ఫిఫా వరల్డ్‌ కప్‌; సెమీస్‌కు ఫ్రాన్స్‌ | France Enters FIFA 2018 Semis By 2-0 Victory On Uruguay | Sakshi
Sakshi News home page

ఫిఫా వరల్డ్‌ కప్‌; సెమీస్‌కు ఫ్రాన్స్‌

Jul 6 2018 9:41 PM | Updated on Jul 6 2018 9:56 PM

France Enters FIFA 2018 Semis By 2-0 Victory On Uruguay - Sakshi

నిజ్ని నవ్‌గొరొడ్‌:  రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా 2018 ప్రపంచ కప్‌ టోర్నీలో ఫ్రాన్స్‌ జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 0-2 తేడాతో ఫ్రాన్స్‌ విజయం సాధించింది. లీగ్‌ దశలో ప్రత్యర్థులకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వని ఉరుగ్వే కీలకమైన మ్యాచ్‌లో చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. 39వ నిమిషంలో రఫెల్‌ వారన్‌ మొదటి గోల్‌ చేయడం ద్వారా ఫస్టాఫ్‌లో ఫ్రాన్స్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట రెండో భాగంలోనూ అదే జోరుతో ప్రత్యర్థి గోల్‌పోస్టుపైకి పదే పదే దూసుకెళ్లింది. 61వ నిమిషంలో ఆంటోనీ గ్రిజ్‌మన్‌ రెండో గోల్‌ సాధించడంతో ఫ్రాన్స్‌ విజయావకాశాల్ని మరింత పదిలం చేసుకుంది. మ్యాచ్‌ ఏ దశలోనూ ప్రత్యర్థిని నిలువరించలేకోపోయిన ఉరుగ్వే ఓటమిభారంతో ఇంటిబాటపట్టింది. 

గెట్‌ రెడీ: రెండో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌-బెల్జియంలు తలపడనున్నాయి. శుక్రవారం రాత్రి గం.11.30 నుంచి ఈ మ్యాచ్‌ సోనీ ఈఎస్‌పీఎన్,  సోనీ టెన్‌–2, 3లలో ప్రత్యక్ష ప్రసారంకానుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement