Four-Unbeatable Football Players Become Standing Pillars to Croatia Team - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: క్రొయేషియా బలం ఆ నలుగురే.. సైలెంట్‌ అనిపించే వయొలెంట్‌ కిల్లర్స్‌

Dec 13 2022 1:15 PM | Updated on Dec 13 2022 1:47 PM

Meet Four-Unbeatable Footballers Become Standing Pillars Croatia Team - Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా దూసుకెళ్తుంది. కేవలం 40 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా జట్టు సాకర్‌‌‌‌లో అద్భుతాలు చేస్తోంది. నాలుగేండ్ల కిందట అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఫైనల్‌‌‌‌ వరకు వచ్చిన క్రొయేషియన్లు ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తూ దూసుకొస్తున్నారు. పలు మేటి జట్లకు చెక్‌‌‌‌ పెడుతున్నారు.2018లో ఫ్రాన్స్‌‌‌‌ చేతిలో ఓడి కొద్దిలో టైటిల్‌‌‌‌ చేజార్చుకున్న క్రొయేషియా ఈసారి ఎలాగైనా వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అవ్వాలన్న సంకల్పంతో ఉంది. శుక్రవారం జరగనున్న సెమీఫైనల్లో బలమైన అర్జెంటీనాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరాలని భావిస్తోంది.

క్రొయేషియా జట్టులో లుకా మోడ్రిచ్‌ ‌‌‌కీలక ఆటగాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ లూకా మోడ్రిచ్ ఒక్కడితోనే జట్టు మొత్తం నడవడం లేదు. మోడ్రిచ్‌కు అండగా జట్టులో నలుగురు ఆటగాళ్లు మూలస్తంభాల్లా నిలబడ్డారు. ఆ నలుగురే  ఇవాన్‌ పెరిసిక్‌(మిడ్‌ ఫీల్డర్‌), మార్సిలో బ్రొజోవిక్‌(మిడ్‌ ఫీల్డర్‌), డెజన్‌ లొవ్‌రెన్‌(డిఫెండర్‌), డొమినిక్‌ లివకోవిచ్‌‌‌‌(గోల్‌ కీపర్‌). సైలెంట్‌గా కనిపించే ఈ నలుగురు వయొలెంట్‌ కిల్లర్స్‌.

గత ఎడిషన్​ మాదిరిగానే క్రొయేషియన్లు సైలెంట్‌‌‌‌ కిల్లర్స్‌‌‌‌గా ఒక్కో అడుగు వేస్తున్నారు. ప్రిక్వార్టర్స్‌‌‌‌లో జపాన్‌‌‌‌ జోరుకు చెక్‌‌‌‌ పెట్టి.. క్వార్టర్స్‌‌‌‌లో ఐదుసార్లు చాంపియన్‌‌‌‌ బ్రెజిల్‌‌‌‌ను దెబ్బకొట్టడంతో ప్లేయర్ల కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరిగింది. క్రొయేషియా టీమ్‌‌‌‌లో మోడ్రిచ్‌‌‌‌ కీలకం. ఈ టోర్నీలో తను ఒక్క గోల్‌‌‌‌ కూడా కొట్టలేదు. అయినా టీమ్‌‌‌‌ మొత్తం అతని చుట్టూనే తిరుగుతోంది. మిడ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌లో అంతా సవ్యంగా ఉండేలా చేయడంతో పాటు చివరి నిమిషం వరకు తోటి ప్లేయర్లంతా పోరాడేలా చేస్తున్నాడు. 2018 టోర్నీ మాదిరిగా నాకౌట్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ను ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌కు తీసుకెళ్లి ప్రత్యర్థుల పని పడుతోంది.తమ బలమైన డిఫెన్స్‌‌‌‌నే ప్రధానంగా ఉపయోగిస్తూ  ఫలితాన్ని రాబడుతోంది. 

అయితే ఈ నలుగురు పుట్టుకతోనే గొప్పవాళ్లు ఏమీ కాలేదు. ఒక్కోక్కరిది ఒక్కో కథ.. వ్యధ. ఒకరు చికెన్‌ ఫార్మ్‌లో పనిచేస్తే.. మరొకడు కసాయి తండ్రి వద్ద పెరిగాడు. ఇంకొకడు చదువును మధ్యలోనే ఆపేశాడు.. ఇలా నలుగురు తమ చిన్నతనంలోనే ఎంతో కష్టాలు అనుభవించారు. లూకా మోడ్రిచ్‌ గురించి పరిచయం అవసరం లేకపోయినా ఈ నలుగురిపై మాత్రం ఒక లుక్కేయండి.

ఇవాన్‌ పెరిసిక్‌(మిడ్‌ ఫీల్డర్‌)


క్రొయేషియా జట్టులో కీలక మిడ్‌ఫీల్డర్‌గా ఇవాన్‌ పెరిసిక్‌ కొనసాగుతున్నాడు. జట్టు డిఫెన్స్‌ ఇంత పటిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం ఇవాన్‌ పెరిసిక్‌. అయితే తన చిన్నతనం నుంచి ఇవాన్‌ పెరిసిక్‌ చికెన్‌ ఫార్మ్స్‌లో పనిచేశాడు. బీచ్‌ వాలీబాల్‌లో ఆరితేరిన ఇవాన్‌ పెరిసిక్‌ ఆ తర్వాత ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఎన్నో కష్టాలకోర్చి స్థానిక లోకల్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఫుట్‌బాల్‌లో ఎదిగాడు. 2011లో ఇవాన్‌ పెరిసిక్‌ తొలిసారి క్రొయేషియా ఫుట్‌బాల్‌ టీంలో చోటు దక్కింది. అప్పటినుంచి జట్టులో కీలక మిడ్‌ఫీల్డర్‌గా కొనసాగుతున్నాడు.

డొమినిక్‌ లివకోవిచ్‌(గోల్‌ కీపర్‌)


ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా ప్రతీ మ్యాచ్‌ను పెనాల్టీ దశ వరకు తీసుకెళ్తుందంటే అదంతా గోల్‌ కీపర్‌ డొమినిక్‌ లివకోవిచ్‌ చలవే. ముఖ్యంగా బ్రెజిల్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో నాలుగుసార్లు గోల్‌ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో డొమినిక్‌ లివకోవిచ్‌ పేరు మార్మోగిపోయింది. ప్రత్యర్థి ఎంత బలమైన జట్టు అయినా.. తన వరకు బంతి వచ్చిందంటే అది కచ్చితంగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా అడ్డుపడడం లివకోవిచ్‌ స్పెషాలిటీ.  అయితే డొమినిక్‌ లివకోవిచ్‌ ఫుట్‌బాల్‌లోకి రాకముందు బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా రాణించాడు. 

డెజన్‌ లొవ్‌రెన్‌(డిఫెండర్‌)


క్రొయేషియా జట్టులో ఢిపెన్స్‌ విభాగంలో డెజన్‌ లొవ్‌రెన్‌ కీలకం. ప్రత్యర్థి ఆటగాళ్లకు బంతి చిక్కకుండా తన డిఫెన్స్‌తో పాస్‌లు అందించడంలో డెజన్‌ లొవ్‌రెన్‌ది ప్రత్యేక స్టైల్‌. ఇవాళ స్టార్‌గా వెలుగొందుతున్న డెజన్‌ లొవ్‌రెన్‌ జీవితం కాస్త డిఫరెంట్‌. యుగోస్లేవియా యుద్ధం కారణంగా డెజన్‌కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు బొస్‌నియన్‌ సిటీకి వలస వచ్చారు. ఏడేళ్ల పాటు అక్కడే పెరిగాడు. ఆ తర్వాత 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫ్యామిలీకి జర్మనీలో ఉండేదుకు అనుమతి రాలేదు. వెంటనే క్రొయేషియాకు వెళ్లిపోవాలని ఆదేశించారు. అలా ఉన్నపళంగా పిల్లలను తీసుకొని క్రొయేషియాలో స్థిరపడ్డారు. అయితే డెజన్‌కు క్రొయేషియా భాష మాట్లాడడం రాదు. దీంతో స్కూల్లో అందరు డెజన్‌ను హేళన చేసేవారు. అయితే క్రమంగా క్రొయేషియా లాంగ్వేజ్‌పై మంచి పట్టు సాధించాడు. 

మార్సిలో బ్రొజోవిక్‌(మిడ్‌ఫీల్డర్‌)


మార్సిలో బ్రొజోవిక్‌ కసాయి త​ండ్రి పెంపకంలో పెరిగాడు. ఫుట్‌బాల్‌ ఆడాలనుకుంటే స్కూల్‌ను వదిలేయాలన్నాడు. ఫుట్‌బాల్‌పై ఇష్టంతో మధ్యలోనే స్కూల్‌ మానేశాడు. దీంతో క్రొయేషియా భాష తప్పిస్తే మరే ఇతర లాంగ్వేజ్‌లోమాట్లడలేడు. ఇంగ్లీష్‌పై కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. ఇవాళ స్టార్‌గా వెలుగొందుతున్న మార్సిలో బ్రొజోవిక్‌ తాను ఎప్పటికైనా ఇంగ్లీష్‌ నేర్చుకొని మాట్లాడి తీరుతానని పేర్కొన్నాడు. 

ఇక లూకా మోడ్రిచ్‌ ఇవాళ వరల్డ్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ సాకర్‌‌‌‌ స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.  ఈ క్రమంలో సెమీస్‌‌‌‌లో అర్జెంటీనా అడ్డుదాటి ముందుకెళ్లాలని చూస్తోంది. గత ఎడిషన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను చిత్తు చేయడం గమనార్హం. అందుకే మెస్సీ సేన ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి క్రొయేషియాను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది.

చదవండి: 'మెస్సీ ఆటను ఎంజాయ్‌ చేస్తున్నాం.. చర్చ అవసరమా?'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement