ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా కథ ముగిసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి అదే ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్ వరకు దూసుకొచ్చింది. కానీ సెమీస్‌లో అర్జెంటీనా లాంటి పటిష్టమైన జట్టు ముందు క్రొయేషియా తలవంచింది. మెస్సీ ఆటను కళ్లార్పకుండా చూసిన ఆ జట్టు అతని ఆటకు ఫిదా అయింది. మొత్తానికి 0-3 తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది.
క్రొయేషియాను అన్నీ తానై నడిపించిన కెప్టెన్ లుకా మోడ్రిక్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించి ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్న జట్టుకు నిరాశే ఎదురైంది. అయినప్పటికి 2014లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన క్రొయేషియాను గాడిలో పెట్టి.. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో నాకౌట్ దశకు తీసుకురావడంలో లుకా మోడ్రిక్‌ది కీలకపాత్ర. తన కెరీర్‌లో వరల్డ్‌కప్ లేదన్న మాటే కానీ అతని ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకొని ఫిఫా వరల్డ్‌కప్‌ను ముగించాడు.
మ్యాచ్ అనంతరం లుకా మోడ్రిక్ మాట్లాడుతూ మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈరోజు మ్యాచ్ అర్జెంటీనాదే. ముఖ్యంగా మెస్సీ అన్నీ తానై జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం. మ్యాచ్‌లో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ఇవ్వడం నాకు నచ్చలేదు. అది తప్పిస్తే ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌తో కెరీర్‌ను ముగిద్దామనుకున్నా.. ఇప్పుడు అది లేకుండానే వెళ్లిపోతున్నా.
ఈసారి మెస్సీదే వరల్డ్‌కప్.. టైటిల్ కచ్చితంగా కొడతాడన్న నమ్మకం నాకుంది. ఒక దిగ్గజ ప్లేయర్ ఈ ఘనత సాధించి ఆటకు వీడ్కోలు పలికితే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అర్జెంటీనా జట్టులో నాకు మెస్సీ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతావాళ్లు బాగా ఆడుతున్నప్పటికి మెస్సీనే నా ఫెవరెట్. ఆల్ ది బెస్ట్ అర్జెంటీనా అండ్ మెస్సీ.'' అంటూ పేర్కొన్నాడు.
🎙️ Luka Modrić: “I hope Lionel Messi wins this World Cup, he is the best player in history and he deserves it.” 🇭🇷🤝🇦🇷#FIFAWorldCup pic.twitter.com/w3VEGdXnDd
— Football Tweet ⚽ (@Football__Tweet) December 13, 2022
చదవండి: ఆదిలోనే సౌదీ చేతిలో ఓటమి! ఎట్టకేలకు ఇలా.. మెస్సీ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment