
రోస్తోవ్–ఆన్–డాన్: వరుసగా రెండో విజయంతో మాజీ చాంపియన్ ఉరుగ్వే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. సౌదీ అరేబియాతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 1–0తో గెలిచింది. కెరీర్‌లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న స్టార్ ప్లేయర్ లూయిస్ సురెజ్ ఆట 23వ నిమిషంలో గోల్ చేసి ఉరుగ్వేకు 1–0తో ఆధిక్యం అందించాడు.
అనంతరం చివరిదాకా ఈ ఆధిక్యం కాపాడుకున్న ఉరుగ్వే విజయం ఖాయం చేసుకుంది. ఫలితంగా గ్రూప్ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన రష్యా, ఉరుగ్వే ఆరు పాయింట్లతో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... రెండేసి పరాజయాలతో సౌదీ అరేబియా, ఈజిప్ట్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
Comments
Please login to add a commentAdd a comment