గోల్ చేస్తున్న ఉరుగ్వే ఆటగాడు జోస్ గిమెనెజ్
సాకర్ ప్రపంచకప్‌లో భాగంగా సెంట్రల్ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో ఈజిప్ట్‌పై ఉరుగ్వే విజయం సాధించింది. మ్యాచ్ అసాంతం నువ్వా నేనా అన్నట్టు జరిగిన పోరులో చివరకు విజయం ఉరుగ్వేను వరించింది. 89వ నిమిషం వరకు ఒక్క గోల్ నమోదు కాని ఈ మ్యాచ్‌లో శాంచెజ్ ఇచ్చిన ఫ్రీ కిక్‌తో జోస్ గిమెనెజ్ గోల్ కొట్టి ఉరుగ్వే శిబిరంలో ఆనందం నింపాడు. దీంతో ఉరుగ్వే 1-0తో ఈజిప్ట్‌పై విజయం సాధించింది.
మరో రెండు నిమిషాల్లో ఆట ముగిసి షూటౌట్‌కు వెళ్లే సమయంలో ఉరుగ్వేకు ఫ్రీ కిక్ రూపంలో అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఉరుగ్వే ఆటగాళ్లు శాంచెజ్ అందించిన బంతిని జోస్ గిమెనెజ్ రైట్‌సైడ్‌లో తలతో ముచ్చటైన రీతిలో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. నేటి మ్యాచ్‌లో ఈజిప్ట్ 12 అనవసర తప్పిదాలు చేయగా, ఉరుగ్వే 4 తప్పిదాలు చేసింది. గోల్ కోసం ఉరుగ్వే ఆరు సార్లు ప్రయత్నించగా ఈజిప్ట్ గోల్ కీపర్ మహ్మద్ ఎల్-షెనవి వాటిని అడ్డుకున్నాడు. ఈజిప్ట్ ఆటగాళ్లు సామ్ మోర్సీ, అహ్మద్ హీగజీలకు రిఫరీలు ఎల్లో కార్డ్ చూపారు.
Comments
Please login to add a commentAdd a comment