ఐపీఎల్ 2024 సీజన్ నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై లీకులు వెలువడ్డాయి. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ ఈ వివరాలను వెల్లడించింది. ఓవరాల్‌గా 74 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. తొలి విడతలో 21 మ్యాచ్‌లకు సంబంధించి ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇవాళ సాయంత్రం మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌తో పాటు నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనుంది. మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1, మే 22న అదే నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెపాక్ వేదికగా క్వాలిఫయర్-2 జరుగనున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 8న జరిగే రెండో విడత షెడ్యూల్ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే.. కేకేఆర్‌తో తలపడనున్నట్లు తెలుస్తుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుందని సమాచారం. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తున్నారు. ఎన్నికల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అన్ని కసర్తులు పూర్తి చేసింది.
దేశంలో మొత్తం ఏడు విడతల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న దేశావ్యాప్తంగా కౌంటింగ్ జరుగనుంది. ఈ తేదీలను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌లు క్లాష్ కాకుండా గవర్నింగ్ బాడీ జాగ్రత్త పడనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. మే 20న మినహాయించి అన్ని రోజులు మ్యాచ్‌లు జరుగుతాయని తెలుస్తుంది. లీగ్ దశ మ్యాచ్‌ల అనంతరం ఒక రోజు బ్రేక్ తీసుకుని మే 21న తిరిగి నాకౌట్ మ్యాచ్‌లు మొదలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment