IPL schedule
-
IPL 2024 Full Schedule: ఐపీఎల్ 2024 రెండో విడత షెడ్యూల్ విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ రెండో విడత షెడ్యూల్ ఇవాళ (మార్చి 25) విడుదలైంది. తొలి విడతలో 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా మిగతా 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రస్తుత సీజన్లో ఓవరాల్‌గా 74 మ్యాచ్‌లు (ప్లే ఆఫ్స్‌తో కలుపుకుని) జరగాల్సి ఉన్నాయి. సీఎస్కే వర్సెస్ కేకేఆర్.. రెండో విడత షెడ్యూల్ మ్యాచ్‌లు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ విడత ఆరంభ మ్యాచ్‌లో సీఎస్కే.. కేకేఆర్‌తో తలపడనుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటించారు. ఎన్నికల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అన్ని కసర్తులు పూర్తి చేసిన అనంతరం ఇవాళ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. IPL 2024 SCHEDULE....!!! ⭐ pic.twitter.com/M80vWCBE40 — Johns. (@CricCrazyJohns) March 25, 2024 చెన్నైలో ఫైనల్.. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనుంది. మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1, మే 22న అదే నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెపాక్ వేదికగా క్వాలిఫయర్-2 జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. హైదరాబాద్‌లో ఐదు.. రెండో విడతలో హైదరాబాద్‌లో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 25- సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ (రాత్రి 7:30 గంటలకు) మే 2- సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (రాత్రి) మే 8- సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో (రాత్రి) మే 16-సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్ (రాత్రి) మే 19- సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్ (రాత్రి) -
ఐపీఎల్ 2024 నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
ఐపీఎల్ 2024 సీజన్ నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై లీకులు వెలువడ్డాయి. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్ ఈ వివరాలను వెల్లడించింది. ఓవరాల్‌గా 74 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. తొలి విడతలో 21 మ్యాచ్‌లకు సంబంధించి ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇవాళ సాయంత్రం మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌తో పాటు నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనుంది. మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1, మే 22న అదే నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెపాక్ వేదికగా క్వాలిఫయర్-2 జరుగనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 8న జరిగే రెండో విడత షెడ్యూల్ తొలి మ్యాచ్‌లో సీఎస్కే.. కేకేఆర్‌తో తలపడనున్నట్లు తెలుస్తుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుందని సమాచారం. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తున్నారు. ఎన్నికల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అన్ని కసర్తులు పూర్తి చేసింది. దేశంలో మొత్తం ఏడు విడతల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న దేశావ్యాప్తంగా కౌంటింగ్ జరుగనుంది. ఈ తేదీలను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌లు క్లాష్ కాకుండా గవర్నింగ్ బాడీ జాగ్రత్త పడనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. మే 20న మినహాయించి అన్ని రోజులు మ్యాచ్‌లు జరుగుతాయని తెలుస్తుంది. లీగ్ దశ మ్యాచ్‌ల అనంతరం ఒక రోజు బ్రేక్ తీసుకుని మే 21న తిరిగి నాకౌట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. -
IPL 2024: సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే.. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు
ఐపీఎల్ 2024 తొలి విడత షెడ్యూల్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహకులు 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈ లెగ్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇంతవరకు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తొలి విడతలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. డే గేమ్స్ మధ్యాహ్నం 3:30 గంటలకు.. రాత్రి మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ విడతలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఎస్ఆర్హెచ్ టీమ్.. తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతా వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్.. కేకేఆర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం ఎస్ఆర్హెచ్.. మార్చి 27న (హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో), మార్చి 31న (అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో), ఏప్రిల్ 5న (హైదరాబాద్‌లో సీఎస్కేతో) మ్యాచ్‌లు ఆడనుంది. తొలి షెడ్యూల్లో సన్‌రైజర్స్ టీమ్ హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈసారి ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున పాట్ కమిన్స్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. ఇటీవల జరిగిన వేలంలో అతన్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు (కెప్టెన్) గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు -
IPL 2024: తొలి మ్యాచ్‌లో చెన్నై ప్రత్యర్ధి గుజరాత్ కాదు..!
ఐపీఎల్ 2024కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ (15 రోజులు) ఇవాళ (ఫిబ్రవరి 22) సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. లీగ్ అనవాయితీ ప్రకారం తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్.. రన్నరప్ జట్టు తలపడతాయి. ఈ లెక్కన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. గత సీజన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ప్రత్యర్ధిని మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ప్రత్యర్ధిగా గుజరాత్ టైటాన్స్ కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉండనున్నట్లు తాజా సమాచారం. ఇదే జరిగితే 16 సీజన్లుగా కొనసాగుతున్న ఆనవాయితీకి బ్రేక్ పడినట్లవుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో వీక్షించవచ్చు. నేడు విడుదల చేసే షెడ్యూల్ కేవలం 15 రోజులకు మాత్రమే ఉండనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విడతల వారీగా షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు ధుమాల్ సృష్టం చేశారు. టోర్నీ మొత్తం భారత్‌లోనే జరగనున్నట్లు ఆయన తెలిపారు. -
ఐపీఎల్-2024కు ముహూర్తం ఫిక్స్.. మరికొన్ని గంటల్లో షెడ్యూల్?
క్రికెట్ అభిమానుల ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 షెడ్యూల్ విడుదలకు సమయం అసన్నమైంది. గురువారం(ఫిబ్రవరి 22) ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేయనున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో వీక్షించవచ్చు. తొలి మ్యాచ్‌లో సీఎస్కే వర్సెస్ గుజరాత్... కాగా మార్చి 22వ తేదీ నుంచి ఈ ఏడాది ధనాధన్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొదటి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించి తొలి 15 రోజుల షెడ్యూల్ షెడ్యూల్ మాత్రమే విడుదల కానున్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ సైతం సృష్టం చేశారు. అదే విధంగా టోర్నీ మొత్తం భారత్‌లోనే జరగనున్నట్లు ఆయన తెలిపారు. -
పంతం నెగ్గించుకున్న బీసీసీఐ.. మారిన ఐపీఎల్ షెడ్యూల్..
-
IPL2022: సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. రాజస్థాన్ రాయల్స్‌తో మొదలై..!
Sunrisers Hyderabad IPL 2022 Schedule: ఐపీఎల్ 2022 మెగా సమరానికి సైరన్ మోగింది. మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుంది. అనంతరం మే 29న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. ఇక ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. కేన్ విలియమ్సన్ సారధ్యంలోని ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 29 (మంగళవారం)న విలియమ్సన్ సేన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్‌కు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదిక కానుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభంకానుంది. అనంతరం ఎస్ఆర్హెచ్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. గతేడాది మూడే మూడు విజయాలతో ఆఖరి స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్.. తేదీ: ఏప్రిల్ 4 (సోమవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: లక్నో సూపర్ జెయింట్స్, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై తేదీ: ఏప్రిల్ 9 (శనివారం), సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: చెన్నై సూపర్ కింగ్స్, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై తేదీ: ఏప్రిల్ 11 (సోమవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: గుజరాత్ టైటాన్స్, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై తేదీ: ఏప్రిల్ 15 (శుక్రవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: కోల్‌కతా నైట్‌రైడర్స్, వేదిక: బ్రబోర్న్ స్టేడియం, ముంబై తేదీ: ఏప్రిల్ 17 (ఆదివారం), సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: పంజాబ్ కింగ్స్, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై తేదీ: ఏప్రిల్ 23 (శనివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: బ్రబోర్న్ స్టేడియం, ముంబై తేదీ: ఏప్రిల్ 27 (బుధవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: గుజరాత్ టైటాన్స్, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై తేదీ: మే 1 (ఆదివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: చెన్నై సూపర్ కింగ్స్, వేదిక: ఎంసీఏ స్టేడియం, పూణే తేదీ: మే 5 (గురువారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: ఢిల్లీ క్యాపిటల్స్, వేదిక: బ్రబోర్న్ స్టేడియం, ముంబై తేదీ: మే 8 (ఆదివారం), సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై తేదీ: మే 14 (శనివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: కోల్‌కతా నైట్‌రైడర్స్, వేదిక: ఎంసీఏ స్టేడియం, పూణే తేదీ: మే 17 (మంగళవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: ముంబై ఇండియన్స్, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై తేదీ: మే 22 (ఆదివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: పంజాబ్ కింగ్స్, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై చదవండి: IPL 2022 Auction Day 1: పూరన్, సుందర్‌కు జాక్‌పాట్.. హైదరాబాద్ ప్లేయర్స్ వీళ్లే! -
ఐపీఎల్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్కేను ఢీకొట్టనున్న కేకేఆర్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుంది. అనంతరం మే 29న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. మార్చి 29న సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడనుంది. 🚨 NEWS 🚨: The Board of Control for Cricket in India (BCCI) announced the schedule for #TATAIPL 2022 which will be held in Mumbai and Pune. A total number of 70 league matches and 4 Playoff games will be played in the duration of 65 days. More Details 🔽 — IndianPremierLeague (@IPL) March 6, 2022 గత సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లను ఒకే సమయానికి నిర్వహించి, ప్రయోగం చేసిన బీసీసీఐ.. అది వర్కవుట్ కాకపోవడంతో పాత పద్ధతిలోనే డబుల్ హెడర్ మ్యాచ్‌లను (మధ్యాహ్నం 3:30 గంటలకు మొదటి మ్యాచ్, సాయంత్రం 7:30కి రెండో మ్యాచ్) నిర్వహించనుంది. ఈ సీజన్‌కు నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలు, వేదికలను బీసీసీఐ ఖరారు చేయాల్సి ఉంది. అహ్మదాబాద్ వేదికగా నాకౌట్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి: IPL 2022: ఐపీఎల్ ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాక్ -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే..?
ఐపీఎల్ 2022 షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 15వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ రేపు (మార్చి 6) ప్రకటించనుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు ప్రముఖ మీడియా సంస్థకు వెల్లడించారు. అయితే బీసీసీఐ రేపు లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటిస్తుందని, ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను తర్వాత వెల్లడిస్తుందని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా, మార్చి 26 నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 2022 సీజన్లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరగుతాయని బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 55 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియాల్లో.. మిగిలిన 15 మ్యాచ్‌లు పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి. ప్లేఆఫ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్టేడియాల్లోకి అనుమతించబోయే ప్రేక్షకుల సంఖ్యను కూడా పెంచాలని బీసీసీఐ భావిస్తుంది. ఈ సంఖ్య 50 శాతం వరకు ఉండవచ్చని సమాచారం. ఇక లీగ్ క్వారంటైన్ నిబంధనల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన విధంగా భారత ఆటగాళ్లకు 3 రోజులు, విదేశీ ప్లేయర్లకు 5 రోజులు కాకుండా గడువు తగ్గించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తుంది. చదవండి: IPL 2022: ఐపీఎల్ ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాక్ -
రేపే ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభానికి ఇంకా 14 రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి షెడ్యూల్ విడుదల కాలేదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లీగ్‌కు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని.. శుక్రవారం (సెప్టెంబర్ 4న) తుది షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించాడు. కానీ నిన్న ఐపీఎల్‌కు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదు. దీంతో అసలు ఐపీఎల్ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ తాజాగా ఐపీఎల్ 2020కి సంబంధించి పూర్తి షెడ్యూల్ రేపు (సెప్టెంబర్ 6, ఆదివారం) అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. శనివారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో బ్రిజేష్ స్వయంగా వెల్లడించారు. దీంతో ఐపీఎల్ షెడ్యూల్‌కు సంబంధించిన నిరీక్షణకు తెరపడినట్లయింది. ముంబైతో జరగబోయే ఓపెనింగ్ మ్యచ్‌కు చెన్నై కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే తెలిపింది. (చదవండి : భజ్జీ దృష్టిలో డబ్బు అనేది చివరి ఆప్షన్) బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ.. 'సెప్టెంబర్ 19 నుంచే ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. లీగ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐపీఎల్లో పాల్గొనబోయే అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రాక్టీస్‌ను ఆరంభించాయి. రేపు అధికారికంగా ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేయబోతున్నాం. షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి' అంటూ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2020ని భారత్ నుంచి యూఏఈకి మార్చారు. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. కాగా అందరికంటే చివరిగా చెన్నై జట్టు శుక్రవారం తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. దుబాయ్‌కు రాగానే సీఎస్కే జట్టులో 13 మంది కరోనా బారీన పడినట్లు బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. వారెవరనేది బయటకు చెప్పకపోయినా.. అందులో ఇద్దరు ఆటగాళ్లు, మిగతావారు సీఎస్కే సిబ్బంది అని తేలింది. అయితే ఇప్పటికే ఆ 13 మందికి మూడోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రావడంతో చెన్నై జట్టు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈసారి ఐపీఎల్ 2020 స్పాన్సర్షిప్ హక్కులను డ్రీమ్ 11 ఏడాది కాలానికి గానూ దాదాపు రూ.250 కోట్లతో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : ‘సచిన్ ప్రేరణ కలిగించలేదు’) -
ఐపీఎల్: ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదికలు మార్పు
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ షెడ్యూల్ వేదికల్లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు పుణే మైదానం (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం) ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే రెండు మ్యాచ్‌ల వేదికలను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు తరలిస్తూ శుక్రవారం ఐపీఎల్ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మే 23, 25 తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు కోల్‌కతాలో జరుగుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. పుణే స్టేడియం కన్నా చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడెన్‌లో 67వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించేందుకు అవకాశం ఉంది. క్వాలిఫయర్ 1 యథావిధిగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనే మే 22న జరగనుంది. మే 27న టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఈ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. తొలుత ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు చెన్నై సూపర్ కింగ్స్ హోం గ్రౌండ్ చపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సిండగా.. కావేరీ వివాదంతో ఆ జట్టు సొంతమైదానంగా పుణెలో ఆడుతున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్ తొలి పోరులో కోల్‌కతా, ముంబై ఢీ
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఏడో ఎడిషన్ మొదటి దశ షెడ్యూల్ విడుదలయింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా మొదటి దశలో జరిగే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించనున్నారు. 20 మ్యాచ్‌లను దుబాయ్‌లోని మూడు మైదానాల్లో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది. ఏప్రిల్ 16న జరిగే ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఇక్కడ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 1 నుంచి 12 వరకు రెండో విడత మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్నారు. కేంద్ర హోం శాఖ అనుమతిస్తే ఈ మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించడం ఇది రెండోసారి. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండో సీజన్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికాలోనే నిర్వహించాల్సి వచ్చింది.