goal keeper
-
EURO 2024: కళ్లుచెదిరే గోల్.. 24 ఏళ్ల తర్వాత తొలి విజయం
యూరో కప్-2024ను రొమేనియా ఘనంగా ఆరంభించింది. సోమవారం మ్యూనిచ్ వేదికగా గ్రూపు-ఈలో భాగంగా ఉక్రెయిన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 3-0 తేడాతో రొమేనియా ఘన విజయం సాధించింది. కాగా 24 ఏళ్ల యూరో ఛాంపియన్ షిప్ చరిత్రలో రొమేనియాకు ఇదే తొలి విజయం కావడం విశేషం.కళ్లుచెదిరే గోల్..ఈ మ్యాచ్ ఫస్ట్‌హాఫ్ హోరాహోరీగా సాగింది. తొలి 20 నిమిషాల పాటు ఇరు జట్ల గోల్ కీపర్స్ ఎటువంటి గోల్స్ సాధించేందుకు అవకాశమివ్వలేదు. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్‌లో 29వ నిమిషాన రొమేనియా కెప్టెన్ నికోలే స్టాన్సియు అద్బుతమైన గోల్‌తో మెరిశాడు. రజ్వాన్ మారిన్ నుంచి పాస్ అందుకున్న స్టాన్సియు రైట్ కార్నర్ వైపు నుంచి కళ్లుచెదిరే రీతిలో గోల్ కొట్టాడు. స్టాన్సియు పవర్ ఫుల్ కెనాన్ షాట్‌ను ఉక్రెయిన్ గోల్ కీపర్ ఆండ్రీ లునిన్ ఆపలేకపోయాడు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి రొమినేయా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సెకెండ్ హాఫ్‌లో రజ్వాన్ మారిన్, డెన్నిస్ మాన్ చెరో గోల్ సాధించి రొమేనియాకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. 🇷🇴🚀 This goal from Nicolae Stanciu (31) vs Ukraine is absolutely incredible! 😍Hit with sweet perfection. 🤌 pic.twitter.com/LJGDwsHAJS— EuroFoot (@eurofootcom) June 17, 2024 -
దోపిడి దొంగల బీభత్సం.. గోల్‌కీపర్, అతని భార్యను బంధించి
ఇటలీ గోల్‌కీపర్ గియాన్లుయిగి డోనరుమ్మాకు చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌లోని తన ఇంట్లోకి చొరబడిన దుండగులు 500,000 యూరోల(భారత కరెన్సీలో సుమారు రూ. 4కోట్లకు పైగా) విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. అయితే అడ్డుపడేందుకు ప్రయత్నించి డోనరుమ్మా, అతని భార్యపై దాడి చేసిన దుండగులు వారిని బంధించి అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఇదంతా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుండగులు డోనరుమ్మా ఇంటి నుంచి పారిపోతున్న సమయంలో పక్కన ఉన్న హోటల్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాగా డోనరుమ్మా ఇంట్లో పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం డోనరుమ్మా, అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి చికిత్స నిర్వహించామని.. అయితే తమ కళ్ల ముందే దొంగతనం జరగడంతో కాస్త షాక్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం డోనరుమ్మా పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ క్లబ్)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకముందు ఏసీ మిలన్ క్లబ్‌కు ఆడిన డోనరుమ్మా 2020లో ఇటలీ యూరో టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2021లో పీఎస్జీ క్లబ్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఇక పీఎస్జీ తరపున ఇప్పటివరకు 72 మ్యాచ్‌లాడాడు. పీఎస్జీ రెండుసార్లు లీగ్-1 ట్రోఫీలు గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇటలీ తరపున ఇప్పటివరకు 54 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. Understand Gianluigi Donnarumma will travel to Japan with PSG tomorrow, as planned. Donnarumma and his wife were the victims of a violent burglary, during which they were both tied up. They managed to take refuge in a hotel located not far from their home around 3:20am. pic.twitter.com/IBwBo8tjUC — Fabrizio Romano (@FabrizioRomano) July 21, 2023 చదవండి: 'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి' -
ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్
ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్ పనేంటి అని చూసుకుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే గోల్స్‌ను అడ్డుకోవడం, ఆ తర్వాత బంతిని తన జట్టు ఆటగాళ్లకు పాస్ లేదా సర్వ్ చేయడం. అయితే ఫుట్‌బాల్ చరిత్రలో ఒక సంచలన గోల్ నమోదైంది. గోల్ కీపర్ సర్వ్ చేసిన బంతి నేరుగా ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దాదాపు 101 మీటర్ల దూరం అవతల ఉన్న గోల్‌పోస్ట్‌లోకి బంతి వెళ్లడంతో ఫుట్‌బాల్‌లో అత్యంత లాంగెస్ట్ గోల్‌గా రికార్డులకెక్కింది. ఈ అద్భుతమైన ఫీట్ కొబ్రెసల్, కొలో-కొలో మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆట 77వ నిమిషంలో అర్జెంటీనాకు చెందిన గోల్ కీపర్ లియాండ్రో రెక్వినా బంతిని పాస్ చేయాలనే ఉద్దేశంతో బంతిని కాస్త వేగంగా తన్నాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో ఎత్తులో వెళ్లిన బంతి పెనాల్టీ ఏరియాలో నిలబడిన కొలో-కొలో గోల్ కీపర్ బ్రయాన్ కోర్టస్ను దాటుకొని అతని తలపై నుంచి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఈ దెబ్బకు గోల్ కీపర్ సహా ప్రత్యర్థి ఆటగాళ్లకు దిమ్మతిరిగింది. చేసేదేం లేక గోల్ కీపర్ బ్రయాన్ దానిని గోల్‌గా ప్రకటించాడు. దీంతో కొబ్రెసల్ జట్టు 3-1 తేడాతో కొలో-కొలో జట్టుపై సంచలన విజయం సాధించింది. ఇంతకముందు 2021లో టామ్ కింగ్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ 96.1 మీటర్ల దూరం నుంచి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును గోల్ కీపర్ లియాండ్రో బద్దలుకొట్టాడు. ఈ అద్భుత విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ⚽⚪🟠 El primer gol arco a arco del #CampeonatoBetsson Así fue la anotación de Leandro Requena desde su propia puerta y que dejó a Brayan Cortés quieto, provocando el error del portero albo en el #CSLvsCCxTNTSports. pic.twitter.com/HDL2K22QnS — TNT Sports Chile (@TNTSportsCL) March 18, 2023 చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. -
విషాదం.. లైవ్ మ్యాచ్‌లో ప్రాణాలొదిలిన గోల్ కీపర్
ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది. లైవ్ మ్యాచ్‌లోనే గోల్ కీపర్ ప్రాణాలొదిలాడు. పెనాల్టీ కిక్‌ను సేవ్ చేసిన గోల్‌కీపర్ ఆ మరుక్షణమే ప్రాణం వదలడం అభిమానులను కలచివేసింది. ఈ ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే..బ్రెజిల్‌కు చెందిన సెకండ్ ప్రొవిజనల్ డివిజన్ వెస్ట్ బ్రాబంట్లో వింకిల్ స్పోర్ట్ బి జట్టుకు ఆర్నే ఎస్పీల్ గోల్ కీపర్‌గా సేవలందిస్తున్నాడు. వెస్ట్రోజెబ్కేతో మ్యాచ్‌లో వింకిల్ స్పోర్ట్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. రెండో సగం మరికాసేపట్లో ముగుస్తుందనగా వెస్ట్రోజెబ్కేకు పెనాల్టీ కిక్ లభించింది. అయితే గోల్‌కీపర్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహించిన ఆర్నే స్పిల్ పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్నాడు. అయితే పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్న మరుక్షణమే గ్రౌండ్‌పై కుప్పకూలాడు. ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికి హార్ట్ ఫెయిల్యూర్‌తో అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్నొన్నారు. ఈ వార్త వింకిల్ స్పోర్ట్స్ క్లబ్లో విషాదం నింపింది. చదవండి: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్ కన్నుమూత -
Turkey Earthquake: విషాదం.. గోల్‌కీపర్ కన్నుమూత
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం దాటికి వేలాది మంది మృత్యువాత పడ్డారు. సోమవారం సంభవించిన భూప్రకంపనల్లో వందలాది భవనాలు కుప్పకూలగా.. వాటి శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. ఇప్పటికి రెస్క్యూ బృందం శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీస్తున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, రోదనలే. ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే దాటోచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే టర్కీకి చెందిన 28 ఏళ్ల ఫుట్‌బాలర్.. గోల్‌కీపర్ అహ్మత్ ఎయుప్ తుర్క్‌స్లాన్ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న ఎయుప్ కన్నుమూసినట్లు యేని మాలత్యస్పోర్ ఫుట్‌బాల్ క్లబ్ తన ట్విటర్లో ధృవీకరించింది. మాకు ఇది విషాదకర వార్త. గోల్ కీపర్ ఎయుప్ తుర్క్‌స్లాన్ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న అతన్ని రక్షించలేకపోయాం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ ట్వీట్ చేసింది. 2011లో కెరీర్ ప్రారంభించిన ఎయుప్ తుర్క్‌స్లాన్ అన్ని క్లబ్‌లకు కలిపి 80 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. ఇక ఘనాకు చెందిన మరో ఫుట్‌బాలర్ క్రిస్టియన్ అట్సూ మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు టర్కిష్ ఫుటబాల్ సూపర్ లీగ్ క్లబ్ పేర్కొంది. Başımız sağ olsun! Kalecimiz Ahmet Eyüp Türkaslan, meydana gelen depremde göçük altında kalarak, hayatını kaybetmiştir. Allah rahmet eylesin, mekanı cennet olsun. Seni unutmayacağız güzel insan.😢 pic.twitter.com/15yjH9Sa1H — Yeni Malatyaspor (@YMSkulubu) February 7, 2023 చదవండి: టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాలర్ LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు -
ఆగ్రహం కట్టలు తెంచుకున్న వేళ.. గోల్‌కీపర్‌పై బకెట్‌తో దాడి
A-లీగ్ మెన్ సాకర్ లీగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా శనివారం మెల్బోర్న్ సిటీ, మెల్బోర్న్ విక్టరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రసాబాసగా మారింది. మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లోకి చొచ్చుకొచ్చిన అభిమానులు మెల్బోర్న్ సిటీ గోల్‌కీపర్ టామ్ గ్లోవర్పై బకెట్‌తో దాడికి పాల్పడ్డారు. దీంతో టామ్ గ్లోవర్ తల నుంచి రక్తం కారింది. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్‌లో 1-0తో మెల్బోర్న్ సిటీ ఆధిక్యంలో ఉన్న దశలో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన 20 నిమిషాల వ్యవధిలోనే మెల్బోర్న్ సిటీ గోల్ చేయడం ప్రత్యర్థి అభిమానులకు నచ్చలేదు. పైగా గోల్‌కీపర్ టామ్ గ్లోవర్ తొండిగా ఆడుతున్నాడంటూ మొదటి నుంచి అరుస్తూ వచ్చారు. అయితే ఇంతలో గోల్ నమోదు కావడంతో మెల్బోర్న్ విక్టర్స్ అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఒక్కసారిగా కొంతమంది అభిమానులు గోల్‌కీపర్ టామ్ గ్లోవర్ వైపు దూసుకొచ్చారు. రిఫరీ వచ్చి వద్దొని వారించినా వినకుండా మెటల్ బకెట్‌తో దాడి చేశారు. దీంతో భయాందోళనకు గురైన టామ్ గ్లోవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ తలకు గట్టిగా తగలడంతో రక్తం కారసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గోల్‌కీపర్‌పై దాడి చేయడాన్ని ఫుట్‌బాల్ ఆస్ట్రేలియా ఖండించింది. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఆట అన్నాకా భావోద్వేగాలు సహజం. అయితే అవి హెచ్చుమీరితే ప్రమాదం. టామ్ గ్లోవర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అని పేర్కొంది. Fair to say the Melbourne Derby has kicked-off. Match abandoned. pic.twitter.com/Y3SJ8X2cp4 — Tom Reed (@tomreedwriting) December 17, 2022 చదవండి: Rafael Nadal: 18 ఏళ్ల బంధం తెంచుకున్న నాదల్ -
FIFA WC: వార్నీ వదిలేస్తే మొత్తం తినేసేలా ఉన్నాడు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శనివారం మొరాకో, క్రొయేషియా మధ్య మూడోస్థానం కోసం ప్లేఆఫ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు అంతా సిద్ధం చేసుకున్నాయి. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడో స్థానంలో నిలుస్తుందా లేక తొలిసారి సెమీస్ వరకు అందరి దృష్టిని ఆకర్షించిన మొరాకో జట్టు మూడోస్థానం సాధించి కెరీర్ బెస్ట్‌ను అందుకుంటుందా అనేది చూడాలి. ఈ సంగతి పక్కనబెడితే.. మొరాకో గోల్‌కీపర్ యాసీ బౌనౌ కుమారుడు చేసిన పని సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. పోర్చుగల్‌తో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన అనంతరం యాసీ బౌనౌ తన కుమారుడితో కలిసి ఇంటర్య్వూ ఇచ్చేందుకు వచ్చాడు. యాసీ మాట్లాడుతుండగా.. రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్‌ను ఐస్‌క్రీం అనుకొని నాకడానికి ప్రయత్నించాడు. కానీ అది ఐస్‌క్రీం కాదని తెలుసుకొని వెనక్కి తగ్గాడు. కొడుకు చేసిన పనిని గమనించిన యాసీ బౌనౌకు నవ్వు ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక మొరాకో గోల్‌కీపర్‌గా యాసీ బౌనౌ సూపర్ ఫామ్ కొనసాగించాడు. పెనాల్టీ అడ్డుకోవడంలో మంచి ప్రదర్శన కనబరిచిన యాసీ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అదే ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పెనాల్టీల్లో ఐదింటిని గోల్స్ కాకుండా అడ్డుకున్నాడు. Yassine Bounou's son thinking the 🎤 to be 🍦 is supremely adorable! ❤️ #FIFAWorldCup pic.twitter.com/YTorvQwDvM — FIFA World Cup (@FIFAWorldCup) December 14, 2022 -
క్రొయేషియా బలం ఆ నలుగురే.. సైలెంట్ అనిపించే వయొలెంట్ కిల్లర్స్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా దూసుకెళ్తుంది. కేవలం 40 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా జట్టు సాకర్‌లో అద్భుతాలు చేస్తోంది. నాలుగేండ్ల కిందట అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఫైనల్ వరకు వచ్చిన క్రొయేషియన్లు ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తూ దూసుకొస్తున్నారు. పలు మేటి జట్లకు చెక్ పెడుతున్నారు.2018లో ఫ్రాన్స్ చేతిలో ఓడి కొద్దిలో టైటిల్ చేజార్చుకున్న క్రొయేషియా ఈసారి ఎలాగైనా వరల్డ్ చాంపియన్ అవ్వాలన్న సంకల్పంతో ఉంది. శుక్రవారం జరగనున్న సెమీఫైనల్లో బలమైన అర్జెంటీనాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరాలని భావిస్తోంది. క్రొయేషియా జట్టులో లుకా మోడ్రిచ్ కీలక ఆటగాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ లూకా మోడ్రిచ్ ఒక్కడితోనే జట్టు మొత్తం నడవడం లేదు. మోడ్రిచ్‌కు అండగా జట్టులో నలుగురు ఆటగాళ్లు మూలస్తంభాల్లా నిలబడ్డారు. ఆ నలుగురే ఇవాన్ పెరిసిక్(మిడ్ ఫీల్డర్), మార్సిలో బ్రొజోవిక్(మిడ్ ఫీల్డర్), డెజన్ లొవ్రెన్(డిఫెండర్), డొమినిక్ లివకోవిచ్(గోల్ కీపర్). సైలెంట్‌గా కనిపించే ఈ నలుగురు వయొలెంట్ కిల్లర్స్. గత ఎడిషన్ మాదిరిగానే క్రొయేషియన్లు సైలెంట్ కిల్లర్స్‌గా ఒక్కో అడుగు వేస్తున్నారు. ప్రిక్వార్టర్స్‌లో జపాన్ జోరుకు చెక్ పెట్టి.. క్వార్టర్స్‌లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను దెబ్బకొట్టడంతో ప్లేయర్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. క్రొయేషియా టీమ్‌లో మోడ్రిచ్ కీలకం. ఈ టోర్నీలో తను ఒక్క గోల్ కూడా కొట్టలేదు. అయినా టీమ్ మొత్తం అతని చుట్టూనే తిరుగుతోంది. మిడ్‌ఫీల్డ్‌లో అంతా సవ్యంగా ఉండేలా చేయడంతో పాటు చివరి నిమిషం వరకు తోటి ప్లేయర్లంతా పోరాడేలా చేస్తున్నాడు. 2018 టోర్నీ మాదిరిగా నాకౌట్ గేమ్స్‌ను ఎక్స్ట్రా టైమ్‌కు తీసుకెళ్లి ప్రత్యర్థుల పని పడుతోంది.తమ బలమైన డిఫెన్స్‌నే ప్రధానంగా ఉపయోగిస్తూ ఫలితాన్ని రాబడుతోంది. అయితే ఈ నలుగురు పుట్టుకతోనే గొప్పవాళ్లు ఏమీ కాలేదు. ఒక్కోక్కరిది ఒక్కో కథ.. వ్యధ. ఒకరు చికెన్ ఫార్మ్‌లో పనిచేస్తే.. మరొకడు కసాయి తండ్రి వద్ద పెరిగాడు. ఇంకొకడు చదువును మధ్యలోనే ఆపేశాడు.. ఇలా నలుగురు తమ చిన్నతనంలోనే ఎంతో కష్టాలు అనుభవించారు. లూకా మోడ్రిచ్ గురించి పరిచయం అవసరం లేకపోయినా ఈ నలుగురిపై మాత్రం ఒక లుక్కేయండి. ఇవాన్ పెరిసిక్(మిడ్ ఫీల్డర్) క్రొయేషియా జట్టులో కీలక మిడ్‌ఫీల్డర్‌గా ఇవాన్ పెరిసిక్ కొనసాగుతున్నాడు. జట్టు డిఫెన్స్ ఇంత పటిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం ఇవాన్ పెరిసిక్. అయితే తన చిన్నతనం నుంచి ఇవాన్ పెరిసిక్ చికెన్ ఫార్మ్స్‌లో పనిచేశాడు. బీచ్ వాలీబాల్‌లో ఆరితేరిన ఇవాన్ పెరిసిక్ ఆ తర్వాత ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఎన్నో కష్టాలకోర్చి స్థానిక లోకల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఫుట్‌బాల్‌లో ఎదిగాడు. 2011లో ఇవాన్ పెరిసిక్ తొలిసారి క్రొయేషియా ఫుట్‌బాల్ టీంలో చోటు దక్కింది. అప్పటినుంచి జట్టులో కీలక మిడ్‌ఫీల్డర్‌గా కొనసాగుతున్నాడు. డొమినిక్ లివకోవిచ్(గోల్ కీపర్) ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా ప్రతీ మ్యాచ్‌ను పెనాల్టీ దశ వరకు తీసుకెళ్తుందంటే అదంతా గోల్ కీపర్ డొమినిక్ లివకోవిచ్ చలవే. ముఖ్యంగా బ్రెజిల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో నాలుగుసార్లు గోల్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో డొమినిక్ లివకోవిచ్ పేరు మార్మోగిపోయింది. ప్రత్యర్థి ఎంత బలమైన జట్టు అయినా.. తన వరకు బంతి వచ్చిందంటే అది కచ్చితంగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా అడ్డుపడడం లివకోవిచ్ స్పెషాలిటీ. అయితే డొమినిక్ లివకోవిచ్ ఫుట్‌బాల్‌లోకి రాకముందు బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా రాణించాడు. డెజన్ లొవ్రెన్(డిఫెండర్) క్రొయేషియా జట్టులో ఢిపెన్స్ విభాగంలో డెజన్ లొవ్రెన్ కీలకం. ప్రత్యర్థి ఆటగాళ్లకు బంతి చిక్కకుండా తన డిఫెన్స్‌తో పాస్‌లు అందించడంలో డెజన్ లొవ్రెన్ది ప్రత్యేక స్టైల్. ఇవాళ స్టార్‌గా వెలుగొందుతున్న డెజన్ లొవ్రెన్ జీవితం కాస్త డిఫరెంట్. యుగోస్లేవియా యుద్ధం కారణంగా డెజన్కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు బొస్నియన్ సిటీకి వలస వచ్చారు. ఏడేళ్ల పాటు అక్కడే పెరిగాడు. ఆ తర్వాత 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫ్యామిలీకి జర్మనీలో ఉండేదుకు అనుమతి రాలేదు. వెంటనే క్రొయేషియాకు వెళ్లిపోవాలని ఆదేశించారు. అలా ఉన్నపళంగా పిల్లలను తీసుకొని క్రొయేషియాలో స్థిరపడ్డారు. అయితే డెజన్కు క్రొయేషియా భాష మాట్లాడడం రాదు. దీంతో స్కూల్లో అందరు డెజన్ను హేళన చేసేవారు. అయితే క్రమంగా క్రొయేషియా లాంగ్వేజ్‌పై మంచి పట్టు సాధించాడు. మార్సిలో బ్రొజోవిక్(మిడ్‌ఫీల్డర్) మార్సిలో బ్రొజోవిక్ కసాయి తండ్రి పెంపకంలో పెరిగాడు. ఫుట్‌బాల్ ఆడాలనుకుంటే స్కూల్‌ను వదిలేయాలన్నాడు. ఫుట్‌బాల్‌పై ఇష్టంతో మధ్యలోనే స్కూల్ మానేశాడు. దీంతో క్రొయేషియా భాష తప్పిస్తే మరే ఇతర లాంగ్వేజ్లోమాట్లడలేడు. ఇంగ్లీష్‌పై కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. ఇవాళ స్టార్‌గా వెలుగొందుతున్న మార్సిలో బ్రొజోవిక్ తాను ఎప్పటికైనా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడి తీరుతానని పేర్కొన్నాడు. ఇక లూకా మోడ్రిచ్ ఇవాళ వరల్డ్ బెస్ట్ సాకర్ స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలో సెమీస్‌లో అర్జెంటీనా అడ్డుదాటి ముందుకెళ్లాలని చూస్తోంది. గత ఎడిషన్ గ్రూప్ స్టేజ్‌లో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను చిత్తు చేయడం గమనార్హం. అందుకే మెస్సీ సేన ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి క్రొయేషియాను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. చదవండి: 'మెస్సీ ఆటను ఎంజాయ్ చేస్తున్నాం.. చర్చ అవసరమా?' -
FIFA: క్రొయేషియా గోల్‌కీపర్ సంచలనం.. చరిత్రలోనే తొలిసారి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా సెమీస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా.. బ్రెజిల్‌ను పెనాల్టీ షూటౌట్లో 4-2తో మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో క్రొయేషియా గోల్ కీపర్ డొమినిక్ లివాకోవిచ్ హీరోగా నిలిచాడు. పెనాల్టీ షూటౌట్లో పటిష్టమైన బ్రెజిల్ ఆటగాళ్లు నాలుగుసార్లు గోల్ చేయడానికి ప్రయత్నించగా సమర్థంగా అడ్డుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే నాలుగు పెనాల్టీ షూటౌట్ అడ్డుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదివరకు ఏ గోల్ కీపర్ ఈ ఘనత సాధించలేదు. ఇక పెనాల్టీ షూటౌట్లో వినిసియస్జూనియర్, నెయ్మర్, లుకాస్ పెక్వెటా కొట్టడానికి యత్నించిన గోల్స్‌ను సమర్థంగా అడ్డుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. దీంతో డొమినిక్ లివాకొవిచ్ ఇప్పుడు క్రొయేషియాలో హీరోగా మారిపోయాడు. ఇక నవంబర్ 14న జరగనున్న తొలి సెమీఫైనల్లో అర్జెంటీనాతో క్రొయేషియా అమితుమీ తేల్చుకోనుంది. Livakovic the hero again as Croatia oust Brazil on penalties 🤯 Watch how Zlatko Dalic's side beat the 5-time #FIFAWorldCup champions 🙌 Presented by @Mahindra_Auto Stay tuned to #JioCinema & #Sports18 for more 📺📲#CROBRA #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/gRydVtRRsC — JioCinema (@JioCinema) December 10, 2022 Croatia's hero... again! 🇭🇷🧤#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/w8QroYs2aJ — FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022 చదవండి: Lionel Messi: 'ఏంటి చూస్తున్నావ్.. నీ పని చూసుకో స్టుపిడ్' -
FIFA WC: భర్త వెళ్లిపోయినా.. భార్య మాత్రం ఖతర్‌లోనే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జర్మనీ అనూహ్యంగా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. 2014లో ఛాంపియన్స్ అయిన జర్మనీ వరుసగా రెండోసారి గ్రూప్ దశలోనే వెళ్లిపోవడం సగటు అభిమానిని బాధించింది. అయితే ఓటమికి తోడూ దురదృష్టం కూడా తోడయ్యి జర్మనీని ఇంటిబాట పట్టించింది. కాగా జట్టు ఓటమితో గోల్‌కీపర్ కెవిన్ ట్రాప్స్ సొంత దేశానికి వెళ్లిపోయాడు. అయితే అతని భార్య ఇజాబెల్ గౌలర్ట్ మాత్రం ఖతర్‌లోనే ఉండిపోయింది. అదేంటి భర్త వెళ్లిపోయాడు.. భార్య వెళ్లకపోవడం ఏంటి అనేగా మీ డౌటు. నిజానికి ఇజాబెల్ గౌలర్ట్కు తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న జర్మనీ కంటే ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ జట్టు అంటే ప్రాణం. అంతేకాదు ఇజాబెల్ బ్రెజిల్‌లోనే పుట్టి పెరిగింది. అందుకే తన స్వంత దేశానికి మద్దతు ఇవ్వడం కోసం భర్త వెళ్లిపోయినప్పటికి ఆమె మాత్రం ఖతర్‌లోనే ఉండిపోయింది. ఇక ప్రీక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాతో బ్రెజిల్ తలపడగా.. మ్యాచ్‌కు ఇజాబెల్ గౌలర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రెజిల్ స్టార్ నెమ్మర్ జూనియర్ తండ్రి పక్కన కూర్చొని ఇజాబెల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేసింది. అనుకున్నట్లుగానే బ్రెజిల్ క్వార్టర్స్‌కు చేరడంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. భర్త అనుమతితోనే ఖతర్‌లో ఉండిపోయిన ఇజాబెల్ బ్రెజిల్ విజేతగా నిలిస్తే చూడాలని ఉందని పేర్కొంది. అలా మొత్తానికి తన భర్త వెళ్లిపోయినా.. సొంత దేశానికి మద్దతు ఇవ్వడం కోసం ఇజాబెల్ ఖతర్‌లోనే ఉండిపోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇక దక్షిణ కొరియాను 4-1తో మట్టికరిపించిన బ్రెజిల్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నవంబర్ 9న జరగనున్న క్వార్టర్ఫైనల్లో క్రొయేషియాతో బ్రెజిల్ అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: గాయం సాకుతో బంగ్లా టూర్‌కు దూరం; భార్యను గెలిపించుకున్న జడేజా ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా? -
AIFF: తొలిసారి అధ్యక్షుడిగా ఆటగాడు
న్యూఢిల్లీ: మైదానంలో ఆటగాళ్లు గోల్ కోసం శ్రమిస్తుంటే... కేంద్ర మంత్రి స్థాయి వారు ఫుట్‌బాల్ సంఘంలో ఏళ్ల తరబడి తిష్టవేసి రాజకీయాలు చేశారు. ఇలా ఆటకు సంబంధంలేని వారే 85 ఏళ్ల పాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను ఏలారు. ఏనాడూ మాజీ కెప్టెన్ కానీ, దిగ్గజ ప్లేయర్ కానీ సమాఖ్యలో అధ్యక్ష స్థానంలో లేనే లేరు. దీంతో రాజకీయాలతో మసక బారిన ఏఐఎఫ్ఎఫ్ చివరకు మన ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ఫిఫా’ నిషేధానికి గురైంది. చివరకు రోజుల వ్యవధిలోనే సడలింపుతో ఊపిరి పోసుకున్న ఏఐఎఫ్ఎఫ్కు ఇప్పుడు కొత్త జవసత్వాలు మాజీ ఆటగాడి రూపంలో వచ్చాయి. భారత మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే 85 ఏళ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో అధ్యక్షుడైన ఆటగాడిగా నిలిచారు. మాజీ కెప్టెన్, దిగ్గజం బైచుంగ్ భూటియా ఈ ఎన్నికలో ఓడినప్పటికీ మైదానంలోలాగే ఓ ఆటగాడి చేతిలోనే ఓడాడు. రాజకీయ నాయకుడి చేతిలో కాకపోవడం గొప్ప ఊరట. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 46 ఏళ్ల కల్యాణ్ చౌబే అధ్యక్షుడిగా ఏకపక్ష విజయం సాధించారు. ఆయన 33–1 ఓట్ల తేడాతో భూటియాను ఓడించారు. ఆశ్చర్యకరంగా మాజీ కెప్టెన్‌కు ఒక్క ఓటే రావడం విచిత్రం! భూటియా, ఐఎం విజయన్, లారెన్స్, హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ ఆటగాళ్ల ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగతా 14 మంది ఈసీ మెంబర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ జీపీ ఫల్గుణతో పాటు అవిజీత్ పాల్, పి.అనిల్ కుమార్, వాలంక నటాష, మాలోజి రాజే ఛత్రపతి, మేన్ల ఎతెన్పా, మోహన్ లాల్, ఆరిఫ్ అలీ, కె.నీబౌ సెఖోస్, లాల్గింగ్లోవా, దీపక్ శర్మ, విజయ్ బాలి, ఇంతియాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ కొసరాజు కోశాధికారి పదవి కోసం పోటీపడి 1–32తో కిపా అజయ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతిలో ఓడారు. మంచి గోల్ కీపర్... కల్యాణ్ చౌబే మాజీ గోల్ కీపర్, మంచి గోల్‌కీపర్ కూడా. 1996లో మోహన్ బగాన్ సీనియర్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశారు. తదనంతరం ఈస్ట్ బెంగాల్, జేసీటీ, సాల్గావ్కర్ తదితర క్లబ్‌లకు 2003 ఏడాది వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు జూనియర్ స్థాయిలో భారత అండర్–17, అండర్–20 జట్ల తరఫున ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 1999–2000లో ప్రి–ఒలింపిక్ క్వాలిఫికేషన్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణాసి యా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడుసార్లు విజేతగా నిలువడంలో గోల్‌కీపర్ గా చౌబే కీలకపాత్ర పోషించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 2019లో బీజేపీ తరఫున బెంగాల్లో ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. -
తారాస్థాయికి గొడవ.. కొట్టుకున్న ఆటగాళ్లు
మాంచెస్టర్ సిటీ, క్లబ్ అమెరికా మధ్య బుధవారం అర్థరాత్రి జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ రసాభాసగా మారింది. మెక్సికో లెజెండరీ గోల్ కీపర్ గిల్లెర్మో ఓచోవా, మాంచెస్టర్ సిటీ మిడ్‌ఫీల్డర్ జాక్ గ్రీలిష్ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. ఆట 25వ గోల్ కొట్టే సమయంలో జాక్ గ్రీలిష్కు ఓచోవా అడ్డువచ్చాడు. దీంతో చిర్రెత్తికొచ్చిన జాక్ గ్రీలిష్కు కిందకు తోశాడు. ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నావని.. ప్రత్యర్థి జట్టుకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశాడంటూ వాదించాడు. కిందపడిన ఒచోవాను చూస్తూ పైకి లే అంటూ జాక్ గ్రీలిష్ కోపంగా అన్నాడు. దీంతో ఒచోవా.. జాక్ కాలర్ పట్టుకొని అడిగే ప్రయత్నంలో ఉండగానే తోటి ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీశారు. అప్పటికి శాంతించని గ్రీలిష్ ఒచోవాను తిడుతూనే ఉన్నాడు. దీంతో ఒచోవా జాక్‌పై కి దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇరుజట్ల ఆటగాళ్లు వచ్చి వారిద్దరిని విడదీశారు. ఆ తర్వాత ఆట రెండో భాగంలోనూ జాక్ గ్రీలిష్ మరోసారి గొడవపడ్డాడు. ఈసారి క్లబ్ అమెరికా డిఫెండర్ బ్రూనో వాల్డెజ్ బంతి తన్నే ప్రయత్నంలో జాక్ గ్రీలిష్‌ను కింద పడేశాడు. కోపంతో పైకి లేచిన జాక్.. వాల్డెజ్‌తో గొడవకు దిగగా.. ఇంతలోనే క్లబ్ అమెరికన్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు జాక్‌ను నెట్టివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీ 2-1 తేడాతో క్లబ్ అమెరికాపై విజయం అందుకుంది. మాంచెస్టర సిటీ మిడ్ ఫీల్డర్ కెవిన డిబ్రూయెన్ ఆట మొదటి హాఫ్‌లో ఒకటి.. రెండో సగంలో మరొక గోల్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. Grealish already having a scrap 😅 pic.twitter.com/bvXiUaAL5m — Álvarez¹⁹ (@19Alvarez_) July 21, 2022 The best of the action from our pre-season friendly against Club America 🎥 📍 NRG Stadium, Houston pic.twitter.com/XKBTQPatXx — Manchester City (@ManCity) July 21, 2022 Bruno Valdez to Jack Grealish: “This is for your chirp at Almiron!” pic.twitter.com/JdnBmaqRiK — Roberto Rojas (@RobertoRojas97) July 21, 2022 చదవండి: Shreyas Iyer: జోరుగా వర్షం.. టీమిండియా ఆటగాడి కోసం రెండు గంటల నిరీక్షణ -
23 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎవరా ఆటగాడు?
25 ఏళ్లకే ఆస్ట్రేలియన్ టెన్నిస్ క్రీడాకారిణి యాష్లే బార్టీ ఆటకు వీడ్కోలు పలికి టెన్నిస్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ విషయాన్ని మరువక ముందే మరో ఆటగాడు కేవలం 23 ఏళ్ల వయసులోనే ఆటకు గుడ్‌బై చెప్పాడు. మాంచెస్టర్ యునైటెడ్ గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్న పాల్ వూల్స్టన్ తన అనూహ్య నిర్ణయంతో ఆశ్చర్చపరిచాడు. 23 ఏళ్లకే తన ఇష్టమైన ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటించాడు. ఈ విషయాన్ని వూల్స్టన్ ట్విటర్ ద్వారా ప్రకటించి భావోద్వేగానికి గురయ్యాడు. ''23 ఏళ్లకే ఇలాంటిది రాస్తానని ఎప్పుడు ఊహించలేదు. కానీ ఫుట్‌బాల్‌లో నా చాప్టర్ ముగిసిపోయింది. గాయాలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం. కెరీర్లో సాధించిన విజయాలపై నేను గర్వంగా వెనక్కి తిరిగి చూసుకోలగను. కానీ భవిష్యత్తులో ఏం చూస్తాననే దానిపై విపరీతమైన ఆసక్తి ఉంది. కొత్త చాప్టర్ నాకోసం నిరీక్షిస్తోంది'' అంటూ రాసుకొచ్చాడు. కాగా పాల్ ఊల్‌స్టన్ 2018లో మాంచెస్టర్ యునైటెడ్‌లో గోల్‌కీపర్‌గా జాయినయ్యాడు. అండర్-18 సమయంలో న్యూకాసిల్ యునైటెడ్‌కు ఆడుతూ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రదర్శనతో అతనికి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ నుంచి పిలుపు వచ్చింది. చదవండి: Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు Womes WC 2022: 'జప్ఫా' బంతితో మెరిసిన బౌలర్.. వీడియో వైరల్ Never thought I would have to write this at 23 but this chapter has had to come to an end. I can look back proudly on what I’ve achieved in my career but I am excited about what’s in store for the future. A new chapter awaits 💥 pic.twitter.com/PbcVaepfMH — Paul Woolston (@PAULHW_) March 23, 2022 -
క్వార్టర్ ఫైనల్స్కే ఇంత రచ్చ.. మరి కప్ గెలిస్తే!
మ్యాచ్ గెలిచినప్పుడు ఆటగాళ్ల సంతోషం పట్టలేనంతగా ఉంటుంది. కొందరు విజయం తాలుకా భావోద్వేగాలను తమలోనే అణుచుకుంటే.. మరికొందరు మాత్రం మాటల్లోనూ.. తమ చేష్టలతోనో బయటపెడుతుంటారు. తాజాగా బుర్కినా ఫాసో గోల్ కీపర్ హార్వే కోఫీ తన సంతోషాన్ని ఎవరు ఊహించని విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో గాబన్, బుర్కినా ఫాసోల మధ్య రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో బుర్కినా ఫోసో ఆటగాడు ఇస్మాహిలా ఔడ్రాగో గోల్ కొట్టడంతో ఆ జట్టు విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది. చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి గోల్ కొట్టిన ఆనందంలో ఔడ్రాగో షర్ట్ తీసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. అయితే ఇదంతా గమనించిన గోల్‌కీపర్ హార్వే కోఫీ మైదానంలోనే ఎరోబిక్ విన్యాసాలు(దొమ్మరిగడ్డలు) వేశాడు. ఇది చూసిన ఆటగాళ్లు గోల్ కీపర్ ఇలా చేయడం చూసి ఆశ్చర్యపోయినప్పటికి అతని సెలబ్రేషన్స్‌లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. క్వార్టర్ ఫైనల్ల్లో గెలిస్తేనే ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉన్నాయి.. మరి ఫైనల్లో గెలిచి కప్ అందుకుంటే ఇంకేం చూడాల్సి వస్తుందో అని ఫన్నీగా క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్‌లో రిఫరీ రెడ్యూనే జియేద్ ఇరు జట్లకు కలిపి దాదాపు 14సార్లు ఎల్లోకార్డులు జారీ చేశారు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం When you reach the #TotalEnergiesAFCON2021 quarter finals! #TeamBurkinaFaso edition! 😆#AFCON2021 | #TeamBurkinaFaso pic.twitter.com/QVotLloBt3 — #TotalEnergiesAFCON2021 🏆 (@CAF_Online) January 24, 2022 -
పాయింట్ బ్లాక్‌లో గోల్ ఆపాడు.. మ్యాచ్‌ను కాపాడాడు
UEFA Champions League 2021-22.. యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్‌లో భాగంగా అర్జెంటీనా గోల్ కీపర్ జువాన్ ముస్సో పాయింట్ బ్లాక్‌లో గోల్ అడ్డుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గోల్ కీపర్ తాను అడ్డుకొని తన జట్టును ఓటమి నుంచి రక్షించాడు. అట్లాంటా, విల్లారియల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆటలో ఫస్ట్‌హాఫ్ కాసేపట్లో ముగుస్తుందనగా.. ప్రత్యర్థి మిడ్‌ఫీల్డర్ వేగంగా దూసుకొచ్చి గోల్‌పోస్ట్ వైపు బంతిని తన్నాడు. అయితే అప్పటికే అప్రమత్తమైన జువాన్ ముస్సో గాల్లోకి ఎగిరి పాయింట్ బ్లాక్ తేడాతో తన చేతితో బంతిని గోల్‌పోస్ట్ పై నుంచి వెళ్లేలా చేశాడు. దీంతో అట్లాంటా బతికిపోయింది. ఆ తర్వాత ఇరు జట్లు చెరో గోల్ చేయడం.. ఓవరాల్‌గా 2-2తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అట్లాంటా తరపున రెమో ఫ్రూలర్ ఆట 6వ నిమిషంలో.. రాబిన్ గోసెన్స్ 83వ నిమిషంలో గోల్ చేయగా.. విల్లారియల్ తరపున మనూ ట్రిగురస్ ఆట 39వ నిమిషంలో.. ఆర్నాట్ డంజూమా 73వ నిమిషంలో గోల్ చేశాడు. చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు Cristiano Ronaldo: రొనాల్డో సంచలనం.. ఫుట్‌బాల్‌లో కొత్త చరిత్ర View this post on Instagram A post shared by UEFA Champions League (@championsleague) -
PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత విజయంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర మరువలేనిది. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ, అడ్డుగోడగా నిలబడి, అద్భతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకొని విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శ్రీజేష్ పేరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్. తాజాగా శ్రీజేష్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. 1998లో తన 12 ఏళ్ల వయసులో హాకీలో ఓనమాలు నేర్చుకునేందుకు తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్లో చేరాడు. అయితే ఆ స్కూల్ హాకీ కోచ్ శ్రీజేష్ను గోల్ కీపింగ్ చేయమని సలహా ఇచ్చాడు. కోచ్ చెప్పిన విషయాన్ని శ్రీజేష్ తన తండ్రికి వివరించాడు. కొడుకు కలను సాకారం చేసేందుకు తండ్రి పీవీ రవీంద్రన్ తన ఇంటి దైవంగా భావించిన ఆవును అమ్మేసి శ్రీజేష్‌కు గోల్ కీపింగ్ కిట్‌ను కొనిచ్చాడు. అయితే ఆ సమయంలో రవీంద్రన్ శ్రీజేష్‌కు ఒక మాట చెప్పాడు. '' ఈరోజు నీ భవిష్యత్తు కోసం నా ఇంటి దైవాన్ని తాకట్టు పెడుతున్నా. నువ్వు అనుకున్న కలను సాధించాలి.. హాకీలో గోల్ కీపర్‌గా మెరవాలి.. దేశానికి పతకం తేవాలి.'' అని చెప్పుకొచ్చాడు. తండ్రి మాటలను శ్రీజేష్ ఈరోజుతో నెరవేర్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో తన గోల్ కీపింగ్‌తో మెప్పించి దేశానికి కాంస్యం అందించాడు. ఇటు తండ్రి కోరికను నెరవేర్చడంతో పాటు ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల పతక నిరీక్షణకు తన జట్టుతో కలిసి తెరదించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్ ఫైట్ లో భారత్ 5-4 తేడాతో జయకేతనం ఎగురవేసి కాంస్యం దక్కించుకుంది. -
Viral Video: గోల్ కీపర్ తడబాటు.. పాపం!
ఉత్కంఠ భరితంగా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విజయం దక్కినప్పటికీ.. ఆ గోల్కీపర్కి మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. గోల్ కీపర్ కంగారుతో .. ప్రత్యర్థి ఖాతాలో పాయింట్ జమ అయ్యింది. దీంతో అవతలి టీం ఆధిక్యంలోకి వెళ్లగా.. కాసేపు మ్యాచ్ ఆడియెన్స్‌లో టెన్షన్ పెంచింది. యూరో 2020 టోర్నీలో పదహారో రౌండ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. స్పెయిన్, క్రోయేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే క్రొయేషియా 1-0తో ఆధిక్యంలో ఉంది. బార్సిలోనా(స్పెయిన్ క్లబ్) మిడ్ ఫీల్డర్ పెడ్రి బంతిని పాస్ చేయగా.. అది గోల్‌కీపర్ ఉనయ్ సైమన్ ముందుకొచ్చింది. అయితే బంతిని కాలితో అడ్డుకోబోయినప్పటికీ పొరపాటున అతని షూ చివర తగిలి.. వెనకాల గోల్ నెట్ వైపు దూసుకెళ్లింది. అయితే రెప్పపాటులో జరిగిన ఆ పరిణామాన్ని .. అడ్డుకునేంత టైం సైమన్‌కు లేదు. ఇక ఆ తర్వాత మ్యాచ్ జరుగుతున్నంత సేపు సైమన్ ముఖంలో ఆందోళనతో నిండిపోయింది. చివరికి ఎక్స్ట్రా టైం కలిసి రావడంతో 5-3 తేడాతో స్పెయిన్.. క్రొయేషియాపై విజయం సాధించింది. ఇక ఆ సెల్ఫ్ గోల్ తర్వాత సైమన్ చాలాసేపు స్థిమితంగా ఉండలేకపోయాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇదే వెరైటీ గోల్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో.. అందుకు సంబంధించిన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. Kepa watching from the bench as Unai Simon concedes from a 30 yard backpass#CROSPA #EURO2020 pic.twitter.com/XBDZq2DtRC — Kiran T-ierney (@mopeygooner) June 28, 2021 “Dubravka scored the most bizarre own goal you’ll see at #EURO2020” Unai Simon: #ESP pic.twitter.com/eYxQWAHMzB — SportPesa Kenya (@SportPesa) June 28, 2021 చదవండి: విజేత నుంచి అబద్ధాలకోరు.. తప్పక చదవాల్సిన కథ -
గోల్‌కీపర్ నిర్లక్ష్యం...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఆటగాళ్ల శ్రమను జట్టు గోల్ కీపర్ కమల్జీత్ సింగ్ వృథా చేశాడు. సొంత మైదానంలో గెలవాల్సిన చోట తన నిర్లక్ష్యంతో హైదరాబాద్ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకునేలా చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్–6 ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా శనివారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అట్లెటికో డి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. 90వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడి నుంచి బంతి అందుకున్న కమల్జీత్... అవసరం లేకపోయినా బంతిని గాల్లోకి తన్నాడు. అయితే ఆ బంతి గతి తప్పి నేరుగా హైదరాబాద్ ‘డి’ బాక్స్ ముందే కాచుకొని ఉన్న ప్రత్యర్థి కోల్‌కతా ప్లేయర్ హెర్నాండెజ్ దగ్గరికి వెళ్లడం... అతను హెడర్‌తో కృష్ణ రాయ్‌కు పాస్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కృష్ణ ఎటువంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్ పోస్టులోకి పంపి స్కోరును 2–2తో సమం చేశాడు. దీంతో మైదానంలోని హైదరాబాద్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. మైదానంతా ఒక్కసారిగా మూగబోయింది. కమల్జీత్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జట్టు డిఫెండర్, భారత జట్టు సభ్యుడైన ఆదిల్ ఖాన్ ఆగ్రహంతో గోల్‌కీపర్ మీదకు దూసుకెళ్లగా... అక్కడే ఉన్న సహచర ఆటగాళ్లు అతనిని నిలువరించారు. అంతకుముందు 15వ నిమిషంలో కృష్ణ రాయ్ గోల్‌తో కోల్‌కతా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో బోబో గోల్‌తో హైదరాబాద్ స్కోరును సమం చేసింది. అనంతరం 85వ నిమిషంలో బోబో మళ్లీ గోల్ చేయడంతో హైదరాబాద్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ చివరి క్షణాల్లో గోల్‌కీపర్ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ గోల్‌ను సమరి్పంచుకుంది. -
ఉత్కంఠ పోరులో ఉరుగ్వే విజయం
సాకర్ ప్రపంచకప్‌లో భాగంగా సెంట్రల్ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో ఈజిప్ట్‌పై ఉరుగ్వే విజయం సాధించింది. మ్యాచ్ అసాంతం నువ్వా నేనా అన్నట్టు జరిగిన పోరులో చివరకు విజయం ఉరుగ్వేను వరించింది. 89వ నిమిషం వరకు ఒక్క గోల్ నమోదు కాని ఈ మ్యాచ్‌లో శాంచెజ్ ఇచ్చిన ఫ్రీ కిక్‌తో జోస్ గిమెనెజ్ గోల్ కొట్టి ఉరుగ్వే శిబిరంలో ఆనందం నింపాడు. దీంతో ఉరుగ్వే 1-0తో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగిసి షూటౌట్‌కు వెళ్లే సమయంలో ఉరుగ్వేకు ఫ్రీ కిక్ రూపంలో అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఉరుగ్వే ఆటగాళ్లు శాంచెజ్ అందించిన బంతిని జోస్ గిమెనెజ్ రైట్సైడ్లో తలతో ముచ్చటైన రీతిలో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. నేటి మ్యాచ్‌లో ఈజిప్ట్ 12 అనవసర తప్పిదాలు చేయగా, ఉరుగ్వే 4 తప్పిదాలు చేసింది. గోల్ కోసం ఉరుగ్వే ఆరు సార్లు ప్రయత్నించగా ఈజిప్ట్ గోల్ కీపర్ మహ్మద్ ఎల్-షెనవి వాటిని అడ్డుకున్నాడు. ఈజిప్ట్ ఆటగాళ్లు సామ్ మోర్సీ, అహ్మద్ హీగజీలకు రిఫరీలు ఎల్లో కార్డ్ చూపారు. -
చిత్తూరు జిల్లా ఖ్యాతి విశ్వవాప్తం
చంద్రగిరిః హాకీ క్రీడలో మొదటి మహిళల ఏసియన్ చాంపియన్‌షిప్ ట్రోఫీ సాధించి, ప్రతిష్ఠాత్మమైన రియో ఒలంపిక్స్‌లో హాకీ గోల్ కీపర్‌గా ఉత్తమ ప్రతిభను కనబరిచి చిత్తూరు జిల్లా ఖ్యాతినికి రజనీ విశ్వవ్యాప్తం చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు ఎన్.శివప్రసాద్ కొనియాడారు. ఎర్రావారిపాళ్యం మండలం నెరబైలు గ్రామానికి చెందిన రజనీని బుధవారం చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో సీబార్ స్పోర్ట్స్ కల్చరల్ అకాడమీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మేళతాళాలతో చంద్రగిరి టవర్‌క్లాక్ వద్ద నుంచి ఊరేగింపుగా పాఠశాల వద్దకు వచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ మారు మూల గ్రామాల్లో ఆదరణ లేక మరుగున పడిన ఇలాంటి రజనీలను ఆదరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం గ్రూప్–2 ఉద్యోగంతో పాటు రూ.25లక్షల నగదు, తిరుపతిలో ఇంటి స్థలాన్ని మంజూరు చేసిందని తెలిపారు. ఒలంపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయం రజనీ మాట్లాడుతూ తాను ఇంతటి స్థాయికి రావడానికి గురువు వెంకరాజు కారణమైతే, తాను రియోలో ఆడేందుకు అన్ని విధాల కృషి చేసిన వ్యక్తి ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు. 2005లో హాకీని ఎంచుకున్న తాను పట్టుదలతో కృషి చేశానన్నారు. 2008లో మొట్టమొదటి సారిగా భారత జట్టు తరపున న్యూజిలాండ్‌తో ఆడినట్లు చెప్పారు. రానున్న ఒలంపిక్స్‌లో దేశానికి స్వర్ణ పతకమే లక్ష్యంగా జట్టు తరపున ఆడుతానని తెలిపారు. చంద్రగిరిలో హాకీ అకాడమీను నెలకొల్పి, మరింత మందిని దేశానికి అందించేలా కృషి చేస్తానన్నారు. అనంతరం రజనీని ఎంపీ శివప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఎంఈవో ప్రభాకర్ రాజు, ప్రిన్సిపల్ నాగరాజు నాయుడు, మస్తాన్, పాదిరి «దనుంజయ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. మహిళా వర్శిటీలో ఉద్యోగం తిరుపతి సెంట్రల్ : రియో ఒలంపిక్స్‌లో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన హాకీ ఇండియన్ ఉమెన్ టీమ్ గోల్ కీపర్ ఇ.రజిని సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. రజనిని బుధవారం సాయంత్రం శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో వీసీ దుర్గాభవానీ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. వీసీ మాట్లాడుతూ కృషి, పట్టుదలతో పాటు లక్ష్యసాధన ఉంటే ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరోజు జీవితంలో పైకి ఎదిగే అవకాశం వస్తుందన్నారు. అలాంటి జాబితాలో ఓ మారుమూల గ్రామంలో జన్మించి దేశ హాకీ టీమ్ గోల్‌కీపర్‌గా రాణిస్తున్న రజని ఆదర్శనీయం అన్నారు. రజిని ఒప్పుకుంటే తమ యూనివర్శిటీ నుంచి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. దీనికి స్పందించిన రజిని అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అవకాశం వచ్చినప్పుడు తన సేవలను మహిళా వర్శిటీకి అందిస్తానని వినయంగా తెలిపారు. అనంతరం రజిని, ఆమె తల్లి దండ్రులు తులసి,రమణాచారితో పాటు గురువు హాకీ ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్లను వేర్వేరుగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళావర్శిటీ యాజమాన్యం, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాలు సంయుక్తంగా ట్రోఫీలను అందించి, ఆత్మీయంగా సన్మానించారు. రిజిస్ట్రార్ విజయలక్ష్మి, కృష్ణకుమారి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శారా సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
గోల్‌కీపర్‌తో మూత్రం తాగించిన అభిమానులు
సాకర్ అంటేనే అభిమానులు చెవి కోసుకుంటారు. ప్రత్యర్థి జట్టులో ఆటగాళ్లను నిజంగానే తమ ప్రత్యర్థులుగా భావిస్తుంటారు. వాళ్లను అవమానించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. స్విట్జర్లండ్కు చెందిన ఓ ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్‌తో అవతలి జట్టు అభిమానులు ఏకంగా మూత్రం తాగించి అతడిని తీవ్రంగా అవమానించి ఆనందించారు. ఎఫ్‌సీ మురీ జట్టు గోల్‌కీపర్ రెటో ఫెల్డర్ ఆట మధ్యలో తన బాటిల్ తీసుకుని అందులోని ద్రవం తాగాడు. అయితే.. అందులో వెచ్చగా ఉన్న పదార్థం తాగాక తాను చాలా ఇబ్బందిపడ్డానని అతడు తెలిపాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, అవతలి జట్టు అభిమానులు బాల్ బోయ్ని పిలిచి, గోల్ కీపర్ వద్ద ఉన్న బాటిల్ తీసుకురమ్మని చెప్పి, అందులో మూత్రం పోశారు. ఇలా తనతో మూత్రం తాగించాలన్న ఆలోచన ఏమాత్రం భరించదగ్గది కాదని ఫెల్డర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో విశ్లేషణ చూసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోడానికి అతడు సిద్ధపడుతున్నాడు. అతడు తాగగానే 'ఇప్పుడు నీకు ఎయిడ్స్ ఉంది' అంటూ అవతలి అభిమానులు గట్టిగా అరిచారు. దీనిపై బాడెన్ అధ్యక్షుడు థోమీ బ్రామ్ క్షమాపణలు చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు.