FIFA World Cup 2022 Uruguay Vs Ghana: గత ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన మాజీ చాంపియన్ ఉరుగ్వే ఈ సారి గ్రూప్ దశకే పరిమితమైంది. ఫిఫా వరల్డ్‌కప్-2022లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 2–0 తేడాతో ఘనాను ఓడించింది. జట్టు తరఫున గియార్గియాన్ డి అరాస్కెటా ఒక్కడే రెండు గోల్స్ (26వ, 32వ నిమిషంలో) కొట్టాడు. అయితే ఉరుగ్వే ముందంజ వేసేందుకు ఈ గెలుపు ఉపయోగపడలేదు.
గ్రూప్-హెచ్‌లో ఉన్న కొరియా, ఉరుగ్వే 4 పాయింట్లతో సమానంగా నిలిచాయి. గోల్స్ అంతరం కూడా ‘0’తో సమం అయింది. దాంతో జట్టు చేసిన గోల్స్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. కొరియా 4 గోల్స్ చేయగా, ఉరుగ్వే 2 గోల్స్ మాత్రమే చేసింది. దాంతో కొరియా ముందంజ వేయగా ఉరుగ్వే నిష్క్రమించింది.
చదవండి: FIFA WC 2022: రెండు గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! భారీ షాకిచ్చిన జపాన్
Comments
Please login to add a commentAdd a comment