knock out
-
సూపర్-8కు సై.. టీమిండియాను భయపెడుతున్న గత రికార్డులు
టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూపు స్టేజీలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు గ్రూపు-ఎ నుంచి సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8 రౌండ్లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో భారత్ తలపడనుంది. ఇప్పటికే గ్రూపు-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, భారత్ తమ బెర్త్‌లు ఖారారు చేసుకోగా.. మరో బెర్త్ కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్-8లో భారత్ షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలిద్దాం.టీ20 వరల్డ్ కప్ టీమిండియా సూపర్ 8 షెడ్యూల్జూన్ 20 : భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆంటిగ్వాజూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, సెయింట్ లూసియాఅదే విధంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో సూపర్-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.సూపర్-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే?టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సూపర్ 8, సూపర్ 10, సూపర్ 12 రౌండ్లలో మ్యాచ్‌లను నిర్వహిస్తుంటుంది. అయితే ఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్‌ను సూపర్ 8 రౌండ్లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. 12 సంవత్సరాల తర్వాత సూపర్-8 ఫార్మాట్‌ను ఐసీసీ తిరిగి మళ్లీ తీసుకువచ్చింది. చివరిగా 2012 టీ20 వరల్డ్‌కప్ సూపర్ ఎయిట్ ఫార్మాట్లో జరిగింది. సూపర్-8 ఫార్మాట్లో భారత జట్టు ట్రాక్ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇప్పటి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ సూపర్ 8లో 12 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించగా, ఎనిమిదింట ఓటమి పాలైంది. టీమిండియా విన్నింగ్ శాతం 33.3 శాతంగా ఉండగా.. ఓటమి శాతం 66.67% గా ఉంది.టీ20 వరల్డ్‌కప్-2007లో సూపర్-8లో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అదే విధంగా 2009, 2010 పొట్టి ప్రపంచకప్‌లో సూపర్-8లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది.ఆ తర్వాత 2012 వరల్డ్‌కప్‌లో రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. అయితే ఈ నాలుగు వరల్డ్‌కప్‌లలో కూడా భారత జట్టు ఎంఎస్ ధోని నాయకత్వంలోనే బరిలోకి దిగింది. 2007 వరల్డ్‌కప్‌ను ధోని సారథ్యంలోనే టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ 12 ఏళ్ల తర్వాత తొలిసారి సూపర్-8 ఫార్మాట్లో ఆడనుంది. -
ఐపీఎల్ 2024 నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
ఐపీఎల్ 2024 సీజన్ నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై లీకులు వెలువడ్డాయి. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్ ఈ వివరాలను వెల్లడించింది. ఓవరాల్‌గా 74 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. తొలి విడతలో 21 మ్యాచ్‌లకు సంబంధించి ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇవాళ సాయంత్రం మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌తో పాటు నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనుంది. మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1, మే 22న అదే నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెపాక్ వేదికగా క్వాలిఫయర్-2 జరుగనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 8న జరిగే రెండో విడత షెడ్యూల్ తొలి మ్యాచ్‌లో సీఎస్కే.. కేకేఆర్‌తో తలపడనున్నట్లు తెలుస్తుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుందని సమాచారం. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తున్నారు. ఎన్నికల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అన్ని కసర్తులు పూర్తి చేసింది. దేశంలో మొత్తం ఏడు విడతల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న దేశావ్యాప్తంగా కౌంటింగ్ జరుగనుంది. ఈ తేదీలను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌లు క్లాష్ కాకుండా గవర్నింగ్ బాడీ జాగ్రత్త పడనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. మే 20న మినహాయించి అన్ని రోజులు మ్యాచ్‌లు జరుగుతాయని తెలుస్తుంది. లీగ్ దశ మ్యాచ్‌ల అనంతరం ఒక రోజు బ్రేక్ తీసుకుని మే 21న తిరిగి నాకౌట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. -
వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..?
2023 వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ నిన్న (జూన్ 27) విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తొలి దశ మ్యాచ్‌లు నవంబర్ 12 వరకు జరుగుతాయి. అనంతరం రెండు సెమీఫైనల్స్, నవంబర్ 19 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో తొలి దశ మ్యాచ్‌లు జరిగే విధానాన్ని రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటారు. అంటే టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు (10) మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన తొలి దశలో 10 జట్లు 9 మ్యాచ్‌ల్లో పోటీపడతాయి. తొలి దశ ముగింపు సమయానికి టాప్-4లో ఉండే నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి. ఇక్కడి నుంచి నాకౌట్ దశ (ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది) మొదలవుతుంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో (ముంబై) తొలి దశ అనంతరం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. ఆ మరుసటి రోజు (నవంబర్ 16) జరిగే రెండో సెమీస్‌లో తొలి దశ అనంతరం రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో ప్లేస్‌లో ఉన్న జట్టును ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. కాగా, 2019 వన్డే వరల్డ్‌కప్ కూడా ఇదే ఫార్మాట్లో జరిగిన విషయం తెలిసిందే. భారత్ వార్మప్ మ్యాచ్‌లు.. సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) అక్టోబర్ 3: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (తిరువనంతపురం) భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-2 (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్ 11: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (బెంగళూరు) నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు.. నవంబర్ 15: సెమీఫైనల్-1 ఏ1 వర్సెస్ ఏ4 (ముంబై) నవంబర్ 16: సెమీఫైనల్-2 ఏ2 వర్సెస్ ఏ3 (కోల్‌కతా) నవంబర్ 19: ఫైనల్ సెమీస్-1 విజేత వర్సెస్ సెమీస్-2 విజేత (అహ్మదాబాద్) -
FIFA WC: ఘనాపై గెలిచినా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన మాజీ చాంపియన్
FIFA World Cup 2022 Uruguay Vs Ghana: గత ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన మాజీ చాంపియన్ ఉరుగ్వే ఈ సారి గ్రూప్ దశకే పరిమితమైంది. ఫిఫా వరల్డ్‌కప్-2022లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 2–0 తేడాతో ఘనాను ఓడించింది. జట్టు తరఫున గియార్గియాన్ డి అరాస్కెటా ఒక్కడే రెండు గోల్స్ (26వ, 32వ నిమిషంలో) కొట్టాడు. అయితే ఉరుగ్వే ముందంజ వేసేందుకు ఈ గెలుపు ఉపయోగపడలేదు. గ్రూప్-హెచ్లో ఉన్న కొరియా, ఉరుగ్వే 4 పాయింట్లతో సమానంగా నిలిచాయి. గోల్స్ అంతరం కూడా ‘0’తో సమం అయింది. దాంతో జట్టు చేసిన గోల్స్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. కొరియా 4 గోల్స్ చేయగా, ఉరుగ్వే 2 గోల్స్ మాత్రమే చేసింది. దాంతో కొరియా ముందంజ వేయగా ఉరుగ్వే నిష్క్రమించింది. చదవండి: FIFA WC 2022: రెండు గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! భారీ షాకిచ్చిన జపాన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup 2022: ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. ఎందుకిలా..?
ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్ని జట్లు తమ ఆఖరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు (ఒకే గ్రూప్‌కు చెందినవి) ఒకే సమయంలో ఎందుకు ఆడతాయన్న విషయం చాలామంది సాకర్ ఫాలోవర్స్‌కు అర్ధం కాకపోవచ్చు. అయితే దీని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉందన్నది అందరూ తెలుసుకోవాలి. వివరాల్లోకి వెళితే.. స్పెయిన్ వేదికగా జరిగిన 1982 వరల్డ్‌కప్‌లో అల్జీరియా తదుపరి రౌండ్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు వెస్ట్ జర్మనీ, ఆస్ట్రియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై ఆధారపడి ఉన్నాయి. దీంతో గ్రూప్ మ్యాచ్‌లన్నీ ముగిసిన అల్జీరియా, ఆ మ్యాచ్ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. ఆ మ్యాచ్‌లో పటిష్టమైన వెస్ట్ జర్మనీ రెండు గోల్స్ తేడాతో గెలిస్తే అల్జీరియా తర్వాతి రౌండ్‌కు చేరుతుంది. ఈ క్రమంలో ఆట మొదలయ్యాక 11 నిమిషాల్లోనే గోల్ చేసిన వెస్ట్ జర్మనీ.. ఆ తర్వాత గోల్ చేసే అవకాశం వచ్చినా ఉదాసీనంగా వ్యవహరించి, అల్జీరియా ఇంటిదారి పట్టడానికి పరోక్ష కారణమైంది. కారణం ఏంటంటే.. అల్జీరియా తమ గ్రూప్ దశ ఓపెనింగ్ మ్యాచ్‌లో వెస్ట్ జర్మనీపై విజయం సాధించింది. ఈ అక్కసుతో వెస్ట్ జర్మనీ.. అల్జీరియా తదుపరి రౌండ్‌కు చేరకుండా చావు దెబ్బకొట్టింది. వెస్ట్ జర్మనీ ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ మోసాన్ని అప్పట్లో సాకర్ ప్రపంచం మొత్తం వేలెత్తి చూపింది. వెస్ట్ జర్మనీని సస్పెండ్ చేయాలని అల్జీరియా.. ఫిఫా గవర్నింగ్ బాడీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన వెస్ట్ జర్మనీ.. అల్జీరియాకు చేసిన మోసానికి ఫలితం అనుభవించింది. వెస్ట్ జర్మనీ.. నాటి చారిత్రక ఫైనల్లో ఇటలీ చేతిలో 1-3 గోల్స్ తేడాతో చావుదెబ్బ తినింది. అల్జీరియాతో మ్యాచ్‌లో వెస్ట్ జర్మనీ తొండాట ఆడిందని విచారణలో తెలుసుకున్న ఫిఫా.. ఆ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ, ఆ తర్వాతి వరల్డ్‌కప్ (1986) నుంచి రూల్స్ మాత్రం మార్చింది. గ్రూప్ స్టేజ్‌లో అన్ని జట్ల తమ చివరి మ్యాచ్‌లు ఒకే సమయంలో ఆడాలని రూల్స్‌ను సవరించింది. ఇలా చేయడం వల్ల ఏ జట్టు ఉద్దేశపూర్వకంగా మరో జట్టుకు (ఒకే గ్రూప్) నష్టం కలిగించే విధంగా వ్యవహరించే అవకాశం ఉండదు. నాకౌట్స్‌కు చేరాలంటే ఓ మ్యాచ్ ఫలితంపై మరో జట్టు భవితవ్యం ఆధార పడే ఆస్కారం ఉండదు. నాకౌట్స్‌కు చేరే క్రమంలో ఆఖరి గ్రూప్ మ్యాచ్ కీలకం కాబట్టి ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. 1986 నుంచి ఆఖరి గ్రూప్ మ్యాచ్ విషయంలో ఇదే పద్దతి పాటిస్తుంది. కాగా, నాటి రూల్ ప్రకారం ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ తొలి 8 రోజులు రోజుకు నాలుగేసి మ్యాచ్‌లు, ఒక్కోటి ఒక్కో సమయంలో (మధ్యాహ్నం 3:30, సాయంత్రం 6:30, రాత్రి 9:30, అర్ధరాత్రి 12:30) జరిగాయి. రౌండ్ ఆఫ్ 16కి (నాకౌట్) ముందు జరగాల్సిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లు (ఒకే గ్రూప్‌కు చెందినవి) మాత్రం రెండూ ఒకే సమయంలో (రాత్రి 8:30, అర్ధరాత్రి 12:30) జరుగుతున్నాయి. నవంబర్ 29 నుంచి ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. -
ఫిఫా అండర్-17 వరల్డ్ కప్.. లీగ్ దశలోనే భారత్ అవుట్
భువనేశ్వర్: ప్రపంచ అండర్–17 మహిళల ఫుట్‌బాల్ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో 0–8తో ఓడిన భారత్... శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 0–3తో మొరాకో చేతిలో పరాజయం పాలైంది. మొరాకో తరఫున దోహా ఎల్ మదానీ (51వ ని.లో), యాస్మీన్ జౌహర్ (62వ ని.లో), జెనా షరీఫ్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ ఈనెల 17న జరిగే నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్‌తో ఆడుతుంది. బ్రెజిల్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతం బ్రెజిల్, అమెరికా నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో... మూడు పాయింట్లతో మొరాకో రెండో స్థానంలో ఉంది. -
సౌతాఫ్రికా పై పాకిస్తాన్ విజయం
-
'మరో నాకౌట్ విజయం సాధిస్తా'
న్యూఢిల్లీ: తన ప్రొఫెషనల్ కెరీర్లో ఇప్పటివరకు ఎనిమిది బౌట్లలో పోటీపడి ఏడింటిలో నాకౌట్ ద్వారా విజయాలు సాధించిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అదే జోరును కొనసాగిస్తానని అన్నాడు. ముంబైలో శనివారం జరిగే బౌట్లో జుల్పికర్ మైమైతియాల్ (చైనా)తో విజేందర్ తలపడనున్నాడు. విజేందర్ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్ కాగా... జుల్పికర్ డబ్ల్యూబీఓ ఒరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్. ఈ బౌట్లో గెలిచిన బాక్సర్‌కు ఏకకాలంలో రెండు టైటిల్స్ లభిస్తాయి. ‘నా కోసం ప్రార్థించండి. మరో నాకౌట్ విజయం కోసం వంద శాతం కృషి చేస్తాను. సాధ్యమైనంత తొందరగా బౌట్‌ను ముగిస్తాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. -
అమీర్ ఖాన్‌కు నాకౌట్ పంచ్!
లాస్‌వెగాస్: బ్రిటన్ బాక్సర్ అమీర్ ఖాన్.. మెక్సికన్ ప్రొఫెషనల్ బాక్సర్ సాల్ కానెలో అల్వరేజ్ చేతిలో నాకౌట్ ఓటమి చవిచూశాడు. ఆరు రౌండ్ల పోరులో అమీర్ ఖాన్ ఆది నుంచీ దూకుడును ప్రదర్శించినా చివరి రౌండ్లో క్షణకాలం పాటు కోల్పోయిన ఏకాగ్రత మూలంగా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో మిడిల్ వెయిట్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్ షిప్‌ను సాల్ కానెలో నిలుపుకున్నడు. బాక్సింగ్ రింగ్‌లో మొదటి రౌండ్ నుంచి చురుగ్గా కదిలిన అమీర్ ఖాన్ మెరుపులాంటి పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. మూడు, నాలుగో రౌండ్లలో అల్వరేజ్పై పంచ్‌ల వర్షం కురిపించాడు. అయితే ఐదో రౌండ్‌కు వచ్చే సరికి అల్వరేజ్ చెలరేగి తన ఛాంపియన్ గేమ్‌ను అమీర్‌కు రుచిచూపించాడు. చివరి రౌండ్లో అదే జోరును కొనసాగిస్తూ.. మెరుపులాంటి రైట్ హ్యాండ్‌తో దాడి చేయడంతో అమీర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో మరో 23 సెకన్ల సమయం ఉందనగా మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ అనంతరం అల్వరేజ్ 'మాన్స్టర్ పంచ్'కు అభినందనలు తెలుపుతూ అమీర్ ట్వీట్ చేశాడు. -
షాదాబ్‌కు 5 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ పేట్రియాట్స్ జట్టు బౌలర్ షాదాబ్ (5/36) ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పేట్రియాట్స్ జట్టు 14 పరుగుల తేడాతో హైదరాబాద్ వాండరర్స్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అజిత్ సింగ్ (75) అర్ధ సెంచరీతో రాణించగా... అక్రమ్ అలీ 35, షాబాద్ 30 పరుగులు చేశారు. హైదరాబాద్ వాండరర్స్ బౌలర్లు అజయ్, త్రిషంక్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ వాండరర్స్ 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. సయ్యద్ అస్కారి (51) అర్ధ సెంచరీతో చెలరేగగా... అజయ్ 35 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో బౌలర్ రాహుల్ (4/10) శ్రమించినప్పటికీ చీర్‌ఫుల్ చమ్స్కు విజయం చేకూరలేదు. హెచ్‌జీసీ జట్టు రెండు వికెట్ల తేడాతో చీర్‌ఫుల్ చమ్స్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చే సిన చీర్‌ఫుల్ చమ్స్ 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. వినీత్ (49), రవితేజ (34) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన హెచ్‌జీసీ 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది. ఉమా మహేశ్వర్ (51) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డెక్కన్ వాండరర్స్: 121 (యాది రెడ్డి 3/23); విజయానంద్: 94. శాంతి ఎలెవన్: 98 (ప్రసాద్ 50; రోహిత్ 3/3);రోహిత్ ఎలెవన్: 99/1(రంజీత్ 62). రెడ్ హిల్స్: 161 (మీసుమ్ అబు 51; తాహ 4/38); ఇన్కమ్ టాక్స్: 164/6 (శివచరణ్ 62, మహ్మద్ 3/21).