Uruguay
-
ఉరుగ్వేకు మూడో స్థానం
చార్లోటి (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ ఉరుగ్వే జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఉరుగ్వే ‘షూటౌట్’లో 4–3 గోల్స్ తేడాతో కెనడా జట్టును ఓడించింది.నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. రెగ్యులర్ టైమ్‌లో కెనడా తరఫున ఇస్మాయిల్ కోన్ (20వ ని.లో), జొనాథన్ డేవిడ్ (80వ ని.లో)... ఉరుగ్వే తరఫున రోడ్రిగో కోల్మన్ (8వ ని.లో), లూయిస్ స్వారెజ్ (90+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
Copa America: సంచలన విజయం.. ఫైనల్లో కొలంబియా
కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో కొలంబియా సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో ఉరుగ్వేను 1-0తో ఓడించింది. తద్వారా ఇరవై మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది.పోటాపోటీగా సాగిన ఆట 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా గోల్ కొట్టి కొలంబియా గెలుపును ఖరారు చేశాడు. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. గాల్లోకి పంచ్‌లు విసురుతూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే, ఓటమిని జీర్ణించుకోలేని ఉరుగ్వే ఆటగాళ్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఉరుగ్వే స్ట్రైకర్ నూనెజ్ సహా మరికొందరు ఆటగాళ్లు.. ప్రేక్షకులు ఉన్న స్టాండ్‌లోకి దూసుకొచ్చి కొలంబియా మద్దతుదారులపై పిడిగుద్దులు కురిపించాడు.దీంతో మ్యాచ్‌కు వేదికైన బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాహకులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో 28 విజయాలతో అజేయంగా నిలిచిన కొలంబియా ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. మియామీ వేదికగా ఇరు జట్లు ఆదివారం టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. కాగా 2001లో కొలంబియా తొలిసారి ఈ టోర్నమెంట్లోట్రోఫీ గెలిచింది.30వసారి టైటిల్ పోరుకు అర్హత కాగా వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు 30వసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టుపై గెలిచింది.ఆట 22వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట 51వ నిమిషంలో మెస్సీ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేసుకుంది. అర్జెంటీనా తరఫున మెస్సీకిది 109వ గోల్ కావడం విశేషం. ఇక మెస్సీ 38 వేర్వేరు దేశాలపై గోల్స్ చేశాడు.అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టు తరఫున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 130 గోల్స్) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీ ఘనత సాధించాడు.After defeat to Colombia, Uruguayan players entered the stands at Bank of America Stadium and began to throw punches. Liverpool forward Darwin Nunez amongst those at the forefront. pic.twitter.com/VE3unKObSa— Kyle Bonn (@the_bonnfire) July 11, 2024 -
విషాదం: బ్యూటీ క్వీన్, మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ కన్నుమూత
Ex-Miss World contestant Sherika de Armas మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్ (26) కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె (అక్టోబర్ 13న) తుదిశ్వాస విడిచారని సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. షెరికా అకాల మరణంతో సొంత దేశం ఉరుగ్వేతోపాటు, ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించారు షెరికా. కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో దాదాపు రెండేళ్లపాటు ఈ మహమ్మారితో పోరాడి చివరికి తనువు చాలించారు. అర్మాస్ మరణంపై స్నేహితులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఒక స్నేహితురాలిగా మీ ఆప్యాయత, మీ ఆనందం ఎప్పటికి మర్చిపోలేనివంటూ మిస్ ఉరుగ్వే 2021 లోలా డి లాస్ శాంటోస్ అర్మాస్కు నివాళులు అర్పించారు. 2015 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో షెరికా డి అర్మాస్ టాప్ 30లో స్థానం దక్కించుకోలేకపోయినప్పటకి, ఆరుగురు 18 ఏళ్ల పోటీదారుల్లోఒకరిగా నిలిచింది. బ్యూటీ మోడల్ అయినా, అడ్వర్టైజింగ్ మోడల్ అయినా, క్యాట్‌వాక్ మోడల్ అయినా తాను ఎప్పుడూ మోడల్‌గా ఉండాలని కోరుకుంటున్నానని అర్మాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రతిదీ ఇష్టమనీ, అందాల పోటీలో, మిస్ యూనివర్స్‌లో పాల్గొనడం అమ్మాయిల కల అనీ పేర్కొన్నారు. కానీ అనేక సవాళ్లతో నిండిన ఈ అనుభవం తనకు దక్కడంపై సంతోషం వ్యక్తం చేసింది కూడా. షే డి అర్మాస్ స్టూడియో పేరుతో హెయిర్, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది. అంతేకాదు కేన్సర్‌తో బాధ పడుతున్న పిల్లల చికిత్స చేసే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్కోసం కొంత సమయాన్ని వెచ్చించినట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భాశయ కేన్సర్ మహిళల్లో నాలుగో అత్యంత సాధారణ కేన్సర్‌గా మారిపోయింది. 2018నాటికి, ప్రపంచవ్యాప్తంగా 570,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారని అంచనా. దాదాపు 311,000 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. అయితే HPV టీకా, అలాగే ముందస్తు పరీక్షలు, చికిత్స కేన్సర్‌కు నివారణ మార్గాలు అనేది గుర్తించాలి. -
FIFA WC: ఘనాపై గెలిచినా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన మాజీ చాంపియన్
FIFA World Cup 2022 Uruguay Vs Ghana: గత ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన మాజీ చాంపియన్ ఉరుగ్వే ఈ సారి గ్రూప్ దశకే పరిమితమైంది. ఫిఫా వరల్డ్‌కప్-2022లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 2–0 తేడాతో ఘనాను ఓడించింది. జట్టు తరఫున గియార్గియాన్ డి అరాస్కెటా ఒక్కడే రెండు గోల్స్ (26వ, 32వ నిమిషంలో) కొట్టాడు. అయితే ఉరుగ్వే ముందంజ వేసేందుకు ఈ గెలుపు ఉపయోగపడలేదు. గ్రూప్-హెచ్లో ఉన్న కొరియా, ఉరుగ్వే 4 పాయింట్లతో సమానంగా నిలిచాయి. గోల్స్ అంతరం కూడా ‘0’తో సమం అయింది. దాంతో జట్టు చేసిన గోల్స్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. కొరియా 4 గోల్స్ చేయగా, ఉరుగ్వే 2 గోల్స్ మాత్రమే చేసింది. దాంతో కొరియా ముందంజ వేయగా ఉరుగ్వే నిష్క్రమించింది. చదవండి: FIFA WC 2022: రెండు గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! భారీ షాకిచ్చిన జపాన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: పోర్చుగల్ ముందుకు...
దోహా: అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన క్రిస్టియానో రొనాల్డో బృందం తొలి అడ్డంకిని దాటింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గతంలో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఉరుగ్వే జట్టుపై గెలిచింది. పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను బ్రూనో ఫెర్నాండెజ్ (54వ ని.లో, 90+3వ ని.లో) సాధించాడు. వరుసగా రెండో విజయం సాధించిన పోర్చుగల్ జట్టు ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గత ప్రపంచకప్‌లో ఉరుగ్వే చేతిలో 1–2తో ఓడిపోయిన రొనాల్డో జట్టు ఈసారి ఈ మాజీ విజేత జట్టును తేలిగ్గా తీసుకోలేదు. ముఖ్యంగా రొనాల్డో ముందుండి జట్టును నడిపించాడు. పలుమార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా వెళ్లి లక్ష్యంపై గురి పెట్టాడు. మరోవైపు ఉరుగ్వే కూడా దూకుడుగానే ఆడింది. కానీ ఆ జట్టును కూడా ఫినిషింగ్ లోపం వేధించింది. విరామ సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. ఎట్టకేలకు 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ సంధించిన క్రాస్ షాట్ నేరుగా ఉరుగ్వే గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రూనో కిక్‌ను గాల్లోకి ఎగిరి రొనాల్డో హెడర్ ద్వారా అందుకునే ప్రయత్నం చేసినా బంతి రొనాల్డో తలకు తగలకుండానే గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఉరుగ్వే తరఫున బెంటాన్కర్, గోమెజ్ కొట్టిన షాట్లు గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లాయి. స్టాపేజ్ సమయంలో ‘డి’ ఏరియాలో ఉరుగ్వే ప్లేయర్ జిమినెజ్ చేతికి బంతి తగలడంతో రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. బ్రూనో ఈ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. చివరి సెకన్లలో బ్రూనో కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లింది. లేదంటే అతని ఖాతాలో హ్యాట్రిక్ చేరేది. ప్రపంచకప్‌లో నేడు డెన్మార్క్ X ఆస్ట్రేలియా రాత్రి గం. 8:30 నుంచి ఫ్రాన్స్ X ట్యునీషియా రాత్రి గం. 8:30 నుంచి అర్జెంటీనా X పోలాండ్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి మెక్సికో X సౌదీ అరేబియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్ నాది'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గ్రూప్-హెచ్లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఉరుగ్వేతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-0తో గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక పోర్చుగల్ మిడ్ ఫీల్డర్ బ్రూనో ఫెర్నాండేజ్ రెండు గోల్స్ చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫెర్నాండేజ్ ఆటతీరకు ముగ్దుడైన రొనాల్డో స్వయంగా అభినందించాడు. కానీ మ్యాచ్‌లో ఫెర్నాండేజ్ కొట్టిన ఒక గోల్ విషయమై ఆరోపణలు చేశాడు. ఆట తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఎలాంటి గోల్ నమోదు చేయలేకపోయాయి. ఇక రెండో అర్థభాగంలో ఆట 54వ నిమిషంలో రొనాల్డో హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టినట్లు భ్రమపడి సంబరాల్లో మునిగిపోయాడు. అయితే ఆ గోల్ చేసింది రొనాల్డో కాదని.. బ్రూనో ఫెర్నాండేజ్ అని తర్వాత తెలిసింది. అసలేం జరిగేందంటే.. వాస్తవానికి రొనాల్డో హెడర్ గోల్ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. అంతకముందే రొనాల్డోకు క్రాస్‌గా వచ్చిన బ్రూనో ఫెర్నాండేజ్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఇక బంతి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడానికి ముందు రొనాల్డోకు ఎక్కడా తగల్లేదని రిప్లేలో తేలింది. దీంతో బ్రూన్ ఫెర్నాండేజ్ ఖాతాలోకి ఆ గోల్ వెళ్లిపోయింది. అయితే రిఫరీ నిర్ణయంతో షాక్ తిన్న రొనాల్డో.. అంతా తొండి.. ఆ గోల్ నాది.. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బ్రూనో ఆట 90+ మూడో నిమిషంలో మరో గోల్ చేయడంతో పోర్చుగల్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లడం.. ఆపై విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ రొనాల్డో ఖాతాలోకి ఆ గోల్ వెళ్లి ఉంటే మాత్రం చరిత్ర సృష్టించేవాడే.. కానీ కొద్దిలో మిస్ అయింది. ఇక ఉరుగ్వేపై విజయంతో ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రి క్వార్టర్స్‌కు చేరిన మూడో జట్టుగా పోర్చుగల్ నిలిచింది. కాగా 2018 చాంపియన్స్ ఫ్రాన్స్‌తో పాటు ఐదుసార్లు చాంపియన్ అయిన బ్రెజిల్ కూడా ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. ఇక పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్ డిసెంబర్ 3న దక్షిణ కొరియాతో ఆడనుంది. #Ronaldo fans, do answer this 👇 Did the ⚽ hit #Ronaldo before it went inside the 🥅 or not? 🤔#PORURU #BrunoFernandes #ManUtd #Qatar2022 #WorldsGreatestShow #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/58AxS2Bb11 — JioCinema (@JioCinema) November 28, 2022 The goal has officially been ruled as scored by Bruno Fernandes #POR #URU https://t.co/3NN2pbupe0 — FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022 చదవండి: FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ -
ఉరుగ్వేకు చుక్కలు చూపించిన దక్షిణ కొరియా
FIFA World Cup 2022- FIFA World Cup 2022- South Korea Vs Uruguay- దోహా: ఈ ప్రపంచకప్‌లో ఆసియా జట్లు తమకెదురైన గట్టి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నా యి. వరుసగా మూడో రోజు మరో ఏషియన్ టీమ్ దక్షిణ కొరియా మ్యాచ్‌లో గెలవకపోయినా... పటిష్ట మైన ఉరుగ్వేని నిలువరించింది. దీంతో గ్రూప్ ‘హెచ్’లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే 0–0తో డ్రాగా ముగిసింది. ఉరుగ్వేకు తొలి, రెండో అర్ధ భాగంలో దాదాపు గోల్ చేసే అవకాశమొచ్చింది. 43వ నిమిషంలో గోల్‌పోస్ట్‌కు అత్యంత చేరువ లో తలపై నుంచి వచ్చిన బంతిని డీగో గాడిన్ ‘హెడర్’గా మలిచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో సువర్ణావకాశం చేజారింది. మళ్లీ రెండో అర్ధభాగంలోనూ మ్యాచ్ నిలిచే దశలో 89వ నిమిషంలో ఫెడెరికో వాల్వెర్డ్కు కూడా ఇలాంటి ఛాన్సే వచ్చినా ఖాతా మాత్రం తెరవలేకపోయింది. కాగా ఈ మ్యాచ్‌లో కొరియా కెప్టెన్ సన్ హ్యుంగ్ మిన్ ప్రత్యేకమైన ఫేస్‌మాస్క్‌తో దిగాడు. ఇటీవల చాంపియన్స్ లీగ్ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాడు చాన్సెల్ ఎంబెంబా బలంగా తగలడంతో హ్యుంగ్ మిన్ ఎడమ కంటికి గాయమైంది. దీంతో గాయం తీవ్రత దృష్ట్యా శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. అయితే దానికి సిద్ధమైతే ప్రపంచకప్‌కు దూరమయ్యేవాడు. దాంతో ఈ మెగా టోర్నీలో అతను ముందు జాగ్రత్తగా ఫేస్‌మాస్క్ పెట్టుకునే ఆడాడు. ఇతనికి సంఘీభావంగా కొరియా అభిమానులు కూడా ‘బ్యాట్మన్’లాంటి మాస్క్‌లతో మైదానంలోకి వచ్చారు. చదవండి: IND vs NZ 1st ODI:తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. యువ బౌలర్లు ఎంట్రీ! సంజూకి ఛాన్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సాకర్ సమరం.. 1800 కిలోల మాంసం వెంట తెచ్చుకున్న ఫుట్‌బాల్ జట్లు
ఫుట్‌బాల్ సాకర్ సమరానికి సమయం అసన్నమైంది. ఖాతార్ వేదికగా ఆదివారం (నవంబర్ 20) ఫిఫా వరల్డ్‌కప్-2022 ప్రారంభం కానుంది. ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం ఒక్కటి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు వచ్చిన అర్జెంటీనా, ఉరుగ్వే జట్లు ఏకంగా 4,000 పౌండ్ల(1800) కిలోల మాంసం తీసుకువచ్చాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఈ రెండు ఫుట్‌బాల్ పవర్‌హౌస్‌లు తమ హోం ఫుడ్ రుచిని కోల్పోకుండా ఉండడానికి ఇంత మొత్తంలో మంసాన్ని తీసుకువచ్చాయి. అయితే ఈ ఫుడ్‌ను ఖతార్‌కు తరలించేందుకు రెండు దేశాల ఫుట్‌బాల్ అసోసియేషన్లు భారీ ఏర్పాట్లు చేశారు. కాగా ఉరుగ్వే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీట్ ఆ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని మాంసాన్ని సరఫరా చేస్తుంది. ఇక ఈ విషయంపైఉరుగ్వే ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇగ్నాసియో అలెన్సో స్పందించారు. "మా జట్టుతో పాటు అత్యధిక పోషణ గల ఆహారాన్ని కూడా తీసుకువెళ్లాము. ప్రపంచంలోనే ఉరుగ్వే మాంసం అత్యుత్తమైనది" అని ఇగ్నాసియో అలెన్సో ఈస్పీఎన్తో పేర్కొన్నారు. కాగా దక్షిణ అమెరికా దేశాలలో మాంసంతో తయారుచేసే అత్యంత ప్రసిద్ద వంటకాల్లో 'అసాడో' ఒకటి. యూఏఈతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 5-0 తో గెలిచిన తర్వాత ఈ అసాడోను అర్జెంటీనా జట్టు టెస్టు చేసింది. ఉరుగ్వే కూడా కూడా అబుదాబి స్టేడియంలో అసాడోను రుచి చూసింది. చదవండి: FIFA WC 2022: ఫిఫా చరిత్రలో మాయని మచ్చలా ఐదు వివాదాలు -
రొనాల్డో... ఆఖరి అవకాశం
క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు క్రిస్టియానో రొనాల్డో. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో తన కెరీర్లో ప్రొఫెషనల్ లీగ్స్‌లో (ప్రీమియర్ లీగ్, లా లిగా, చాంపియన్స్ లీగ్, సెరియా లీగ్) అందుబాటులో ఉన్న అన్ని గొప్ప టైటిల్స్ సాధించాడు. కానీ ప్రపంచకప్ ఒక్కటే అతడిని అందని ద్రాక్షగా ఊరిస్తోంది. వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న రొనాల్డో ఆఖరి ప్రయత్నంగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తన నాయకత్వంలో పోర్చుగల్‌ను 2016లో యూరో చాంపియన్‌గా నిలబెట్టిన రొనాల్డో 2019లో నేషన్స్ లీగ్ టైటిల్ కూడా అందించాడు. ఈసారి పోర్చుగల్ విశ్వవిజేతగా నిలిస్తే క్రిస్టియానో రొనాల్డో దిగ్గజాల సరసన చేరడంతోపాటు తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంటాడు. పోర్చుగల్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1966). ‘ఫిఫా’ ర్యాంక్: 9. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ విజేత. ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ యువ, సీనియర్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. రికార్డుస్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో జట్టుకు వెన్నెముకలాంటి వాడు. పోర్చుగల్ తరఫున ఇప్పటి వరకు 191 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 117 గోల్స్ సాధించి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. రొనాల్డోతోపాటు రాఫెల్ లియావో, బెర్నార్డో సిల్వా, రూబెన్ డయాస్ కీలక ఆటగాళ్లు. ఘనా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (2010). ‘ఫిఫా’ ర్యాంక్: 61. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విజేత. ‘బ్లాక్ స్టార్స్’గా పేరున్న ఘనా నాలుగోసారి ప్రపంచకప్‌లో ఆడుతోంది. 2018 ప్రపంచకప్‌నకు అర్హత పొందలేకపోయిన ఘనా అంతకుముందు రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశను దాటి ముందుకెళ్లింది. ఈసారి తమ గ్రూప్‌లోని మూడు జట్లు పటిష్టమైనవి కావడంతో ఘనా సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. డెనిస్ ఒడోయ్, లాంప్టె, కుడుస్, అబ్దుల్ రహమాన్ కీలక ఆటగాళ్లు. ఉరుగ్వే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (1930, 1950). ‘ఫిఫా’ ర్యాంక్: 14. అర్హత ఎలా: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్‌లో మూడో స్థానం. నిలకడలేని ప్రదర్శనకు మారుపేరైన ఉరుగ్వే 14వసారి ప్రపంచకప్‌లో పోటీపడుతోంది. రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన మూడు జట్లలో ఒకటైన ఉరుగ్వే ఈసారి ఎంత దూరం వెళ్తుందనేది అంచనా వేయలేము. గోల్‌కీపర్ ఫెర్నాండో ముస్లెరా, కెప్టెన్ డీగో గోడిన్, మార్టిన్ సెసెరెస్, లూయిస్ స్వారెజ్, ఎడిన్సన్ కవానిలకు 100 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. సీనియర్లు సత్తా చాటుకుంటే ఉరుగ్వే జట్టుకు గ్రూప్ దశ దాటడం ఏమంత కష్టం కాబోదు. దక్షిణ కొరియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: నాలుగో స్థానం (2002). ‘ఫిఫా’ ర్యాంక్: 28. అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ రన్నరప్. ప్రపంచకప్‌లో ఆసియా నుంచి అత్యధికసార్లు బరిలోకి దిగిన జట్టు దక్షిణ కొరియా. ఇప్పటి వరకు 11 సార్లు పోటీపడిన కొరియా తాము ఆతిథ్యమిచ్చిన 2002 టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏ ఆసియా జట్టుకైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 1986 నుంచి ప్రతి ప్రపంచకప్‌నకు అర్హత పొందిన కొరియా 2002లో మినహా మిగతా అన్నిసార్లు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. స్టార్ ప్లేయర్ సన్ హెయుంగ్ మిన్ ఫామ్ కొరియా విజయావకాశాలను నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. –సాక్షి క్రీడా విభాగం -
ఆసుపత్రిలో సంగీత కచేరీలు...అక్కడ రోగులకు అదే ఔషధం!
సంగీతంతో చికిత్స అందిస్తారని మనం టీవీల్లోనూ లేదా సినిమాల్లోనూ విని ఉంటాం. నిజ జీవితంలో సంగీతంతో చికిత్స చేయడం గురించి వినటం అరుదు. మానసిక వ్యాధితో బాధపడుతున్నవాళ్లకు సంగీతంతో మార్పు తీసుకరావడం వంటివి చేస్తున్నారు. గానీ ఒక హాస్పటల్ పేషంట్ల కోసం ఏకంగా సంగీత కచేరీనే ఏర్పాటు చేసి చికిత్స అందించడం అంటే ఆశ్చర్యమే కదా. వివరాల్లోకెళ్తే..ఉరుగ్వేలో కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స అందిస్తున్నారు. మాంటెవీడియోలోని డయావెరమ్ క్లినిక్ కిడ్ని పేషంట్ల కోసం బ్యాండోనియన్ ప్లేయర్లు, గాయకులు, గిటారిస్టులు చేత సంగీత కచేరిని ఏర్పాటు చేస్తోంది. ఆ సంగీత బృందం రోగులను క్లాసిక్ టాంగో పీస్ "నరంజో ఎన్ ఫ్లోర్ వంటి సంగీతాలతో అలరిస్తారు. వాస్తవానికి కిడ్ని పేషంట్ల డయాలసిస్ చేయించుకోవడమనేది విపరీతమైన బాధతో కూడుకున్న చికిత్స. పైగా వాళ్లు వారానికి మూడుసార్లు క్లినిక్‌కి వచ్చి డయాలసిస్ చేయించుకోక తప్పదు. తమకు ఏదో అయిపోయిందన్న భావనతో నిరాశ నిస్ప్రహలతో నీరశించి పోతుంటారు. అలాంటి రోగులు ఈ సంగీత కచేరిని వింటూ... డయాలసిస్ చికిత్స తీసుకుంటారు. ఆ క్లినిక్‌లో ఉన్న రోగులంతా తాము ఇంతవరకు భయాందోళనలతో జీవతం మీద ఆశలేకుండా జీవచ్ఛవంలా బతుకుతున్నా మాకు ఈ సంగీతం మాకు కొత్త ఊపిరిని ఇస్తోందంటున్నారు. తాము రోజువారీ పనులు కూడా చేసుకునేందుకు ఆసక్తి కనబర్చలేకపోయాం. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలంటేనే భయపడే వాళ్లం అని చెబుతున్నారు. ఇప్పుడు తమకు క్లినిక్ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారిందని ఆనందంగా చెబుతున్నారు పేషంట్లు. ఆ ఆస్పత్రిని సంగీత బృందం స్పానిష్ మ్యూజిషియన్స్ ఫర్ హెల్త్ ఎన్జీవో నుంచి ప్రేరణ పొంది ఈ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంవత్సరాలుగా ఆరోగ్య వ్యవస్థల్లో కళా సంస్కృతిని చేర్చాలని సిఫార్సు చేసిందని అందుకే తాము డయాలసిస్ పేషెంట్లకు రెండు దశాబ్దాలుగా టాంగో సంగీతాన్ని అందిస్తున్నామని చెబుతోంది ఆ సంగీత బృందం. నెఫ్రాలజిస్ట్ గెరార్డో పెరెజ్ చొరవతోనే "హాస్పిటల్ టాంగో" అనే ప్రాజెక్ట్ ఏర్పాటైంది. ఇది ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో మినీ కచేరీలను నిర్వహిస్తుంది. అంతేగాదు సంగీతం వినడం వల్ల ఆందోళన ఒత్తిడి తగ్గుతుందని, హృదయ స్పందన స్థిరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు నిరూపితమైంది కూడా. (చదవండి: కొడుకు టార్చర్ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే.... ఇనుప గొలుసులతో బంధించి) -
దెబ్బకు ఠా.. ఐస్‌క్రీమ్ తూటా!
ఓ పోలీసు అధికారి చేతిలో ఐస్‌క్రీమ్ కోన్‌తో దొంగలను తరిమికొట్టినట్లు ఉన్న ఒక వీడియో ఇటీవల నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఉరుగ్వేలోని ఓ ఐస్‌క్రీమ్ షాప్‌లో ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి తన కొడుకుతో కలిసి ఐస్‌క్రీమ్ తింటున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి వారి టేబుల్ వద్ద కూర్చున్నారు. వారిలో ఒకడు తన జేబులో చెయ్యిపెట్టి దేనికోసమో వెదుకుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ పోలీస్ వెంటనే అప్రమత్తమయ్యి తుపాకీతో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఇంత చేస్తున్నా మరో చేతిలోని ఐస్‌క్రీమ్‌ను వదలక పోవడంతో ఈ వీడియో తెగ వైరలయ్యింది. సయాగో పరిసర ప్రాంతంలో రాత్రి 11.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై రావడాన్ని గమనించానని, ఇది దోపిడి కావచ్చని అనుమానం రావడంతో తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీస్ అధికారి సుబ్రాయాడో తెలిపారు. కాల్పులు తరువాత దొంగలు ఇద్దరూ మోటారు సైకిల్ వదిలి పారిపోయారన్నారు. అయితే, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో కొద్దిదూరంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గాయపడిన అతడిని హాస్పటల్‌కు తరలించామని, ఛాతీకి తగిలిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సుబ్రాయాడో తెలిపారు. చికిత్స పొందుతున్న స్నేహితుడిని చూసేందుకు వచ్చిన సహచరుడిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. -
అమ్మాయిలు శుభారంభం
హిరోషిమా: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో టైటిల్ ఫేవరెట్ భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1 గోల్స్ తేడాతో ఉరుగ్వే జట్టును ఓడించింది. భారత్ తరఫున కెప్టెన్ రాణి రాంపాల్ (10వ నిమిషంలో), గుర్జీత్ కౌర్ (21వ నిమిషంలో), జ్యోతి (40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఉరుగ్వే జట్టుకు వియానా తెరీసా (51వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో పోలాండ్‌తో భారత్ ఆడుతుంది. రెండేళ్ల తర్వాత ఉరుగ్వేతోమ్యాచ్ ఆడిన భారత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. మరోవైపు మొదటి క్వార్టర్లో ఉరుగ్వే జట్టు చురుగ్గా ఆడుతూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టించినా భారత డిఫెన్స్ వాటిని సమర్ధవంతంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్లో ఇరు జట్లు పలుమార్లు గురి తప్పాయి. ముఖ్యంగా ఉరుగ్వే రెండు పెనాల్టీ కార్నర్లను జారవిడచగా, భారత్ ఒక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో విఫలమైంది. తొలి రోజు జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో చిలీ 7–0తో మెక్సికోపై, జపాన్ 2–1తో రష్యాపై, పోలాండ్ 6–1తో ఫిజీపై విజయం సాధించాయి. -
అందంగా ఉన్నావంటూ ‘ఆమె’కు ఫైన్
హెల్మెట్ పెట్టుకోలేదని, సీటు బెల్టు పెట్టుకోలేదని, బైక్‌పై ముగ్గురు వెళుతున్నారని, రాంగ్ రూట్లో వెళ్తున్నారని ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. అది ఎక్కడైనా సహజమే. కానీ ఉరుగ్వేలో బైక్‌పై వెళుతున్న ఓ అమ్మాయికి ఫైన్ వేశారు. ఇంతకీ చలానా ఎందుకు వేసారో తెలుసా...ఆమె చాలా అందంగా ఉందని!. నోరెళ్లపెట్టకండి. మే 25న పేసందు అనే పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అంతేకాదు చలానాను చించి ఇచ్చాడు. పైగా దానిపై ‘చాలా అందంగా ఉండి పబ్లిక్ రోడ్డుపై వెళ్తుందుకు ఫైన్ కట్టండి’ అంటూ ట్రాఫిక్ పోలీస్ రాసిచ్చాడు. అందంగా ఉన్నవారికి ఫైన్ వేయాలని ఏమైనా చట్టం ఉందా అంటే అదీ లేదు. ఇంతకీ ఆ ఫైన్ ఎందుకు వేశాడో తెలుసా. ఆ యువతిని చూడగానే ఆ పోలీస్ మనసు పారేసుకున్నాడు. వెంటనే ఆమెను ఆకట్టుకునేందుకు ఇదో ట్రిక్‌గా భావించాడు. ఆ చాలాన చివరలో ఐ లవ్ యూ అని కూడా రాశాడు. అయితే అది పెద్ద వివాదాస్పదమైంది. అధికారిక చలానాలను సొంత వ్యవహారాల కోసం వాడుకున్నందుకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మనోడి మన్మథ కళలకు ఉద్యోగం ఊడేలా ఉందిప్పుడు. -
ఫ్రాన్స్ ప్రతాపం...
ప్రపంచ కప్ ప్రయాణాన్ని నిదానంగా ప్రారంభించినా, క్రమంగా తనదైన ఆటను బయటకు తీస్తోంది మాజీ చాంపియన్ ఫ్రాన్స్. లీగ్ దశను అజేయంగా ముగించి... ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌నే ఓడించిన ఉరుగ్వేను... క్వార్టర్ ఫైనల్లో అలవోకగా మట్టికరిపించి సెమీస్ బెర్తును కొట్టేసింది. స్టార్ స్ట్రయికర్ ఎడిన్సన్ కవానీ లేని లోటుతో పాటు... మరో స్టార్ లూయీజ్ సురెజ్ మెరుపులు కొరవడటంతో ఉరుగ్వే ఉసూరుమంటూ వెనుదిరిగింది. నిజ్ని నవ్‌గొరొడ్: ప్రత్యర్థులూ... కాచుకోండి! ఫ్రాన్స్ ఆట పదునెక్కుతోంది! మొదటి క్వార్టర్ ఫైనలే ఇందుకు నిదర్శనం! ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టే ఉరుగ్వేను గుక్క తిప్పుకోనీయకుండా మట్టికరిపించిన తీరే దీనికి సాక్ష్యం! ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆంటోన్ గ్రీజ్మన్ ప్రతిభతో శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 2–0తో గెలుపొంది దర్జాగా సెమీస్‌లో అడుగు పెట్టింది. 40వ నిమిషంలో రఫెల్ వరెన్కు ఫ్రీ కిక్ పాస్ అందించి అతడు గోల్ చేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రీజ్మన్... 61వ నిమిషంలో స్వయం గా గోల్ కొట్టి జట్టును సురక్షిత స్థితిలో నిలిపాడు. ఆటగాళ్ల దూకుడు, వరుస ఎల్లోకార్డులు, గోల్‌పోస్ట్ వద్ద పోరాటాలతో క్వార్టర్స్ మ్యాచ్ కొంత ఉత్కంఠ రేకెత్తించింది. ఓ దశ వరకు ఉరుగ్వే దీటుగానే కనిపించినా ఫినిషింగ్ లోపం వేధించింది. అందివచ్చిన ఒకటి, రెండు చక్కటి అవకాశాలను కాలదన్నుకున్న ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. సమంగా ప్రారంభమై... అంతా భావించినట్లే ఉరుగ్వే రక్షణ శ్రేణి, ఫ్రాన్స్ ఫార్వర్డ్ దళానికి పోటీలా ప్రారంభమైంది మ్యాచ్. ప్రత్యర్థిని ఆశ్చర్యానికి గురిచేస్తూ సురెజ్, టొరీరాల వేగంతో ఉరుగ్వేకే మొదట అవకాశాలు దక్కాయి. అయితే అవి కొంత క్లిష్టమైనవి. బంతి ఎక్కువ శాతం తమ ఆధీనంలో ఉన్నప్పటికీ ఫ్రాన్స్ ఏమీ చేయలేకపోయింది. ఎంబాపె, గ్రీజ్మన్, గిరౌడ్‌ల పాస్‌లను ఉరుగ్వే మధ్యలోనే అడ్డుకుంది. ఎంబాపెకు కొన్ని హెడర్లు వచ్చినా సఫలం చేయలేకపోయాడు. 38వ నిమిషంలో బెంటాన్కర్ ప్రత్యర్థి ఆటగాడిని అడ్డుకోవడంతో ఫ్రాన్స్‌కు ఫ్రీకిక్ లభించింది. దీనిని కార్నర్ నుంచి గ్రీజ్మన్ షాట్ కొట్టగా... గోల్‌పోస్ట్ ముందున్న వరెన్ హెడర్‌తో నెట్లోకి పంపాడు. గాయంతో కవానీ దూరం కావడం సురెజ్ ప్రదర్శనపైనా ప్రభావం చూపింది. సరైన సహకారం కరవైన అతడు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేకపోయాడు. రెండోభాగంలో రెండో గోల్... ఆధిక్యం కోల్పోయిన ఉరుగ్వే రెండో భాగంలో దాడుల తీవ్రత పెంచేందుకు రొడ్రిగెజ్, గోమెజ్లను సబ్స్టిట్యూట్లుగా దింపింది. కానీ, పేలవమైన ఆటతో ఫ్రాన్స్‌కు గోల్ ఇచ్చింది. పెనాల్టీ ఏరియాలో పాస్‌ను అందుకున్న గ్రీజ్మన్ మరో ఆలోచన లేకుండా గోల్‌పోస్ట్ దిశగా కొట్టాడు. దీనిని ఉరుగ్వే ఆటగాళ్లెవరూ అడ్డుకోలేకపోగా... కీపర్ ముస్లెరా గోల్‌పోస్ట్ వద్ద తడబడ్డాడు. దారి మళ్లించే క్రమంలో అతడు విఫలమవడంతో బంతి గోల్ లైన్‌ను తాకింది. 2–0 ఆధిక్యం దక్కడంతో ఫ్రాన్స్ మిగతా సమయం ప్రశాంతంగా ఆడుకుంటూ పోయింది.ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఆరోసారి సెమీస్ చేరింది. 1958, 82, 86, 98, 2006లలోనూ సెమీస్ చేరిన ఫ్రాన్స్ 1998లో విజేతగా, 2006లో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు ఉరుగ్వేతో ఆడిన ఫ్రాన్స్ రెండోసారి మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ఏకైకసారి 1986లో ఉరుగ్వేను ఫ్రాన్స్ ఓడించింది. నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకోగా... రెండింటిలో ఓడిపోయింది. -
సెమీస్‌కు ఫ్రాన్స్ క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై విజయం
-
ఫిఫా వరల్డ్ కప్; సెమీస్‌కు ఫ్రాన్స్
నిజ్ని నవ్‌గొరొడ్: రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా 2018 ప్రపంచ కప్ టోర్నీలో ఫ్రాన్స్ జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 0-2 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. లీగ్ దశలో ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వని ఉరుగ్వే కీలకమైన మ్యాచ్‌లో చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. 39వ నిమిషంలో రఫెల్ వారన్ మొదటి గోల్ చేయడం ద్వారా ఫస్టాఫ్‌లో ఫ్రాన్స్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట రెండో భాగంలోనూ అదే జోరుతో ప్రత్యర్థి గోల్పోస్టుపైకి పదే పదే దూసుకెళ్లింది. 61వ నిమిషంలో ఆంటోనీ గ్రిజ్మన్ రెండో గోల్ సాధించడంతో ఫ్రాన్స్ విజయావకాశాల్ని మరింత పదిలం చేసుకుంది. మ్యాచ్ ఏ దశలోనూ ప్రత్యర్థిని నిలువరించలేకోపోయిన ఉరుగ్వే ఓటమిభారంతో ఇంటిబాటపట్టింది. గెట్ రెడీ: రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్-బెల్జియంలు తలపడనున్నాయి. శుక్రవారం రాత్రి గం.11.30 నుంచి ఈ మ్యాచ్ సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2, 3లలో ప్రత్యక్ష ప్రసారంకానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు వరల్డ్ కప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్స్
-
సాకర్ వర్ల్డ్ కప్ నేడు క్వార్టర్ ఫైనల్స్
-
అష్ట దిగ్గజాల ఆట...
విశ్వ సమరంలో వీర రస ప్రదర్శనకు మళ్లీ రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు నుంచి మొదలు పెట్టి అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు తమ సత్తా చాటేందుకు సై అంటున్నాయి. తొలి రోజు ఖండాంతర పోరులో శుక్రవారం ఉరుగ్వే–ఫ్రాన్స్, బ్రెజిల్–బెల్జియం క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. వీటిలో సెమీస్ మెట్టును రెండు దక్షిణ అమెరికా (ఉరుగ్వే, బ్రెజిల్) జట్లే ఎక్కుతాయో... లేదా రెండు యూరప్ దేశాలు (ఫ్రాన్స్, బెల్జియం) ముందంజ వేస్తాయో చూడాలి...! నిజ్ని నవ్‌గొరొడ్: ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా... అయిదు గోల్స్ చేసి లీగ్ దశను అజేయంగా ముగించింది ఉరుగ్వే. ప్రి క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు గోల్ ఇచ్చినా ప్రతిగా రెండు కొట్టి గెలుపొందింది. మరోవైపు ఫ్రాన్స్ ప్రయాణం నిదానంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా, పెరూపై గెలిచి, డెన్మార్క్‌తో డ్రా చేసుకుంది. ప్రి క్వార్టర్స్‌లో మాత్రం అర్జెంటీనాపై జూలు విదిల్చింది. మొత్తమ్మీద రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ చేశాయి. ఇక శుక్రవారం క్వార్టర్ ఫైనల్‌ను 350 మ్యాచ్‌ల విశేష అనుభవం ఉన్న డిగో గోడిన్, జిమెనెజ్, క్యాసెరెస్, లక్జాల్ట్ల ఆధ్వర్యంలోని ఉరుగ్వే రక్షణ శ్రేణికి... గ్రీజ్మన్, ఎంబాపెల ఫ్రాన్స్ ఫార్వర్డ్ దళానికి మధ్య పోరాటంగా పేర్కొనవచ్చు. స్టార్ స్ట్రయికర్ సురెజ్ ఫామ్ భరోసానిస్తున్నా, ప్రి క్వార్టర్స్‌లో రెండు గోల్స్‌తో గెలిపించిన మరో స్టార్ ఎడిన్సన్ కవాని గాయం ఉరుగ్వేను కలవరపరుస్తోంది. అతడు బరిలో దిగేది అనుమానంగానే ఉంది. గత మ్యాచ్‌లో అర్జెంటీనాపై విజయం ఫ్రాన్స్‌లో ఆత్మవిశ్వాసం పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. టీనేజ్ సంచలనం ఎంబాపె తన వేగంతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. అతడికి గ్రీజ్మన్, గిరౌడ్, ఉస్మాన్ డంబెల్ తోడైతే తిరుగుండదు. వీరి ఆధ్వర్యంలోని ఫార్వర్డ్ బృందం ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించే ప్రయత్నాలు మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చడం ఖాయం. దీనిని దృష్టిలో పెట్టుకునే ‘ఫ్రాన్స్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చామో వారిని అందుకోవడం చాలా కష్టం’ అని ఇప్పటికే ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబ్రెజ్ వ్యాఖ్యానించాడు. ‘బలమైన ఉరుగ్వే నుంచి భిన్న ఆట ఎదురుకావొచ్చు’ అనేది ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ అంచనా. ►ఉరుగ్వే (vs) ఫ్రాన్స్ రాత్రి గం. 7.30 నుంచి కజన్: వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ప్రయాణం సాఫీగా సాగుతోంది. మాజీ చాంపియన్లు ఒక్కొక్కటే వెనుదిరుగుతున్నా, సాంబా జట్టు మాత్రం ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. లీగ్ దశలో డ్రాతో స్విట్జర్లాండ్ విస్మయపర్చినా... కోస్టారికా, సెర్బియాలపై సాధికార విజయాలు సాధించింది. ప్రి క్వార్టర్స్‌లో మెక్సికోకు చిక్కకుండా తప్పించుకుంది. అటువైపు బెల్జియం మాత్రం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ లీగ్‌లో అజేయంగా నిలిచింది. ప్రి క్వార్టర్స్‌లో జపాన్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న తీరు అదెంత ప్రమాదకర జట్టో చాటింది. ప్రపంచ ర్యాంకుల్లో 2, 3 స్థానాల్లో ఉన్న వీటి మధ్య క్వార్టర్స్‌లో భీకర పోరాటం ఖాయం. టోర్నీలో ఇప్పటివరకు ఏడు గోల్స్ చేసిన బ్రెజిల్... ప్రత్యర్థులకు ఒక్కటే ఇచ్చింది. బెల్జియం ఏకంగా 12 గోల్స్ కొట్టి... నాలుగు ఇచ్చింది. కీలక సమయంలో స్టార్ ఆటగాడు నెమార్ ఫామ్‌లోకి రావడంతో పాటు సాంబా జట్టు ఆట క్రమంగా పదునెక్కుతోంది. యువ గాబ్రియెల్ జీసస్ కూడా మెరిస్తే తిరుగుండదు. థియాగో సిల్వా, మిరండా వంటి సీనియర్లతో పటిష్ఠంగా కనిపిస్తున్న వీరి రక్షణ శ్రేణిని బెల్జియం స్టార్లు హజార్డ్, లుకాకు, మెర్టెన్స్‌లు ఏమేరకు ఛేదిస్తారో చూడాలి. గత మ్యాచ్‌లోలా ఆధిక్యం కోల్పోతే కోలుకోవడానికి వీలుండదు. ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండటంతో బెల్జియంను ‘గోల్డెన్ జనరేషన్’ జట్టుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు కాకుంటే మరె ప్పుడూ కప్పు గెలిచే అవకాశం రాదంటున్నారు. ఈ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ను ఓడిస్తే 1986 తర్వాత బెల్జియం సెమీస్‌కు చేరినట్లవుతుంది. ►బ్రెజిల్ (vs) బెల్జియం రాత్రి గం.11.30 నుంచి ►సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2, 3లలో ప్రత్యక్ష ప్రసారం -
పోర్చు‘గల్లంతు’
ఇటు అర్జెంటీనా... అటు పోర్చుగల్... ఒకే రోజు ఒకే తీరు ఫలితాలు... ఇద్దరు దిగ్గజాల కలలు కల్లలయ్యాయి. మొదట మెస్సీ చిరకాల స్వప్నాన్ని ఎంబాపె (ఫ్రాన్స్) తుడిచిపెడితే... తర్వాత రొనాల్డో ‘ఫిఫా’ వేటను కవాని (ఉరుగ్వే) ముగించాడు. దీంతో ప్రిక్వార్టర్స్‌లోనే మేటి జట్లు నాక్ ‘ఔట్’ అయ్యాయి. ఉరుగ్వే సుడి బాగుంది. రొనాల్డో జట్టును నాకౌట్ దెబ్బకొట్టింది. స్ట్రయికర్ కవాని ‘డబుల్’ ధమాకా పోర్చుగల్‌ను ఇంటిదారి పట్టించింది. మ్యాచ్‌లో ఉరుగ్వే ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. బంతి ఎక్కువగా ప్రత్యర్థి ఆధీనంలో ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం ఉరుగ్వేదే! ఒక దశలో ఉరుగ్వే ఆటగాళ్లు అలసిపోయినా... గెలిచేదాకా చెమట చిందించారు. ఈ పోరాటానికి, వీరి దుర్బేధ్యమైన డిఫెన్స్‌ను చూసి రొనాల్డోకు చిర్రెత్తిందేమో సహనం కోల్పోయి ‘ఎల్లో’కార్డు చూపించిన రిఫరీ మీదే ఒంటికాలిపై లేచాడు. స్ఫూర్తి మరిచాడు. సొచీ: పాపం... రొనాల్డోదీ మెస్సీ వ్యథే! పోర్చుగల్ జట్టుదీ అర్జెంటీనా బాటే! ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ అందించాలనుకున్న వీరిద్దరి ఆశలు ప్రిక్వార్టర్స్‌లోనే ఆవిరయ్యాయి. ప్రత్యర్థి పోరాటానికి సమకాలీన దిగ్గజాలు తలవంచక తప్పలేదు. నాకౌట్ దశ మొదలైన తొలి రోజే... ఫ్రాన్స్ దూకుడుకు అర్జెంటీనా, ఉరుగ్వే జోరులో పోర్చుగల్ గల్లంతయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి మొదలైన రెండో నాకౌట్ మ్యాచ్‌లో ఉరుగ్వే 2–1తో ‘యూరో’ చాంపియన్ పోర్చుగల్‌ను కంగుతినిపించింది. అనుభవజ్ఞుడైన ఫార్వర్డ్ ఆటగాడు కవాని ఆరంభం నుంచి అంతా తానై నడిపించాడు. తొలి, రెండో అర్ధభాగాల్లో ఒక్కో గోల్ చేసి ఉరుగ్వేకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఆట ఆరంభమైన ఏడు నిమిషాలకే సురెజ్ ఇచ్చిన పాస్ విజయవంతమైంది. పెనాల్టీ బాక్స్ వెలుపలి నుంచి సురెజ్ కొట్టిన షాట్‌ను స్ట్రయికర్ కవాని గోల్‌పోస్ట్ ముందే కాచుకున్నాడు. మెరుపు వేగంతో హెడర్ గోల్‌గా మలిచాడు. దీంతో ఉరుగ్వే శిబిరం సంబరాల్లో మునిగింది. స్కోరు సమం చేసేందుకు తొలి అర్ధభాగంలో పోర్చుగల్ స్ట్రయికర్లు పడ్డ కష్టమంతా వృథా అయింది. చురుగ్గా, తెలివిగా పాస్లిస్తున్నప్పటికీ ఏ ఒక్కటీ గోల్‌పోస్ట్‌ను ఛేదించలేకపోయింది. చివరకు రెండో అర్ధభాగం మొదలైన 10 నిమిషాలకు గురెరో ఇచ్చిన కార్నర్ పాస్‌ను పెపె (55వ ని.) గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అయితే స్కోరు సమమైన పోర్చుగల్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే మళ్లీ కవాని కదంతొక్కాడు. ఆట 62వ నిమిషంలో ఈ సారి బెటంకుర్ ఇచ్చిన పాస్‌ను కవాని ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తాకొట్టిస్తూ రెండో గోల్ సాధించాడు. ఆ తర్వాత పోర్చుగల్ ఎంత ప్రయత్నించినప్పటికీ గోల్ దిశగా సఫలం కాలేకపోయింది. ఆట 74వ నిమిషంలో కవాని కుడికాలికి గాయమవడంతో మైదానం వీడాడు. నొప్పితో విలవిలలాడుతున్న కవానికి రొనాల్డో సాయమందించాడు. ఈ మ్యాచ్ మొత్తం మీద పోర్చుగల్ షాట్లే ఎక్కువగా దూసుకొచ్చాయి. మ్యాచ్‌లో సింహభాగం వీరి స్ట్రయికర్ల ఆధీనంలోనే బంతి ఆడింది. దీంతో ఉరుగ్వే (273) కంటే పోర్చుగల్ (544) రెట్టింపు పాస్‌లను ప్లేస్ చేసింది. కానీ సరైన దిశ, ఫినిషింగ్ లేక మూల్యం చెల్లించుకుంది. పోర్చుగల్ 20 షాట్లు ప్రత్యర్థి పెనాల్టీ బాక్స్ దిశగా ఆడారు. ఇందులో ఐదుసార్లు లక్ష్యంపై గురిపెడితే ఒక్కసారి మాత్రమే గోల్ అయింది. మరోవైపు ప్రత్యర్థి షాట్లను ఎక్కడికక్కడ నిలువరించిన ఉరుగ్వే మాత్రం కొట్టింది ఐదు షాట్లే. లక్ష్యంపై మూడు సార్లు గురిపెట్టిన ఆ జట్టు రెండు సార్లు గోల్ చేయడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఉరుగ్వే తలపడనుంది. ► ‘ఫిఫా’ ప్రపంచకప్ చరిత్రలో ఉరుగ్వే వరుసగా 4 మ్యాచ్‌లు గెలవడం ఇది రెండోసారి. 1930లో ఉరుగ్వే విజేతగా నిలిచిన టోర్నీలో ఇలాగే జరిగింది. రిఫరీపై రొనాల్డో ఆగ్రహం పోర్చుగల్ అభిమాని కంట కన్నీరు ప్రపంచకప్‌లో నేడు ప్రిక్వార్టర్ ఫైనల్స్ బ్రెజిల్ x మెక్సికో రా.గం. 7.30 నుంచి బెల్జియం x జపాన్ రా.గం. 11.30 నుంచి సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం -
ఫిఫా ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం
ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలు.. ఈసారైనా ఈ దిగ్గజ ఆటగాడు కప్ గెలుస్తాడనుకున్నారు.. కానీ అతని పయనం మెస్సీ దారిలోనే నడిచింది. ప్రపంచకప్ తీరని కలగానే మిగిలింది క్రిస్టియానో రొనాల్డోకు.. ఎక్కువ సేపు బంతి ఆధీనంలో ఉన్నా గోల్ చేయలేని నివ్వెర పరిస్థితి రొనాల్డో సేనది.. లీగ్ దశలో ఓటమెరుగని ఉరుగ్వే.. అదే పోరాటం, కసితో ఆడి పోర్చుగల్‌పై పోరాడి గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఢీ కొట్టడానకి సై అంటోంది. సోచి : ఫిఫా ప్రపంచకప్‌లో మరో దిగ్గజ జట్టు పోరాటం ముగిసింది. ఎన్నో అంచనాల నడుమ సాకర్ సమరంలో అడుగుపెట్టిన పోర్చుగల్ కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో నాకౌట్ పోరులొ ఉరుగ్వే 2-1తో పోర్చుగల్‌పై ఘన విజయం సాధించింది. తొలి క్వార్టర్ ఫైనల్లో జులై 6న ఫ్రాన్స్‌తో తలపడనుంది. మ్యాచ్ ప్రారంభమైన ఏడు నిమిషాలకే రోనాల్డో సేనకు దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు ఉరుగ్వే ఫార్వర్డ్ ప్లేయర్ ఎడిన్సన్ కావనీ. సువారెజ్ ఇచ్చిన పాస్‌ను ఈ స్టార్ స్ట్రైకర్ హెడర్ గోల్ చేసి ఉరుగ్వేకు తొలి గోల్ అందించాడు. అనంతంరం ఫ్రికిక్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రొనాల్డో మిస్ చేశాడు. మరో గోల్ నమోదు కాకుండానే తొలి భాగం ముగిసింది. ద్వితీయార్థం ముగియగానే దాడిని మరింత పెంచిన రొనాల్డో సేనకు ఫలితం లభించింది. 55వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో ఇచ్చిన పాస్‌తో డిఫెండర్ పెపె గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోర్ సమం అయ్యాయి. పోర్చుగల్ శిభిరంలో ఆనంద ఎంతో సేపు నిలువలేదు. రొనాల్డో సేన డిఫెండింగ్ వైఫల్యంతో ఎడిన్సన్ కావనీ మరో అద్భుతమైన గోల్ చేయడంతో ఉరుగ్వే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్లు మరో గోల్ కోసం పోటీపడినా ఇరు జట్ల రక్షణశ్రేణి సమర్ధవంతంగా అడ్డుకున్నాయి. ఇక ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్‌లో కూడా మరో గోల్ నమోదు చేయలేకపోయిన పోర్చుగల్ ఓటమితో నిష్క్రమించింది. మ్యాచ్‌లో 63 శాతం బంతి పోర్చుగల్ ఆధీనంలో ఉన్నా గోల్ చేయటంలో స్ట్రైకర్లు విఫలమ్యారు. రొనాల్డో సేన ఎనిమిది సార్లు గోల్ కోసం ప్రయత్నించి విఫలమయింది. ఈ మ్యాచ్‌లో ఏకైక ఎల్లో కార్డు రిఫరీలు రొనాల్డోకు చూపించారు. పోర్చుగల్ 12 అనవసర తప్పిదాలు చేయగా ఉరగ్వే 13 తప్పిదాలు చేసింది. -
ఎవరిదో నాకౌట్ ‘కిక్’!
ఇదికాకుంటే... మరోటి అనుకునేందుకు లేదు. వెనుకబడితే... వెన్నులో వణుకు పుట్టినట్లే. గెలిస్తే ముందుకు... లేదంటే ఇంటికే. ‘కిక్’ ఎవరిదో... వారే నాకౌట్ విజేత! నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్ సమరం...! మాస్కో: అభిమానులను ఉర్రూతలూగిస్తూ... ఫుట్‌బాల్ ప్రపంచకప్ రెండో అంకానికి చేరింది. 32 జట్లు సగమై 16 మిగిలాయి. ఈ సగంలో మరింత ముందుకెళ్లే సగమేవో తేల్చేందుకు శనివారం నుంచే పోరు. కజన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచే దిగ్గజాలైన అర్జెంటీనా–ఫ్రాన్స్ మధ్య. ప్రిక్వార్టర్స్ దశలోనే తలపడుతున్న మాజీ విజేతలు ఈ రెండే కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో పోర్చుగల్‌ను ఉరుగ్వే ‘ఢీ’ కొట్టనుంది. చిత్రమేమంటే ఇప్పటివరకు కప్ గెలుచుకున్న 8 దేశాల్లో ఇటలీ ఈసారి అర్హత సాధించలేదు. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. నేటి ఫ్రాన్స్, అర్జెంటీనా మ్యాచ్‌తో ఓ మాజీ విజేత ఇంటిముఖం పట్టడం ఖాయం. మిగతా ఐదు మాజీ చాంపియన్లలో ఎన్నింటికి షాక్ తగులుతుందో చూడాలి. దృష్టంతా వారిపైనే... జట్లుగా తలపడుతున్నా అందరి కళ్లూ అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ, ఫ్రాన్స్ మెరిక ఆంటోన్ గ్రీజ్మన్ పైనే. వీరిద్దరూ టోర్నీలో చెరో గోలే చేసినా... ఆటతీరులో మొత్తం జట్టుపై వారి ప్రభావం తీసిపారేయలేనిది. బలాబలాల్లోకి వస్తే అర్జెంటీనాపై ఫ్రాన్స్‌కే కొంత మొగ్గు కనిపిస్తోంది. ఆ జట్టులోని పోగ్బా, ఎంబాపె ఫామ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో అర్జెంటీనాకు మెస్సీనే అన్నీ అవుతున్నాడు. లీగ్ దశలో ప్రత్యర్థులు అతడినే లక్ష్యం చేసుకోవడంతో జట్టుకు కష్టాలు ఎదురయ్యాయి. చివరి మ్యాచ్‌లో మార్కస్ రొజొ మెరిసినా... స్వతహాగా అతడు డిఫెండర్. మెస్సీకి హిగుయెన్, అగ్యురో తోడైతేనే ప్రత్యర్థిపై అర్జెంటీనా పైచేయి సాధించగలదు. ఫ్రాన్స్ లీగ్ దశలో ఓటమి లేకుండా ప్రిక్వార్టర్స్ చేరగా, అర్జెంటీనా మిశ్రమ ఫలితాలతో గట్టెక్కింది. ప్రపంచ కప్ చరిత్రలో ఫ్రాన్స్‌పై రెండుసార్లూ అర్జెంటీనాదే విజయం. 1930లో 1–0తో, 1978లో 2–1తో గెలుపొందింది. రొనాల్డో వర్సెస్ సురెజ్ సోచిలో శనివారం అర్ధరాత్రి 11.30కు జరుగనున్న మరో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో పోర్చుగల్ తో ఉరుగ్వే తలపడనుంది. 1972 తర్వాత ఈ రెండు జట్లు మరోసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఉరుగ్వేతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకసారి నెగ్గిన పోర్చుగల్, మరోసారి ‘డ్రా’తో సరిపెట్టుకుంది. పోర్చుగల్ ఆశలన్నీ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోపైనే. ఈ టోర్నీలో అతను ఇప్పటికి నాలుగు గోల్స్ చేశాడు. మరోవైపు ఉరుగ్వే స్టార్ ఆటగాడు సురెజ్ ఆటతీరుపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ జూన్ 30 అర్జెంటీనా x ఫ్రాన్స్ రాత్రి గం. 7.30 నుంచి పోర్చుగల్ x ఉరుగ్వే రాత్రి గం. 11.30 నుంచి జూలై 1 స్పెయిన్ x రష్యా రాత్రి గం. 7.30 నుంచి క్రొయేషియా x డెన్మార్క్ రాత్రి గం. 11.30 నుంచి జూలై 2 బ్రెజిల్ x మెక్సికో రాత్రి గం. 7.30 నుంచి బెల్జియం x జపాన్ రాత్రి గం. 11.30 నుంచి జూలై 3 స్వీడన్ x స్విట్జర్లాండ్ రాత్రి గం. 7.30 నుంచి కొలంబియా x ఇంగ్లండ్ రాత్రి గం. 11.30 నుంచి సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం -
ఉరుగ్వే ‘తీన్’మార్
రెండు జట్లూ ఇప్పటికే నాకౌట్‌కు చేరాయి. ఇక మ్యాచ్ గ్రూప్ ‘ఎ’లో టాపర్ ఫలితం కోసమే. ఇందులో కీలక ఆటగాళ్లు గాజిన్ స్కీ, చెరిషెవ్ల తప్పిదాలతో ఆతిథ్య రష్యా దెబ్బతినగా... స్టార్ ఆటగాడు సురెజ్ జోరుతో ఉరుగ్వే ‘తీన్’మార్ మోగించింది. లీగ్ దశను అజేయంగా ముగించింది. మ్యాచ్‌లో ఓ సెల్ఫ్ గోల్, ఓ రెడ్ కార్డ్ నమోదవడం కొంత ఆసక్తి రేపింది. సమారా: తొలి రెండు మ్యాచ్‌ల్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్‌లను ఓడించిన రష్యా... బలమైన ఉరుగ్వే ముందు తలొంచింది. ప్రపంచ కప్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 0–3 తేడాతో పరాజయం పాలైంది. ఉరుగ్వేకు లూయీ సురెజ్ (10వ నిమిషం)తో పాటు ఎడిన్సన్ కవానీ (90వ నిమిషం) గోల్స్ అందించగా, రష్యా ఆటగాడు చెరిషెవ్ (23వ నిమిషం) సెల్ఫ్ గోల్‌తో ప్రత్యర్థి పనిని మరింత సులువు చేశాడు. ఉరుగ్వే నాకౌట్లో ఈ నెల 30న గ్రూప్ ‘బి’ రన్నరప్‌తో, రష్యా జూలై 1న గ్రూప్ ‘బి’ టాపర్‌తో తలపడతాయి. రష్యా ఆటగాడు స్మొల్నికవ్ (27వ, 36వ నిమిషంలో ఎల్లో కార్డ్) రెడ్ కార్డ్‌ను ఎదుర్కొని తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. కీలక ఆటగాళ్ల తప్పిదాలతో సొంతగడ్డ అనుకూలతతో కప్‌లో రాణిస్తున్న రష్యాకు ఈ మ్యాచ్‌లో ఏదీ కలిసిరాలేదు. కీలక ఆటగాళ్లు ల్యూరీ గాజిన్ స్కీ, చెరిషెవ్ల పొరపాట్లు ప్రత్యర్థికి అనుకోని వరంలా మారాయి. పెనాల్టీ ఏరియా ముందు గాజిన్ స్కీ ఫౌల్ చేయడంతో ఉరుగ్వేకు 10వ నిమిషంలోనే ఫ్రీ కిక్ లభించింది. కీపర్ అకిన్ఫీవ్ను తప్పిస్తూ దీనిని సురెజ్ తెలివిగా తక్కువ ఎత్తులోనే గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టుకు ఆధిక్యం అందించాడు. రష్యాకు కూడా వెంటనే కార్నర్ కిక్ రూపంలో ఓ అవకాశం దక్కింది. దానిని డియుబా తలతో గోల్ పోస్ట్‌లోకి నెట్టే యత్నం చేసినా దూరంగా వెళ్లింది. టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో మూడు గోల్స్‌తో హీరోగా నిలిచిన చెరిషెవ్... 23వ నిమిషంలో మరో పెద్ద పొరపాటు చేశాడు. డిగో లక్సాల్ట్ (ఉరుగ్వే) షాట్‌ను తప్పించే యత్నంలో గురితప్పి అతడు అనూహ్యంగా సెల్ఫ్ గోల్ చేశాడు. ఓవైపు ఉరుగ్వే దూకుడుగా దాడులు చేస్తుండగా... స్మొల్నికవ్ 9 నిమిషాల వ్యవధిలో రెండు ఎల్లో కార్డ్‌లకు గురై మైదానాన్ని వీడాడు. దీంతో రష్యా 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. పట్టు జారకుండా... 2–0తో సురక్షిత స్థితిలో ఉండటంతో ఉరుగ్వే ప్రశాంతంగా ఆడుతూ రెండో భాగంలో పట్టుజారకుండా చూసుకుంది. 90వ నిమిషంలో డిఫెండర్ డీగో గొడిన్ నుంచి అందిన బంతిని కవాని పొరపాటు లేకుండా గోల్‌గా మలిచాడు. సౌదీ... చివరకు గెలిచింది వోల్గోగ్రాడ్: సౌదీ అరేబియా విజయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ ‘ఎ’లో సోమవారం ఆఖరి మ్యాచ్‌లో సౌదీ జట్టు 2–1తో ఈజిప్ట్‌పై గెలిచింది. ఈ ప్రపంచకప్‌లోనే అతిపెద్ద వయస్కుడైన 45 ఏళ్ల ఈజిప్ట్ గోల్‌కీపర్ ఎసామ్ ప్రత్యర్థి పెనాల్టీ కిక్‌ను అడ్డుకోవడం అకట్టుకుంది. 22వ నిమిషంలో ఈజిప్ట్ మిడ్‌ఫీల్డర్ సలాæ గోల్ చేయడంతో 1–0 ఆధిక్యం లోకి వెళ్లింది. 39వ నిమిషంలో మువల్లాద్ పెనాల్టీ కిక్‌ను ఎసామ్ అడ్డుకున్నాడు. కానీ నిమిషాల వ్యవధిలోనే మరో పెనాల్టీని పొందిన సౌదీ అరేబియాకు ఈ సారి సల్మాన్ ఇంజ్యూరీ టైమ్(45+6వ ని)లో గోల్ సాధించి పెట్టాడు. చివర్లో సలీమ్ కూడా ఇంజ్యూరీ టైమ్ (90+5వ ని.)లో గోల్ చేసి సౌదీని గెలిపించాడు. -
ప్రిక్వార్టర్స్‌లో ఉరుగ్వే
రోస్తోవ్–ఆన్–డాన్: వరుసగా రెండో విజయంతో మాజీ చాంపియన్ ఉరుగ్వే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. సౌదీ అరేబియాతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 1–0తో గెలిచింది. కెరీర్లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న స్టార్ ప్లేయర్ లూయిస్ సురెజ్ ఆట 23వ నిమిషంలో గోల్ చేసి ఉరుగ్వేకు 1–0తో ఆధిక్యం అందించాడు. అనంతరం చివరిదాకా ఈ ఆధిక్యం కాపాడుకున్న ఉరుగ్వే విజయం ఖాయం చేసుకుంది. ఫలితంగా గ్రూప్ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన రష్యా, ఉరుగ్వే ఆరు పాయింట్లతో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... రెండేసి పరాజయాలతో సౌదీ అరేబియా, ఈజిప్ట్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
ఉరుగ్వే... ఉత్కంఠను అధిగమించి
కఠినమైన పోటీని ఎదుర్కొన్నా, చివరి వరకు పైచేయి కాకున్నా, ఎదురుదాడి చేయలేకపోయినా, బంతిపై నియంత్రణతో, మ్యాచ్‌పై పట్టు నిలబెట్టుకొని ఉరుగ్వే గెలిచింది. ప్రపంచ కప్ వేటను నిదానంగా ప్రారంభిస్తుందని పేరున్న ఆ జట్టు... దానికి తగ్గట్లే భారీ తేడా ఏమీ లేకుండానే నెగ్గింది. కీలక ఆటగాడైన మొహమ్మద్ సలా గైర్హాజరీలో ఈజిప్ట్‌కు పోరాడామన్న సంతృప్తి మాత్రమే మిగిలింది. ఎకతెరినాబర్గ్: అద్భుతం అనదగ్గ ప్రదర్శనలు లేకుండా సాదాసీదాగా సాగిన మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై ఉరుగ్వేదే పైచేయి అయింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 1–0తో గెలిచింది. 89వ నిమిషంలో ఉరుగ్వే డిఫెండర్ జిమినెజ్ కొట్టిన ఏకైక గోల్ రెండు జట్ల మధ్య తేడా చూపింది. ఉరుగ్వేకు ప్రపంచ కప్ తొలి పోరులో నెగ్గడం 48 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఆధిపత్యం కోసం పోటాపోటీగా, మిడ్ ఫీల్డ్ సమరంలా సాగిన మ్యాచ్‌లో గోల్ కోసం ఇరు జట్లు శ్రమించాల్సి వచ్చింది. దాడి మొదలు పెట్టింది ఉరుగ్వేనే అయినా, ఈజిప్ట్ కూడా దీటుగా నిలిచింది. తొలి అరగంటలో డిఫెన్స్‌తో పాటు ప్రత్యర్థి ప్రధాన ఆటగాళ్లు లక్ష్యంగా ప్రతి దాడులు చేసింది. మొదటి గోల్ అవకాశం మాత్రం ఉరుగ్వే స్టార్ సురెజ్కే వచ్చింది. కానీ, తక్కువ ఎత్తులో వచ్చిన క్రాస్‌ను అతడు సద్వినియోగం చేయలేకపోయాడు. ఒకింత ఒత్తిడితో ప్రారంభమైన రెండో భాగంలో ఉరుగ్వేకు కొంత మొగ్గు కనిపించగా ఈజిప్ట్‌కు ఆటగాళ్ల గాయాలు అనుకోని దెబ్బగా మారాయి. దాడుల తీవ్రత పెంచేందుకు ఆ జట్టు కోచ్ పలు మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే, సలా లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ అవేవీ గోల్‌ను చేర లేదు. ఈజిప్ట్ డిఫెన్స్‌ను గుక్క తిప్పుకోకుండా చేసిన సురెజ్, ఎడిన్సన్ కవానీలు అవకాశాలను చేజార్చడంతో మ్యాచ్ చివరకు డ్రా అయ్యేలా కనిపించింది. అయితే 89వ నిమిషంలో జిమినెజ్ మాయ చేశాడు. డిగో గొడిన్ ద్వారా కుడివైపు నుంచి దూసుకొచ్చిన ఫ్రీ కిక్‌ను ఒడుపుగా గోల్ పోస్ట్‌లోకి పంపి ఉరుగ్వే తరఫున ఖాతా తెరిచాడు. ఎప్పటిలానే రక్షణాత్మక ఆటకు ప్రాధాన్యమిచ్చిన ఈజిప్ట్‌కు ఒక్క కార్నర్ కిక్ కూడా లభించకపోవడం, సలా గైర్హాజరీలో స్ట్రయికర్ మార్వన్ ఒంటరిగా మిగిలిపోవడం దెబ్బతీసింది.