ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ బృందం ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్థరాత్రి క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో 3-0తో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. కీలకమైన నాకౌట్స్‌లో బ్రెజిల్, జపాన్ లాంటి మేటి జట్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే క్రొయేషియా.. అర్జెంటీనాతో జరిగిన సెమీస్‌లో మాత్రం తోకముడిచింది. మెస్సీ బృందం క్లాస్ ఆటతీరుకు ఆ జట్టు వద్ద సమాధానం లేకుండా పోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడిన లుకా మోడ్రిక్ బృందం సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టింది.
అయితే అర్జెంటీనా మాత్రం క్రొయేషియాపై తమ ప్రతీకారం తీర్చుకుంది. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా, క్రొయేషియాలు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. లీగ్ దశలో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాకు షాక్ ఇచ్చింది. అప్పటి మ్యాచ్‌లో లుకా మోడ్రిక్ సహా మరో ఇద్దరు ఆటగాళ్లు కలిసి మూడు గోల్స్ కొట్టగా.. మెస్సీ సేన మాత్రం ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. ఆ తర్వాత అర్జెంటీనా ప్రీక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.
2018 ఫిఫా వరల్డ్‌కప్: అర్జెంటీనాపై గెలుపు.. క్రొయేషియా సంబరాలు
సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా క్రొయేషియాను కీలక నాకౌట్ దశలో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. యాదృశ్చికంగా అర్జెంటీనా కూడా 3-0 తేడాతోనే క్రొయేషియాను మట్టికరిపించింది. ఈసారి మెస్సీ ఒక గోల్ కొట్టగా.. అల్వరేజ్ రెండో గోల్స్ నమోదు చేశాడు. అలా 2018 ఓటమికి దెబ్బకు దెబ్బ తీసిన మెస్సీ బృందం లెక్కను సరిచేసింది.
చదవండి: Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు'
3️⃣ strikes that powered #Messi𓃵 & Co.'s dream of reaching #Qatar2022 final 👏
— JioCinema (@JioCinema) December 13, 2022
Watch all the goals from #ARGCRO & stay tuned to the #WorldsGreatestShow on #JioCinema & #Sports18 📺📲#FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/gUWKbJGbJl
Comments
Please login to add a commentAdd a comment