Luka Modric
-
చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం మూడోస్థానం కోసం మొరాకోతో జరిగని ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 2-1 తేడాతో క్రొయేషియా ఘన విజయం సాధించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జట్టు కెప్టెన్ లుకా మోడ్రిక్ తన కెరీర్లో చివరి ఫిఫా వరల్డ్‌కప్ ఆడేసినట్లే. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో క్రొయేషియాను నడిపించిన లుకా మోడ్రిక్ ఒకసారి రన్నరప్, మరోసారి మూడో స్థానంలో నిలిపాడు. టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయాడు లుకా మోడ్రిక్. అయినా కూడా ఈ క్రొయేషియా స్టార్ తన ఆటతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫుట్‌బాల్ స్టార్స్ తర్వాత మరో పేరు బాగా మార్మోగింది. ఆమెనే క్రొయేషియా మోడల్ ఇవానా నోల్. ఖతర్‌లో పొట్టి దుస్తులు వేసుకోవాన్ని ఆ దేశం బహిష్కరించనప్పటికి ఇవానా నోల్ మాత్రం పొట్టి బట్టలు ధరించి క్లీవేజ్ షో చేస్తూ అందాల ఆరబోతను ప్రదర్శించింది. తనకు ఖతర్ అధికారుల నుంచి అనుమతి ఉందని.. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని స్టేడియానికి వచ్చినట్లు ఇవానా పేర్కొంది. ఇక తాజాగా శనివారం క్రొయేషయా, మొరాకోల మధ్య జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో మరోసార దర్శనమిచ్చింది. అయితే ఈసార అందాల ప్రదర్శన కాకుండా తన ఫెవరెట్ అయిన.. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిక్ కోసం మ్యాచ్‌కు వచ్చిందంట. అందుకు తగ్గట్లుగానే లుకా మోడ్రిక్ పేరున్న ప్రత్యేక ఔట్‌ఫిట్‌ను వేసుకొచ్చింది. ఈ సందర్భంగా లుకా మోడ్రిక్కు స్పెషల్ థాంక్స్ చెబుతూ.. థాంక్యూ కెప్టెన్ లుకా మోడ్రిక్.. మన దేశం గర్వించేలా చేశారు. ఇక మూడోప్లేస్లో నిలిచి మెడల్ అందుకోవడమే తరువాయి. ఇంకెందుకు ఆలస్యం పని కానిచ్చేయండి అంటూ రాసుకొచ్చింది. ఇవానా నోల్ కోరికను క్రొయేషియా నిలబెట్టింది. మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-1తేడాతో గెలిచి ఈ వరల్డ్‌కప్‌ను మూడోస్థానంతో ముగించింది క్రొయేషియా జట్టు. ఏది ఏమైనా ఈసారి మాత్రం ఇవానా నోల్ తన అందచందాలతో ప్రత్యేకంగా నిలిచింది. చదవండి: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ను క్రొయేషియా మూడోస్థానంతో ముగించింది. శనివారం మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో క్రొయేషియా.. మొరాకోను 2-1 తేడాతో ఓడించింది. క్రొయేషియా తరపున ఆట 7వ నిమిషంలో జోస్కో గ్వార్డియోల్, ఆట 42వ నిమిషంలో మిస్లావ్ ఓర్సిక్ గోల్స్ చేశారు. ఇక మొరాకో తరపున ఆట 9వ నిమిషంలో అచ్రఫ్ డారీ గోల్ చేశాడు. అయితే ఆట తొలి అర్థభాగంలోనే ఇరుజట్లు గోల్స్ చేశాయి. రెండో అర్థభాగంలో గోల్స్ కోసం ప్రయత్నించినప్పటికి సఫలం కాలేకపోయాయి. ఇక గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో తొలిసారి సెమీస్ చేరి సంచలనం సృష్టించింది. గ్రూప్ దశలో బెల్జియం.. నాకౌట్స్‌లో పోర్చుగల్, స్పెయిన్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకున్న మొరాకో డిఫెడింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఆదివారం(డిసెంబర్ 18న) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగే ఫైనల్‌తో మెగాటోర్నీ ముగియనుంది. -
అల్విదా 'లుకా మోడ్రిక్'.. నాయకుడంటే నీలాగే
లుకా మోడ్రిక్.. ఈతరం ఫుట్‌బాల్ స్టార్స్‌లో ఒకడు. మెస్సీ, రొనాల్డో లాగా పాపులారిటీ లేనప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను లుకా మోడ్రిక్ నడిపిన తీరు అద్బుతమని చెప్పొచ్చు. వరుసగా రెండు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అసాధారణ ఆటతీరు కనబరిచి అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ మోడ్రిక్ జట్టును అన్నీ తానై నడిపించాడు. నాయకుడంటే ఇలాగే ఉండాలి అనే పదానికి నిర్వచనంగా నిలిచాడు లుకా మోడ్రిక్. 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించిన లుకా మోడ్రిక్ తొలి రెండు వరల్డ్‌కప్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2010, 2014 వరల్డ్‌కప్స్‌లో క్రొయేషియా గ్రూప్ దశలోనే వెనుదిరిగడం మోడ్రిక్ను వెలుగులోకి తీసుకురాలేకపోయింది. ఇక 2014 ఫిఫా వరల్డ్‌కప్.. గ్రూప్ దశలోనే క్రొయేషియా జట్టు వెనుదిరిగింది. కేవలం 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన క్రొయేషియా వచ్చే నాలుగేళ్లలో అద్భుతం చేయబోతుందని అప్పట్లో ఎవరు ఊహించలేదు. 2014 తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మోడ్రిక్ దశ దిశ లేకుండా అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను గాడిలో పెట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్లలో జట్టులో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. మేజర్ టోర్నీలు గెలవకపోయినప్పటికి జట్టును బలంగా తయారు చేయడంలో మాత్రం సఫలమయ్యాడు. ఇక 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా.. ఈసారి కూడా దాదాపు అదే ఫలితాలను రిపీట్ చేసింది. కీలకమైన నాకౌట్స్‌లో బ్రెజిల్, జపాన్ లాంటి మేటి జట్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అలా వరుసగా రెండు వరల్డ్‌కప్స్‌లో ఒకసారి రన్నరప్.. మరోసారి సెమీఫైనల్ వరకు వచ్చిందంటే లుకా మోడ్రిక్ జట్టులో నింపిన చైతన్యం వల్లే అని చెప్పొచ్చు. ఈసారి లుకా మోడ్రిక్తో పాటు గోల్ కీపర్ డొమినిక్ లివకోవిచ్ , ఇవాన్ పెరిసిక్, డెజన్ లొవ్రెన్, మార్సిలో బ్రొజోవిక్లు నాలుగు స్తంభాలుగా మారి క్రొయేషియాను ముందుకు నడిపించారు. 37 ఏళ్ల లుకా మోడ్రిక్ తన చివరి ఫిఫా వరల్డ్‌కప్ ఆడేసినట్లే. క్రొయేషియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా లుకా రికార్డు నెలకొల్పాడు. క్రొయేషియా తరపున 161 మ్యాచ్‌ల్లో 23 గోల్స్ సాధించాడు. మిడ్‌ఫీల్డర్‌గా బాధ్యతలు నిర్వర్తించే లుకా మోడ్రిక్ ఎక్కువ గోల్స్ చేయకపోయినప్పటికి పాస్‌లు అందించడంలో మాత్రం దిట్ట. 2006 నుంచి 16 ఏళ్ల పాటు క్రొయేషియా జట్టుకు సేవలందించిన లుకా మోడ్రిక్.. ఫిఫి వరల్డ్‌కప్ గెలవలేదన్న కోరిక మినహాయిస్తే జీవితంలో అన్నీ చూశాడు. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్ బాల్ అందుకున్న లుకా.. 2018లోనే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డు, యూఈఎఫ్ఏ మెన్స్ ప్లేయర్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇక 2019లో గోల్డెన్ ఫుట్ అవార్డు గెలుచుకున్న లుకా మోడ్రిక్ ఆటకు నీరాజనం పలుకుతూ అతని మలి కెరీర్ కూడా ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం. చదవండి: దెబ్బకు దెబ్బ తీశారు.. లెక్క సరిచేసిన మెస్సీ Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు' Warrior spirit 💪 Still not over for @lukamodric10 & Co. in #Qatar2022 📊 Watch #Croatia vie for a third-place finish at the #FIFAWorldCup once again, Dec 17 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGCRO #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/HjqX7k2qKe — JioCinema (@JioCinema) December 13, 2022 -
దెబ్బకు దెబ్బ తీశారు.. లెక్క సరిచేసిన మెస్సీ
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ బృందం ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్థరాత్రి క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో 3-0తో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. కీలకమైన నాకౌట్స్‌లో బ్రెజిల్, జపాన్ లాంటి మేటి జట్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే క్రొయేషియా.. అర్జెంటీనాతో జరిగిన సెమీస్‌లో మాత్రం తోకముడిచింది. మెస్సీ బృందం క్లాస్ ఆటతీరుకు ఆ జట్టు వద్ద సమాధానం లేకుండా పోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడిన లుకా మోడ్రిక్ బృందం సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టింది. అయితే అర్జెంటీనా మాత్రం క్రొయేషియాపై తమ ప్రతీకారం తీర్చుకుంది. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా, క్రొయేషియాలు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. లీగ్ దశలో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాకు షాక్ ఇచ్చింది. అప్పటి మ్యాచ్‌లో లుకా మోడ్రిక్ సహా మరో ఇద్దరు ఆటగాళ్లు కలిసి మూడు గోల్స్ కొట్టగా.. మెస్సీ సేన మాత్రం ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. ఆ తర్వాత అర్జెంటీనా ప్రీక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. 2018 ఫిఫా వరల్డ్‌కప్: అర్జెంటీనాపై గెలుపు.. క్రొయేషియా సంబరాలు సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా క్రొయేషియాను కీలక నాకౌట్ దశలో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. యాదృశ్చికంగా అర్జెంటీనా కూడా 3-0 తేడాతోనే క్రొయేషియాను మట్టికరిపించింది. ఈసారి మెస్సీ ఒక గోల్ కొట్టగా.. అల్వరేజ్ రెండో గోల్స్ నమోదు చేశాడు. అలా 2018 ఓటమికి దెబ్బకు దెబ్బ తీసిన మెస్సీ బృందం లెక్కను సరిచేసింది. చదవండి: Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు' 3️⃣ strikes that powered #Messi𓃵 & Co.'s dream of reaching #Qatar2022 final 👏 Watch all the goals from #ARGCRO & stay tuned to the #WorldsGreatestShow on #JioCinema & #Sports18 📺📲#FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/gUWKbJGbJl — JioCinema (@JioCinema) December 13, 2022 -
Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా కథ ముగిసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి అదే ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్ వరకు దూసుకొచ్చింది. కానీ సెమీస్‌లో అర్జెంటీనా లాంటి పటిష్టమైన జట్టు ముందు క్రొయేషియా తలవంచింది. మెస్సీ ఆటను కళ్లార్పకుండా చూసిన ఆ జట్టు అతని ఆటకు ఫిదా అయింది. మొత్తానికి 0-3 తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది. క్రొయేషియాను అన్నీ తానై నడిపించిన కెప్టెన్ లుకా మోడ్రిక్కు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించి ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్న జట్టుకు నిరాశే ఎదురైంది. అయినప్పటికి 2014లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన క్రొయేషియాను గాడిలో పెట్టి.. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో నాకౌట్ దశకు తీసుకురావడంలో లుకా మోడ్రిక్ది కీలకపాత్ర. తన కెరీర్లో వరల్డ్‌కప్ లేదన్న మాటే కానీ అతని ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకొని ఫిఫా వరల్డ్‌కప్‌ను ముగించాడు. మ్యాచ్ అనంతరం లుకా మోడ్రిక్ మాట్లాడుతూ మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈరోజు మ్యాచ్ అర్జెంటీనాదే. ముఖ్యంగా మెస్సీ అన్నీ తానై జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం. మ్యాచ్‌లో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ఇవ్వడం నాకు నచ్చలేదు. అది తప్పిస్తే ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌తో కెరీర్‌ను ముగిద్దామనుకున్నా.. ఇప్పుడు అది లేకుండానే వెళ్లిపోతున్నా. ఈసారి మెస్సీదే వరల్డ్‌కప్.. టైటిల్ కచ్చితంగా కొడతాడన్న నమ్మకం నాకుంది. ఒక దిగ్గజ ప్లేయర్ ఈ ఘనత సాధించి ఆటకు వీడ్కోలు పలికితే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అర్జెంటీనా జట్టులో నాకు మెస్సీ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతావాళ్లు బాగా ఆడుతున్నప్పటికి మెస్సీనే నా ఫెవరెట్. ఆల్ ది బెస్ట్ అర్జెంటీనా అండ్ మెస్సీ.'' అంటూ పేర్కొన్నాడు. 🎙️ Luka Modrić: “I hope Lionel Messi wins this World Cup, he is the best player in history and he deserves it.” 🇭🇷🤝🇦🇷#FIFAWorldCup pic.twitter.com/w3VEGdXnDd — Football Tweet ⚽ (@Football__Tweet) December 13, 2022 చదవండి: ఆదిలోనే సౌదీ చేతిలో ఓటమి! ఎట్టకేలకు ఇలా.. మెస్సీ పోస్ట్ వైరల్