ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య రష్యా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శనివారం క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. నిర్ణీత సమయంలో(అదనపు సమయంతో కలుపుకుని) రష్యా, క్రొయేషియా జట్లు తలో రెండు గోల్స్ చేశాయి. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.