీనా.. జనసంద్రంతో నిండిన వీధులు (ఫొటోలు)
-
FIFA WC: ఇది చాలు.. మా ఆనందానికి పట్టపగ్గాల్లేవు! మమ్మల్ని ఎవరూ ఆపలేరు
FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi- Final: అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో ఆ దేశ ప్రజల సంబరాలు అంబరాన్నంటాయి. రాజధాని బ్యూనో ఎయిర్స్ వీధులు మొత్తం జనసంద్రంతో నిండిపోయాయి. కాగా అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ వరల్డ్‌కప్ కల నెరవేరే క్రమంలో ముందడుగు పడింది. ఖతర్ వేదికగా జరిగిన మొదటి సెమీ ఫైనల్లో క్రొయేషియాను ఓడించిన అర్జెంటీనా ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ తరుణంలో వేలాది మంది అర్జెంటీనా ప్రజలు తమ జాతీయత ప్రతిబింబించేలా లేత నీలం, తెలుపు రంగుల కలయికతో ఉన్న జెండాలు ప్రదర్శిస్తూ ఆనందంతో గంతులు వేశారు. మెస్సీ బృందం అందుకున్న చిరస్మరణీయి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా రాయిటర్స్‌తో అభిమానులు మాట్లాడుతూ.. ‘‘ఫైనల్ వరకు చేరడమే అత్యుత్తమం. ఆ తర్వాత ఏం జరిగినా పర్లేదు. ఈ సంతోషాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అర్జెంటీనా ప్రజలంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా సమకాలీన ఫుట్‌బాలర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా అద్బుతమైన రికార్డులు సాధించిన మెస్సీ ఖాతాలో ఒక్క వరల్డ్‌కప్ ట్రోఫీ కూడా లేదు. అంతేకాదు 35 ఏళ్ల మెస్సీకి ఇదే ఆఖరి ప్రపంచకప్ టోర్నీ కానుందన్న తరుణంలో అర్జెంటీనా ఫైనల్ చేరడం సంతోషాలను రెట్టింపు చేసింది. ఇక రెండో సెమీ ఫైనల్లో ఫ్రాన్స్- మొరాకో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్లో అర్జెంటీనా తలపడనుంది. చదవండి: Ind Vs Ban: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్లు ఇవే Sanju Samson: రెచ్చిపోయిన సంజూ శాంసన్.. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో
FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi: ప్రపంచకప్ గెలవాలన్న చిరకాల కల నెరవేర్చుకునే దిశగా దూసుకెళ్తున్నాడు మేటి ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ. కెరీర్లో ఇంతవరకు అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగుదూరంలో నిలిచాడు. ఫిఫా ప్రపంచకప్-2022లో భాగంగా ఖతర్ వేదికగా క్రొయేషియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో మెస్సీ బృందం ఘన విజయం సాధించింది. ఫైనల్ చేరాలన్న క్రొయేషియా ఆశలపై నీళ్లు చల్లుతూ 3-0తో చిత్తు చేసింది. తద్వారా 2014 తర్వాత తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుతమైన గోల్‌తో మెరిశాడు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ. క్రొయేషియాతో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీ కిక్కు గోల్‌గా మలిచిన ఈ స్టార్ ఫుట్‌బాలర్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో అతడికి ఇది ఐదో గోల్. మొత్తంగా ఈ మెగా ఈవెంట్లో 11వది. తద్వారా అర్జెంటీనా తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దిగ్గజ ఫుట్‌బాలర్ డిగో మారడోనా సహా గాబ్రియెల్ బటిస్టుటా, గిల్మెరో స్టబిలేను దాటుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్లు లియోనల్ మెస్సీ- 11(25 మ్యాచ్‌లు) గాబ్రియెల్ బటిస్టుటా- 10(12 మ్యాచ్‌లు) గిల్మెరో స్టబిలే- 8 (4 మ్యాచ్‌లు) డిగో మారడోనా- 8 (21 మ్యాచ్‌లు) మారియో కెంప్స్- 6 (18 మ్యాచ్‌లు) తనే మొదటివాడు ఇక ఈ రికార్డుతో మరో ఫీట్‌ను కూడా నమోదు చేశాడు మెస్సీ. ఒక వరల్డ్‌కప్ టోర్నీలో 5 గోల్స్ సాధించిన అత్యధిక వయస్కుడిగా నిలిచాడు 35 ఏళ్ల మెస్సీ. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! -
క్రొయేషియా బలం ఆ నలుగురే.. సైలెంట్ అనిపించే వయొలెంట్ కిల్లర్స్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా దూసుకెళ్తుంది. కేవలం 40 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా జట్టు సాకర్‌లో అద్భుతాలు చేస్తోంది. నాలుగేండ్ల కిందట అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఫైనల్ వరకు వచ్చిన క్రొయేషియన్లు ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తూ దూసుకొస్తున్నారు. పలు మేటి జట్లకు చెక్ పెడుతున్నారు.2018లో ఫ్రాన్స్ చేతిలో ఓడి కొద్దిలో టైటిల్ చేజార్చుకున్న క్రొయేషియా ఈసారి ఎలాగైనా వరల్డ్ చాంపియన్ అవ్వాలన్న సంకల్పంతో ఉంది. శుక్రవారం జరగనున్న సెమీఫైనల్లో బలమైన అర్జెంటీనాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరాలని భావిస్తోంది. క్రొయేషియా జట్టులో లుకా మోడ్రిచ్ కీలక ఆటగాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ లూకా మోడ్రిచ్ ఒక్కడితోనే జట్టు మొత్తం నడవడం లేదు. మోడ్రిచ్‌కు అండగా జట్టులో నలుగురు ఆటగాళ్లు మూలస్తంభాల్లా నిలబడ్డారు. ఆ నలుగురే ఇవాన్ పెరిసిక్(మిడ్ ఫీల్డర్), మార్సిలో బ్రొజోవిక్(మిడ్ ఫీల్డర్), డెజన్ లొవ్రెన్(డిఫెండర్), డొమినిక్ లివకోవిచ్(గోల్ కీపర్). సైలెంట్‌గా కనిపించే ఈ నలుగురు వయొలెంట్ కిల్లర్స్. గత ఎడిషన్ మాదిరిగానే క్రొయేషియన్లు సైలెంట్ కిల్లర్స్‌గా ఒక్కో అడుగు వేస్తున్నారు. ప్రిక్వార్టర్స్‌లో జపాన్ జోరుకు చెక్ పెట్టి.. క్వార్టర్స్‌లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను దెబ్బకొట్టడంతో ప్లేయర్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. క్రొయేషియా టీమ్‌లో మోడ్రిచ్ కీలకం. ఈ టోర్నీలో తను ఒక్క గోల్ కూడా కొట్టలేదు. అయినా టీమ్ మొత్తం అతని చుట్టూనే తిరుగుతోంది. మిడ్‌ఫీల్డ్‌లో అంతా సవ్యంగా ఉండేలా చేయడంతో పాటు చివరి నిమిషం వరకు తోటి ప్లేయర్లంతా పోరాడేలా చేస్తున్నాడు. 2018 టోర్నీ మాదిరిగా నాకౌట్ గేమ్స్‌ను ఎక్స్ట్రా టైమ్‌కు తీసుకెళ్లి ప్రత్యర్థుల పని పడుతోంది.తమ బలమైన డిఫెన్స్‌నే ప్రధానంగా ఉపయోగిస్తూ ఫలితాన్ని రాబడుతోంది. అయితే ఈ నలుగురు పుట్టుకతోనే గొప్పవాళ్లు ఏమీ కాలేదు. ఒక్కోక్కరిది ఒక్కో కథ.. వ్యధ. ఒకరు చికెన్ ఫార్మ్‌లో పనిచేస్తే.. మరొకడు కసాయి తండ్రి వద్ద పెరిగాడు. ఇంకొకడు చదువును మధ్యలోనే ఆపేశాడు.. ఇలా నలుగురు తమ చిన్నతనంలోనే ఎంతో కష్టాలు అనుభవించారు. లూకా మోడ్రిచ్ గురించి పరిచయం అవసరం లేకపోయినా ఈ నలుగురిపై మాత్రం ఒక లుక్కేయండి. ఇవాన్ పెరిసిక్(మిడ్ ఫీల్డర్) క్రొయేషియా జట్టులో కీలక మిడ్‌ఫీల్డర్‌గా ఇవాన్ పెరిసిక్ కొనసాగుతున్నాడు. జట్టు డిఫెన్స్ ఇంత పటిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం ఇవాన్ పెరిసిక్. అయితే తన చిన్నతనం నుంచి ఇవాన్ పెరిసిక్ చికెన్ ఫార్మ్స్‌లో పనిచేశాడు. బీచ్ వాలీబాల్‌లో ఆరితేరిన ఇవాన్ పెరిసిక్ ఆ తర్వాత ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఎన్నో కష్టాలకోర్చి స్థానిక లోకల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఫుట్‌బాల్‌లో ఎదిగాడు. 2011లో ఇవాన్ పెరిసిక్ తొలిసారి క్రొయేషియా ఫుట్‌బాల్ టీంలో చోటు దక్కింది. అప్పటినుంచి జట్టులో కీలక మిడ్‌ఫీల్డర్‌గా కొనసాగుతున్నాడు. డొమినిక్ లివకోవిచ్(గోల్ కీపర్) ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా ప్రతీ మ్యాచ్‌ను పెనాల్టీ దశ వరకు తీసుకెళ్తుందంటే అదంతా గోల్ కీపర్ డొమినిక్ లివకోవిచ్ చలవే. ముఖ్యంగా బ్రెజిల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో నాలుగుసార్లు గోల్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో డొమినిక్ లివకోవిచ్ పేరు మార్మోగిపోయింది. ప్రత్యర్థి ఎంత బలమైన జట్టు అయినా.. తన వరకు బంతి వచ్చిందంటే అది కచ్చితంగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా అడ్డుపడడం లివకోవిచ్ స్పెషాలిటీ. అయితే డొమినిక్ లివకోవిచ్ ఫుట్‌బాల్‌లోకి రాకముందు బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా రాణించాడు. డెజన్ లొవ్రెన్(డిఫెండర్) క్రొయేషియా జట్టులో ఢిపెన్స్ విభాగంలో డెజన్ లొవ్రెన్ కీలకం. ప్రత్యర్థి ఆటగాళ్లకు బంతి చిక్కకుండా తన డిఫెన్స్‌తో పాస్‌లు అందించడంలో డెజన్ లొవ్రెన్ది ప్రత్యేక స్టైల్. ఇవాళ స్టార్‌గా వెలుగొందుతున్న డెజన్ లొవ్రెన్ జీవితం కాస్త డిఫరెంట్. యుగోస్లేవియా యుద్ధం కారణంగా డెజన్కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు బొస్నియన్ సిటీకి వలస వచ్చారు. ఏడేళ్ల పాటు అక్కడే పెరిగాడు. ఆ తర్వాత 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫ్యామిలీకి జర్మనీలో ఉండేదుకు అనుమతి రాలేదు. వెంటనే క్రొయేషియాకు వెళ్లిపోవాలని ఆదేశించారు. అలా ఉన్నపళంగా పిల్లలను తీసుకొని క్రొయేషియాలో స్థిరపడ్డారు. అయితే డెజన్కు క్రొయేషియా భాష మాట్లాడడం రాదు. దీంతో స్కూల్లో అందరు డెజన్ను హేళన చేసేవారు. అయితే క్రమంగా క్రొయేషియా లాంగ్వేజ్‌పై మంచి పట్టు సాధించాడు. మార్సిలో బ్రొజోవిక్(మిడ్‌ఫీల్డర్) మార్సిలో బ్రొజోవిక్ కసాయి తండ్రి పెంపకంలో పెరిగాడు. ఫుట్‌బాల్ ఆడాలనుకుంటే స్కూల్‌ను వదిలేయాలన్నాడు. ఫుట్‌బాల్‌పై ఇష్టంతో మధ్యలోనే స్కూల్ మానేశాడు. దీంతో క్రొయేషియా భాష తప్పిస్తే మరే ఇతర లాంగ్వేజ్లోమాట్లడలేడు. ఇంగ్లీష్‌పై కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. ఇవాళ స్టార్‌గా వెలుగొందుతున్న మార్సిలో బ్రొజోవిక్ తాను ఎప్పటికైనా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడి తీరుతానని పేర్కొన్నాడు. ఇక లూకా మోడ్రిచ్ ఇవాళ వరల్డ్ బెస్ట్ సాకర్ స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలో సెమీస్‌లో అర్జెంటీనా అడ్డుదాటి ముందుకెళ్లాలని చూస్తోంది. గత ఎడిషన్ గ్రూప్ స్టేజ్‌లో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను చిత్తు చేయడం గమనార్హం. అందుకే మెస్సీ సేన ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి క్రొయేషియాను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. చదవండి: 'మెస్సీ ఆటను ఎంజాయ్ చేస్తున్నాం.. చర్చ అవసరమా?' -
FIFA WC: ఆఖరి ఛాన్స్! క్రొయేషియా తక్కువేమీ కాదు! అదే జరిగితే మెస్సీ కూడా రొనాల్డోలాగే..
Argentina Vs Croatia- Lionel Messi- Doha: మెస్సీ మరోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు చేరుస్తాడా? మోడ్రిచ్ వరుసగా రెండోసారి తమ జట్టును తుది పోరు వరకు తీసుకెళ్లగలడా? ఒకరు ఆల్‌టైమ్ గ్రేట్‌గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని తన జట్టుకు బలంగా నిలవగా... మరోవైపు సమష్టితత్వాన్నే నమ్ముకొని ముందుకు సాగిపోయిన టీమ్ మళ్లీ అంచనాలను తలకిందులు చేయగలదా? ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ-2022లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. సంచలనాలు కొత్త కాదు రెండుసార్లు విజేత అర్జెంటీనా, గత వరల్డ్‌కప్ ఫైనలిస్ట్ క్రొయేషియా మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ తొలి సెమీఫైనల్లో తలపడతాయి. 2014 వరల్డ్‌కప్‌లో మెస్సీ సారథ్యంలోనే అర్జెంటీనా ఫైనల్ చేరగా, మోడ్రిచ్ నాయకత్వంలోనే 2018లో క్రొయేషియా రన్నరప్‌గా నిలిచింది. అంచనాలు ఇప్పటికీ అర్జెంటీనాకు అనుకూలంగానే ఉండగా... క్రొయేషియాకు సంచలనాలు కొత్త కాదు. చెరోసారి.. అయితే! ఈ రెండు జట్లు గతంలో రెండుసార్లు ప్రపంచకప్‌లో లీగ్ దశలో ముఖాముఖిగా తలపడ్డాయి. 1998లో అర్జెంటీనా 1–0తో నెగ్గగా... 2018లో క్రొయేషియా 3–0తో గెలిచింది. నాకౌట్ దశలో మాత్రం తొలిసారి ఈ రెండు జట్లు ‘ఢీ’కొంటున్నాయి. స్టార్ ముందుండి నడిపిస్తుండగా... తన కెరీర్లో వరల్డ్‌కప్ లేని లోటును పూరించేందుకు, అభిమానుల దృష్టిలో మరో మారడోనాగా మారేందుకు మెస్సీకి ఇది చివరి చాన్స్. 35 ఏళ్ల వయసులో కూడా అతని అద్భుత ప్రదర్శన జట్టును సెమీస్ వరకు తీసుకొచ్చింది. సమకాలీన మేటి ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు సాధ్యం కానిది సాధించగలిగే అవకాశం మెస్సీ ముంగిట నిలిచింది. నిజానికి మెక్సికో, ఆస్ట్రేలియాలపై చేసిన గోల్స్‌తో పాటు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో నాహుల్ మొలినాకు మెస్సీ ఇచ్చిన రివర్స్ పాస్ మొత్తం వరల్డ్‌కప్‌లోనే హైలైట్‌గా నిలిచాయి. అయితే మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లు అంతంతమాత్రంగానే రాణించారు. అల్వారెజ్, ఫెర్నాండెజ్, మ్యాక్ అలిస్టర్ ఫర్వాలేదనిపించినా ప్రపంచ స్థాయి ప్రదర్శన మాత్రం రాలేదు. ఇప్పటి వరకు అర్జెంటీనా ఆటలో ఆశించిన వేగం, కొత్తదనం కనిపించకపోయినా నడిచిపోయింది. కాస్త ఏమరుపాటుగా ఉన్నా కానీ సెమీస్ వేదికపై కాస్త ఏమరుపాటుగా ఉన్నా క్రొయేషియా మ్యాచ్‌ను లాగేసుకోగలదు. మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లను కోచ్ స్కలోని ఎంత సమర్థంగా వాడుకుంటాడనేది కీలకం. గోల్‌కీపర్ మార్టినెజ్‌పై అదనపు బాధ్యత ఉంది. క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ మెరుపు నైపుణ్యంతో టోర్నీని శాసిస్తున్న తీరు చూస్తే... ఒకవేళ మ్యాచ్ పెనాల్టీల వరకు వెళితే మాత్రం మార్టినెజ్ అత్యద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. పోరాటతత్వమే బలంగా... బ్రెజిల్‌పై క్వార్టర్ ఫైనల్లో గెలిచిన తర్వాత చివరి వరకు ఓటమిని అంగీకరించని తమ పోరాటస్ఫూర్తి గుర్తించి క్రొయేషియా కోచ్ డాలిచ్ పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. గణాంకాల్లో అది కనిపించకపోయినా అదే వారి విజయ రహస్యమనేది వాస్తవం. సుదీర్ఘ సమయం పాటు బంతిని తమ అదుపులో ఉంచుకోగల మిడ్‌ఫీల్డర్లు మోడ్రిచ్, కొవాసిచ్, బ్రొజొవిచ్ జట్టు ప్రధాన బలం. దీనిని బద్దలు కొట్టాలంటే మెస్సీకి కూడా అంత సులువు కాదు. మ్యాచ్ సమంగా ఉన్న స్థితిలో దీనిని క్రొయేషియా కొనసాగిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. ఎందుకంటే ప్రధాన టోర్నీల్లో క్రొయేషియా ఆడిన గత 9 నాకౌట్ మ్యాచ్‌లలో 8 అదనపు సమయం వరకు వెళ్లాయి. ఆపై పెనాల్టీల ద్వారానే ఈ టోర్నీలో జపాన్‌పై, బ్రెజిల్‌పై జట్టు విజయం సాధించింది. అయితే అర్జెంటీనాతో పోలిస్తే జట్టులో దూకుడు తక్కువ. కెనడాపై మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు 2 ఫీల్డ్ గోల్స్ మాత్రమే చేయగలిగింది. 2018 ఫైనల్లో ఆ జట్టు ఫ్రాన్స్‌కు తొలి 65 నిమిషాల్లోనే 4 గోల్స్ సమర్పించుకుంది. అంటే ఆరంభంలో ప్రత్యర్థి దాడి చేయగలిగితే క్రొయేషియా మళ్లీ కోలుకునే అవకాశాలు తక్కువ. అయితే గోల్‌కీపర్ లివకోవిచ్ ఈసారి కూడా అడ్డుగోడగా నిలవాలని టీమ్ కోరుకుంటోంది. గతంలో ఐదుసార్లు కాగా ప్రపంచకప్‌లో ఆరోసారి ఫైనల్ బెర్త్‌పై అర్జెంటీనా గురి పెట్టింది. గతంలో అర్జెంటీనా సెమీఫైనల్ చేరిన ఐదు పర్యాయాలు విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత పొందింది. క్రొయేషియా గెలిస్తే అర్జెంటీనాపై క్రొయేషియా గెలిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్ చేరిన నాలుగో యూరోప్ జట్టుగా నిలుస్తుంది. గతంలో ఇటలీ (1934, 1938), నెదర్లాండ్స్ (1974, 1978), జర్మనీ (1982, 1986, 1990) మాత్రమే ఈ ఘనత సాధించాయి. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! క్రొయేషియాతో సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాకిచ్చిన ఫిఫా Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్ ఎప్పుడంటే! IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Flashback ⏪ to when #ARG and #HRV met at the 2018 #FIFAWorldCup. These sides have met twice before on the big stage. Who will prevail tomorrow? pic.twitter.com/SHMSt84o1A — FIFA World Cup (@FIFAWorldCup) December 12, 2022 -
ARG VS CRO: అన్నంత పని చేసిన ఫిఫా.. ఇద్దరు అర్జెంటీనా ఆటగాళ్లపై వేటు
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అన్నంత పని చేసింది. వరల్డ్‌కప్-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హద్దు మీరి ప్రవర్తించిన అర్జెంటీనా ఆటగాళ్లపై వేటు వేసింది. మార్కోస్ అకునా, గొంజాలో మాంటియల్పై ఫిఫా ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. ఫిఫా ఇచ్చిన ఈ ఊహించని షాక్‌తో అర్జెంటీనా ఖంగుతింది. డిసెంబర్ 14న క్రొయేషియాతో జరుగబోయే కీలక సెమీస్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తప్పక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఫిఫా.. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ జట్టు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. Gonzalo Montiel and Marcos Acuña will not be able to play the semifinals due to suspension. pic.twitter.com/PGoqnT8wzF — Abubakar Ahmad Mulawa (@Mulawa99) December 10, 2022 కాగా, డచ్ టీమ్‌తో డిసెంబర్ 10న జరిగిన హోరాహోరీ క్వార్టర్స్ సమరంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఓవరాక్షన్ చేయడంతో రిఫరీ అంటోనియో మాథ్యూ ఏకంగా 16 సార్లు ఎల్లో కార్డ్ (ఆటగాళ్లకు మందలింపులో భాగంగా ఎల్లో కార్డులను చూపుతారు) చూపించాడు. ఇందులో భాగంగానే ఫిఫా.. ఇద్దరు అర్జెంటీనా ఆటగాళ్లపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఇదిలా ఉంటే, తొలి సెమీఫైనల్లో క్రితం వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా.. అర్జెంటీనా ఢీకొంటుంటే.. డిసెంబర్ 15న జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు షాకిచ్చిన మొరాకో తలపడుతుంది. ఈ రెండు సెమీస్‌లో విన్నర్లు.. డిసెంబర్ 18వ తేదీన జరిగే తుది సమరంలో అమీతుమీ తేల్చుకుంటాయి. -
FIFA WC 2022: సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాక్..?
ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022 తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి అనంతరం వరుస విజయాలతో దూసుకుపోతున్న అర్జెంటీనాకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) భారీ షాకిచ్చింది. నిన్న (డిసెంబర్ 10) నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మెస్సీ అండ్ టీమ్ చేసిన ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న ఫిఫా.. వారిపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్యపై డిసిప్లినరీ కేసులను నమోదు చేసింది. దీని ప్రభావం డిసెంబర్ 14న క్రొయేషియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌పై పడే అవకాశం ఉంది. ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ.. అర్జెంటీనా క్రమశిక్షణారాహిత్యానికి కెప్టెన్ మెస్సీని బాధ్యున్ని చేస్తే క్రొయేషియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో అతనిపై వేటు పడే అవకాశం ఉంది. మెస్సీతో పాటు ఆ జట్టు గోల్‌కీపర్, మరికొంత మంది ఆటగాళ్లపై కూడా ఫిఫా నిషేధం విధించవచ్చు. ఇదే జరిగితే అర్జెంటీనాకు భారీ షాక్ తగిలినట్టే. సెమీస్‌లో మెస్సీ, గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ బరిలోకి దిగకపోతే అర్జెంటీనా ఓటమిపాలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని సాకర్ అభిమానులు భావిస్తున్నారు. సెమీఫైనల్లో మెస్సీ ఆడకుండా అడ్డుకుంటే ఫిఫా అంతు చూస్తామని అర్జెంటీనా ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఈ ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో ఫిఫా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా, నిన్న డచ్ టీమ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ ఫైనల్లో అర్జెంటీనా 4-3 (2-2) తేడాతో గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ సమరంలో రిఫరీ అంటోనియో మాథ్యూ ఏకంగా 18 సార్లు ఎల్లో కార్డ్ (ఆటగాళ్లకు మందలింపులో భాగంగా ఎల్లో కార్డులను చూపుతారు) చూపించగా, ఇందులో అర్జెంటీనా ఆటగాళ్లే 16 సార్లు బాధ్యులయ్యారు. క్వార్టర్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మెస్సీ పోస్ట్‌మ్యాచ్ ఇంటర్య్వులోడీ అంశంపై స్పందిస్తూ.. రిఫరీ, నెదర్లాండ్ స్ట్రైకర్ వౌట్ వెఘోర్స్ట్, డచ్ కోచ్ లుయిస్ వాన్ గాల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే, డిసెంబర్ 14న జరిగే తొలి సెమీఫైనల్లో క్రితం వరల్డ్‌కప్‌లో రన్నరప్ క్రొయేషియా-అర్జెంటీనా జట్లు తలపడుతుంటే.. డిసెంబర్ 15న జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు షాకిచ్చిన మొరాకో తలపడనున్నాయి. ఈ రెండు సెమీస్‌లో విన్నర్లు.. డిసెంబర్ 18వ తేదీన జరిగే తుది సమరంలో అమీతుమీ తేల్చుకుంటాయి. -
FIFA: క్రొయేషియా గోల్‌కీపర్ సంచలనం.. చరిత్రలోనే తొలిసారి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా సెమీస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా.. బ్రెజిల్‌ను పెనాల్టీ షూటౌట్లో 4-2తో మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో క్రొయేషియా గోల్ కీపర్ డొమినిక్ లివాకోవిచ్ హీరోగా నిలిచాడు. పెనాల్టీ షూటౌట్లో పటిష్టమైన బ్రెజిల్ ఆటగాళ్లు నాలుగుసార్లు గోల్ చేయడానికి ప్రయత్నించగా సమర్థంగా అడ్డుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే నాలుగు పెనాల్టీ షూటౌట్ అడ్డుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదివరకు ఏ గోల్ కీపర్ ఈ ఘనత సాధించలేదు. ఇక పెనాల్టీ షూటౌట్లో వినిసియస్జూనియర్, నెయ్మర్, లుకాస్ పెక్వెటా కొట్టడానికి యత్నించిన గోల్స్‌ను సమర్థంగా అడ్డుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. దీంతో డొమినిక్ లివాకొవిచ్ ఇప్పుడు క్రొయేషియాలో హీరోగా మారిపోయాడు. ఇక నవంబర్ 14న జరగనున్న తొలి సెమీఫైనల్లో అర్జెంటీనాతో క్రొయేషియా అమితుమీ తేల్చుకోనుంది. Livakovic the hero again as Croatia oust Brazil on penalties 🤯 Watch how Zlatko Dalic's side beat the 5-time #FIFAWorldCup champions 🙌 Presented by @Mahindra_Auto Stay tuned to #JioCinema & #Sports18 for more 📺📲#CROBRA #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/gRydVtRRsC — JioCinema (@JioCinema) December 10, 2022 Croatia's hero... again! 🇭🇷🧤#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/w8QroYs2aJ — FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022 చదవండి: Lionel Messi: 'ఏంటి చూస్తున్నావ్.. నీ పని చూసుకో స్టుపిడ్' -
కల చెదిరింది.. హృదయం ముక్కలైంది! గుండెకోత మిగిల్చారు.. అయినా!
ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫిపా ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ తమ ప్రయాణాన్ని క్వార్టర్ ఫైనల్లోనే ముగించింది. క్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ క్రోయేషియా చేతిలో పరాజయం పాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆరోసారి ట్రోఫీను ముద్దాడాలని ఖాతర్ గడ్డపై అడుగుపెట్టిన సాంబా బృందం నిరాశతో ఇంటిముఖం పట్టింది. తమ ఆరాధ్య జట్టు ఓడిపోవడంతో అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. బ్రెజిల్ జట్టు స్టార్ ఆటగాడు నెయ్మర్ సైతం పొగిలి పొగిలి ఏడ్చాడు. మ్యాచ్ సాగిందిలా.. ఇరు జట్లు మ్యాచ్ నిర్దేశిత 90 నిమిషాల సమయం ముగిసే వరకు గోల్ సాధించలేకపోయాయి. దీంతో మ్యాచ్ రిఫరీ ఇరు జట్లకు అదనపు సమయమిచ్చారు. అయితే అదనపు సమయంలో మొదటి అర్ధ భాగంలో నెయ్మర్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ తో మెరిశాడు. అభిమానులలో గెలుపు ఆశలు రేకెత్తించాడు. పట్టలేని సంతోషం తో మైదానంలో పరుగులు తీసాడు. దీంతో 1-0 బ్రెజిల్‌కు లభించింది. అనంతరం రెండో అర్ధభాగం లో క్రొయేషియా ఆటగాడు బ్రూనో పెట్వోనిక్ గోల్ చేసి స్కోర్లను 1-1 తేడాతో సమం చేశాడు. దీంతో అభిమానుల హృదయ స్పందనల వేగం మరింత హెచ్చింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు మ్యాచ్ రిఫరీ పెనాల్టీ షూటౌట్‌ను ఎంచుకున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఫెనాల్టీ షూటౌట్లో ఏం జరిగిందంటే? తొలి ప్రయత్నంలోనే క్రోయేషియా ఆటగాడు గోల్ కొట్టి తమ జట్టుకు అధిక్యాన్ని ఇచ్చాడు. అనంతరం బ్రెజిల్ తమ తొలి ప్రయత్నంలో గోల్ కొట్టడంలో విఫలమైంది. బ్రెజిల్ ఆటగాడు రోడ్రిగో కొట్టిన బంతిని క్రోయేషియా గోల్ కీపర్ లీవర్ కోచ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇక రెండో ప్రయత్నంలోనూ క్రొయేషియా ఆటగాడు బంతిని గోల్ పోస్ట్ లోకి పంపించగా.. బ్రెజిల్ కూడా ఈ సారి గోల్ కొట్టడంలో సఫలమైంది. దీంతో స్కోర్ 2-1గా మారింది. ఇక మూడో ప్రయత్నంలోనూ క్రొయేషియా, బ్రెజిల్ ఇరు జట్లు గోల్స్ సాధించాయి. దీంతో స్కోర్ 3-2 అయింది. ఇక నాలుగో ప్రయత్నంలోనూ క్రొయేషియా గోల్ సాధించింది. దీంతో 4-2గా మారింది. స్టేడియం మొత్తం ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో బ్రెజిల్ తరపున గోల్ కొట్టేందుకు మార్కినోస్ పెనాల్టీ తీసుకున్నాడు. అయితే మార్కినో కొట్టిన షాట్ ఎడమైవైపున్న గోల్ బార్‌ను తాకడంతో బ్రెజిల్ ఓటమిపాలైంది. దీంతో సగటు బ్రెజిల్ అభిమాని గుండె పగిలింది. ఇక బ్రెజిల్‌పై అద్భుత విజయం సాధించిన క్రోయేషియా సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఏదేమైనా ఆటలో గెలుపుఓటములు సహజమే! క్రొయేషియా గెలిచినా.. బ్రెజిల్ ఓడినా సాకర్ ప్రేమికులను ఈ మ్యాచ్ ఉత్కంఠతో మునివేళ్ళమీద నిలబెట్టిందనటంలో సందేహం లేదు. కావాల్సినంత వినోదం పంచడంతో పాటు కాసిన్ని భావోద్వేగాలను కూడా మూటగట్టింది. చదవండి: FIFA WC: షూటౌట్లో బ్రెజిల్ అవుట్.. సెమీఫైనల్లో క్రోయేషియా -
FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి
ఇటీవలే క్రొయేషియాకు చెందిన మోడల్ ఇవానా నోల్ ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పొట్టి బట్టలతో దర్శనమిచ్చి వరల్డ్ హాటెస్ట్ ఫ్యాన్‌గా నిలిచింది. కఠిన నిబంధనలు ఉన్న అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన చేసిన ఆమె వార్తల్లో నిలిచింది. పైగా తన అందాలను చూపించడానికి ఖతర్ దేశం అనుమతి ఇచ్చిందంటూ పేర్కొంది. తాజాగా ఇవానా నోల్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈసారి అందాల ప్రదర్శన కాకుండా జపాన్ను అవమానిస్తూ వార్తల్లోకి ఎక్కింది. విషయంలోకి వెళితే.. ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రీక్వార్టర్స్‌లో భాగంగా సోమవారం రాత్రి క్రొయోషియా, జపాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయంలోగా ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో జపాన్ను 3-1 తేడాతో క్రొయేషియా ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇవానా నోల్ జపాన్ను ట్రోల్ చేసింది. జపనీయులకు సుషీ అనేది ఫెవరెట్ డిష్. వెంజర్డ్ రైస్, కూరగాయలు, ఇతర పదార్థాలను కలిపి ఈ డిష్‌ను తయారు చేస్తుంటారు. మ్యాచ్‌కు ముందు ఇవానా నోల్ తన ప్లేట్లో సుషీ డిష్‌ను ఉంచి.. ''జపాన్ మీకోసం మేము రెడీగా ఉన్నాం'' అంటూ పోస్ట్ చేసింది. దీనర్థం జపాన్‌తో కలిసి సుషీ తినడానికి మేం రెడీ అని. అయితే జపాన్ మ్యాచ్ ఓడిపోయాకా ఇవానా నోల్ మరో ఫోటో షేర్ చేసింది. ''ఈరోజు సుషీ మాత్రమే మా ఫుడ్మెనులో కనిపిస్తుంది.. పాపం జపాన్ తినే అర్హత కోల్పోయింది'' అంటూ అవమానించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇవానా షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) చదవండి: 'దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురా అన్నప్పుడు నవ్వుకున్నా' FIFA WC: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup 2022: క్రొయేషియా కేక
దోహా: లీగ్ దశలో రెండు ప్రపంచ మాజీ చాంపియన్ జట్లపై (జర్మనీ, స్పెయిన్) సంచలన విజయం సాధించిన జపాన్ జట్టు కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టుతో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ ‘షూటౌట్’లో ఓడిపోయింది. జపాన్ను ఏమాత్రం తక్కువ చేయకుండా నిర్ణీత సమయంలో... ఆ తర్వాత అదనపు సమయంలోనూ జాగ్రత్తగా ఆడిన క్రొయేషియా నిర్ణాయక ‘షూటౌట్’లో మాత్రం పూర్తిగా పైచేయి సాధించింది. తుదకు ‘షూటౌట్’లో 3–1తో జపాన్ను ఓడించి ఈ మెగా ఈవెంట్లో మూడోసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1998లో మూడో స్థానం పొందిన క్రొయేషియా, 2018లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు జపాన్ ప్రస్థానం నాలుగోసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. గతంలో మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ గండాన్ని అధిగమించలేకపోయిన ‘బ్లూ సమురాయ్’ బృందానికి నాలుగోసారీ నిరాశే ఎదురైంది. క్రొయేషియా సంబరం ముందుగా ఆట 43వ నిమిషంలో డైజెన్ మేడా గోల్‌తో జపాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 55వ నిమిషంలో లావ్రెన్ కుడి వైపు నుంచి కొట్టిన క్రాస్ షాట్‌ను ‘డి’ ఏరియాలో పెరిసిచ్ హెడర్ షాట్‌తో గోల్‌గా మలచడంతో క్రొయేషియా స్కోరును 1–1తో సమం చేసింది. అనంతరం రెండు జట్లు మరో గోల్ చేయకపోవడంతో నిర్ణీత సమయానికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితం తేలడానికి అదనపు సమయం (15 నిమిషాలు నిడివి గల రెండు భాగాలు) ఆడించారు. అదనపు సమయంలోనూ స్కోరు సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో క్రొయేషియా గోల్‌కీపర్ లివాకోవిచ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. జపాన్ ఆటగాళ్లు కొట్టిన మూడు షాట్లను నేర్పుతో నిలువరించాడు. మరోవైపు క్రొయేషియా జట్టులో లివాజా కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌కు తగిలి పక్కకు వెళ్లగా, మిగతా ముగ్గురు ఆటగాళ్లు జపాన్ గోల్కీపర్ను బోల్తా కొట్టించి బంతిని లక్ష్యానికి చేర్చారు. బ్రెజిల్, దక్షిణ కొరియా మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా ఆడుతుంది. -
FIFA WC: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ చూడడానికి వచ్చే అభిమానులకు కఠినమైన కండీషన్స్ పెట్టారు నిర్వాహకులు. మాములుగా ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగితే యువతుల గ్లామర్ షో ఎక్కువగా ఉండడం సహజం. మందు, విందు, చిందు కూడా కామన్‌గా కనిపిస్తాయి. ఫిఫా లాంటి మెగా టోర్నీలో అయితే ఇక చెప్పనవసరం లేదు. పొట్టి దుస్తులు ధరించి క్లీవేజ్ షో చేస్తూ తమ అంద చందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ అరబ్ దేశమైన ఖతర్‌లో ఇలాంటివి నిషేధం. ఇస్లాం మతం ఎక్కువగా ఆచరించే దేశంలో మహిళలు అసభ్యకర దుస్తులు ధరించడానికి వీల్లేదు. అందుకే ఫిఫా వరల్డ్‌కప్‌కు వచ్చే యువతులు, మహిళలలు ఎట్టి పరిస్థితుల్లోనూ కురచ దుస్తులు వేసుకొని రావొద్దని.. అనవసరంగా క్లీవేజ్ షో చేసి జైలుపాలు కావొద్దని ముందే హెచ్చరించింది. అంతేకాదు మ్యాచ్ చూడడానికి వచ్చే మహిళా అభిమానులు ఫుల్ డ్రెస్ వేసుకొని రావాలని.. తప్పనిసరిగా మెడచుట్టు స్కార్ఫ్ వాడాల్సిందేనని పేర్కొన్నారు. అయితే క్రొయేషియాకు చెందిన మోడల్ ఇవానా నోల్ మాత్రం తనకు ఈ నిబంధనలు ఏ మాత్రం వర్తించవని ధైర్యంగా పేర్కొంది. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో హాటెస్ట్ ఫ్యాన్‌గా ముద్రపడిన ఇవానా నోల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అందాల ప్రదర్శన చేయడం సంచలనం కలిగించింది. క్రొయేషియా, బెల్జియం మ్యాచ్‌కు హాజరైన ఇవానా నోల్.. స్టేడియంలోకి సాధారణంగానే ఎంట్రీ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతుండగానే ఇవానా నోల్ తాను వేసుకున్న డ్రెస్ పైపార్ట్ తొలగించి క్లీవేజ్ షో చేసింది. ఫిఫా నిర్వాహకుల సంగతి ఏమో తెలియదు కానీ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులు మాత్రం ఆమె అందాల ప్రదర్శనను బాగా ఎంజాయ్ చేశారు. అయితే తన అందాల ప్రదర్శనే ఇప్పుడు ఇవానా నోల్కు సమస్యను తెచ్చిపెట్టింది. ఖతర్ వీధుల్లో ఇవానా నోల్ ఫోటోలను దగ్దం చేసిన స్థానిక యువకులు వెంటనే ఆమెను దేశం నుంచి బహిష్కరించాలని లేదా జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఇవానా నోల్ మాత్రం తన అంద చందాలతో ఖతర్‌లో సెగలు పుట్టించింది. చదవండి: నాలుగుసార్లు ఛాంపియన్.. ఇదంతా గతం; మాకు జరగాల్సిందే View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) -
FIFA World Cup Qatar 2022: బెల్జియం అవుట్
దోహా: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ప్రపంచ రెండో ర్యాంకర్, గత ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన బెల్జియం జట్టు తాజా మెగా ఈవెంట్లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. నాకౌట్ దశ బెర్త్ దక్కాలంటే గత వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా జట్టుపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను బెల్జియం 0–0తో ‘డ్రా’ చేసుకుంది. బెల్జియంను నిలువరించిన క్రొయేషియా ఐదు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్రొయేషియాతో మ్యాచ్‌లో బెల్జియం జట్టు ఓటమి స్వయంకృతమే అని చెప్పాలి. స్టార్ ఫార్వర్డ్ రొమెలు లుకాకుకు ఏకంగా ఐదుసార్లు గోల్ చేసే సువర్ణావకాశాలు వచ్చినా అతను వృథా చేశాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇదేనా ఆటతీరు.. మెరుపుల్లేవ్!
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం గ్రూప్-ఎఫ్‌లో భాగంగా మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ పేలవ డ్రాగా ముగిసింది. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా జట్టు ఈ మ్యాచ్‌లో పెద్దగా మెరవలేదు. క్రొయేషియా పలుసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసినప్పటికి మొరాకో డిఫెన్స్ పటిష్టంగా ఉండడంతో గోల్స్ కొట్టలేకపోయింది. తొలి హాఫ్ టైమ్‌లో ఇరుజట్లు గోల్స్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. ఇక రెండో హాఫ్ టైంలోనూ అదే పరిస్థితి. అదనపు సమయంలోనే ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో చెరొక పాయింట్ కేటాయించారు. ఇక తమ తర్వాతి మ్యాచ్‌లో క్రొయేషియా..కెనడాతో ఆడనుండగా; మొరాకో బెల్జియంతో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: మరొక మ్యాచ్ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ చాన్స్ ఎంత? Morocco and Croatia share the points. 🤝@adidasfootball | #FIFAWorldCup — FIFA World Cup (@FIFAWorldCup) November 23, 2022 -
FIFA Football WC 2022: బెల్జియంపై భారీ అంచనాలు.. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి..!
గత నాలుగు ప్రపంచకప్‌లలో యూరోప్ జట్లే విశ్వవిజేతగా నిలిచాయి. ఈసారీ యూరోప్ నుంచే మళ్లీ ప్రపంచ చాంపియన్ వచ్చే అవకాశాలున్నాయి. గత వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించి కీలకమైన సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన బెల్జియం మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా ఖతర్‌లో అడుగు పెట్టింది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి తడబడకుండా ఆడితే ఈసారి ఆ జట్టుకు గొప్ప ఫలితం లభిస్తుంది. –సాక్షి క్రీడా విభాగం బెల్జియం ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 2. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఇ’ విన్నర్. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లతో నిండిన బెల్జియం జట్టును కచ్చితంగా టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా పరిగణించాలి. 14వ సారి ప్రపంచకప్‌లో ఆడుతున్న బెల్జియం క్వాలిఫయింగ్ టోర్నీలో అజేయంగా నిలిచింది. ఆరు విజయాలు సాధించి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. సమకాలీన ఫుట్‌బాల్‌లో మేటి గోల్‌కీపర్‌గా పేరొందిన థిబాట్ కుర్టియస్, ఉత్తమ మిడ్‌ఫీల్డర్ కెవిన్ డి బ్రున్, స్టార్ ఫార్వర్డ్స్ లుకాకు, హెజార్డ్లతో బెల్జియం పటిష్టంగా కనిపిస్తోంది. తమ గ్రూప్‌లో క్రొయేషియాతో మ్యాచ్ మినహా మొరాకో, కెనడా జట్ల నుంచి బెల్జియంకు పెద్దగా ప్రతిఘటన ఉండకపోవచ్చు. మొరాకో ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (1986). ‘ఫిఫా’ ర్యాంక్: 22. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విన్నర్. ఆఫ్రికా క్వాలిఫయింగ్ టోర్నీలో అజేయంగా నిలిచిన మొరాకో ప్రపంచకప్ ప్రధాన టోర్నీలోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే బెల్జియం, క్రొయేషియాలాంటి రెండు పటిష్ట జట్లను నిలువరించాలంటే మొరాకో అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. హకీమ్ జియచ్, హకీమీ కీలక ఆటగాళ్లు. కెనడా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ (1986). ‘ఫిఫా’ ర్యాంక్: 41. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా కరీబియన్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విన్నర్. మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌కు అర్హత పొందిన కెనడా జట్టులో అల్ఫోన్సో డేవిస్, డేవిడ్ల రూపంలో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రెండోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కెనడా 1986లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గ్రూప్‌లో బెల్జియం, క్రొయేషియా లాంటి పటిష్ట జట్లు ఉండటంతో కెనడా ఈసారైనా పాయింట్ల ఖాతా తెరుస్తుందో లేదో వేచి చూడాలి. క్రొయేషియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: రన్నరప్ (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 12. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘హెచ్’ విన్నర్. నాలుగేళ్ల క్రితం సంచలన ప్రదర్శనతో క్రొయేషియా తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత పలువురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ కావడంతో కొంత బలహీన పడ్డా యూరోపియన్ క్వాలిఫయింగ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించి తొలి అవకాశంలోనే ప్రపంచకప్ బెర్త్ సాధించింది. తాజా జట్టులో అనుభవంలేని యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో స్టార్ మిడ్ ఫీల్డర్లు లుకా మోడ్రిచ్, బ్రొజోవిచ్, కొవాచిచ్ల ఆటతీరుపైనే క్రొయేషియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు తదుపరి వరల్డ్‌కప్‌లోనూ ఫైనల్‌కు చేరడం చివరిసారి 2002లో జరిగింది. 1998 ప్రపంచకప్ రన్నరప్ బ్రెజిల్ 2002లో ఫైనల్ చేరడంతోపాటు విజేతగా నిలిచింది. -
‘డైనమో జాగ్రెబ్’ జట్టులో సౌమ్య
భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన గుగులోత్ సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. క్రొయేషియాకు చెందిన ప్రతిష్టాత్మక క్లబ్ ‘డైనమో జాగ్రెబ్’ తరఫున ఆమె ఆడనుంది. దీనికి సంబంధించి ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. సౌమ్యతో పాటు మరో భారత ప్లేయర్ జ్యోతి చౌహాన్‌ను కూడా జాగ్రెబ్ క్లబ్ ఎంచుకుంది. ఈ టీమ్‌తో జత కట్టిన తొలి విదేశీ ఆటగాళ్లుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. క్రొయేషియాలోనే జరిగిన ట్రయల్స్‌లో సత్తా చాటి వీరిద్దరు ఆ అవకాశం దక్కించుకున్నారు. ఇద్దరూ కూడా భారత దేశవాళీ మహిళల లీగ్‌లో గోకులమ్ ఎఫ్‌సీకే ప్రాతినిధ్యం వహించారు. క్రొయేషియాలో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన డైనమో జాగ్రెబ్ 46 ట్రోఫీలు గెలుచుకుంది. చదవండి: Japan Open 2022: ముగిసిన శ్రీకాంత్ పోరాటం.. బరిలో మిగిలింది ఒకే ఒక్కడు -
అందరూ చూస్తుండగా బట్టలు విప్పి రచ్చరచ్చ చేసిన స్టార్ ఫుట్‌బాలర్
ప్రత్యర్ధి జట్టు ఆటగాడు అని కూడా చూడకుండా తనపై అభిమానంతో మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌కు క్రొయేషియన్ స్టార్ ఫుట్‌బాలర్ ఇవాన్ రాకిటిక్ తనదైన స్టైల్లో థ్యాంక్స్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోనే బట్టలు విప్పి ప్రత్యర్ధి జట్టు అభిమానులకు ఇచ్చేశాడు. అనంతరం అండర్‌వేర్‌తోనే మైదానం మొత్తం తిరుగుతూ స్టాండ్స్‌లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. 📹 Rakitic gives his shirt and shorts to fans after the game #BarçaSevilla ⏩ @GolagolE3 pic.twitter.com/pfXUpmcsVX — FCBarcelonaFl (@FCBarcelonaFl) April 4, 2022 ప్రముఖ స్పానిష్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా బార్సీలోనా-సెవిల్లా జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బార్సీలోనా 1-0 తేడాతో విజయం సాధించింది. బార్సిలోనా తరఫున పేద్రీ 72వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పెద్రీతో పాటు సెవిల్లా ఆటగాడు ఇవాన్ రాకిటిక్ కూడా హీరో అయ్యాడు. తన జట్టు ఓటమి పాలైనప్పటికీ అద్భుతమైన ఆటతీరు కనబర్చి ప్రత్యర్ధి జట్టు అభిమానుల మద్దతు చూరగొన్నాడు. చదవండి: దుమ్మురేపుతున్న టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. భవిష్యత్తు వీళ్లదే -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇవానిసెవిచ్
ఫ్లోరిడా: క్రొయేషియా మాజీ టెన్నిస్ ప్లేయర్ ఇవానిసెవిచ్కు గొప్ప గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇవానిసెవిచ్కు చోటు లభించింది. ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న 49 ఏళ్ల ఇవానిసెవిచ్ ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి 2001లో వింబుల్డన్ టోర్నీ టైటిల్‌ను గెలిచాడు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించా డు. ఇవానిసెవిచ్తోపాటు మాజీ నంబర్‌వన్ హెవిట్ (ఆస్ట్రేలియా), వింబుల్డన్ మాజీ విజేత కొంచిటా మార్టినెజ్ (స్పెయిన్)లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కింది. -
Wimbledon 2021: తొలిసారి టైటిల్ నెగ్గిన క్రొయేషియన్ జోడీ
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ ట్రోఫీని క్రొయేషియా ద్వయం నికోలా మెక్టిక్, మేట్ పావిక్ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఈ క్రొయేషియా ద్వయం 6-4, 7-6(5), 2-6, 7-5తో మార్సెల్ గ్రానోల్లర్స్(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) జోడీపై విజయం సాధించింది. దీంతో వింబుల్డన్ టైటిల్ గెలిచిన మొదటి క్రొయేషియా డబుల్స్ జోడీగా మెక్టిక్-పావిక్ జోడీ చరిత్ర సృష్టించింది. కాగా, మెక్టిక్-పావిక్ జంటకు ఈ సీజన్లో ఇది ఎనిమిదో టైటిల్ కావడం విశేషం. ఇదిలా ఉంటే, 2018 ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్‌ను వేర్వేరు భాగస్వాములతో కలిసి గెలుపొందిన పావిక్‌కు.. మెక్టిక్‌తో కలిసి ఇదే తొలి టైటిల్. మరోవైపు మెక్టిక్కు మాత్రం ఇదే తొలి గ్రాండ్‌స్లామ్. ఈ క్రొయేషియా జోడీ టోక్యో ఒలింపిక్స్‌లోనూ జంటగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు, శనివారమే జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సువే(తైవాన్)-ఎలిస్ మెర్టన్స్(బెల్జియం) జోడీ 6-3, 5-7, 7-9తో వెరోనికా కుడెర్మెటోవా- ఎలెనా వెస్నినా(రష్యా) ద్వయంపై విజయం సాధించి వింబుల్డన్ 2021 మహిళల డబుల్స్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, కెరీర్లో 20వ గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకుని దిగ్గజ ఆటగాళ్లైన రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ సరసన నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్న సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్.. తుది పోరులో ఏడో సీడ్ ఇటలీ ఆటగాడు మాటియో బెరెటినితో అమీతుమీకి రెడీ అయ్యాడు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. -
Viral Video: గోల్ కీపర్ తడబాటు.. పాపం!
ఉత్కంఠ భరితంగా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విజయం దక్కినప్పటికీ.. ఆ గోల్కీపర్కి మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. గోల్ కీపర్ కంగారుతో .. ప్రత్యర్థి ఖాతాలో పాయింట్ జమ అయ్యింది. దీంతో అవతలి టీం ఆధిక్యంలోకి వెళ్లగా.. కాసేపు మ్యాచ్ ఆడియెన్స్‌లో టెన్షన్ పెంచింది. యూరో 2020 టోర్నీలో పదహారో రౌండ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. స్పెయిన్, క్రోయేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే క్రొయేషియా 1-0తో ఆధిక్యంలో ఉంది. బార్సిలోనా(స్పెయిన్ క్లబ్) మిడ్ ఫీల్డర్ పెడ్రి బంతిని పాస్ చేయగా.. అది గోల్‌కీపర్ ఉనయ్ సైమన్ ముందుకొచ్చింది. అయితే బంతిని కాలితో అడ్డుకోబోయినప్పటికీ పొరపాటున అతని షూ చివర తగిలి.. వెనకాల గోల్ నెట్ వైపు దూసుకెళ్లింది. అయితే రెప్పపాటులో జరిగిన ఆ పరిణామాన్ని .. అడ్డుకునేంత టైం సైమన్‌కు లేదు. ఇక ఆ తర్వాత మ్యాచ్ జరుగుతున్నంత సేపు సైమన్ ముఖంలో ఆందోళనతో నిండిపోయింది. చివరికి ఎక్స్ట్రా టైం కలిసి రావడంతో 5-3 తేడాతో స్పెయిన్.. క్రొయేషియాపై విజయం సాధించింది. ఇక ఆ సెల్ఫ్ గోల్ తర్వాత సైమన్ చాలాసేపు స్థిమితంగా ఉండలేకపోయాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇదే వెరైటీ గోల్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో.. అందుకు సంబంధించిన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. Kepa watching from the bench as Unai Simon concedes from a 30 yard backpass#CROSPA #EURO2020 pic.twitter.com/XBDZq2DtRC — Kiran T-ierney (@mopeygooner) June 28, 2021 “Dubravka scored the most bizarre own goal you’ll see at #EURO2020” Unai Simon: #ESP pic.twitter.com/eYxQWAHMzB — SportPesa Kenya (@SportPesa) June 28, 2021 చదవండి: విజేత నుంచి అబద్ధాలకోరు.. తప్పక చదవాల్సిన కథ -
వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?!
జాగ్రెబ్(క్రొయేషియా): దెయ్యాలు, భూతాలు అంటే నమ్మకం లేని వారు ఎందరు ఉన్నారో.. వాటి ఉనికిని విశ్వసించే వారు కూడా అంతకంటే ఎక్కువ మందే ఉంటారు లోకంలో. దెయ్యాలకు సంబంధించిన వార్తలు, వీడియోలకు చాలా క్రేజ్. చాలా మంది భయపడుతూ మరి వాటిని చూస్తారు. ఇక నెట్టింట్లో దెయ్యాల ఉనికికి సంబంధించిన వీడియోలు కోకొల్లలు. వీటిలో చాలా మటుకు ట్రిక్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన వీడియోలే. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే తాజాగా ఓ మహిళ ఫోటో ఇంటర్నెట్‌ని హడలెత్తిస్తుంది. చాలా మంది ఇమె మనిషి కాదు దెయ్యం అంటుండగా.. కొందరు మాత్రం.. కెమరా ట్రిక్ అని కొట్టి పారేస్తున్నారు. ఇంతకు ఈ ఫోటో కథ ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. క్రొయేషియాకు చెందిన ఇవాన్ రుబిల్ టూర్ గైడ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం జాగ్రేబ్ బస్టాప్ వద్ద నిలుచున్న ప్రయాణికులను తన ఫోన్ కెమేరాతో ఫొటో తీశాడు. ఆ ఫొటో చూసేందుకు చాలా సాధారణంగానే ఉంది. దీనిలో ఇద్దరు నన్‌లు, బ్రౌన్ కలర్ కోటు ధరించిన ఓ మహిళ ఉన్నారు. ఇక ఈ ఫోటోని పరిశీలనగా చూస్తే.. అందులో బ్రౌన్ కోటు వేసుకున్న మహిళ కాళ్లను చూడగానే ఒక్కసారిగా వెన్నులో వణకు పుడుతుంది. ఎందుకంటే.. ఈ ఫోటోలో ఆమె కాళ్లు పారదర్శకంగా ఉన్నాయి. బస్టాప్‌లో ఉన్న తెల్ల గీత సైతం ఆమె కాళ్ల నుంచి వెళ్లినట్లు కనిపిస్తోంది. దాంతో ఇవాన్ ఆ ఫొటోను రెండు మూడుసార్లు పరిశీలనగా చూశాడు. ఈ ఫొటోను అతడి స్నేహితులకు షేర్ చేశాడట. వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు మాత్రం ‘‘అది నీ కెమేరా ట్రిక్ కాబోలు’’ అని కొట్టిపడేశారట. అనంతరం ఆ ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్టు చేశాడు ఇవాన్. ఇక ఈ ఫోటో చూసిన వాళ్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ‘‘నీ ఫొటోలో దెయ్యం ఉంది’’ అంటే.. చాలామంది మాత్రం ‘‘నీ కెమేరాలో ఏదో సమస్య ఉంది చెక్ చేసుకో’’ అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇవాన్ మాట్లాడుతూ.. ‘‘నా ఫోన్ కెమేరాలో ఏదైనా సమస్య ఉందేమోనని భావించి మిగతా ఫొటోలను కూడా చెక్ చేశాను. కానీ, ఆ ఫొటో మాత్రమే అలా వచ్చింది. బహుశా వారు చెప్పేది కూడా నిజమే కావచ్చు. నా కెమేరాలో సమస్య వల్లే ఆ ఫొటో అలా వచ్చిందేమో’’ అని తెలిపాడు. ఏది ఏమైనా ఈ ఫోటో మరోసారి దెయ్యాల ప్రస్తావను తెరమీదకు తెచ్చింది. చిత్రం ఏమిటంటే ఇవాన్‌కు హాంటెడ్ సిటీలంటే ఇష్టమట. అతడు చాలాసార్లు ఆయా ప్రాంతాలను సందర్శించాడు. కానీ, ఎక్కడా అతడికి దెయ్యం జాడ కనిపించలేదట. అందుకే ఆ ఫొటోను చూడగానే అతడు అంత ఆశ్చర్యపోయాడు. ఇక సదరు మహిళ కాళ్లు అంత పారదర్శకంగా కనిపించడానికి కారణం ఏమిటో ఎవరు చెప్పలేకపోతున్నారు. చదవండి: ప్రాంక్ కాదు, అక్కడ నిజంగానే దెయ్యం! -
సోనూ సూద్‌ని సాయం కోరిన బ్రహ్మాజీ
సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ పోషించినప్పటికి దాతృత్వంతో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సోనూ సూద్. లాక్డౌన్లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చడంతో ప్రారంభించిన సోనూ సూద్ సహాయక సేవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కష్టం అంటూ తన దృష్టికి వచ్చిన వారందరికి సాయం చేస్తున్నారు సోనూ సూద్. అయితే అప్పుడప్పుడు కొందరు తనని ఆటపట్టించడం కోసం వింత వింత కోరికలు కోరుతున్న సంఘటనలు కొన్ని చూశాం. తాజాగా అలాంటి ఫన్ని రిక్వెస్ట్ ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఈ విన్నపం చేసిన వ్యక్తి కూడా ఓ ప్రముఖ నటుడు కావడంతో ఈ ట్వీట్ వైరలవుతోంది. (సోనూ సూద్ సేవ: కొత్త దేశం.. కొత్త మిషన్) వివరాలు.. బ్రహ్మాజీ ట్విట్టర్ వేదికగా సోనూ సూద్‌ని ఓ కోరిక కోరారు. ఇంట్లో ఉండి డిప్రెషన్‌కు గురయ్యాను. నన్ను క్రొయేషియా పంపించు సోనూ భాయ్ అంటూ రిక్వెస్ట్ చేశారు బ్రహ్మాజీ. ‘డియర్ సూపర్‌మ్యాన్ సోనూ భాయ్.. నేను డిప్రెషన్లో ఉన్నాను. మెంటల్‌గా లాక్డౌన్ అయ్యాను. హైదరాబాద్‌లో చిక్కుకుపోయాను. ప్లీజ్ నన్ను ఇక్కడకు తీసుకెళ్లు. క్రొయేషియా’ అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక సోనూ సూద్ ఎలా స్పందిస్తారో చూడాలి. Dear superman Sonu bhai.. am depressed.. mentally locked down ..am struck in Hyd.. pl take me there.. 🙏🏼 #croatia @SonuSood pic.twitter.com/ad6aVpZKRU — BRAHMAJI (@actorbrahmaji) August 21, 2020 -
కరోనా అంటించిన జొకోవిచ్ చావాల్సిందే
స్లి్పట్ (క్రొయేషియా): ఇప్పటికే కరోనా బారిన పడిన ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మరో చిక్కు వచ్చి పడింది. వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ బాధ్యతారాహిత్యంగా టోర్నీ నిర్వహించిన జొకో చావాల్సిందేనంటూ పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీల నిర్వహణతో జొకోవిచ్ దంపతులతోపాటు అతని కోచ్ ఇవానిసెవిచ్, మరో ముగ్గురు కోవిడ్ బారిన పడ్డారు. దీనిపై కొందరు క్రీడా ప్రముఖులు సెర్బియన్ స్టార్‌పై మండిపడ్డారు. తాజాగా క్రొయేషియాలోని స్లి్పట్ నగరంలో కరోనా అంటించిన జొకోవిచ్ చావాలని కోరుకుంటున్నట్లు గోడలపై రాతలు రాశారు. ‘జొకో నువ్వు చావాలని స్లి్పట్ నగరం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది’ అని నిరసనకారులు రాశారు. మరోవైపు సెర్బియా మహిళా ప్రధానమంత్రి తమ స్టార్ ప్లేయర్‌కు మద్దతుగా నిలిచారు. టోర్నీ నిర్వహణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని... ఈ విషయంలో నొవాక్‌ను నిందించకూడదని ఆమె కోరారు. జొకోవిచ్, ప్రధాని అనా బోర్నబిచ్ -
రెండు సింగిల్స్‌లోనూ భారత్‌కు నిరాశ
జాగ్రెబ్: డేవిస్ కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా క్రొయేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లు ఓటమి చవిచూశారు. తొలి సింగిల్స్‌లో 132వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–3, 4–6, 2–6తో ప్రపంచ 277వ ర్యాంకర్ బోర్నా గోజో చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో 182వ ర్యాంకర్ రామ్ కుమార్ 6–7 (8/10), 6–7 (8/10)తో 37వ ర్యాంకర్ మారిన్ సిలిచ్ చేతిలో పోరాడి ఓడాడు. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన క్రొయేషియా... నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లేదా రెండు రివర్స్ సింగిల్స్‌లో ఒక దాంట్లో విజయం సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే డేవిస్‌కప్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. -
భారత్ ముందుకెళ్లేనా?
జాగ్రెబ్ (క్రొయేషియా): డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్ బెర్త్‌పై కన్నేసిన భారత పురుషుల టెన్నిస్ జట్టుకు నేటి నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా రెండు రోజుల పాటు సాగే ఈ పోరులో భారత్... 2014 యూఎస్ ఓపెన్ విజేత మారిన్ సిలిచ్‌తో కూడిన క్రొయేషియాను ఎదుర్కోనుంది. అయితే మారిన్ సిలిచ్ మినహా మిగతా క్రొయేషియా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్థాయి ప్లేయర్లు కాకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, లియాండర్ పేస్, రోహన్ బొపన్న, రామ్‌కుమార్ రామనాథన్‌లతో కూడిన భారత్ ఈ మ్యాచ్‌లో అండర్ డాగ్స్‌గా బరిలో దిగనుంది. తన కెరీర్లో చివరి డేవిస్ కప్ సీజన్ ఆడుతున్న లియాండర్ పేస్ ఘనమైన ముగింపు పలకాలనే పట్టుదలతో ఉన్నాడు. రెండు సింగిల్స్... డబుల్స్... రెండు రివర్స్ సింగిల్స్ పద్ధతిన జరిగే ఈ పోరులో మూడు మ్యాచ్‌లను గెలిచిన జట్టు మాడ్రిడ్ వేదికగా నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లు బరిలో దిగనున్నారు. భారత నంబర్‌వన్ సుమీత్ నాగల్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో బోర్నా గోజోతో ప్రజ్నేశ్; రెండో మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ మారిన్ సిలిచ్‌తో రామ్‌కుమార్ తలపడతారు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో మ్యాట్ పావిచ్–స్కుగోర్‌లతో లియాండర్ పేస్–రోహన్ బోపన్న... నాలుగో మ్యాచ్‌లో సిలిచ్‌తో ప్రజ్నేశ్; ఐదో మ్యాచ్‌లో గోజోతో రామ్‌కుమార్ ఆడతారు. చివరిసారిగా ఈ రెండు జట్లు 1995లో న్యూఢిల్లీ వేదికగా తలపడగా... అందులో భారత్ 3–2తో గెలుపొందింది. -
తుది జట్టులో పేస్
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది. మార్చి 6, 7 తేదీల్లో జాగ్రెబ్‌లో క్రొయేషియా జట్టుతో జరిగే డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ వరల్డ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పాల్గొనే ఐదుగురు సభ్యులతో భారత తుది జట్టును ఏఐటీఏ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)కు పంపించింది. 24 జట్లు పాల్గొనే క్వాలిఫయర్స్‌లో గెలిచిన 12 జట్లు ఈ ఏడాది చివర్లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. సింగిల్స్‌లో భారత టాప్–3 ర్యాంకర్లు సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్... డబుల్స్‌లో భారత నంబర్‌వన్ రోహన్ బోపన్న, నాలుగో ర్యాంకర్ లియాండర్ పేస్‌లను భారత జట్టులో ఎంపిక చేశామని ఏఐటీఏ తెలిపింది. డబుల్స్‌లోభారత రెండో ర్యాంకర్ దివిజ్ శరణ్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ‘ఈ సీజన్లో పేస్ బాగా రాణిస్తున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. టాటా ఓపెన్‌లో దివిజ్ శరణ్ జంటపై పేస్ జోడీ గెలిచింది. బెంగళూరు ఓపెన్ చాలెంజర్ టోర్నీలో పేస్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది పేస్ కెరీర్లో చివరిది. 30 ఏళ్లుగా దేశానికి సేవ అందిస్తున్న వ్యక్తికి అత్యున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా అతడిని ఎంపిక చేశాం. దివిజ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు’ అని భారత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ తెలిపారు. డేవిస్ కప్‌లో క్రొయేషియా, భారత్ తలపడనుండటం ఇది రెండోసారి మాత్రమే. 1995లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–2తో క్రొయేషియాను ఓడించింది. ఈ పోటీలో పేస్ సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగి విజయం సాధించాడు. -
అండర్సన్‌కు సింగిల్స్ టైటిల్ ...
టాటా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ ఆరో ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) సాధించాడు. 100వ ర్యాంకర్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అండర్సన్ 7–6 (7/4), 6–7 (2/7), 7–6 (7/5)తో గెలుపొందాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 95 కేజీల బరువున్న అండర్సన్ మ్యాచ్‌లో 21 ఏస్‌లు... 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 105 కేజీల బరువున్న కార్లోవిచ్ 36 ఏస్‌లు సంధించడం విశేషం. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా నమోదు కాకపోవడం విశేషం. చివరి సెట్ టైబ్రేక్‌లో 39 ఏళ్ల కార్లోవిచ్ 5–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత తడబడి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి ఓటమి చవిచూశాడు. విజేత అండర్సన్‌కు 90,990 డాలర్ల (రూ. 63 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
ఈ యేటి మేటి మోడ్రిచ్
పారిస్: తన అద్వితీయ ఆటతీరుతో ఈ ఏడాది క్రొయేషియాను ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన లుకా మోడ్రిచ్... 2018 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ బాల్’ (వరల్డ్ బెస్ట్ ప్లేయర్) అవార్డును అందుకున్నాడు. మోడ్రిచ్‌కు మొత్తం 753 ఓట్లు లభించగా... 476 ఓట్లతో రొనాల్డో రెండో స్థానంలో... 414 ఓట్లతో ఫ్రాన్స్ స్ట్రయికర్ గ్రీజ్మన్ మూడో స్థానంలో నిలిచారు. రొనాల్డో (పోర్చుగల్), మెస్సీ (అర్జెంటీనా) కాకుండా గత పదేళ్లలో ఈ అవార్డు నెగ్గిన తొలి ప్లేయర్ మోడ్రిచ్ కావడం విశేషం. ఈ ఏడాది కొత్తగా మహిళా ఫుట్‌బాల్ స్టార్‌కు గోల్డెన్ బాల్ పురస్కారాన్ని అందజేశారు. నార్వే స్ట్రయికర్ అడా హెగెర్బెర్గ్ ఈ అవార్డును అందుకుంది. -
మోదీ ఫ్రాన్స్.. రాహుల్ క్రొయేషియా
ముంబై: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచినట్లు ప్రధాని మోదీ అవిశ్వాస పరీక్షలో నెగ్గినా, రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియాలా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అందరి మనసులు గెలుచుకున్నారని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్చారు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ గెలిచినప్పటికీ, గొప్ప ఆటతీరు, పోరాటపటిమను ప్రదర్శిం చిన జట్టుగా క్రొయేషియాను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్‌ను అందరూ ఇదే తరహాలో చూస్తున్నారు. ఎవరైనా ఇలాంటి రాజకీయాలు చేస్తే కచ్చితంగా అతను మిగతా వారి కంటే నాలుగైదు అడుగులు ముందుంటాడు’ అని వ్యాఖ్యానించారు. అందరి దృష్టిని ఆకర్షించేందుకే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారనీ, ప్రధానికి షాకివ్వాలన్న లక్ష్యంతో రాహుల్ ఆ పని చేసుంటే ఆయన లక్ష్యం నెరవేరినట్లేనని రౌత్ అభిప్రాయపడ్డారు. -
క్రొయేషియా జట్టుకు బ్రహ్మరథం..
ఫుట్‌బాల్ ప్రపంచ కప్-2018 తుదిపోరులో ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైనా అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన క్రొయేషియా జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఊహించని రీతిలో దేశ అధికారులు, అభిమానులు తమ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడాన్ని ఎంతో గౌరవంగా భావించారు. గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్) అందుకున్న లుకా మోడ్రిచ్‌తో కరచాలనం చేసేందుకు క్రొయేషియా వాసులు పోటీపడ్డారు. దేశ రాజధాని జాగ్రిబ్ నగరంలో ఓపెన్ టాప్ బస్సులో వచ్చిన ఆటగాళ్లకు కరతాళ ధ్వనులతో, ప్లేయర్ల పేర్ల నినాదాలతో గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆటగాళ్ల రాక సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాల కూడళ్లలో క్రొయేషియా జాతీయ గీతాన్ని ఆలపించి వారు సాధించిన ఘనతకు అసలుసిసలైన గుర్తింపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరిగ్గా 50 లక్షల జనాభా కూడా లేని క్రొయేషియా పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అందుకు కారణం రష్యాలో జరిగిన సాకర్ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి, దిగ్గజ జట్లను మట్టికరించడమే. అయితే ఫైనల్లో పటిష్ట ఫ్రాన్స్ జట్టుతో చివరివరకూ పోరాడిన క్రొయేషియా ఆటగాళ్లు దేశంలో సూపర్ స్టార్లయ్యారు. ఇప్పుడు క్రొయేషియాలో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ఆటగాళ్ల ఘనత గురించే. వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్ చేరిన జట్లలో క్రొయేషియా (20)దే పెద్ద ర్యాంకు.. అయినా అసాధారణ ఆటతీరుతో ఆ ప్లేయర్లు జననీరాజనాలు అందుకుంటున్నారు. ఒకవేళ క్రొయేషియా కప్ నెగ్గి ఉంటే.. అత్యధిక ర్యాంకుతో బరిలోకి కప్ సాధించిన జట్టుగా నిలిచి ఫ్రాన్స్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసేది. 1998 వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ 18వ ర్యాంకుతో బరిలో దిగి టైటిల్ నెగ్గడం విశేషం. మరోవైపు అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ సైతం దేశ ప్రజల మనసుల్ని గెలిచారు. ఫైనల్లో జట్టు ఓటమిని జీర్ణించుకోలేక ఏడుస్తున్న క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిక్ కన్నీళ్లు తుడిచి.. లీడర్ అంటే ఎలా ఉండాలో నేర్పారు. విజయం సాధించినప్పుడు సంబరాల్లో పాల్గొన్న ఆమె.. జట్టు ఓడిన సమయంలోనూ వారి వెన్నంటే నిలిచారు. ఆమెను చూసి ప్రపంచం నేర్చుకోవాలి! క్రొయేషియా.. మేనియా! -
క్రొయేషియా ఫుట్‌బాల్ జట్టుకు ఘన స్వాగతం
-
ఆమెను చూసి ప్రపంచం నేర్చుకోవాలి!
గత నెలన్నర రోజులుగా సాగిన ఫిఫా ప్రపంచకప్ ముగిసింది. అంచనాలు లేని జట్టు టైటిల్ కైవసం చేసుకోగా... అనామక జట్టు శక్తివంచన లేకుండా పోరాడి ఓడింది. పోరాడి ఓడిన ఆ అనామక జట్టు దేశ అధ్యక్షురాలు ఇప్పుడు ప్రపంచానికే స్పూర్తిదాయకంగా నిలిచారు. ఆ అనామక జట్టు క్రొయేషియా అయితే ఆ దేశ అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్-కిటారోవిక్. మన హైదరాబాద్ నగరంలో సగం కూడా (50 లక్షలు) జనాభా లేని ఆ దేశం సంచలనాలు సృష్టిస్తూ ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లడం గమనార్హం. ఫైనల్లో ఆ జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకున్నా.. ఆ దేశ అధ్యక్షురాలి ప్రదర్శన మాత్రం ప్రపంచం గర్వించేలా మిన్నంటింది. ఆమెను చూసి నాయకత్వం అంటే ఏమిటో ఇప్పుడు ప్రపంచానికే బోధపడింది. 736 మంది ఆటగాళ్లు 32 జట్లతో 31 రోజుల పాటు పోరాడి నెగ్గిన రెండు జట్లు తుదిసమరానికి సిద్దమైన సమయం. విజయం ఎవరిని వరిస్తుందా అని నరాలు తెగేంతా ఉత్కంఠకర ఫైనల్ మ్యాచ్.. మరోవైపు పలు దేశ అధ్యక్షులు ఆసీనులైన సందర్భం. మ్యాచ్ ప్రారంభమైంది. కానీ అందరీ చూపు వీఐపీ గ్యాలరీవైపే. అవును అక్కడ ఎరుపు తెలుపు రంగులతో కూడిన టీషర్టులు ధరించిన జట్టు జెర్సీతో క్రొయేషియా దేశ అధ్యక్షురాలు గ్రాబర్ కిటారోవిక్ సందడి చేస్తున్నారు. ఏ రేంజ్లో అంటే గంతులేస్తూ మరీ తమ జట్టుకు దగ్గరుండి మద్దతు తెలుపున్నారు. కానీ పోరాడిన క్రోయేషియా చివరకు ఓటమిని చవిచూసింది. ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. చమర్చిన కన్నీళ్లతో అభిమానుల భావోద్వేగానికి గురయ్యారు. అంతటి ఉద్విగ్ఘమై క్షణాల్లో ఎవరైనా ఓటమిని జీర్ణించుకోలేక అసహనం, అసంతృప్తి, ఆవేదన వంటివెన్నో వ్యక్తం చేస్తారు. కానీ అలా చేస్తే ఆమె క్రొయేషియా అధ్యక్షురాలు ఎలా అవుతారు. అవును ఏమాత్రం దిగులు చెందని ఆమె తమ జట్టుకు అండగా నిలిచారు. ఓడిన జట్టుకు ఆమె అందించిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ కన్నీళ్లు తుడిచిన అధ్యక్షురాలు తన అద్భుత ప్రదర్శనతో ముందుండి ఫైనల్‌కు చేర్చిన క్రొయేషియా జట్టు కెప్టెన్ లుకా మోడ్రిక్ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇది చూసిన ఆ దేశాధ్యక్షురాలు అతడి దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడిచారు. బాధపడొద్దని ఓదార్చారు. ఈ ఘటన అభిమానులందరికి ఉద్వేగానికి గురిచేయగా.. ఆమె పక్కన నిలుచున్న ఇతర దేశ అధ్యక్షులను చప్పట్లతో అభినందించేలా చేసింది. మరోవైపు జోరు వాన కురుస్తున్నా.. ఆతిథ్య దేశపు అధ్యక్షుడు గొడుగుతో మైదానంలోకి వచ్చినా ఆమె మాత్రం అలానే ఆ వర్షంలో తడుస్తూ.. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇరు జట్ల ఆటగాళ్లను ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలసి క్రొయేషియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమును సందర్శించారు. ఓటమితో దిగులు చెందుతున్న వారిని అభినందిస్తూ భరోసానిచ్చారు. ఇది చూసినప్పుడు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దివంగత నేత నెల్సెన్ మండేలా చెప్పిన ‘కష్టాలు ఉన్నప్పుడే నాయకుడిగా ముందుండాలి.. అప్పుడే మీ నాయకత్వానికి విలువ ఉంటుంది’ అనే మాటలు గుర్తొస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అధ్యక్షురాలు కాకమందు.. ఆమె పుల్‌బ్రైట్ స్కాలర్, అమెరికాకు అంబాసిడర్, నాటో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం క్రొయేషియా అధ్యక్షురాలిగా తూర్పు యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలో తమ దేశాన్ని ముందంజలో నిలుపుతున్నారు. ఆమె 2015లో తొలిసారి ఆ దేశ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. చదవండి: విశ్వవిజేత ఫ్రాన్స్ భూతల స్వర్గం క్రొయేషియా -
కప్పు ఫ్రాన్స్‌ది కాదు.. ఆఫ్రికాది!
కరాకస్ (వెనిజువెలా): హోరాహోరీ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సంగ్రామాన్ని ఆస్వా దించాం! ఆఖరి ఘట్టంలో ఫ్రాన్స్ జయకేతనం ఎగురవేయడాన్ని కళ్లారా చూశాం! కానీ, కప్ గెలిచింది ఆఫ్రికా అంటున్నారు వెనిజువెలా దేశాధ్యక్షుడు నికొలస్ మడురొ. ‘ఫ్రాన్స్... ఆఫ్రికా జట్టులా కనిపిస్తోంది. తక్కువ చూపు చూసిన వలస కుటుంబాల ఆటగాళ్లతో ఆఫ్రికానే కప్ గెలిచినట్లుంది. అందుకే వారికి ధన్యవాదాలు’ అని నికొలస్ వ్యాఖ్యానించారు. మడురో మాటల్లో కొంత తర్కం లేకపోలేదు. 23 మంది సభ్యుల ఫ్రాన్స్ జట్టులో 16 మంది ఆఫ్రికా మూలాలున్నవారే మరి. ఫైనల్లో గోల్స్ చేసిన ఎంబాపె తల్లిదండ్రులు కామెరూన్, అల్జీరియా వాసులు కాగా, పోగ్బా అమ్మానాన్న గినియాకు చెందినవారు. ఇక ఉమ్టిటి... కామెరూన్లో పుట్టాడు. మట్యుడి తల్లిదండ్రులు అంగోలా, కాంగో దేశస్తులు. ఎంగొలొ కాంటె పెద్దలది మాలి నేపథ్యం. రాఫెల్ వరానె తండ్రి కరీబియన్ దీవుల నుంచి వచ్చాడు. ఈ నేపథ్యంలో... ఫ్రాన్స్ సహా యూరప్ దేశాలు ఇకనైనా ప్రతిభావంతులు, ప్రభావవంతులైన ఆఫ్రికా, లాటిన్ అమెరిక్లను తక్కువగా చూడొద్దని మడురో కోరారు. ‘యూరప్‌లో జాతి వివక్షకు ఇది అంతం. కప్ సాధించి పెట్టినందుకు వారు మమ్మల్ని అభినందించాలి’ అని పేర్కొన్నారు. అయితే, మడురో నియంతలా వ్యవహరిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ గతంలో విమర్శించారు. మాక్రోన్ విమర్శలను మనసులో పెట్టుకొనే ప్రస్తుతం ఫ్రాన్స్ విజయాన్ని తక్కువ చేసి చూపేలా వెనిజువెలా అధ్యక్షుడు మాట్లాడినట్లు తెలుస్తోంది. -
అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన క్రొయేషియా
-
జయహో ఫ్రాన్స్!
ఏ క్షణాన ఏమవుతుందో తెలియకుండా ఊహాతీతమైన మలుపులు తిరుగుతూ ఆద్యంతం ఉత్కంఠ రేపే ప్రపంచ సాకర్ క్రీడా సంరంభం ముగిసింది. హోరాహోరీగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో క్రొయే షియా జట్టును ఓడించి, ప్రపంచ కప్ చేజిక్కించుకుని ఫ్రాన్స్ విశ్వ విజేతగా నిలిచింది. పరస్పరం తలపడుతున్న రెండు జట్లూ బరిలో నువ్వా నేనా అన్నట్టు చెలరేగేవి అయినప్పుడే ఆట రంజుగా ఉంటుంది. అవతలి టీం బలహీనమైనదన్న ముద్ర పడితే, ఫలితం ముందే అంచనాకు వచ్చేలా ఉంటే ఆసక్తి పుట్టదు. నిజానికి ఫ్రాన్స్‌తో ఫైనల్లో తలపడిన క్రొయేషియా జట్టు తొలిసారి 1998లో అడుగు పెట్టినప్పుడు మూడో స్థానంలో నిలిచిందిగానీ ఆ తర్వాత అది పెద్దగా ప్రతిభ కనబర్చలేదు. అయితే ఈసారి దాని కెప్టెన్ లూకా మోడ్రిక్ నాయకత్వంలో ఆ జట్టు అసాధారణ రీతిలో ఆడింది. లీగ్ దశలో అర్జెంటీనా లాంటి కాకలు తీరిన జట్టునే మట్టి కరిపించింది. ప్రి క్వార్టర్స్‌లో డెన్మార్క్‌పై, క్వార్టర్స్‌లో రష్యాపై, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతంగా ఆడింది. అన్ని దశల్లోనూ ఎన్నెన్నో ఒత్తిళ్లనూ, అవాంత రాలనూ ఎదుర్కొంది. చివరకు ఫైనల్‌కి చేరింది. చెప్పాలంటే దానిది శక్తికి మించిన పోరాటం. జట్టు సభ్యులు మంచి సమన్వయంతో దూకుడు ప్రదర్శించడం వల్ల క్రొయేషియాపై అంచనాలు పెరుగుతూ పోయాయి. దాని దూకుడు ఫ్రాన్స్ జట్టును మొదట్లో అయోమయంలో పడేసింది. కానీ చూస్తుండగానే అంతా తిరగబడింది. ఫ్రాన్స్ జట్టు కోలుకుని జోరు పెంచింది. ఎలాగైతేనేం అది క్రొయేషియాను జయించగలిగింది. గెలుపోటముల మాటెలా ఉన్నా క్రొయేషియా చివరి వరకూ పోరాడిన తీరు చిరస్మరణీయమైనది. పట్టుమని 40 లక్షలమంది జనాభా లేని ఆ దేశం ఇంతటి పోరాటస్ఫూర్తిని ప్రద ర్శించడం నిజంగా మెచ్చదగింది. అందువల్లే క్రీడాభిమానులంతా ఫ్రాన్స్ క్రీడాకారులతోపాటు క్రొయేషియా జట్టు సభ్యుల్ని కూడా హీరోలుగానే పరిగణించారు. ఫ్రెంచ్ జట్టు ఎన్నడో 20 ఏళ్లక్రితం ప్రపంచకప్ గెల్చుకుంది. పన్నెండేళ్లక్రితం అంటే...2006లో ఫైనల్ వరకూ వచ్చి ఆగిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు అది విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. అందుకే పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద దాదాపు లక్షమంది అభిమానులు ఆరోజు పెద్ద పండగ చేసుకున్నారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా రిఫరీ నిర్ణయం వివాదాస్పదమైంది. క్రొయేషియా ఆటగాడి చేతికి బంతి తగిలిందని రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు. అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్రొయేషియా వాదించిన లాభం లేకపోయింది. బహుశా ఇది జరగ కపోయి ఉంటే క్రొయేషియా మరింత నిబ్బరంగా ఆడగలిగేదేమో! అయితే ఇరవైయ్యేళ్లనాడు ప్రపంచకప్ గెల్చుకున్నప్పటి రీతిలోనే ఈసారి కూడా ఫ్రాన్స్ జట్టుకు ‘బ్లాక్, బ్లాంక్, బ్యూరో(నలుపు, తెలుపు, అరబ్) అన్న ముద్ర పడింది. ఫ్రెంచ్‌లో బ్లాంక్‌కు తెలుపు, బ్యూరోకు అరబ్ అని అర్ధం. ఫ్రాన్స్ జట్టులో శ్వేత జాతీయులు, నల్లజాతీయులు, అరబ్బులు ఉండటం వల్ల ‘బ్లాక్, బ్లాంక్, బ్యూరో’ పేరొచ్చింది. ఇప్పుడున్న జట్టులో 14మంది ఆటగాళ్లకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల మూలాలున్నాయి. 19వ శతాబ్దంలో ఆ దేశాలన్నీ ఫ్రెంచ్ వలసలు. రెండో ప్రపంచ యుద్ధానంతరం దేశ పునర్నిర్మాణం కోసం ఫ్రాన్స్ ఆరాటపడినప్పుడు అందుకవసరమైన కార్మికులు దానికి లేరు. అందుకే ఉత్తర ఆఫ్రికాలో గతంలో తన పెత్తనంకింద ఉన్న దేశాలనుంచి ఫ్రాన్స్ భారీయెత్తున వలసలను ప్రోత్సహించింది. 60వ దశకంలో ప్రపంచ సాకర్ పోటీల్లో తన ప్రాభవం కొడిగట్టడం ప్రారంభించాక తన ఫుట్‌బాల్ క్రీడా నైపుణ్యానికి కూడా పదును పెట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఒక అకాడెమీని ప్రారంభించి వందలమందిని చేర్చుకుని తర్ఫీదు నివ్వడం మొదలెట్టింది. ఆ శిక్షణలో ఎందరో ప్రతిభగల ఆటగాళ్లు రూపొందారు. చిత్రమేమంటే వీరిలో అత్యధికులు వలస కూలీల బిడ్డలు. ఈ కుటుంబాలకు కేటాయించిన ప్రాంతాల్లో జీవనం ఎంతో దుర్భరమైంది. అరకొర వసతులతో, అర్థాకలితో ఆ కుటుంబాలు బతకాల్సివచ్చేంది. స్థానికుల జాత్యహంకార ధోరణి, వారికి వత్తాసు పలికే పోలీసుల తీరు కూలీల కుటుంబీకులకు ఎప్పుడూ దుఃఖాన్నే మిగిల్చేది. బహుశా అవి అక్కడి పిల్లల్లో కసిని రగిల్చి కష్టపడటం నేర్పాయి. ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొని గెలిచి తీరాలన్న కృతనిశ్చయాన్ని కలిగించాయి. అందుకే ఆఫ్రికా వలస దారుల పిల్లలు అకాడెమీలో మెరికల్లా తయారయ్యారు. ఫ్రాన్స్ జాతీయ టీంలో స్థానం సంపాదించి చిచ్చరపిడుగుల్లా ప్రశంసలందుకున్నారు. సాకర్ ప్రపంచంలో దిగ్గజాలుగా వెలిగిన జిండేన్, పాట్రిక్ వీరా సెనెగల్ దేశస్తుల పిల్లలైతే... ఇప్పటి పాల్ పోగ్బా, కిలియాన్ ఎంబాపెలిద్దరూ అల్జీరియా, కామెరూన్లకు చెందిన తల్లిదండ్రుల పిల్లలు. నిజానికి పారిస్ ప్రపంచ సాకర్ తారలకు పుట్టిల్లు. అల్జీరియా జట్టు మాజీ కెప్టెన్ బగెర్రా, సెంట్రల్ ఆఫ్రికా దేశమైన గబన్కు చెందిన ఆటగాడు పెర్రీ ఎమెరిక్లు అక్కడ ఎదిగినవారే. ప్రపంచంలో ఇంతమంది ప్రతిభాశాలురను అందించిన ఘనత మరే అకాడెమీకి లేదంటారు. ఈసారి ప్రపం చకప్ పోటీల్లో సైతం వివిధ దేశాల జట్లలోని 50మంది ఆటగాళ్లు అక్కడ పదునుదేలినవారే. వీటన్నిటిని సరిగా అధ్యయనం చేస్తే మన దేశం కూడా ఫుట్‌బాల్ క్రీడలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నడో 1950లో ఒక్కసారి వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి అనుకోకుండా అవకాశం వచ్చినా జట్టును పంపలేక ఆ అవకాశాన్ని మన దేశం చేజార్చుకుంది. ఇటీవలికాలంలో మన ఆట గాళ్లు కూడా మెరుగ్గా ఆడుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) ఆసియా కప్‌లో పాల్గొనడానికి మన జట్టు అర్హత సాధించింది. అక్కడ మంచి తీరు ప్రదర్శించగలిగితే మున్ముందు దానిపై ఆశలు పెట్టుకోవచ్చు. చిన్నా చితకా దేశాలు సైతం ప్రపంచ సాకర్ యవనికపై మెరుస్తున్నప్పుడు మనమెందుకు వెనకబడ్డామన్న ఆత్మ విమర్శ పాలకుల కుండాలి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే... తగిన ప్రోత్సాహకాలందిస్తే... రాజకీయాలను దరిచేరనీయ కుంటే మనం సైతం ఆ క్రీడలో ఎదగడానికి అవకాశం ఉంటుందని గుర్తించాలి. -
మైమురిపించి!
గోలా కాదా అనే గగ్గోలును ‘వార్’ తీర్చింది... మెస్సీ, రొనాల్డొ లోటును గ్రీజ్మన్, లుకాకు పూడ్చారు... జర్మనీ, బ్రెజిల్‌కు తీసిపోమని క్రొయేషియా, బెల్జియం చాటాయి... ఫ్రాన్స్‌కు పూర్వవైభవం దక్కింది... ఇంగ్లండ్ చాన్నాళ్లకు మెరిసింది... రష్యాకు ఆతిథ్య సంతృప్తితో పాటు పోరాడామన్న కీర్తి మిగిలింది... మొత్తానికి 2018 ఫుట్‌బాల్ ప్రపంచకప్ సూపర్ హిట్ అయ్యింది... సాక్షి క్రీడా విభాగం:నెల పాటు సాగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఎన్నెన్నో మెరుపులు. అంతకుమించి అనుభూతులు. అభిమానులకు కావాల్సినంత వినోదం. బెల్జియం కెప్టెన్ హజార్డ్ దూకుడు, ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ కేన్ పోరాటం, ఫ్రాన్స్ కుర్రాడు ఎంబాపె వేగం, క్రొయేషియా సారథి మోడ్రిచ్ స్థయిర్యం... వెరసి 64 మ్యాచ్‌ల్లో 169 గోల్స్. మ్యాచ్‌కు 2.6 చొప్పున నమోదు. స్కోరు లేని పోరు ఒక్కటంటే ఒక్కటే.! అర్జెంటీనా మెస్సీ ఘనతలు, పోర్చుగల్ రొనాల్డొ విన్యాసాలు ఇక చరిత్రే. మున్ముందు చెప్పుకోవాల్సింది రొమేలు లుకాకు గొప్పలు, గ్రీజ్మన్ గెలుపు రహస్యాలే. అందరూ ఊహించినట్లు హూలిగన్ల బెడద ఎదురవలేదు, దేశాల మధ్య వివాదాలు తలెత్తలేదు, ఆటగాళ్ల నడుమ విద్వేషాలు రేగలేదు. ఆసాంతం సాఫీ! దిగ్గజాల బేజారు... చిన్న జట్ల సంచలనంతో పుట్టుకొచ్చిన నయా తారలు. క్రొయేషియా ఓడి గెలిచింది... ‘ఫిఫా’ అధ్యక్షుడు జియాని ఇన్ఫాటినొ వర్ణించినట్లు జగజ్జేత హోదాకు ఫ్రాన్స్ తగినదే. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన ఫ్రెంచ్ జట్టు సరైన సమయంలో శక్తియుక్తులు ప్రదర్శించింది. ఇవ్వదగినదా కాదా అన్న ‘పెనాల్టీ’ వివాదాన్ని పక్కనపెట్టి... ఫైనల్లో తాము అత్యుత్తమ జట్టు చేతిలోనే ఓడామంటూ క్రొయేషియా కోచ్ జాల్టొ డాలిచ్, జట్టు సభ్యులు ప్రకటించి క్రీడా స్ఫూర్తిని చాటారు. పోరాటం అంటే ఏమిటో ఈ టోర్నీలో చాటిన క్రొయేషియా తడబాటుతో టైటిల్‌ను చేజార్చుకుంది. ఈసారి తుది సమరం గత రెండు కప్‌ల తరహాలో పోటాపోటీగా సాగకున్నా మరీ నిరాశపర్చలేదు. తరం మారుతోంది... ఈ ప్రపంచ కప్‌తో రొనాల్డొ, మెస్సీల శకం దాదాపు ముగిసినట్లేనని తేలింది. వచ్చే కప్ నాటికి 35 ఏళ్లు దాటే వీరిద్దరూ టోర్నీలో ఆడేది అనుమానమే. బ్రెజిల్ స్టార్ నెమార్కూ 30 ఏళ్లు వస్తాయి. ఈ తరం తర్వాత అలరించేందుకు నేనున్నానంటున్నాడు 19 ఏళ్ల ఎంబాపె. ఫ్రాన్స్ జగజ్జేతగా నిలవడం వెనుక గ్రీజ్మన్తో పాటు ఈ టీనేజ్ సంచలనం పాత్ర అంతాఇంత కాదు. జట్టులోని పోగ్బా, పవార్డ్, వరానె, కాంటె, హెర్నాండెజ్, ఉమ్టిటి... వీరంతా 20ల్లో ఉన్నవారే. రానున్న దశాబ్దం ఫ్రాన్స్‌దేనని వీరంతా చాటుతున్నారు. ఆ మూడింటికీ ఉంది భవిష్యత్! ప్రతిభను లెక్కలోకి తీసుకుంటే భవిష్యత్‌లో ఫ్రాన్స్‌కు పోటీగా వచ్చేది బ్రెజిలే అంటున్నారు. ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన సాంబా జట్టు... ఈసారి క్వార్టర్స్‌లో బెల్జియం దెబ్బకు ఔటైంది. అయినా, జీసస్ వంటి యువకులతో పాత ఘనతలను అందుకుంటుందనే నమ్మకం కలుగుతోంది. గారెత్ సౌత్‌గేట్ శిక్షణలో నిండా యువకులతో అడుగుపెట్టిన ఇంగ్లండ్ అదరగొట్టింది. పాతికేళ్లలోపు కుర్రాళ్లతో కళకళలాడుతున్న ఈ జట్టు 2022 నాటికైనా గట్టి పోటీదారేనని లోథర్ మథియాస్ లాంటి దిగ్గజమే కితాబిచ్చాడు. అందరూ ఫేవరెట్‌గా భావించిన బెల్జియం లుకాకు, హజార్డ్ వంటి ‘గోల్డెన్ జనరేషన్’ ఆటగాళ్లతో సెమీస్ చేరింది. అయితే, వచ్చే ప్రపంచకప్‌కు ఫ్రాన్స్, బ్రెజిల్ మాదిరిగా పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇక అర్జెంటీనా చేయాల్సింది మెస్సీ నీడ నుంచి బయటకు రావడమే. 2022 నాటికి వారికిదే పెద్ద సమస్య. ప్రపంచ కప్ రికార్డుల రారాజు జర్మనీ పునరుత్తేజం పొందే పనిలో పడాలి. 2000 సంవత్సరంలో యూరో కప్‌లో గ్రూప్ దశలో వెనుదిరిగిన జర్మనీ... తర్వాత మరింత మేటిగా తయారైంది.ఆసియా జట్లు ఈ కప్‌లోనూ ఒకటీ రెండు మెరుపులకే పరిమితమయ్యాయి. జర్మనీని ఇంటికి పంపి కొరియా ఔరా అనిపిస్తే, నాకౌట్లో ప్రతిఘటనతో జపాన్ ఆకట్టుకుంది. ఫేవరెట్లు కాకున్నా ప్రమాదకారులు అనిపించుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. రాజకీయం... సుహృద్భావం రష్యా వంటి దేశంలో ప్రపంచకప్ జరిగినా... పెద్దగా రాజకీయ ప్రస్తావనలకు అవకాశం లేకపోయింది. ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించిన అధ్యక్షుడు పుతిన్‌తో సౌదీ రాకుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ కరచాలనం ఆకట్టుకుంది. అయితే, ఈజిప్ట్ స్టార్ సలా వివాదాస్పద చెచెన్యా నేత రమ్జాన్ కదిరోవ్ను కలవడం చర్చనీయాంశమైంది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న రీత్యా నైక్ సంస్థ బూట్లను ధరించకుండా ఇరాన్ ఆటగాళ్లు బరిలో దిగడం వార్తల్లో నిలిచింది. ఫైనల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ విజయ సంబరం... క్రొయేషియా దేశాధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ కిటారోవిచ్ తమ జట్టు ఫైనల్‌కు వెళ్లాక డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లను అభినందించడం, వారితో కలసి నృత్యం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. గాయాలు... గేయాలు ఇరాన్‌తో మ్యాచ్‌లో మొరాకో ఆటగాడు నార్డిన్ అమ్రాబట్ అపస్మారకంలోకి వెళ్లాడు. ముఖంపై నీళ్లు చల్లి అతడిని స్పృహలోకి తేవాల్సి వచ్చింది. బెల్జియంతో సెమీస్‌లో ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ మట్యుడి సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గోల్స్‌ను మరువలేం! సౌదీ అరేబియాపై అలెగ్జాండర్ గోలోవిన్ (రష్యా), స్పెయిన్‌పై రొనాల్డొ, క్రొయేషియాపై ట్రిపియర్ (ఇంగ్లండ్)ల ఫ్రీ కిక్‌లు అంత తేలిగ్గా మర్చిపోలేనివి. స్విట్జర్లాండ్‌పై కౌటిన్హొ (బ్రెజిల్), అర్జెంటీనాపై మోడ్రిచ్ (క్రొయేషియా), పనామాపై లిన్‌గార్డ్ (ఇంగ్లండ్), ఫ్రాన్స్‌పై డిమారియా (అర్జెంటీనా)లు సుదూరం నుంచి కొట్టిన షాట్లు గోల్‌పోస్ట్‌లోకి చేరిన తీరు ముచ్చట గొలిపింది. కవానీ హెడర్ పోర్చుగల్ కథను ప్రి క్వార్టర్స్‌తోనే ముగించింది. ‘వార్’ తప్పించింది ‘వీఏఆర్’ ప్రపంచ కప్ అంటేనే ‘గోల్ గగ్గోలు’ సాధారణం. కానీ ఈసారి వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్)తో దీనికి అడ్డుకట్ట పడింది. బంతి శరీరానికి తగిలిందా లేదా అనే సంశయాలు, గాయాల నటన, రిఫరీని చుట్టుముట్టడం, ఆటగాళ్ల వేడుకోళ్లను తప్పించింది. ఆరంభంలోనే ఉన్నా ఈ పద్ధతి ఆశలు కల్పిస్తోంది. టెన్నిస్‌లో రివ్యూ, క్రికెట్లో హాక్ ఐ శైలిలో వీఏఆర్ కూడా కొన్నేళ్లలో ఫుట్‌బాల్‌లో మార్పు తేనుంది. టోర్నీలో 29 పెనాల్టీ (స్పాట్) కిక్‌లకు అనుమతివ్వగా వీటిలో 11 వీఏఆర్‌ను ఆశ్రయించి ఇచ్చినవే. లీగ్ దశలో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో క్రొయేషియాపై గ్రీజ్మన్ కొట్టిన గోల్స్ ‘వార్’ అందించినవే కావడం విశేషం. మొత్తం 32 జట్లలో 16 జట్లు ఒక్కసారైనా పెనాల్టీతో లబ్ధిపొందాయి. మరీ ముఖ్యంగా ‘గోల్డెన్ బూట్’ విజేత హ్యారీ కేన్ తన ఆరు గోల్స్‌లో మూడింటిని పెనాల్టీలోనే కొట్టాడు. వచ్చేసారి ‘ఖతర్’నాక్‌గా... 2022 కప్ కూడా కొత్త వేదికపైనే జరుగనుంది. ఈసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ‘ఖతర్’ ఏర్పాట్లు చేసుకుంటోంది. సహజంగా ప్రపంచకప్ జూన్–జూలైలలో నిర్వహిస్తారు. గల్ఫ్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2022 కప్ షెడ్యూల్‌ను నవంబరు–డిసెంబరుకు మార్చారు. ‘సెట్ పీస్’... ఇంగ్లండ్ సెమీస్ ప్రస్థానంలో పెనాల్టీలతో పాటు ‘సెట్ పీస్’ (ఫ్రీ కిక్, కార్నర్, త్రో ఇన్ల సహాయంతో వచ్చేవి) గోల్స్ది కీలక పాత్ర. తొమ్మిందిటిని ఇలానే సాధించింది మూడు సింహాల బృందం. చిత్రమేమంటే ఇంగ్లండ్ విజేతగా నిలిచిన 1966 తర్వాత (70) అత్యధికంగా సెట్పీస్ గోల్స్ ఇప్పుడే (48) నమోదయ్యాయి. -
‘హిందూ-ముస్లిం లొల్లి.. ఆ జట్టును చూసి నేర్చుకోండి’
హైదరాబాద్ : దేశంలో నెలకొన్న హిందూ-ముస్లిం గొడవల పట్ల టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ గొడవలను పక్కన పెట్టి ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన క్రొయేషియాను చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఫ్రాన్స్-క్రొయేషియా ఫైనల్ మ్యాచ్‌కు ముందు బజ్జీ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు. ‘కేవలం 50 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఆడుతోంది. కానీ 135 కోట్ల జనాభా గల మన దేశంలో మాత్రం హిందూ-ముస్లింలు అనుకుంటూ గొడవపడుతున్నాం’ అని ట్విటర్లో అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇక ఫిఫా తుది సమరంలో సంచలనాల క్రొయేషియా పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. लगभग 50 लाख की आबादी वाला देश क्रोएशिया फ़ुटबॉल वर्ल्ड कप का फाइनल खेलेगा और हम 135 करोड़ लोग हिंदू मुसलमान खेल रहे है।#soch bdlo desh bdlega — Harbhajan Turbanator (@harbhajan_singh) July 15, 2018 -
అద్భుతం: అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు కోచ్‌గా!
మాస్కో: విశ్వ వేదికపై ఫ్రాన్స్ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగిరింది. ఆదివారం క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో గెలుపొందడంతో రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మళ్లీ ‘ది బ్లూస్’ చెంత చేరింది. ఇలా ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచిన రెండు సందర్భాల్లో ఆ జట్టు కోచ్ దిదియర్ డెచాంప్స్ పాత్ర మరవలేనిది. 1998 సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తొలిసారిగా టైటిల్ అందుకోగా.. ఆ జట్టుకు దిదియర్ డెచాంప్సే కెప్టెన్ కావడం విశేషం. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆ కెప్టెనే.. కోచ్‌గా మారి మరోసారి తమ జట్టును జగ్గజ్జేతగా నిలిపాడు. దీంతో అటు కెప్టెన్‌గా.. ఇటు కోచ్‌గా వరల్డ్‌కప్ సాధించిన మూడో ఆటగాడిగా దిదియర్ డెచాంప్స్ గుర్తింపు పొందాడు. జగాలో (బ్రెజిల్), బ్రెకన్‌బాయర్ (జర్మనీ)లు డెచాంప్స్ కన్నా ముందు ఇలా కోచ్, కెప్టెన్‌గా తమ జట్లకు ప్రపంచకప్ అందించారు. జగాలో 1958,1962లో బ్రెజిల్‌ను ఇలా రెండు సార్లు విశ్వ విజేతగా నిలపగా.. బ్రెకన్ బాయర్ కెప్టెన్‌గా 1974, కోచ్‌గా 1990లో జర్మనీకి ప్రపంచకప్ అందించారు. ప్రస్తుత టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా ప్రపంచకప్ అందుకోవడంలో కోచ్ దిదియర్ డెచాంప్స్ పాత్ర కీలకం. ముఖ్యంగా పిన్న వయసు ఆటగాళ్లకు అవకాశమివ్వడం.. వెన్ను తట్టి ప్రోత్సహించడం.. కోచ్‌గా దిదియర్ డెచాంప్స్ ప్రత్యేకత. ఎంబాపె వంటి మెరికల్లాంటి కుర్రాడి ప్రతిభను వెలికితీసి డెచాంప్స్ ప్రపంచానికి పరిచయం చేశాడు. బలహీనతలను పక్కన బెట్టి ఆటగాళ్లను మానసికంగా తీర్చిదిద్దడంతో డెచాంప్స్ విజయవంతమయ్యాడు. నిజానికి ఫైనల్ పోరులో ఫ్రాన్స్ అత్యద్భుత ఆట తీరు కనబర్చకపోయినా, తమ బలాన్ని నమ్ముకొని తెలివిగా, వ్యూహాత్మకంగా ఆడింది. దీనికి కూసింత అదృష్టం కూడా కలిసిరావడంతో సంచలనాల క్రొయేషియా ఆట కట్టించింది. ఈ వ్యూహాలు వెనకుండి నడిపించిన వాడు డెచాంప్స్. గొప్పగా ఆడలేదనే విషయాన్ని మ్యాచ్ అనంతరం అతనే అంగీకరించాడు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘మా యువ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే టాప్ జట్టుగా నిలిచింది. మా చాంపియన్లలో కొందరికైతే 19 ఏళ్లే! నిజానికి మేం అంత గొప్పగా ఆడలేదు. కానీ మానసిక నైపుణ్యాన్ని కనబరిచాం. మొత్తానికి నాలుగు గోల్స్ చేశాం. గెలిచేందుకు మా వాళ్లకే అర్హత ఉంది. మా బృందమంతా చాలా కష్టపడింది. ఈ గెలుపుదారిలో ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంది. రెండేళ్ల క్రితం ‘యూరో’ గెలవలేకపోవడం బాధించింది. కానీ గుణపాఠాలెన్నో నేర్పింది. ఇది నా విజయం కాదు. ఆటగాళ్లు 55 రోజులుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ ప్రపంచకప్. దీన్నిప్పుడు ఫ్రాన్స్‌కు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది.’ తెలిపాడు. -
ఫిఫా ప్రపంచకప్: పీలే తర్వాత ఎంబాపెనే!
మాస్కో : ఫ్రాన్స్ యువ కెరటం కైలిన్ ఎంబాపె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆదివారం క్రోయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఈ స్టార్ ఆటగాడు 65వ నిమిషంలో గోల్ సాధించి బ్రెజిల్ దిగ్గజం పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్ కప్ ఫైనల్లో గోల్ కొట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2తో నెగ్గి 20 ఏళ్ల తర్వాత రెండోసారి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక అంతకముందు నాకౌట్ సమరంలోను గోల్ సాధించిన ఎంబాపే ఇదే..పీలే రికార్డును సమం చేశాడు. మ్యాచ్ అనంతరం ‘మైలవ్’ అనే క్యాప్షన్‌తో ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటోను ఎంబాపె ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు పీలేనే తొలుత స్పందించడం విశేషం. ‘కైలిన్ నా రికార్డును సమం చేశాడు.. ఇక నా బూట్లకున్న దుమ్ముదులిపి బరిలోకి దిగాల్సిందే’ అని ట్వీట్ చేశాడు. అంతకు ముందు ‘వెలకమ్ టూ ది క్లబ్’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి. If Kylian keeps equalling my records like this I may have to dust my boots off again... // Se o @KMbappe continuar a igualar os meus records assim, eu vou ter que tirar a poeira das minhas chuteiras novamente...#WorldCupFinal https://t.co/GYWfMxPn7p — Pelé (@Pele) July 15, 2018 క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్ (18వ నిమిషం) సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరవగా... గ్రీజ్మన్ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్ కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్ (28వ ని.లో), మాన్‌జుకిచ్ (69వ ని.లో) గోల్స్ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. దీంతో ఫ్రాన్స్ సునాయస విజయం సాధించింది. -
ఫుట్‌బాల్ విశ్వ విజేత ఫ్రాన్స్
-
ఫ్రెంచ్ ఫెస్టివల్
ఫ్రెంచ్ కిక్ అదిరింది. విశ్వ వేదికపై ఫ్రాన్స్ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగిరింది. రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మళ్లీ ‘ది బ్లూస్’ చెంత చేరింది. అగ్రశ్రేణి జట్టుగా తమపై ఉన్న అంచనాలకు ఎక్కడా తగ్గకుండా టోర్నీలో అజేయంగా దూసుకెళ్లిన ఫ్రాన్స్ చివరకు శిఖరాన నిలిచి సత్తా చాటింది. ఫైనల్ పోరులో అత్యద్భుత ఆట తీరు కనబర్చకపోయినా, తమ బలాన్ని నమ్ముకొని తెలివిగా, వ్యూహాత్మకంగా ఆడిన ఫ్రెంచ్ బృందం కూసింత అదృష్టం కూడా కలిసొచ్చి సంచలనాల క్రొయేషియా ఆట కట్టించింది. రెండో సారి వరల్డ్ కప్ విన్నర్‌గా నిలిచి తమ స్థాయిని ప్రదర్శించింది. గ్రీజ్మన్, పోగ్బా, ఎంబాపెలాంటి స్టార్లు ఆఖరి పోరులో గోల్స్‌తో చెలరేగగా... 1998లో కెప్టెన్‌గా ప్రపంచ కప్ అందించిన దిదియర్ డెచాంప్స్ ఇప్పుడు కోచ్‌గా మళ్లీ ట్రోఫీని ముద్దాడగలిగాడు. అటు మాస్కోలో ఆఖరి విజిల్ మోగగానే ఇటు ఈఫిల్ టవర్ సాక్షిగా పారిస్ వీధుల నిండా విరామం లేకుండా ‘ఫ్రెంచ్ వైన్’ పొంగిపొర్లడం ప్రారంభమైపోయింది. మ్యాచ్ ఆసాంతం బంతిపై పట్టు... అటాకింగ్‌తో తిరుగులేని ఆట... ప్రత్యర్థి ఏరియాలోకి పదే పదే దూసుకుపోయిన ఫార్వర్డ్లు ... కానీ గోల్స్ లెక్కలో మాత్రం వెనుకబడిపోయిన క్రొయేషియాకు గుండెకోత తప్పలేదు. తొలిసారి ఫైనల్ చేరి ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ఈ జట్టుకు తుది ఫలితం చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. టైటిల్ పోరులో దురదృష్టం దగ్గరి బంధువులా క్రొయేషియా వెంట పరుగెత్తుకు వచ్చింది. ముందుగా సెల్ఫ్ గోల్, ఆపై రిఫరీ తప్పుడు నిర్ణయంతో ప్రత్యర్థికి పెనాల్టీ అవకాశం ఒక్కసారిగా జట్టును వెనుకంజ వేసేలా చేశాయి. ఆ తర్వాత ఎంత పోరాడినా అది మాజీ చాంపియన్‌ను నిలువరించడానికి సరిపోలేదు. మూడు నాకౌట్ మ్యాచ్‌లను కూడా అదనపు సమయంలో గెలుచుకొని పవర్ ప్రదర్శించిన ఈ టీమ్‌కు ఫైనల్ మాత్రం నిరాశనే పంచింది. ‘హృదయాలు గెలిచారు’ అనే ఓదార్పు మాట తప్ప ఇక రన్నరప్ ముద్రతోనే ఆ జట్టు వచ్చే నాలుగేళ్లు సహవాసం చేయాల్సిందే. మాస్కో: ఫ్రాన్స్ రెండోసారి ఫుట్‌బాల్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 2018 టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడకుండా అజేయంగా ముందుకు సాగిన ఫ్రెంచ్ బృందం ఫైనల్లోనూ చెలరేగింది. లుజ్నికి స్టేడియంలో జరిగిన తుది పోరులో ఫ్రాన్స్ 4–2 గోల్స్ తేడాతో క్రొయేషియాను చిత్తు చేసింది. క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్ (18వ నిమిషం) సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరవగా... గ్రీజ్మన్ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్ కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్ (28వ ని.లో), మాన్‌జుకిచ్ (69వ ని.లో) గోల్స్ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. చివర్లో క్రొయేషియా ఎంత పోరాడినా లాభం లేకపోయింది. ఫ్రాన్స్‌తో పోలిస్తే ఏకంగా 61 శాతం క్రొయేషియా బంతిని నియంత్రణలో ఉంచుకున్నా... తుది ఫలితం విషయంలో మాత్రం అది ప్రతిఫలించలేదు. క్రొయేషియా బ్యాడ్‌లక్... తొలిసారి ఫైనల్ ఆడుతున్న క్రొయేషియా ఆరంభంలో చెలరేగింది. ప్రత్యర్థి దూకుడుగా ఆడటంతో తొలి 15 నిమిషాల పాటు ఫ్రాన్స్‌కు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ఏ దశలో కూడా ఫ్రాన్స్ ఆటగాళ్లు వరుసగా మూడు పాస్‌లు కూడా ఇవ్వలేకపోయారు. అయితే మంచి జోష్‌లో కనిపించిన క్రొయేషియా అదే జోరులో చేసిన పొరపాటు ఫ్రెంచ్ జట్టుకు కలిసొచ్చింది. గ్రీజ్మన్ కొట్టిన ఫ్రీ కిక్ కోసం అతని సహచరుడు రాఫెల్ వరాన్ సిద్ధమయ్యాడు. అయితే దానిని అడ్డుకునే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయిన మాన్‌జుకిచ్ తమ గోల్ పోస్ట్లోకే బంతిని పంపించేశాడు. ప్రపంచ కప్ ఫైనల్లో నమోదైన తొలి సెల్ఫ్ గోల్ ఇదే కావడం విశేషం. అయితే కొద్దిసేపటికే పెరిసిచ్ గోల్ చేసి క్రొయేషియా ఆశలకు ఊపిరి పోశాడు. ఫ్రాన్స్ పెనాల్టీ ఏరియాలో ప్రతీ ఒక్కరు బంతిపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న దశలో పెరిసిచ్ ప్రశాంతంగా అందు కొని ఏమాత్రం తడబాటు లేకుండా గోల్ కొట్టాడు. ఆ తర్వాత పెరిసిచ్ను దురదృష్టం పలకరించింది. అతను చేతితో బంతిని అడ్డుకున్నాడని రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. ముందుగా పెనాల్టీకి అంగీకరించని రిఫరీ ‘వీఏఆర్’ ద్వారా సుదీర్ఘ సమయం తీసుకొని దానిని నిర్ధారించడం వివాదాస్పదమైంది. పెరిసిచ్ చేతికి బంతి తగలడం వాస్తవమే కానీ అది ఉద్దేశ పూర్వకంగా చేయలేదనే క్రొయేషియా వాదన చెల్లలేదు. గ్రీజ్మన్ అలవోకగా కీపర్‌ను బోల్తా కొట్టించడంతో ఫ్రాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఫ్రాన్స్ దూకుడు... రెండో అర్ధభాగంలో కూడా క్రొయేషియా దూకుడుగానే ఆడే ప్రయత్నం చేయగా, ఫ్రాన్స్ తడబాటు కొనసాగింది. ల్యుకా మోడ్రిచ్, ఇవాన్ రాకిటిచ్ పదే పదే ఫ్రాన్స్ ఏరియాలో చొరబడినా గోల్ చేయడంలో మాత్రం సఫలం కాలేకపోయారు. ఈ దశలో ఒక్కసారిగా వ్యూహం మార్చిన ఫ్రాన్స్ ఫలితం సాధించింది. కౌంటర్ అటాక్‌తో ఆ జట్టు కీలక గోల్ నమోదు చేసింది. ముందుగా క్రొయేషియా డిఫెండర్ల నుంచి బంతిని లాక్కున్న పోగ్బా ఆ తర్వాత ఎంబాపెకు పాస్ ఇచ్చాడు. ఎంబాపె నుంచి పాస్ గ్రీజ్మన్కు వెళ్లి మళ్లీ పోగ్బాకు వచ్చింది. పోగ్బా కొట్టిన షాట్‌ను మోడ్రిచ్ అడ్డుకోవడంతో బంతి మళ్లీ వెనక్కి వచ్చింది. ఈసారి పొరపాటుకు చాన్స్ లేకుండా పోగ్బా గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఇదే జోరులో మరో ఆరు నిమిషాలకే ఎంబాపె సునాయాస గోల్ సాధించాడు. క్రొయేషియా ఏరియాలో అడ్డుకోవడానికి ఎవరూ లేకపోగా, కీపర్ కూడా అచేతనంగా మారిపోవడంతో... పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్ కప్ ఫైనల్లో గోల్ కొట్టిన ఆటగాడిగా ఎంబాపె నిలిచాడు. తమ జట్టు ఆశలు కోల్పోయిన దశలో మాన్‌జుకిచ్ గోల్ కొట్టి ఊపు తెచ్చాడు. ఫ్రాన్స్ కీపర్ లోరిస్ తన వద్దకు వచ్చిన బంతిని కిక్ కొట్టకుండా అక్కడే డ్రిబ్లింగ్ చేస్తుండగా పైకి దూసుకొచ్చి మాన్‌జుకిచ్ అనూహ్యంగా గోల్ సాధించడం విశేషం. అయితే ఆ వెంటనే ఫ్రాన్స్ కోచ్ ముగ్గురు డిఫెండర్లను సబ్స్టిట్యూట్లుగా బరిలోకి దించి రక్షణాత్మక ప్రదర్శనకే మొగ్గు చూపాడు. దాంతో క్రొయేషియా ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధించడంలో విఫలమై కన్నీటితో నిష్క్రమించింది. మా యువ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే టాప్ జట్టుగా నిలిచింది. మా చాంపియన్లలో కొందరికైతే 19 ఏళ్లే! నిజానికి మేం అంత గొప్పగా ఆడలేదు. కానీ మానసిక నైపుణ్యాన్ని కనబరిచాం. మొత్తానికి నాలుగు గోల్స్ చేశాం. గెలిచేందుకు మా వాళ్లకే అర్హత ఉంది. మా బృందమంతా చాలా కష్టపడింది. ఈ గెలుపుదారిలో ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంది. రెండేళ్ల క్రితం ‘యూరో’ గెలవలేకపోవడం బాధించింది. కానీ గుణపాఠాలెన్నో నేర్పింది. ఇది నా విజయం కాదు. ఆటగాళ్లు 55 రోజులుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ ప్రపంచకప్. దీన్నిప్పుడు ఫ్రాన్స్‌కు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది. –ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ ► 1970 (బ్రెజిల్) తర్వాత ఫైనల్లో 4 గోల్స్ కొట్టిన తొలి జట్టు ఫ్రాన్స్ ► 2002 నుంచి నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌లో కలిపి 6 గోల్స్ నమోదు కాగా... ఈ ఒక్క మ్యాచ్‌లోనే 6 గోల్స్ వచ్చాయి. 1958 ఫైనల్ తర్వాత ఒకే మ్యాచ్‌లో 6 గోల్స్ నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి. ► జగాలో (బ్రెజిల్), బ్రెకన్‌బాయర్ (జర్మనీ) తర్వాత అటు కెప్టెన్‌గా, ఇటు కోచ్‌గా కూడా వరల్డ్ కప్ సాధించిన మూడో ఆటగాడు దిదియర్ డెచాంప్స్. 1998 అతని నాయకత్వంలోనే సొంతగడ్డపై ఫ్రాన్స్ వరల్డ్ కప్ గెలిచింది. ఎవరికెంత వచ్చాయంటే...? ► విజేత ఫ్రాన్స్ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 260 కోట్లు) ► రన్నరప్ క్రొయేషియా జట్టుకు 2 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 191 కోట్లు). ► మూడో స్థానం పొందిన బెల్జియం జట్టుకు 2 కోట్ల 40 లక్షల డాలర్లు (రూ. 164 కోట్లు). ► నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 2 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 150 కోట్లు). ► క్వార్టర్స్‌లో ఓడిన జట్లకు కోటీ 60 లక్షల డాలర్లు చొప్పున (రూ. 109 కోట్లు). ► ప్రిక్వార్టర్స్‌లో ఓడిన జట్లకు కోటీ 20 లక్షల డాలర్లు చొప్పున (రూ. 82 కోట్లు). ► లీగ్ దశలోనిష్క్రమించిన జట్లకు 80 లక్షల డాలర్లు చొప్పున (రూ. 54 కోట్లు). విశేషాలు ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్ -169 జరిగిన మ్యాచ్‌లు -64 ఎల్లో కార్డులు -219 రెడ్ కార్డులు -4 టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టు బెల్జియం -16 ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక గోల్స్ (బెల్జియం 5–ట్యూనిషియా 2; ఇంగ్లండ్ 6–పనామా 1).- 7 గోల్స్ లేకుండా ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లు (ఫ్రాన్స్–డెన్మార్క్).- 1 లీగ్ దశలో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లు -8 నాకౌట్ దశలో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లు- 3 రన్నరప్ క్రొయేషియా జట్టు ఫెయిర్ ప్లే అవార్డు: స్పెయిన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ సంబరం -
ఫిఫా ప్రపంచకప్ ఫ్రాన్స్ వశం
మాస్కో: పసికూనపై పెద్దన్నదే పైచేయి. ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఫ్రాన్స్ ప్రపంచకప్‌ను రెండో సారి ముద్దాడింది. 1998లో ప్రస్తుత కోచ్ డైడర్ డెచాంప్స్ సారథ్యంలో తొలి సారి టైటిల్ గెలిచిన ఫ్రాన్స్.. మరోసారి లోరిస్ కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిచింది. ఆట ప్రారంభం నుంచి ఫ్రాన్స్ దూకుడుగా ఆడటంతో క్రొయేషియా ఒత్తిడిలో చిత్తయి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించింది. క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో తొలి గోల్ నమోదయింది. అనంతరం క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ పెరిసిచ్(28వ నిమిషంలో) గోల్ చేసి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. ఆట 38వ నిమిషంలో పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఫ్రాన్స్ ఉపయోగించుకుంది. ఫ్రాన్స్ ఫార్వర్డ్ ప్లేయర్ గ్రీజ్మన్ లెఫ్ట్ కార్నర్ నుంచి అద్బుతంగా గోల్ చేశాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సరికి 2-1తో ఫ్రాన్స్ ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో ధాటిగా ఆడిన ఫ్రాన్స్, క్రొయేషియా రక్షణశ్రేణిని ఛేదించుకుంటూ గోల్ పోస్ట్‌లపై దాడి చేసింది. రెండో భాగంలో గోల్ చేయడానికి ఇరు జట్లు కష్టపడినా మరో గోల్ నమోదు కాలేదు. పోగ్బా 59వ నిమిషంలో మరో గోల్ నమోదు చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో మూడు గోల్స్ నమోదయ్యాయి. క్రొయేషియాను అయోమయంలోకి నెట్టుతూ ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె 65వ నిమిషంలో మరో గోల్ చేశాడు. ఫ్రాన్స్ దూకుడుకు అడ్డుకట్టువేసేందుకు క్రోయేషియా అడ్డుకునే ప్రయత్నం చేసి సఫలమైంది. 69వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మన్జుకిచ్ గోల్ చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఇక ఆట ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. -
వార్
-
ఆ జట్టు జెర్సీలకు భారీ డిమాండ్
పారిస్: రష్యాలో జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన మొదటి జట్టు ఫ్రాన్స్. ఈరోజు(ఆదివారం) ఫ్రాన్స్-క్రొయేషియా మధ్య మెగా ఫైనల్ జరగనుంది. తమ దేశ జట్టుకు మద్దతిచ్చేందుకు పెద్ద సంఖ్యలో ఫ్రాన్స్ అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు ఆటగాళ్లు ధరించే ముదురు నీలం రంగు జెర్సీలకు పారిస్‌లో భారీగా డిమాండ్ పెరిగింది. ఆటగాళ్ల జెర్సీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీనిలో భాగంగా తమ అభిమాన ఆటగాళ్ల జెర్సీలను సొంతం చేసుకునే పనిలో పడిపోయారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని వస్త్ర దుకాణాల్లో ఆ దేశ ఆటగాళ్ల జెర్సీలను కొనేందుకు అభిమానులు స్టోర్ల వద్ద క్యూ కడుతున్నారు. ‘ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జెర్సీలు కావాలంటూ పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్ల పేర్లతో కూడిన జెర్సీలు కావాలని అభిమానులు అడుగుతున్నారు. ఇప్పటికే చాలా షర్టులు విక్రయించాం. ఇంకా చాలా ఆర్డర్లు ఇచ్చాం.’ అని స్టోర్ల యజమానులు తెలిపారు. అలాగే స్థానిక రెస్టారెంట్లు, బార్లు కూడా నీలం రంగు విద్యుద్దీపాల వెలుగులతో ధగధగలాడుతున్నాయి. విద్యద్దీపాలంకరణ వెలుగుల్లో పారిస్ నగరం మరింత ఆకర్షణీయంగా మారింది. క్రొయేషియాతో జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో క్రొయేషియా సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. మరి ఫైనల్లో గెలిచి ఏ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటుందో చూడాలి. -
పెద్దన్నా? పసి కూనా?
జర్మనీ తరం కాలేదు... స్పెయిన్ సత్తా సరిపోలేదు... అర్జెంటీనాకు వశపడలేదు...బ్రెజిల్ బేజారైపోయింది...బెల్జియం–ఇంగ్లండ్‌లది ‘మూడో’ ముచ్చటే!... ఫేవరెట్లన్నీ ఫట్ ఫట్‌మని తేలిపోయాయి!...‘ఫైనల్’గా ఫ్రాన్స్ ఒక్కటే మిగిలింది! పోర్చుగల్ పనైపోయింది...ఉరుగ్వే పరుగు ఆగింది...మెక్సికోకు కళ్లెం పడింది...కొలంబియా ఇంటికెళ్లిపోయింది......‘అండర్ డాగ్స్’ సంచలనం సమాప్తమైంది!...క్రొయేషియా ఒక్కటే కొరకరానిదిగా తేలింది! మాస్కో: అభిమానులను ఉర్రూతలూపి... ప్రేక్షకులను రంజింపజేసిన నెల రోజుల మహా సంరంభంలో ఆఖరి అంకం! ఫుట్‌బాల్ జగజ్జేతను తేల్చే సంగ్రామం! సరిగ్గా ముప్ఫై రోజుల క్రితం ఊహకైనా అందని రెండు జట్లు నేడు తుది సమరానికి నిలిచాయి. నవ యువకులతో కళకళలాడుతున్న ఫ్రాన్స్... అనుభవజ్ఞులతో రాటుదేలిన క్రొయేషియా! కప్పు నీదా నాదా అనేలా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నెమార్ల గొప్పదనం కాదు.. మా ప్రతిభ చూడండి అంటు దూసుకొచ్చారు ఫ్రాన్స్ ఆశాకిరణాలు గ్రీజ్మన్, ఎంబాపె, క్రొయేషియా మొనగాళ్లు మోడ్రిచ్, పెరిసిచ్. నరాలు తెగే ఉత్కంఠను అధిగమించి వీరిలో మెరిసేదెవరో? తమ దేశానికి కప్ అందించేదెవరో? తేలేందుకు మరొక్క రోజే సమయం. చరిత్రకు ఎదురీది... ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు ఫేవరెట్లలో ఒకటిగా ఫ్రాన్స్ పేరు వినిపించినా ఏ మూలనో సందేహం! మెరికల్లాంటి ఆటగాళ్లున్నా కొన్నేళ్లుగా జట్టు తడబడుతుండటమే ఇందుకు కారణం. ఆతిథ్య దేశ హోదాలో, 1998లో ప్రస్తుత కోచ్ డైడర్ డెచాంప్స్ సారథ్యంలో, థియరీ హెన్రీ, జినెదిన్ జిదాన్ జోరుతో తొలిసారి టైటిల్ గెలిచిన ఫ్రాన్స్... 2002 కప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. 2006లో రన్నరప్‌గా నిలిచినా, 2010లో గ్రూప్, 2014లో క్వార్టర్స్ అధిగమించలేకపోయింది. వీటన్నింటిని మించి సొంతగడ్డపై 2016 యూరో కప్‌ను పోర్చుగల్‌కు చేజార్చుకుంది. ఇంతటి అనిశ్చితి ఆట తీరుతోనే ఏమో... డెచాంప్స్ కూడా జట్టును సెమీస్ చేర్చితే చాలనుకున్నాడు. కానీ, దానిని మించి ముందుకెళ్లారు. యువతరంతో తొణికిసలాడుతున్న జట్టుకు, కెప్టెన్‌గా, కోచ్‌గా దేశానికి రెండుసార్లు కప్ అందించిన వాడిగా చరిత్రలో నిలిచేందుకు డెచాంప్స్కు ఇది సువర్ణావకాశమే. ఫ్రాన్స్ టైటిల్ కొట్టిన 1998లోనే... ఒక దేశం హోదాతో కప్‌లో ప్రవేశించిన క్రొయేషియా సెమీస్ చేరి పెను సంచలనం సృష్టించింది. క్వార్టర్స్‌లో దిగ్గజ జర్మనీని 3–0తో ఓడించినా, సెమీస్‌లో ఫ్రాన్స్‌కు 2–1తో తలొగ్గింది. అయితే, నెదర్లాండ్స్‌పై 2–1తో నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. తర్వాతంతా పేలవ ప్రదర్శనే. మూడు కప్‌లలో (మధ్యలో 2010లో అర్హత పొందలేదు) గ్రూప్ దశ దాటలేదు. ప్రస్తుతం మాత్రం పదునైన ఆటతో ఫైనల్‌కు చేరింది. ఓ విధంగా జట్టు ఇప్పటికే చరిత్ర సృష్టించింది. మరో విధంగా రికార్డులకు ఎక్కే మహదావకాశం ముందుంది. పడుతూ లేస్తూ... లేచి పడుతూ! టోర్నీలో రెండు జట్లది పూర్తి భిన్న ప్రయాణం. లీగ్ దశలో ఆస్ట్రేలియా సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో గెలవగలిగిన ఫ్రాన్స్... తర్వాత పెరూపై 1–0తో బయట పడింది. డెన్మార్క్‌తో స్కోరేమీ లేకుండా ‘డ్రా’ చేసుకుంది. నాకౌట్లో మాత్రం జూలు విదిల్చింది. ప్రిక్వార్టర్స్‌లో 4–3తో అర్జెంటీనాను చిత్తు చేసి, క్వార్టర్స్‌లో ఉరుగ్వేను 2–0తో సునాయాసంగా ఇంటికి పంపింది. సెమీస్‌లో ప్రమాదకర బెల్జియంకు పుంజుకునే అవకాశమే ఇవ్వకుండా 1–0తో ముగించింది. క్రొయేషియా మాత్రం నైజీరియాను 2–0తో, అర్జెంటీనాను 3–0తో, ఐస్లాండ్ను 2–1తో కొట్టేసి లీగ్‌లో అజేయంగా నిలిచింది. అయితే, నాకౌట్లో కిందామీదా పడింది. డెన్మార్క్, రష్యాలపై పెనాల్టీ షూటౌట్లలో, సెమీస్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌పై అదనపు సమయంలో గోల్‌తో ఊపిరి పీల్చుకుంది. ఈ మూడు సార్లూ మ్యాచ్‌లో వెనుకబడినా... పుంజుకుని గెలుపొందడం క్రొయేషియా పోరాటం తీవ్రతను చాటుతోంది. రక్షణ శ్రేణి–మిడ్ ఫీల్డర్స్ మొండి రక్షణ శ్రేణితో ప్రత్యర్థికి పట్టు చిక్కనివ్వదు ఫ్రాన్స్. మిడ్ ఫీల్డర్ల దన్నుతో కడవరకు పోరాడుతుంది క్రొయేషియా. ఈ రెండింటి మధ్య మ్యాచ్, అదీ ఫైనల్ అంటే రసవత్తరంగా సాగడం ఖాయం. ఫ్రెంచ్ డిఫెండర్లు పవార్డ్, వరానె, ఉమ్టిటిలు కీలక సమయంలో కొట్టిన గోల్స్ టోర్నీలో ఆ జట్టుకు విజయాలు అందించాయి. క్రొయేషియా మిడ్ ఫీల్డర్లు ఇవాన్ రాకిటిచ్, కెప్టెన్ లూకా మోడ్రిచ్, బడెల్జ్లు ఎలాంటి పరిస్థితినైనా సమన్వయం చేయగల సమర్థులు. అయితే, ఆంటోన్ గ్రీజ్మన్, కిలియాన్ ఎంబాపె, గిరౌడ్, ఉస్మాన్ డంబెల్, ఫెకిర్ వంటి మెరికల కలయికతో స్ట్రయికర్ల బలంలో మాజీ చాంపియన్‌దే కొంత పైచేయిగా ఉంది. ప్రత్యర్థి జట్టు స్ట్రయికర్లు ఇవాన్ పెరిసిచ్, మాన్‌జుకిచ్ సెమీస్‌లో గోల్స్ కొట్టి తామెంత ప్రమాదకారులమో చాటారు. వీరు తప్ప క్రమారిచ్, కలినిచ్, రెబిచ్లు పెద్దగా మెరవకపోవడం లోటు. ఫ్రాన్స్ మిడ్ఫీల్డ్లోని పోగ్బా, కాంటె, మటౌడి, క్రొయేషియా డిఫెండర్లలోని పివారిచ్, విదా, లొవ్రెన్ కూడా మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్నవారే. మా ‘ఆకలి‘ తీరాలి... ఫ్రాన్స్ జట్టులోని యువ ఆటగాళ్లు ట్రోఫీని తాకాలని తహతహలాడుతున్నారు. 1998లో తమ దేశం కప్ గెలిచినపుడు వీరిలో చాలామంది ఐదేళ్లలోపు చిన్నారులే. అందుకేనేమో, ‘ఫైనల్లో ఆడటం చిన్ననాటి కల. అదిప్పుడు నెరవేరుతోంది. మేం టైటిల్‌కు దగ్గరగా వచ్చాం. ఈ మ్యాచ్ మాకు జీవితంతో సమానం’ అని మిడ్ ఫీల్డర్ మట్యుడి అంటున్నాడు. 2016 యూరో కప్ ఫైనల్లో ఓడిన అనుభవం పాఠాలు నేర్పిందని చెబుతున్నాడు. ఫ్రాన్స్ గోల్ కీపర్లు: లోరిస్, స్టీవ్ మండాండా, ఎరోలా డిఫెండర్లు: పవార్డ్, కింపెంబె, వరానె, ఉమ్టిటి, అదిల్, సిడిబి, హెర్నాండెజ్, మెండి. మిడ్ ఫీల్డర్లు: పోగ్బా, కాంటె, టొలిస్సొ, మట్యుడి, ఎంజొన్జి. ఫార్వర్డ్స్: గ్రీజ్మన్, లెమర్, గిరౌడ్, ఎంబాపె, డంబెల్, ఫెకిర్, థయువిన్. క్రొయేషియా గోల్ కీపర్లు: సుబాసిచ్, లివకోవిచ్, కలినిచ్. డిఫెండర్లు: వ్రసాల్కొ, స్టిరినిచ్, కొర్లుకా, లొవ్రెన్, జెడ్వాజ్, కలెట్ కార్, విదా, పివారిచ్. మిడ్ ఫీల్డర్లు: రకిటిచ్, కొవాసిచ్, మోడ్రిచ్, బ్రొజొవిచ్, బ్రడారిచ్, బడెల్జ్. ఫార్వర్డ్స్: పెరిసిచ్, క్రమారిచ్, కలినిచ్, మన్జుకిచ్, రెబిచ్, మార్కో జాకా. బలాన్నే నమ్ముకున్నాం మేం కఠిన మార్గంలో వచ్చాం. ఆడిన నిమిషాలను లెక్కిస్తే టోర్నీలో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడినట్లు లెక్క. బహుశా ఏ ప్రపంచ కప్‌లో ఏ జట్టుకూ ఇలా జరిగి ఉండకపోవచ్చు. కష్టమైనదే అయినా ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. మేం బలాన్ని, ప్రేరణను నమ్ముకుని ముందుకెళ్తున్నాం. – క్రొయేషియా కోచ్ జాల్టొ ఇదో గొప్ప గౌరవం ఓ ఫుట్‌బాలర్‌కు ఇంతకంటే మించిన గొప్ప గౌరవం ఏమీ ఉండదు. మేం మొదటినుంచి నమ్ముకున్న నిశబ్దం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతలతోనే ఫైనల్‌కు శక్తి మేర సన్నద్ధమయ్యాం. క్రొయేషియా అనుభవం ఉన్న జట్టే. కానీ మేం ఇలాంటి అనుభవం ఉన్నవాటిని చాలా ఎదుర్కొన్నాం. ఆటగాడిగా శారీరక శ్రమ మాత్రమే ఉంటుంది. కోచ్‌గా మానసిక ఒత్తిడిని భరించాల్సి వస్తుంది. –ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ ►ఇటలీ, బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనాలలో ఏ ఒక్క జట్టూ లేకుండా జరుగుతున్న రెండో ఫైనల్ ఇది. 2010లో స్పెయిన్–నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఫైనల్ మొదటిది. ►ఫ్రాన్స్ కప్ గెలిస్తే రెండుసార్లు టైటిల్ కొట్టిన మూడో దేశంగా నిలుస్తుంది. ఉరుగ్వే (1930, 50), అర్జెంటీనా (1978, 86) రెండేసి సార్లు కప్ అందుకున్నాయి. ►ఫ్రాన్స్ టైటిల్ అందుకుంటే కెప్టెన్‌గా, కోచ్‌గా దేశానికి కప్ సాధించి పెట్టిన మూడో వ్యక్తిగా డెడర్ చాంప్స్ రికార్డులకెక్కుతాడు. ఇప్పటి వరకు మారియో జగాలో (బ్రెజిల్), ఫ్రాంజ్ బెకెన్‌బాయర్ (జర్మనీ) మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించారు. ►ఈసారి మొత్తం టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ గోల్స్ లేకుండా ముగిసింది. అది గ్రూప్ ‘సి’లో ప్రస్తుత ఫైనలిస్టు ఫ్రాన్స్... డెన్మార్క్ మధ్య జరిగిన మ్యాచ్ కావడం గమనార్హం. ►1998 కప్‌లో ఫ్రాన్స్... అరంగేట్ర క్రొయేషియా సెమీఫైనల్లో తలపడ్డాయి. నాడు లిలియన్ థురామ్ రెండు గోల్స్ కొట్టి ఫ్రాన్స్‌ను గెలిపించాడు. తర్వాత ఫ్రెంచ్ జట్టు కప్‌నూ కైవసం చేసుకుంది. -
క్రొయేషియా.. మేనియా!
జాగ్రెబ్: క్రొయేషియా.. 50 లక్షల జనాభా కూడా లేని ఈ దేశం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి, దిగ్గజ జట్లను మట్టికరిపిస్తూ ఫైనల్ చేరి ఆ దేశ జట్టు పెను సంచలనమే సృష్టించింది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగే ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. బుధవారం ఇంగ్లండ్‌ను సెమీఫైనల్లో ఓడించినప్పటి నుంచి నెటిజన్లు ఎక్కువగా అన్వేషిస్తున్నది క్రొయేషియా గురించే కావడం గమనార్హం. చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ చిన్న దేశం గురించి కొన్ని వివరాలు.. పురాతన చారిత్రక నేపథ్యం.. ఆరు నుంచి 14వ శతాబ్దం వరకు క్రొయేషియన్లు అనేక ఒడిదుడుకులు చవిచూశారు. 1527లో ఒట్టోమన్ చక్రవర్తుల ఆక్రమణల నేపథ్యంలో క్రొయేషియన్ పార్లమెంట్ ఫెర్డినాండ్‌ను తమ అధినేతగా ఎన్నుకుంది. 1918 తొలి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత సెర్బ్‌లు, స్లోవియన్లతో కలిసి క్రొయేషియన్లు యుగోస్లావియా రాజ్యాన్ని స్థాపించారు. సొంతంగా దేశం ఏర్పాటు చేసుకోవాలన్న ఆకాంక్షల మధ్య తలెత్తిన గందరగోళ పరిస్థితుల్లో 1929లో రాజు అలెగ్జాండర్ పార్లమెంట్‌ను పక్కనపెట్టి నియంతృత్వ పాలన సాగించాడు. 1941, ఏప్రిల్ 6న జర్మనీ బలగాలు దాడిచేసి క్రొయేషియా రాజ్యాన్ని ఆక్రమించుకుని ఫాసిస్టు నాయకుడు ఉస్టేన్ నేతృత్వంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత టిటో నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1980లో టిటో కన్ను మూశాక, 1989 నాటికి తూర్పు ఐరోపాలోని అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పాలన అంతమైంది. 1991లో క్రొయేషియన్లు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. క్రొయేషియా సరిహద్దుల్లో నివసిస్తున్న సెర్బ్ల రక్షణ పేరుతో యుగోస్లావియా సైన్యం దేశంలోకి చొచ్చుకురావడం సుదీర్ఘ యుద్ధానికి దారి తీసింది. 1992 జనవరి 15న క్రొయేషియాను ఐరోపా మండలి గుర్తించింది. ఎర్తుట్ ఒప్పందం వల్ల 1995లో ఆ యుద్ధం ముగిసింది. 1998 వరకు ఐరాస కింద ఉన్న తూర్పు స్లొవోనియాను క్రొయేషియాకు అప్పగించారు. 2009లో నాటో కూటమిలో, 2013లో ఐరోపా మండలిలో చేరింది. పొంచి ఉన్న సవాళ్లు.. ప్రస్తుతం క్రొయేషియా ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వలసలతో పాటు యువతలో 43 శాతం నిరుద్యోగం దేశాన్ని పట్టిపీడిస్తోంది. కమ్యూనిజం నుంచి ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారీ విధానంవైపు అడుగులేస్తోంది. ఈయూ, ఐరాస, కౌన్సిల్ ఆఫ్ యూరోప్, నాటో, డబ్ల్యూటీవోలలో సభ్యదేశంగా కొనసాగుతోంది. ఐరాస శాంతి పరిరక్షక దళంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ ఆర్థికవ్యవస్థలో సేవా, పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలోని టాప్–20 పర్యాటక ప్రాంతాల్లో క్రొయేషియా ఒకటిగా ఉంది. ఆసక్తికర విషయాలు... ► జనాభా: 41,63,968 (ఐరాస గణాంకాల ప్రకారం) ► జన సాంద్రత: చ.కి.మీకు 74 మంది ► వైశాల్యం: 55,960 చ.కి.మీ.లు ► పట్టణ జనాభా: 60.60 శాతం ► ప్రపంచంలోనే అతి చిన్న పట్టణం (17–23 మంది మాత్రమే నివసిస్తారు) ‘హమ్’ ఇక్కడే ఉంది. ► అత్యంత సుందరమైన సూర్యాస్తమయాన్ని ఇక్కడి డాల్మేషియాలోని ‘జడర్’లో వీక్షించవచ్చు. ► ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘డాల్మేషియన్’ శునకాల మూలాలు 17వ శతాబ్దంలో ఇక్కడే బయటపడ్డాయి. ► క్రొయేషియాలో ఎనిమిది జాతీయ పార్కులు, 11 నేచర్ పార్కులు, రెండు నేచర్ రిజర్వులున్నాయి. ► హెచ్‌బీఓ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను డాల్మేషియన్ తీరంలో చిత్రీకరిస్తున్నారు. -
నంబర్‌వన్ దురదృష్టవంతుడు!
మాస్కో: ప్రపంచ కప్ ఆడే అవకాశం రావడమంటేనే గొప్ప ఘనత. అలాంటిది ఫైనల్ వరకు వెళ్లిన, అదృష్టం కలిసొస్తే విశ్వవిజేతగా కూడా నిలిచే జట్టులో భాగంగా ఉండి కూడా చేజేతులా దానిని పోగొట్టుకుంటే అతడిని ఏమంటారు? ఆ దురదృష్టం పేరు నికొలా కలినిక్. క్రొయేషియా తరఫున 41 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ ఫార్వర్డ్ 23 మంది సభ్యుల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యుడిగా రష్యాకు వచ్చాడు. అయితే కాస్త పొగరు, మరికాస్త ఆవేశం కలగలిసి జట్టుకు దూరమయ్యాడు. టోర్నీలో భాగంగా నైజీరియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తొలి 11 మందిలో అతను లేడు. అయితే మ్యాచ్ మధ్యలో కలినిక్ను సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లమని కోచ్ జ్లాటో డాలిక్ ఆదేశించాడు. అయితే తన స్థాయికి సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లడం నామోషీ అంటూ అతను తిరస్కరించాడు. దాంతో చిర్రెత్తిన కోచ్ తర్వాతి రోజే కలినిక్ను ఇంటికి పంపించేశాడు. కాస్త ఓపిగ్గా ఉంటే నేడు జట్టు సంబరాల్లో భాగం కావాల్సినవాడు తన సహచరుల ఫైనల్‌ను టీవీలో చూడాల్సి వస్తోంది. ‘మీరెప్పుడూ కలినిక్లా చేయవద్దు’ అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు వ్యంగ్య వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. -
స్త్రీలోక సంచారం
68 ఏళ్ల తర్వాత క్రొయేషియా తొలిసారి వరల్డ్ కప్ ఫుట్‌బాల్ పోటీలలో ఫైనల్స్‌కు చేరిన ఆనందోత్సాహంలో క్రోయేషియా అధ్యక్షురాలు కొలిందా గ్రేబర్–కితారోబిక్.. డ్రెస్సింగ్‌రూమ్‌కి వెళ్లి మరీ తన దేశ క్రీడాకారుల జట్టును ఆలింగనం చేసుకున్నారు. అలా ఆమె ఆలింగనం చేసుకున్న క్రీడాకారులలో ఛాతీపై ఏ అచ్ఛాదనా లేని వారు కూడా ఉండడం మీడియాకు ఒక విశేషం అవగా, అచ్చు కొలిందా గ్రేబర్లా ఉండే యు.ఎస్. మోడల్ కోకో ఆస్టి బికినీలో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి, అందులో ఉన్నది కొలిందానే అనుకునేంతగా నెటిజన్లను తప్పదారి పట్టించింది ::: మహిళల భద్రత కోసం భిన్నమైన ఆలోచనలను ఆవిష్కరించేందుకు ఐఐటి–హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ఆగస్టు 12 వరకు జరుగుతున్న ‘మెగాథాన్ 2018’ లో దేశవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొంటున్నారు. మహిళల భద్రతకు అవసరమైన మెరుగైన పరిష్కారాలను కనుగొనడం కోసం రెండేళ్ల క్రితం తొలిసారి ‘హ్యాకథాన్’ పేరుతో 450 మంది విద్యార్థులతో మొదలైన ఈ విద్యార్థి ఉద్యమం 2017 నాటికి వెయ్యిమందికి చేరుకుని ఈ ఏడాది.. ఈవెంట్లో ప్రత్యక్షం పాల్గొనలేని విద్యార్థులను సైతం కలుపుకునేందుకు ‘ఆన్లైన్ రౌండ్’ను కూడా ప్రారంభించింది. చేతిలో బిస్కెట్ పాకెట్లు ఉన్న ఒక మహిళను.. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా సభ్యురాలిగా అనుమానించి గ్రామస్తులు ఒక స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన దేశంలోని మహిళల భద్రతపై సందేహాలను రేకెత్తిస్తోంది. తమిళనాడు మదురైలోని మేలూరు సమీపంలో ఉన్న పత్తినెట్టంకుడిలో గురువారం జరిగిన ఈ ఘటనలో గ్రామస్తులలోనే కొందరు ఆమె ప్రాణ రక్షణ కోసం పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఆమెను విడిపించి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు ::: రాంచీలోని ‘నిర్మల్ హృదయ్’లో అవివాహిత తల్లులకు పుట్టిన బిడ్డల్ని అందులో పనిచేసే ఒక ఉద్యోగి, నన్ కలిసి విక్రయించారనే ఆరోపణలు వచ్చి, వారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ పైనే దర్యాప్తు చేయించాలన్న బి.జె.పి. ఆలోచన వెనుక మిషనరీస్‌ను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విమర్శించారు. ‘‘స్వయంగా మదర్ థెరిస్సానే స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీని కూడా వీళ్లు వదిలిపెట్టడం లేదు. చారిటీస్ పేరును చెడగొట్టడానికి ప్రయత్నించడం, సిస్టర్స్‌ని టార్గెట్ చెయ్యడం వంటివి తీవ్రంగా ఖండించవలసిన విషయాలు’’ అని మమత ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేశారు ::: అత్యాచారం, లైంగిక వేధింపులలో దోషులైన వారికి డ్రైవింగ్ లైసెన్సు, ఆయుధాలు కలిగివుండే ౖలñ సెన్సులను రద్దు చేయడంతో పాటు, వారిని వృద్యాప్య పింఛన్లకు అనర్హులను చేయడం కూడా జరుగుతుందని హరియాణ ప్రభుత్వం ప్రకటించింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్షను విధించే ఆలోచన ప్రభుత్వ పరిగణనలో ఉందని పంచకులలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడిస్తూ.. లైసెన్సులను, పింఛన్లను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసిందని హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు.. హాలీవుడ్ నటి డెమీ మూర్ క్రెడిట్ కార్డును దొంగిలించి, ఆ విషయాన్ని ఆమె కనిపెట్టే లోపే లక్షా 60 వేల డాలర్ల (సుమారు కోటీ పదిహేను లక్షల యాభై వేల రూపాయలు) కొనుగోళ్లు జరిపిన డేవిడ్ మేథ్యూ రీడ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. కార్డు పోయిన వెంటనే ఆ విషయాన్ని డెమీ మూర్ సహాయకురాలు క్రిడెట్ కార్డ్ కంపెనీకి తెలియజేసేటప్పటికీ ఖరీదైన కోనుగోళ్లు అనేకం జరిగిపోయాయి ::: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని గతంలో బహిర్గతం చేసిన పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌ను గురువారం నాడు ఒక నైట్ క్లబ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మారువేషంలో క్లబ్బుకు వచ్చిన ముగ్గురు ‘నైతిక విలువల పరిరక్షణ’ డిటెక్టివ్‌లను తాకినందుకే ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతుండగా, రాజకీయ కక్షల కారణంగానే తన క్లయింట్‌ను ఇలా సాధిస్తున్నారని స్టార్మీ తరఫు న్యాయవాది ఆరోపిస్తున్నారు ::: యు.ఎస్. నేవీలో మహిళా ఉద్యోగుల హెయిర్ స్టెయిల్పై ఏళ్లనాటి నిషేధాన్ని తొలగిస్తూ, ఇక మీదట మహిళలు యూనిఫామ్‌లో ఉన్నప్పటికీ తమకు ఇష్టమైనట్లు పోనీ టైల్స్, వదులు జడలు, వైడర్ బన్స్, లాక్స్ వంటి వాటితో స్వేచ్ఛగా విధులకు హాజరు కావచ్చని నేవల్ ఆపరేషన్స్ చీఫ్ ఆడమ్ జాన్ రిచర్డ్సన్ ప్రకటించారు. ఇందువల్ల నేవీ మరింత సంఘటితం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. -
‘నిద్రపోతున్న దిగ్గజం’ లేచేది ఎప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ : కేవలం నలభై లక్షల జనాభా కలిగిన, అందులోనూ 1991లో స్వాతంత్య్రం సాధించిన క్రొయేషియా మొట్ట మొదటిసారి వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఫైనల్‌కు చేరుకోవడం అసాధారణ విషయం. కేవలం 34 లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే, నాలుగు లక్షల లోపు జనాభా కలిగిన ఐస్లాండ్ క్రీడాకారులతో పోటాపోటీగా రాణించి ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకోవడం క్రొయేషియా క్రీడాకారులకే దక్కిన అరుదైన గౌరవం. ఇంతటి చిన్న దేశాలు అంతటి ఘనకీర్తిని దక్కించుకుంటున్నప్పుడు 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశం ఇంతటి చిన్న దేశాలతోని ఎందుకు పోటీపడలేకపోతోందని, ఎందుకు ఫుట్‌బాల్ క్రీడారంగంలో రాణించలేక పోతోందన్న ప్రశ్న తలెత్తక మానదు. ‘భారత్ నిద్రపోతున్న దిగ్గజం’ అని 2012లో జరిగిన సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ వ్యాఖ్యానించారు. ‘భారత్‌లో 130 కోట్ల జనాభా ఉంది. వారిలో 130 కోట్ల మంది ఫుట్‌బాల్ ఆడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ నిద్రపోతున్న దిగ్గజం. ఈ దిగ్గజం నిద్రలేపడానికి ఒక అలారం క్లాక్ సరిపోక పోవచ్చు. రకరకాల అలారం క్లాక్‌లను ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఆ మాటకొస్తే భారత్ ఇప్పటికీ నిద్రపోతోందని చెప్పడం సబబు కాదు. అది మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది’ అని బ్లాటర్ వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఆరేళ్లు అవుతున్నా ‘నిద్రపోతున్న దిగ్గజం’ ఇంకా కదలిక లేదు. నిద్ర లేస్తున్న సూచనలు కూడా లేవు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉంది కనుక ఫుట్‌బాల్‌లో (ఆ మాటకోస్తే ఏ ఆటలోనైనాసరే) రాణించే సామర్థ్యం భారత్‌కు ఎక్కువగా ఉంటుందని భావించడం అర్థరహితం. ఒలింపిక్స్, సాకర్ వరల్డ్‌కప్ పోటీలు వచ్చినప్పుడల్లా అనివార్యంగా భారత్ ప్రస్తావన వస్తోంది. రాజకీయ నాయకులు, క్రీడా బోర్డులు చీఫ్‌లు అప్పటికప్పుడు నాలుగు మాటలు మాట్లాడి మళ్లీ నిద్రలోకి జారుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారంటూ తలలు లెక్క పెట్టడం ద్వారా మంచి జాతీయ క్రీడాకారులను తయారు చేయలేం. దేశంలోని క్రీడా సంస్కృతిపైనే అది ఆధారపడి ఉంటుంది. భారత క్రీడాకారులు రాటుదేలి రాణించాలంటే సహజ నైపుణ్యంకన్నా మంచి వ్యవస్థలు ఎక్కువ అవసరం. ఆకర్షణీయమైన పథకాలకన్నా అకుంఠిత దీక్షతో కఠోర శ్రమ చేయడం ఎక్కువ అవసరం. 2017, అక్టోబర్ నెలలో అండర్–17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను భారత్ నిర్వహించింది. అలాంటి అవకాశం దొరకడం ఒక అదృష్టం. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని దేశంలోని యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి క్రీడా సంస్కృతి పరిఢవిల్లేందుకు అందమైన బాటలు వేసి ఉంటే ఎంతో బాగుండేది. టోర్నమెంట్ వచ్చిందీ వెళ్లింది. భారత్ నిద్రలేవలేదు. బలమైన పునాదులు లేకుండా ఫుట్‌బాల్‌లో రాణించలేం. అట్టడుగు స్థాయి క్రియాశీలత, అందుకు ప్రోత్సాహక వ్యవస్థలు అవసరం. ఈ విషయంలో భారత్ ఇప్పటికీ వెనకబడే ఉంది. పేరుకు భారత్‌లో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఉంది. దీని దృక్పథమే తలకిందులు. క్రీడాకారుల కోసం పైనుంచి కిందకు చూస్తోంది. అట్టడుగు లేదా గ్రామీణ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించకుండా డబ్బు ఖర్చుతో కూడిన అతిపెద్ద లీగ్‌ల నిర్వహణపైనే దృష్టిని కేంద్రీకరిస్తోంది. క్రీడా సంస్కృతి లేకుండా ఎన్ని మౌలిక సౌకర్యాలున్నా లాభం లేదు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్యహించే వ్యవస్థలు ఉన్నప్పుడు, అవి సవ్యంగా పనిచేసినప్పుడు క్రీడా సంస్కృతి పెరుగుతుంది. క్రొయేషియా క్రీడాకారులు భలే రాణించారబ్బా! అంటూ అబ్బురపడితే మనకా క్రీడ అబ్బదు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదోరోజు వారివలే మనమూ రాణిస్తామన్న ఆత్మవిశ్వాసంతో అడుగులేయాలనుకుంటే నిద్రమత్తు దానంతట అదే తొలగిపోతుంది. దిగ్గజం ఘీంకారం వినిపిస్తుంది. -
ఇంగ్లండ్ ఇంటికి...
‘ఇట్స్ కమింగ్ హోమ్’...! ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఒక్కో విజయం సాధిస్తున్న కొద్దీ కప్పు తమదేనంటూ ఆ దేశంలో మార్మోగుతున్నదీ పాట. వారికిదో జాతీయ గీతమైపోయింది కూడా. జట్టు ఫైనల్‌కు చేరకముందే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జనం టీవీలకు అతుక్కుపోయారు. ఆ దేశ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ జో రూట్ అయితే... తమ దృష్టంతా భారత్‌తో వన్డే సిరీస్ మీద కాక ఫుట్‌బాల్ సెమీఫైనల్ పైనే ఉందన్నాడు. అభిమానులు మరింత ముందడుగేసి ఆదివారం వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ వేళలు మార్చాలని, సంబరాలు జరుపుకోవడానికి సోమవారం ఏకంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేసేశారు. కానీ ఈ కలంతా చెదిరింది. కలతే మిగిలింది. తమ చిన్న దేశానికీ ఒక జట్టుందని, అది ఈ స్థాయిలో ఆడుతుందని ఊహించని సగటు అభిమానికి క్రొయేషియా మాంచి కిక్ ఇచ్చింది. గోల్ మీద గోల్ కొట్టి లీగ్ దశలో అర్జెంటీనాను మట్టికరిపించి... ఒత్తిడిని ఓడించి డెన్మార్క్, రష్యాలను వరుసపెట్టి ‘పెనాల్టీ నాకౌట్’ చేసి... సెమీస్‌లో ఇంగ్లండ్‌పై శక్తికి మించి పోరాడి అద్భుతమే చేసింది. తమ చరిత్రలోనే గొప్పదనదగ్గ విజయంతో ప్రపంచ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. ఆదివారం టైటిల్ పోరులో ఫ్రాన్స్‌కు సవాల్ విసిరింది. మాస్కో :అంచనాలు లేకుండా వచ్చి, ఉత్కంఠను అధిగమిస్తూ ఒక్కో మ్యాచ్ నెగ్గుతూ వస్తున్న క్రొయేషియా... అంతే సంచలన రీతిలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిం ది. బుధవారం అర్ధరాత్రి ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో ఆ జట్టు 2–1 తేడాతో మాజీ చాంపియన్‌ను ఓడించి ఇంటికి పంపింది. అంతకుముందు రెండు పెనాల్టీ షూటౌట్ మ్యాచ్‌లు ఆడినా, ఈసారి యువకులతో నిండిన ప్రత్యర్థితో తలపడుతున్నా, కనీసం సబ్‌స్టిట్యూట్‌ను కూడా దింపకుండా ఏకబిగిన 90 నిమిషాల పాటు ఒకే జట్టును కొనసాగించిన క్రొయేషియా తమ శ్రమకు తగ్గ ఫలితం పొందింది. పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన కీరన్ ట్రిప్పియర్ (5వ నిమిషం) ఇంగ్లండ్ ఖాతా తెరవగా..., ఇవాన్ పెరిసిచ్ (68వ ని.), మాన్‌జుకిచ్ (109వ ని.) గోల్స్ కొట్టి క్రొయేషియాకు విజయం అందించారు. ఆరంభంలోనే ఆధిక్యం ఇచ్చినా... వేలాదిగా హాజరైన అభిమానుల మద్దతు మధ్య మైదానంలో దిగిన ఇంగ్లండ్‌కు... అందుకు తగ్గట్లే ఆరంభంలోనే గోల్ దక్కింది. క్రొయేషియా కెప్టెన్ మోడ్రిచ్ ఫౌల్ చేయడంతో లభించిన ఫ్రీ కిక్‌ను ట్రిప్పియర్ 20 గజాల దూరం నుంచి నెట్లోకి పంపి ఆధిక్యం అందించాడు. దీన్నుంచి తేరుకున్న క్రొయేషియా ప్రతి దాడులకు దిగింది. ఓ దశలో గోల్ చేసినంత పనిచేసింది. అయితే రక్షణ శ్రేణి లోపాలతో పదేపదే తప్పులు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ చక్కటి అవకాశాన్ని జారవిడిచాడు. సరిగ్గా గోల్‌పోస్ట్ ముందున్న అతడు బంతిని నేర్పుగా నెట్లోకి కొట్టలేకపోయాడు. ఖాతా తెరిచి... విరుచుకుపడి ఇరు జట్ల ఆటగాళ్లు వెంటవెంటనే ఎల్లో కార్డులు ఎదుర్కొనడంతో రెండో భాగం పోటాపోటీగా ప్రారంభమైంది. గోల్‌పోస్ట్ ముందు కేన్‌కు దక్కిన మరో అవకాశాన్ని బంతిని పక్కకునెట్టి లోవ్రెన్ నిర్వీర్యం చేశాడు. బాక్స్ ఏరియా ఆవల చాలా చాన్స్‌లు దొరికినా వ్యూహంతో కదలక చేజార్చుకున్న క్రొయేషియా... ఎట్టకేలకు 68వ నిమిషంలో సఫలమైంది. సైమ్ వాల్జ్కో అందించిన క్రాస్‌ను పెరిసిచ్ పొరపాటు లేకుండా హెడర్‌తో నెట్లోకి చేర్చాడు. తర్వాత ఒక్కసారిగా ఆ జట్టు విజృంభించడంతో ఆటే మారిపోయింది. పదేపదే దాడులతో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించింది. పెరిసిచ్ కొట్టిన ఓ షాట్ చివరి క్షణంలో గోల్ బార్‌ను తగిలి పక్కకు పోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి స్కోరు సమం కావడంతో అదనపు అరగంట తప్పలేదు. టోర్నీలో జట్టుకు వెన్నెముకలా నిలిచిన కీపర్ జోర్డాన్ పిక్ఫోర్డే ఈసారి ఉదాసీనతతో ఇంగ్లండ్ కొంపముంచాడు. సాధారణ పాస్‌తో బంతిని అందుకుని 109వ నిమిషంలో గోల్‌పోస్ట్ ముందుకు వచ్చిన మాన్‌జుకిచ్ కొట్టిన షాట్... పిక్‌ఫోర్డ్ నిర్లిప్తతతో నెట్లోకి వెళ్లిపోయింది. సబ్‌స్టిట్యూట్ అవకాశాలు అయిపోయి, గాయంతో ట్రిప్పర్ మైదానం వీడటంతో చివర్లో ఇంగ్లండ్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. మరో గోల్‌కు కూడా వీలు చిక్కకపోవడంతో ఆ జట్టు పరాజయ భారంతో మైదానం వీడింది. ►వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్ చేరిన జట్లలో క్రొయేషియా (20)దే పెద్ద ర్యాంకు. ఈ టోర్నీ మరో ఫైనలిస్టు ఫ్రాన్స్ 1998 వరల్డ్ కప్‌లో 18వ ర్యాంకుతో బరిలో దిగి టైటిల్ నెగ్గడం విశేషం. ►‘ఇట్స్ కమింగ్ హోమ్’ ఉంటూ ఉర్రూతలూగిన ఇంగ్లండ్ అభిమానులపై ప్రపంచ వ్యాప్తంగా వ్యంగ్య బాణాలు మొదలయ్యాయి. ‘ఎస్...ఇంగ్లండ్ కమింగ్ హోమ్’ అంటూ అన్ని వైపులనుంచి జనం విసుర్లతో విరుచుకు పడ్డారు. -
క్రొయేషియా ఒక భూతల స్వర్గం
-
ఫిఫాలో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు షాక్
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పెనుసంచలనం. క్రొయేషియా తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫిఫా-2018 తుదిసమరానికి చేరింది. మ్యాచ్‌లో 2-1 తేడాతో క్రొయేషియా విజయం సాధించింది. ఆట 5వనిమిషంలో ఇంగ్లండ్ ఆటగాడు ట్రిపియర్ గోల్ చేయగా.. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ హాఫ్ లో సీన్ మారింది. క్రొయేషియా ప్లేయర్లు మైదానంలో చురుక్కుగా కదులుతూ ఇంగ్లండ్‌కు మరో అవకాశం ఇవ్వలేదు. క్రొయేషియా ఆటగాడు పిరిసిక్ ఆట 68వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మ్యాచ్ ఎక్స్ ట్రా టైమ్‌లో ఇంగ్లండ్ కు షాకిచ్చింది క్రొయేషియా. 109వ నిమిషంలో క్రొయేషియా ప్లేయర్ మండూకిక్ గోల్ చేసి ఇంగ్లండ్ ఆశలను గల్లంతు చేశాడు. ఈ చిరస్మరణీయ విజయంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌తో క్రొయేషియా తలపడనుంది. -
ప్రధాని ఎదుట అధ్యక్షురాలి సంబరాలు!
సోచీ: ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య రష్యా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శనివారం క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. నిర్ణీత సమయంలో(అదనపు సమయంతో కలుపుకుని) రష్యా, క్రొయేషియా జట్లు తలో రెండు గోల్స్ చేశాయి. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్లో క్రొయేషియా 4-3తో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వరల్డ్‌కప్‌లో క్రొయేషియా సెమీస్ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. మెగా టోర్నీలో క్రొయేషియా జట్టు మరో సెమీస్‌కు చేరడంతో ఆ దేశ ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆ దేశ అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ కిటారోవిక్ ఆనందానికైతే అవధుల్లేవు. క్రొయేషియా జెర్సీ ధరించి మరీ తమ దేశ ఆటగాళ్లకు ఆమె మద్దతు తెలిపారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఎంతో ఉత్సాహంగా కనిపించిన ఆమె.. క్రొయేషియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న తర్వాత ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో రష్యా ప్రధానమంత్రి దిమిత్రి మెద్వెదేవ్ ఎదురుగానే ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ప్రధాని ఎదుట అధ్యక్షురాలి సంబరాలు!
-
క్రొయేషియా కొట్టేసింది
పోరు చివరిదాకా రసవత్తరంగా జరిగింది. ఆతిథ్య జట్టు ఆడుతుంది కాబట్టి ఫిష్ట్ స్టేడియం హోరెత్తింది. ఇరు జట్లు రెండు సార్లు సమవుజ్జీగా నిలిచాయి. నిర్ణీత సమయంలో రష్యా, క్రొయేషియా చెరో గోల్ చేశాయి. అదనపు సమయంలోనూ ఒక్కో గోల్ చేశాయి. 2–2తో స్కోరు సమం కావడంతో షూటౌట్ తప్పలేదు. రష్యా ఆటగాళ్లు వెనుకబడితే క్రొయేషియా 4–3తో మ్యాచ్‌ను, సెమీస్ చాన్స్‌నూ కొట్టేసింది. సొచి: రష్యా ఆడినంతసేపూ బాగా ఆడింది. ఈ క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా కంటే ముందే గోల్ చేసింది. అదనపు సమయం దాకా దీటుగా బదులిచ్చింది. అదనపు సమయం ఒక దశలో 2–1తో గెలుస్తుందనుకున్న క్రొయేషియాను చివరి నిమిషాల్లో గోల్ చేసి 2–2తో మళ్లీ నిలువరించింది. కానీ షూటౌటే ఆతిథ్య జట్టు కొంపముంచింది. ఇద్దరు ఆటగాళ్లు షూటౌట్ ఒత్తిడిలో చిత్తవడంతో చివరకు క్రొయేషియా 4–3తో విజయం సాధించింది. రష్యా తరఫున డెనిస్ చెరిషెవ్ (31వ ని.), మరియో ఫెర్నాండెస్ (115వ ని.) చెరో గోల్ చేయగా... క్రొయేషియా తరఫున అండ్రెజ్ క్రామరిక్ (39వ ని.), డొమగొజ్ విదా (100వ ని.) గోల్ చేశారు. అయితే షూటౌట్లో రష్యా జట్టులో స్మొలొవ్తో పాటు ఫెర్నాండెస్ విఫలం కాగా జగొయెవ్, ఇగ్నాషెవిచ్, కుజియయెవ్ గోల్ సాధించారు. క్రొయేషియాలో మటే కొవసిక్ మినహా బ్రొజొవిక్, మోడ్రిక్, విదా, రకిటిక్ గోల్ చేయడంతో ఆ జట్టు సెమీస్ చేరింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో క్రొయేషియా తలపడుతుంది. ప్రపంచకప్‌లో క్రొయేషియా సెమీస్ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆరంభం నుంచి రష్యా జాగ్రత్తగా ఆడింది. క్రొయేషియా స్ట్రయికర్లను నిలువరిస్తూ కదంతొక్కింది. బంతి చాలావరకు క్రొయేషియా ఆధీనంలోనే ఉన్నా... వారి దాడుల్ని గోల్పోస్ట్దాకా రానివ్వకుండా రష్యా అడ్డుకుంది. దీంతో అరగంట దాకా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఆ మరుసటి నిమిషంలో రష్యా మిడ్‌ఫీల్డర్ చెరిషెవ్ (31వ ని.) పెనాల్టీ బాక్స్‌కు సమీపంలో 25 గజాల దూరం నుంచి కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. కానీ 8 నిమిషాల వ్యవధిలోనే క్రొయేషియా స్కోరు సమం చేసింది.రష్యా డిఫెండర్లను ఛేదిస్తూ మడ్జుకిచ్ ఇచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్ క్రామరిక్ (39వ ని.) హెడర్ గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు తమ దాడులకు పదును పెట్టినప్పటికీ ఎవరు సఫలం కాలేదు. బంతి పదేపదే క్రొయేషియా ఆధీనంలోకి వెళ్లినా... ప్రత్యర్థి లక్ష్యంపై గురిపెట్టడంలో రష్యా ఆటగాళ్లు కూడా ఆకట్టుకున్నారు. 13 షాట్లు ఆడిన రష్యా ఐదు సార్లు లక్ష్యంపై గురిపెట్టగా... క్రొయేషియా 18 షాట్లలో కేవలం మూడు సార్లు లక్ష్యం దిశగా ఆడింది. అదనపు సమయం మొదలైన పది నిమిషాలకు క్రొయేషియా తరఫున విదా (100వ ని.) హెడర్ గోల్ చేయగా, ఇక మ్యాచ్ ముగిసే చివరి క్షణాల్లో ఫెర్నాండెస్ (115వ ని.) కూడా హెడర్తోనే గోల్ చేసి రష్యాకు ఊపిరి పోశాడు. దీంతో 2–2తో స్కోరు సమం కావడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. -
ఫిఫా ప్రపంచకప్: రష్యా కథ ముగిసింది
సమరా: ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఫిఫా 2018 వరల్డ్ కప్ నాకౌట్ సమరంలో ఆతిథ్య జట్టు రష్యా పోరాటం అనూహ్యంగా ముగిసింది. దీంతో ఆ దేశ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం నాలుగో క్వార్టర్ ఫైనల్స్‌లో ఆతిథ్య జట్టు పెనాల్టీ షూటౌట్లో 3-4 గోల్స్ తేడాతో క్రొయేషియాతో చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్లు రెండేసి గోల్స్ చేయడంతో స్కోర్ మ్యాచ్ డ్రా అయింది. రష్యా తరుపున డెనిస్ చెరిషెవ్ 31వ నిమిషంలో, మారియో ఫెర్నాండేజ్ 115వ నిమిషంలో గోల్స్ సాధించారు. క్రొయేషియా తరపున ఆండ్రెజ్ 39వ నిమిషంలో, డోమాగ్ విడా 100 నిమిషంలో గోల్స్ చేశారు. నాటకీయంగా సాగిన ఈ మ్యాచ్‌లో సమయాన్ని పెంచినా ఫలితం తేలకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఈ షూటౌట్లో రష్యా తొలి పెనాల్టీ కిక్‌ను చేజార్చుకోని ఒత్తిడికి లోనైంది. ఇలా రెండు సార్లు పెనాల్టీ షూటౌట్‌ను రష్యా వృథా చేయగా, క్రొయేషియా నాలుగు పెనాల్టీ గోల్స్ సాధించడంతో సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక సెమీస్‌లో క్రొయేషియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా క్వార్టర్ ఫైనల్లోనే దక్షిణ అమెరికా జట్లకు షాక్ తగలడంతో నాలుగు యూరప్ జట్లు సెమీస్‌కు చేరాయి. -
ఆఖరి ‘కిక్’ క్రొయేషియాదే
ప్రేక్షకులింకా స్టేడియంలో కుదురుకోనేలేదు...అభిమానులింకా టీవీల ముందు సర్దుకోనేలేదు...ఫటాఫట్... రెండు గోల్స్ పడిపోయాయి!ఆరంభం అదిరిందనుకుంటే... మళ్లీ స్కోరే లేదు!నాకౌట్ మొదటి రోజు రెండు దిగ్గజ జట్లు నిష్క్రమిస్తే...రెండో రోజు రెండు మ్యాచ్‌లూ పెనాల్టీ షూటౌట్‌కు దారితీశాయి!ఇందులో క్రొయేషియానే కొట్టేసింది... డెన్మార్క్ ‘అవుటైంది’...! నిజ్ని నవ్‌గొరొడ్: సాకర్ ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్‌లో మరో రసవత్తర పోరు. ఆదివారం రాత్రి మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా 4–3తో స్పెయిన్‌పై పెనాల్టీ షూటౌట్లో గెలుపొందగా... అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఫలితం వచ్చింది. కాకపోతే, మొదటిదాని కంటే ఇంకొంత ఉత్కంఠగా...! ఇందులో డెన్మార్క్ గట్టి పోటీనిచ్చినా, ఆఖరి కిక్ క్రొయేషియాదే. ఆజట్టు 3–2 తేడాతో నెగ్గింది. నిర్ణీత 90 నిమిషాలతో పాటు, అదనపు అరగంట ముగిశాక కూడా రెండు జట్లూ 1–1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. అప్పటికీ తొలి, నాలుగో కిక్‌లను గోల్ కీపర్లు కాస్పర్ షమిచెల్ (డెన్మార్క్), డానిజెల్ కబాసిక్ (క్రొయేషియా) అడ్డుకోవడంతో స్కోరు 2–2తో నిలిచి ఉద్విగ్నత పతాక స్థాయికి చేరింది. అయిదో కిక్‌ను జొర్గెన్సన్ నెట్లోకి పంపడంలో విఫలం కాగా, రాక్టిక్ విజయవంతమయ్యాడు. ఒకట్లో ఒకటి... నాలుగులో రెండోది ఆటగాళ్లు గోల్పోస్ట్ల వద్దకు దూసుకురావడంతో వెంటవెంటనే ఇరువైపులా స్కోర్లు నమోదయ్యాయి. మొదటి నిమిషంలోనే దూరం నుంచి వచ్చిన పాస్‌ను పెనాల్టీ ఏరియాలో అందుకున్న మథియాస్ జొర్గెన్సన్... పెనుగులాట మధ్య గోల్ చేసి డెన్మార్క్‌ను ఆధిక్యంలో నిలిపాడు. తేరుకున్న క్రొయేషియా 4వ నిమిషంలోనే సమం చేసేసింది. కుడివైపు ప్రాంతంలో బంతిని దొరకబుచ్చుకున్న మారియో మన్డ్జుక్ చిక్కకుండా ముందుకెళ్లి గోల్‌గా మలిచాడు. క్రొయేషియా కళ్లెం వేసినా... డెన్మార్క్ ఆత్మవిశ్వాసంతో ఆడింది. కానీ, క్రొయేషియా మిడ్‌ఫీల్డ్‌ను దాటి డెన్మార్క్ ముందుకు వెళ్లలేకపోయింది. తీవ్ర స్థాయిలో శ్రమించినా ఎవరూ గోల్ చేయలేకపోయారు. దీంతో అదనపు అరగంట అనివార్యమైంది. జొర్గెన్సన్ ఫౌల్‌తో 116వ నిమిషంలో క్రొయేషియాకు పెనాల్టీ కిక్ దక్కింది. అయితే, మొడ్రిక్ కొట్టిన ఈ షాట్‌ను షెమిచెల్ నిలువరించాడు. ఇది తప్ప మెరుపులు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ను అశ్రయించారు. కీపర్ల ప్రతిభతో ఇందులో నాలుగో కిక్ వరకు హై డ్రామా నడించింది. అయిదో కిక్‌ను పొరపాటు చేయకుండా రాక్టిక్ నెట్లోకి కొట్టి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. -
20 ఏళ్ల తర్వాత క్రొయేషియా..
నిజ్నీ నోవ్గారోడ్(రష్యా): ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో దుమ్మురేపిన క్రొయేషియా జట్టు ఊహించినట్లే క్వార్టర్స్‌కు చేరింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్‌లో క్రొయేషియా 3-2 తేడాతో డెన్మార్క్‌ను ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇరు జట్లు నిర్ణీత సమయానికి 1-1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌల్లో క్రొయేషియా మూడు గోల్స్ సాధించగా, డెన్మార్క్ రెండు గోల్స్ మాత్రమే చేసింది. దాంతో క్రొయేషియా మరో నాకౌట్ సమరానికి సిద్ధమైంది. శనివారం ఆతిథ్య రష్యాతో క్రొయేషియా క్వార్టర్స్‌లో తలపడనుంది. వరల్డ్ కప్‌లో క్రొయేషియా క్వార్టర్స్‌కు చేరడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1998లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో చివరిసారి క్రొయేషియా క్వార్టర్స్‌కు చేరగా, ఆపై ఇంతకాలానికి మరొకసారి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. నిన్నటి మ్యాచ్‌లో క్రొయేషియా-డెన్మార్క్‌లు మొదటి నాలుగు నిమిషాల వ్యవధిలోనే తలో గోల్స్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అనిపించింది. కాగా, ఆపై ఇరు జట్లు అత్యంత రక్షణాత్మకంగా ఆడటంతో అదనపు సమయంలో కూడా గోల్స్‌ను సాధించలేకపోయాయి. దాంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. -
అర్జెంటీనా ఊపిరి పీల్చుకో..
మాస్కో : అర్జెంటీనాకు ఉపశమనం లభించింది. లియోనల్ మెస్సీ, అర్జెంటీనా అభిమానులు ఎప్పుడూ లేనంతగా ఐస్లాండ్పై క్రొయేషియా గెలవాలి.. కనీసం ఈ మ్యాచ్ డ్రా అవ్వాలని ప్రార్ధించారు. వారి ప్రార్థనలు ఫలించాయి. ఐస్లాండ్పై 2-1తో క్రొయేషియా గెలిచి అర్జెంటీనాను నాకౌట్‌కు పంపించింది. ఫిఫా ప్రపంచకప్ తొలి నాకౌట్ పోరులో ఫ్రాన్స్‌తో అర్జెంటీనా శనివారం రోజు(జూన్ 30)న తలపడనుంది. మంగళవారం అర్ధరాత్రి ఐస్‌లాండ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరకు క్రోయేషియా విజయం సాధించింది. తొలి భాగం ముగిసే సరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. రెండో అర్థభాగం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకు క్రొయేషియా ఆటగాడు బాడెల్జ్ (53వ నిమిషంలో) తొలి గోల్ నమోదు చేశాడు. గోల్‌పోస్ట్‌పై ఇరుజట్లు పోటీపడీ దాడులు చేసినా, రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. 76వ నిమిషంలో పెనాల్టీ కిక్ రూపంలో ఐస్లాండ్ను అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐస్లాండ్ ఆటగాడు సిగుర్గ్స్సన్ గోల్‌గా మలిచాడు. రెండో అర్థభాగం పూర్తవుతుందనుకున్న సమయంలో క్రొయేషియా ఆటగాడు పెరిసిక్ కళ్లుచెదిరే రీతిలో గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఇంజ్యూరీ టైమ్‌లో ఇరుజట్లు మరో గోల్ నమోదు చేయకపోవడంతో క్రొయేషియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఐస్లాండ్ అత్యధిక సార్లు(17) గోల్ కోసం ప్రయత్నించగా, క్రొయేషియా రక్షణశ్రేణి విజయవంతంగా ఆడ్డుకుంది. క్రొయేషియా అనవసర తప్పిదాలు 12 చేయగా, ఐస్ లాండ్ 10 తప్పిదాలు చేసింది. ఈ మ్యాచ్‌లో రిఫరీలు ఇద్దరు క్రొయేషియా, ముగ్గురు ఐస్లాండ్ ఆటగాళ్లకు ఎల్లో కార్డు చూపించారు. -
మెస్సీ భార్య పోస్ట్‌పై విమర్శలు..!
నిజ్నీ నొవొగొరొడ్: ఫిఫా ప్రపంచకప్‌లో లియనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా.. క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను మట్టికరిపించిన తర్వాత మెస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు...ఇప్పుడు అతని భార్య అంటోనెల్లా రోకుజ్జోను సైతం వదల్లేదు. ఇందుకు కారణం అంటోనెల్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేయడమే. క్రొయేషియాతో మ్యాచ్‌కు ముందు వోమెస్‌పాపి(గోడాడీ) అనే క్యాప్షన్‌ను జోడించిన అంటోనెల్లా తన మూడేళ్ల కుమారుడితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్యాలో జరిగే ప్రపంచకప్‌కు హాజరుకాని అంటోనెల్లా.. ఇన్స్టాగ్రామ్ ద్వారా భర్తకు చీర్స్ తెలిపింది. అయితే క్రొయేషియాతో మ్యాచ్‌లో అర్జెంటీనా ఘోరంగా వైఫల్యం చెందిన క్రమంలో మెస్సీ భార్య పోస్ట్‌పై విమర్శలు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఆ క్యాప్షన్‌ను ఉద్దేశిస్తూ.. ‘ మీ నాన్న ఒక లూజర్’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, త్వరలోనే మీ ‘పాపి’(నాన్న) స్వదేశానికి వచ్చేస్తాడులే’ అని మరో నెటిజన్ చమత్కరించాడు. ‘టోర్నీ నుంచి నిష్క్రమించడానికి అర్జెంటీనా చాలా దగ్గరలో ఉంది.. మెస్సీ ఇంటిలో కూర్చొని మ్యాచ్‌లు చూడొచ్చు’ అని మరొక అభిమాని విమర్శించాడు. ఇదిలా ఉంచితే, నైజీరియాతో జరిగే తదుపరి మ్యాచ్‌లో మెస్సీ రాణిస్తాడని పలువురు మద్దతుగా నిలిచారు. -
ఫిఫా ప్రపంచకప్: అర్జెంటీనాకు షాక్
నిజ్నీ నొవొగొరొడ్: ఫిఫా ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్లలో ఒకటైన అర్జెంటీనాకు షాక్ తగిలింది. గ్రూప్ డిలో భాగంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా చిత్తుగా ఓడిపోయింది. క్రొయేషియాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన మెస్సీ అండ్ గ్యాంగ్ 0-3తో ఓటమి పాలైంది. క్రొయేషియా పోటీ పడి గోల్స్ చేయగా మెస్సీ సేన ఒక్క గోల్ కూడా నమోదు చేయలేక చతికిలబడింది. ప్రధానంగా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఓటమితో అర్జెంటీనా నాకౌట్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. ఇరు జట్లు ప్రథమార్థంలో గోల్స్ చేయడంలో విఫలమైతే, ద్వితీయార్థం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకే అంటీ రెబిక్ క్రొయేషియాకు తొలి గోల్‌ను అందించాడు. అనంతరం అర్జెంటీనా-క్రొయేషియాలు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. కాగా, ఆట 80వ నిమిషంలో క్రొయెషియా ఆటగాడు బ్రొజోవిక్ అందించిన సహకారంతో లుకా మాడ్రిక్ అద్భుత గోల్ అందించాడు. దీంతో 2-0తో ఆధిక్యంలోకి వచ్చిన క్రొయేషియా ప్రత్యర్థి అర్జెంటీనాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే గోల్ పోస్ట్‌పై దాడి చేసినా క్రొయేషియా రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయారు. ఎక్సట్రా ఇంజూరి టైమ్ (90+1)లో ఇవాన్ రాకిటిక్ క్రొయేషియాకు మూడో గోల్ అందించాడు. ఇక ఆట ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో క్రొయేషియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అరెంటీనా 14 అనవసర తప్పిదాలు చేయగా, క్రొయేషియా 19 తప్పిదాలు చేసింది. అర్జెంటీనా గోల్ పోస్ట్‌పై ఏడు సార్లు దాడి చేయగా, క్రొయేషియా తొమ్మిది సార్లు దాడి చేసింది. ఈ మ్యాచ్‌లో నలుగురు క్రొయేషియా ఆటగాళ్లకు, ముగ్గురు అర్జెంటీనా ఆటగాళ్లుకు రిఫరీలు ఎల్లో కార్డు చూపించారు. రికార్డులు.. ప్రపంచకప్‌లో క్రొయేషియా చేతిలో 1998లో ఏకైకసారి ఆడి ఓడిపోయిన అర్జెంటీనాకు ఈసారి ఏదీ కలిసిరాలేదు. తొలి మ్యాచ్‌లో 1-1తో ఐస్‌లాండ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న అర్జెంటీనా.. సాకర్ ప్రపంచకప్‌లో లీగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవకపోవటం 44 సంవత్సరాల తర్వాత ఇదే కావడం విశేషం. ఫుట్‌బాల్ సంగ్రామంలో ఓటమి పరంగా 1958లో ఛెకోస్లోవేకియాపై 1-6 తేడాతో ఓటమి తర్వాత రెండో అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. ఇక నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే జూన్26న నైజీరియాతో జరిగే మ్యాచ్‌లో అర్జెంటీనా తప్పక గెలవాల్సిన పరిస్థితి. -
ఆడకపోతే.. ఇంటికి వెళ్లిపో!
మాస్కో: క్రొయేషియా ఫ్వార్వర్డ్ నికొలా కలినిచ్ ప్రపంచకప్ నుంచి ఇంటికొచ్చేస్తున్నాడట. దీనికి కారణం అతను నైజీరియాతో మ్యాచ్‌తో ఆడడటానికి నిరాకరించడమే! నైజీరియాతో మ్యాచ్‌లో రెండో అర్ధభాగంలో సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లాల్సిందిగా కోచ్ జ్లాకో డాలిచ్ నికొలాను కోరాడు. అయితే తాను ఆడలేనని అతను చెప్పడంతో స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా డాలిచ్ ఆదేశించాడట. అయితే కలినిచ్ ఇంటికి వెళ్లే విషయాన్ని క్రొయేషియా ఫుట్‌బాల్ సంఘం అధికారికంగా ధ్రువీకరించలేదు. తొలి మ్యాచ్‌లో క్రొయేషియా 2-0తో నైజీరియాపై గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఇటలీ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు ఏసీ మిలాన్ తరపున 41 మ్యాచ్‌లు ఆడిన నికోలా ఆరు గోల్స్ చేశాడు. కాగా, ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగో అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయిన నికొలా.. తనకు వెన్ను గాయంతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఆ క్రమంలోనే ఆదేశాలు పాటించని నికోలా.. కోచ్ ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. -
ప్రపంచకప్‌లో క్రొయేషియా శుభారంభం
-
రెండు దశాబ్దాల తర్వాత...
కలినిన్‌గ్రాడ్: రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లోనే క్రొయేషియా జట్టు విజయం రుచిని చూసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో క్రొయేషియా 2–0తో నైజీరియాను ఓడించింది. నైజీరియా ఆటగాడు ఒగెనెకరో ఎటెబో చేసిన సెల్ఫ్ గోల్‌తో క్రొయేషియా ఖాతా తెరువగా... 71వ నిమిషంలో కెప్టెన్ మోడ్రిక్ గోల్‌తో క్రొయేషియా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల ఆటగాళ్లు దీటుగా కదంతొక్కుతున్న సమయంలో అనూహ్యంగా ఎటెబో తమ గోల్‌పోస్ట్‌లోకే గోల్ కొట్టాడు. ఆట 32వ నిమిషంలో అంటె రెబిక్, మరియో మండ్‌జుకిక్‌నుంచి బంతిని అందుకునే క్రమంలో ఫస్ట్–హాఫ్ కార్నర్ వద్ద ఎటెబో నుంచి బంతి గోల్‌పోస్ట్‌లోకి చేరడంతో నైజీరియాకు సొంతదెబ్బ తగిలింది. దీంతో క్రొయేషియా అయాచిత వరంతో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. నైజీరియా స్ట్రయికర్లను అదేపనిగా ప్రత్యర్థి డిఫెండర్లు నిలువరించారు. దీంతో డెజన్ లొవ్రెన్, ఒడియన్ ఇగాలో గోల్ ప్రయత్నాలన్నీ నీరుగారాయి. క్రొయేషియా డిఫెండర్లు అలెక్స్ ఐవోబి, బ్రియాన్ ఇడోవులు ప్రత్యర్థి అవకాశాల్ని సమర్థంగా దెబ్బతీశారు. ఫలితంగా 59వ నిమిషంలోగానీ నైజీరియా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై షాట్ కొట్టకపోవడం గమనార్హం. నైజీరియా డిఫెండర్ విలియమ్ ట్రూస్ట్ ఎకాంగ్... కార్నర్ వద్ద క్రొయేషియా ఫార్వర్డ్ ఆటగాడు మరియో మండ్‌జుకిక్‌ను దురుసుగా కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. ఆట 71వ నిమిషంలో మోడ్రిక్ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌గా మలచడంతో క్రొయేషియా 2–0తో జయభేరి మోగించింది. 2 వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ క్రొయేషియా జట్టు ‘సెల్ఫ్ గోల్’తో ఖాతా తెరువడం విశేషం. 2014లో క్రొయేషియాపై బ్రెజిల్ ప్లేయర్ మార్సెలో సెల్ఫ్ గోల్ చేయగా... ఈసారి ఎటెబో సాధించాడు. 1 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ‘సెల్ఫ్ గోల్’ చేసిన ఏకైక జట్టుగా నైజీరియా నిలిచింది. చివరిసారి 2014 ప్రపంచకప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ జట్టుపై ఇదే విధంగా నైజీరియా సెల్ఫ్ గోల్ సాధించింది. 1 ఇరవై ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం క్రొయేషియాకిదే తొలిసారి. చివరిసారి 1998లో అరంగేట్రం మ్యాచ్‌లో క్రొయేషియా 3–1తో జమైకాను ఓడించింది. -
ప్రేమయాత్రలో 14వేల కిలోమీటర్లు...
బ్కోడ్స్కా వారోస్, క్రొయేషయా : ప్రేమ ఎంత గొప్పదంటే అనాముకుడిని సైతం ఆకాశమంతా ఎత్తు ఎదిగేలా చేస్తుంది. పిరికివారిని సైతం గొప్ప సాహసికులుగా మారుస్తుంది. దూర, భారాల్ని సైతం లెక్కచేయదు. ప్రేమకున్న శక్తే అలాంటిది. అందుకే క్లెపెతాన్ ప్రతి ఏడాది శీతాకాలం అయిపోగానే దక్షిణాఫ్రిక నుంచి 14వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తూర్పు క్రొయేషియాలోని బ్రోడ్స్కి వారోస్ గ్రామంలో ఉన్న తన ప్రియురాలు మలేనాను కలుసుకుంటాడు. శీతకాలం అయిపోగానే రావడం ఏంటి, ఎప్పుడు మలేనా దగ్గరే ఉండొచ్చు కదా అంటే శీతకాలం కొంగలకు క్రొయేషియా అనుకూలమైన తావు కాదు. అవును మలేనా, క్లెపెతాన్ రెండు కొంగలు. మరి మలేనా కూడా క్లెపెతాన్తో దక్షిణాఫ్రికా వెళ్లొచ్చు కదా అనుకుంటే అది కుదరరు. ఎందుకంటే మలేనా వికలాంగురాలు. మనుషులకే ఆదర్శంగా నిలిచిన ఈ ప్రేమ కొంగలు తూర్పు క్రొయేషియాలోని ఒక రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు స్టెపెన్ వోకిక్ ఇంట్లో జతకట్టాయి. ఓసారి వీటి ప్రేమకథను వినమంటున్నాడు వోకిక్. కొన్నాళ్ల క్రితం వోకిక్కి తన ఇంటి దగ్గరలోని చెరువు వద్ద గాయాలతో ఉన్న ఆడకొంగ మలేనా కనిపించింది. వేటగాడు మలేనాను తూపాకీతో కాల్చడం వల్ల మలేనా కాలు విరిగిపోయింది. గాయంతో బాధపడుతున్న మలేనాను వోకిక్ తన ఇంటికి తీసుకువచ్చాడు. దానికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ క్రమంలోనే మలేనా క్లెపెతాన్ రెండు జతయ్యాయి. ఇవి ఇప్పటికే 62 పిల్లలను కూడా చేశాయి. శీతాకాలం క్లెపెతాన్ తూర్పు క్రొయేషియా నుంచి దక్షిణాఫ్రికకు వలస వెళ్తాడు. ఆ సమయంలో వోకిక్ మలేనాకు తన ఇంటిలోనే ఒక గదిలో హీటర్‌ను ఏర్పాటు చేసి వెచ్చగా ఉండేలా చుస్తాడు. వసంత రుతువు మొదలవ్వగానే క్లెపెతాన్ దక్షిణాఫ్రిక నుంచి తూర్పుక్రొషియాకి వస్తాడు. వేసవిలో ఈ ప్రేమ జంట కోసం వోకిక్ తన ఇంటి పైన వసతిని ఏర్పాటు చేస్తాడు. ఇప్పటి నుంచే క్లెపెతాన్ తన పిల్లలకు ఎగరడంలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ సారి ఆగస్టులో తన పిల్లలతో కలిసి ఈ మగ కొంగ దక్షిణాఫ్రికకు వలస వెళ్లనుంది. ఈ ప్రేమ పక్షులు ప్రస్తుతం క్రొయేషియాలో సెలబ్రటీలయ్యాయి. 1993లో వోకిక్ మలేనాను తన ఇంటికి తీసుకువచ్చాడు. నాటి నుంచి నేటి వరకూ మలేనా వోకిక్తో పాటే కలసి ఉంటుంది. వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. వోకిక్ తనతోపాటు మలేనాను చేపలుపట్టడానికి తీసుకువెళ్తాడు, ఇద్దరూ కలిసి టీవీ కూడా చూస్తారు. మలేనా పూర్తి బాధ్యత నాదే అంటున్నారు వోకిక్. క్రొయేషియాలో దాదాపు 1500 జతల తెల్ల కొంగలు ఉన్నాయి. సెంట్రల్ క్రొయేషియాలోని సిగాక్ 1994లో తొలి కొంగల గ్రామంగా పొందింది. ప్రస్తుతం బోడ్స్కా వారోస్ గ్రామంలో 210 పక్షులు ఉన్నాయి. ఇవి గ్రామస్తుల ఇళ్ల పైన ఏర్పాటుచేసుకున్న తమ గూళ్లలో నివసిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనుషుల సంఖ్య కన్నా రెట్టింపుగా పక్షుల సంఖ్య ఉండటం గమనార్హం. -
అర్జెంటీనా అదుర్స్...
ఎట్టకేలకు డేవిస్‌కప్ సొంతం ఐదో ప్రయత్నంలో సఫలం ఫైనల్లో క్రొయేషియాపై 3-2తో గెలుపు జాగ్రెబ్ (క్రొయేషియా): ఒకటి కాదు... రెండు కాదు.. మూడు కాదు... ఏకంగా నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నా... ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరిస్తోన్న డేవిస్ కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అర్జెంటీనా సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో అర్జెంటీనా 3-2తో క్రొయేషియాపై విజయం సాధించింది. చివరిరోజు జరిగిన రెండు రివర్స్ సింగిల్స్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు గెలిచి తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. 1-2తో వెనుకబడి ఆదివారం తొలి రివర్స్ సింగిల్స్‌లో బరిలోకి దిగిన అర్జెంటీనాకు 2009 యూఎస్ ఓపెన్ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. 4 గంటల 53 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డెల్‌పొట్రో 6-7 (4/7), 2-6, 7-5, 6-4, 6-3తో 2014 యూఎస్ ఓపెన్ చాంపియన్ మారిన్ సిలిచ్‌ను ఓడించాడు. దాంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ మ్యాచ్‌లో సిలిచ్ 34 ఏస్‌లు సంధించి, 79 అనవసర తప్పిదాలు చేయగా... డెల్‌పొట్రో 16 ఏస్‌లు కొట్టి, 48 అనవసర తప్పిదాలు చేశాడు. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ ఫెడెరికో డెల్బోనిస్ 6-3, 6-4, 6-2తో ప్రపంచ 20వ ర్యాంకర్ ఇవో కార్లోవిచ్‌ను ఓడించి అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 1920లో నార్మన్ బ్రూక్స్ (43 ఏళ్లు) తర్వాత డేవిస్ కప్ మ్యాచ్‌లో ఆడుతున్న రెండో పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందిన 37 ఏళ్ల కార్లోవిచ్ కీలకపోరులో క్రొయేషియాను ఆదుకోలేకపోయాడు. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 104 కేజీల బరువున్న కార్లోవిచ్ ఈ మ్యాచ్‌లో 42 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు డెల్బోనిస్ నాలుగుసార్లు కార్లోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నాడు. గతంలో అర్జెంటీనా 1981, 2006, 2008, 2011లలో ఫైనల్‌కు చేరుకున్నా ఓడిపోరుు రన్నరప్‌గా నిలిచింది. 116 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో విజేతగా నిలిచిన 15వ జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. అమెరికా అత్యధికంగా 35 సార్లు డేవిస్‌కప్ టైటిల్‌ను సాధించింది. -
స్పెయిన్‌కు షాక్
► క్రొయేషియా సంచలన విజయం ► ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం యూరో ఫుట్‌బాల్ టోర్నీ. పారిస్: వరుసగా మూడోసారి ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ జట్టుకు చివరి లీగ్ మ్యాచ్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో క్రొయేషియా జట్టు 2-1 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టును బోల్తా కొట్టించింది. ఈ విజయంతో క్రొయేషియా ఏడు పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలువడంతోపాటు ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. చివరి మ్యాచ్‌లో ఓడినప్పటికీ... తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో నెగ్గిన స్పెయిన్ ఆరు పాయింట్లతో నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. యూరో టోర్నీలలో వరుసగా 14 మ్యాచ్‌ల తర్వాత స్పెయిన్‌కు ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన స్పెయిన్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా పటిష్టమైన ఇటలీ ఎదురుకానుంది. పెనాల్టీని వృథా చేసిన రామోస్ గ్రూప్ టాపర్‌గా నిలవాలంటే స్పెయిన్ కనీసం డ్రా చేసుకుంటే సరిపోయేది. కానీ ఆ జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. ఆట ఏడో నిమిషంలో అల్వారో మొరాటా చేసిన గోల్‌తో స్పెయిన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 45వ నిమిషంలో కాలినిచ్ గోల్‌తో క్రొయేషియా 1-1తో స్కోరును సమం చేసింది. 72వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కిక్ రూపంలో సువర్ణావకాశం దక్కింది. అయితే కెప్టెన్ సెర్గియో రామోస్ కొట్టిన షాట్‌ను క్రొయేషియా గోల్‌కీపర్ డానియెల్ సుబాసిచ్ నిలువరించాడు. 87వ నిమిషంలో పెరిసిచ్ చేసిన గోల్‌తో క్రొయేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్పెయిన్‌ను నిలువరించి ఆ జట్టుపై 22 ఏళ్ల తర్వాత మరో విజయాన్ని సొంతం చేసుకుంది. టర్కీ ఆశలు సజీవం: గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో టర్కీ 2-0తో చెక్ రిపబ్లిక్‌పై గెలిచి తమ నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. టర్కీ తరఫున బురాక్ యిల్మాజ్ (10వ నిమిషంలో), ఒజాన్ తుఫాన్ (65వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ ఓటమితో చెక్ రిపబ్లిక్ యూరో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. -
పాపం.. పసివాళ్లు!