ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ను క్రొయేషియా మూడోస్థానంతో ముగించింది. శనివారం మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో క్రొయేషియా.. మొరాకోను 2-1 తేడాతో ఓడించింది. క్రొయేషియా తరపున ఆట 7వ నిమిషంలో జోస్కో గ్వార్డియోల్, ఆట 42వ నిమిషంలో మిస్లావ్ ఓర్సిక్ గోల్స్ చేశారు. ఇక మొరాకో తరపున ఆట 9వ నిమిషంలో అచ్రఫ్ డారీ గోల్ చేశాడు. అయితే ఆట తొలి అర్థభాగంలోనే ఇరుజట్లు గోల్స్ చేశాయి. రెండో అర్థభాగంలో గోల్స్ కోసం ప్రయత్నించినప్పటికి సఫలం కాలేకపోయాయి.
ఇక గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో తొలిసారి సెమీస్ చేరి సంచలనం సృష్టించింది. గ్రూప్ దశలో బెల్జియం.. నాకౌట్స్‌లో పోర్చుగల్, స్పెయిన్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకున్న మొరాకో డిఫెడింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఆదివారం(డిసెంబర్ 18న) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగే ఫైనల్‌తో మెగాటోర్నీ ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment