IPL 2024: సన్‌రైజర్స్‌ ఆడే మ్యాచ్‌లు ఇవే.. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు | IPL 2024 First Leg Schedule Released, SRH To Play 4 Matches | Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌ ఆడే మ్యాచ్‌లు ఇవే.. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు

Published Thu, Feb 22 2024 5:58 PM | Last Updated on Thu, Feb 22 2024 6:18 PM

IPL 2024 First Leg Schedule Released, SRH To Play 4 Matches - Sakshi

ఐపీఎల్‌ 2024 తొలి విడత షెడ్యూల్‌ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహకులు 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈ లెగ్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఇంతవరకు టైటిల్‌ గెలవని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది.

తొలి విడతలో డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. డే గేమ్స్‌ మధ్యాహ్నం 3:30 గంటలకు.. రాత్రి మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ విడతలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌.. తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతా వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌.. కేకేఆర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌.. మార్చి 27న (హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో), మార్చి 31న (అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో), ఏప్రిల్‌ 5న (హైదరాబాద్‌లో సీఎస్‌కేతో) మ్యాచ్‌లు ఆడనుంది. తొలి షెడ్యూల్‌లో సన్‌రైజర్స్‌ టీమ్‌ హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున పాట్‌ కమిన్స్‌ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. ఇటీవల జరిగిన వేలంలో అతన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ రికార్డు ధరకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ జట్టు:

  1. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు
  2. రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు
  3. ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు (కెప్టెన్‌)
  4. గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు
  5. హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు
  6. మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు
  7. ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు
  8. అన్మోల్‌ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు
  9. ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు
  10. షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు
  11. నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు
  12. అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు
  13. మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు
  14. వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు
  15. సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
  16. పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు
  17. భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు
  18. టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు
  19. వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు
  20. మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు
  21. ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు
  22. ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు
  23. జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు
  24. ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు
  25. ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement