Fans Flood Buenos Aires Streets After Argentina Reach World Cup Final - Sakshi
Sakshi News home page

FIFA WC 2022 Final: ఫైనల్‌ చేరాం చాలు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు! అంబరాన్నింటిన సంబరాలు

Published Wed, Dec 14 2022 10:05 AM | Last Updated on Wed, Dec 14 2022 12:57 PM

FIFA WC 2022: Fans Flood Buenos Aires Streets After Argentina Reach Final - Sakshi

FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi- Final: అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో ఆ దేశ ప్రజల సంబరాలు అంబరాన్నంటాయి. రాజధాని బ్యూనో ఎయిర్స్‌ వీధులు మొత్తం జనసంద్రంతో నిండిపోయాయి. కాగా అర్జెంటీనా కెప్టెన్‌, స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ వరల్డ్‌కప్‌ కల నెరవేరే క్రమంలో ముందడుగు పడింది. 

ఖతర్‌ వేదికగా జరిగిన మొదటి సెమీ ఫైనల్లో క్రొయేషియాను ఓడించిన అర్జెంటీనా ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ తరుణంలో వేలాది మంది అర్జెంటీనా ప్రజలు తమ జాతీయత ప్రతిబింబించేలా లేత నీలం, తెలుపు రంగుల కలయికతో ఉన్న  జెండాలు ప్రదర్శిస్తూ ఆనందంతో గంతులు వేశారు. మెస్సీ బృందం అందుకున్న చిరస్మరణీయి విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ కేరింతలు కొట్టారు.  

ఈ సందర్భంగా రాయిటర్స్‌తో అభిమానులు మాట్లాడుతూ.. ‘‘ఫైనల్‌ వరకు చేరడమే అత్యుత్తమం. ఆ తర్వాత ఏం జరిగినా పర్లేదు. ఈ సంతోషాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మా ఆనందానికి పట్టపగ్గాల్లేవు.  అర్జెంటీనా ప్రజలంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా సమకాలీన ఫుట్‌బాలర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా అద్బుతమైన రికార్డులు సాధించిన మెస్సీ ఖాతాలో ఒక్క వరల్డ్‌కప్‌ ట్రోఫీ కూడా లేదు. 

అంతేకాదు 35 ఏళ్ల మెస్సీకి ఇదే ఆఖరి ప్రపంచకప్‌ టోర్నీ కానుందన్న తరుణంలో అర్జెంటీనా ఫైనల్‌ చేరడం సంతోషాలను రెట్టింపు చేసింది. ఇక రెండో సెమీ ఫైనల్లో ఫ్రాన్స్‌- మొరాకో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్లో అర్జెంటీనా తలపడనుంది.

చదవండి: Ind Vs Ban: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. తుది జట్లు ఇవే
Sanju Samson: రెచ్చిపోయిన సంజూ శాంసన్‌.. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement